రాయలు కవి పోషకుడా కాదా అన్నది academic. అది తేల్చినందు వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు. కానీ, రాయల కాలంలో రాసిన కావ్యాలు, రచనలు, అవి చేసినవాళ్ళతో సహా, ఇప్పటి దాకా తెలిసినవి ఒక లిస్టు ఉంటే ఇవ్వండి. ఒక వేళ సాహిత్యం ఆయన కాలంలో (మిగతా సమయాలతో పోల్చుకుంటే) disproportionate గా వచ్చి ఉంటే దానికర్ధం, ఏదో ఒక incentive ఆ కాలంలో సాధ్యమైందనే నేననుకుంటాను.
చరిత్రలో మిగిలిన గ్రంథాలను, వాటి ఈ విషయం తేల్చి చెప్పగల వాళ్ళు ఒక “సమయ” నిర్ధారణ సాధ్యమైనంతలో చేయగలిగితే అది చాలు మొదటి మెట్టుగా.
ఈ వ్యాసం చాలా శ్రమ తీసుకుని రాసింది, కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది. నా.రా. గారి (తెలుగునాడి) వ్యాసం కూడా మరో లింకుతో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.
మారుతీ రావు గారు,
మీ వ్యయ ప్రయాస బావుంది. గుర్తుంచుకోదగ్గ వాక్యాలు చాలా ఉన్నాయి. కింద నేను గమనించిన కొన్ని విషయాలు. నా అవగాహన లేమికి సూచనలు 🙁
1. ” నెత్తావిని పుక్కిలించే పూల బాలలు ”
నెత్తావి అంటే సువాసన అయినట్టయితే పుక్కిలించడం అర్ధం కాలేదు. మకరందం అయితే పరవాలేదు.
2. ” చిలుక తత్తడి రౌతు ”
రహస్యంలో గిరిజా కల్యాణం తరవాత మళ్ళీ ఈ ప్రయోగం ఇదే వినడం. ఆనందం గా ఉంది. కాకపోతే మన్మధ విన్యాసాలు మన వాళ్ళకు మన సినిమాల ద్వారా బాగానే అందుతున్నాయి. వాటిని మీరు విన్యాసాలు గా కాక వికారాలు అన్న
ఉద్దేశ్యంతో రాసేరేమో.. 🙂
3. “దేశభక్తి చిప్పలే జాతి వైభవానికి అభిగ్న( క్షమించాలి ఎలా టైపు చెయ్యాలో తెలియదు).ఆనాటి నా పేరు ” ఇది అర్ధం కాలేదు. అభిగ్న అంటే కీర్తి అని అర్ధం ఉంది. ఎలా అన్వయించాలో అర్ధం కాలేదు.
4. “రుజ క్షుధ ఆకలి..” క్షుధ అన్నా ఆకలి అన్నా ఒకటేనా లేక విశేషార్ధం ఉందా?
5. సీతా కోక చిలుక – రసాయనపు జాడీ .. చాలా బావుంది.
– రమానాథ
మారుతీరావు గారూ..
అయ్యా, మహానుభావా, మార్తాండ తేజా, నమస్కారం..
మీ రచనలంటే నాకు ప్రాణం. అలాగని అన్నీ చదివానని కాదు. చదివినవన్నీ నచ్చాయి, మళ్ళీ చదివేంతగా. అప్పుడెప్పుడో మీరు (కూడా) రాసిన “ఈడియట్” గొలుసునవల నుండి, నిన్న మొన్న మీరు రాసిన మీ “టాంజేనియా” విహార యాత్ర వివరాలదాకా అన్నీ నాకిష్టమే. మా ఈమాటకు సుస్వాగతం. ఇది నిజంగా పండుగ రోజు మాకు…
మీ ఫణి (శ్రీనివాస ఫణికుమార్ డొక్కా)
ఈమాట కొత్త వేషం గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారి అభిప్రాయం:
05/02/2006 10:06 am
కొత్త వేషం చాలా బాగుంది. NYTimes, CNN లాంటి సైట్లతో పోల్చతగినట్టు గా ఉంది. మీ శ్రమ వృథా పోలేదు, పోదు.
ఏ వ్యాసం కామెంట్లు ఆ వ్యాసం కిందే ఇవ్వటం హాయిగా ఉంది. అదే సందర్భంలో, మొత్తం అన్ని వ్యాసాల, కథల, కవితల కామెంట్లూ చదివేశేయాలానే నాలాంటి దురాశా పరులకి కొంత కష్టమవుతోంది. బోలెడు క్లిక్కులు కొడితేగానీ ఏమన్నా కొత్త కామెంట్లు వచ్చాయో లేదో తెలియకుండా ఉంది. మరో పేజీ, “అన్ని కామెంటులూ” అని ఒకటి తయారు చేసి, దాంట్లో అన్నింటినీ చూప గలరేమో ప్రయత్నించండి. వెనకాల డేటాబేస ఉందన్నారు కాబట్టి సాధ్యమవాలి.
అక్కిరాజు భట్టిప్రోలు
తుది ప్రార్ధన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/02/2006 9:01 am
అమ్మా నాన్న వద్దు అందామనుకుంటే
“అమ్మ, నాన్న” లను చేసింది నా పుట్టుకే అనిపిస్తుంది
అడవి కాని ఇల్లు వాకిలి వద్దు అందామనుకుంటే
అవేవీ కట్టకముందు అంతా అడవే అనిపిస్తుంది
చదువుకోవడానికి మేష్టార్లు వొద్దనుకుంటే
ప్రతి అనుభూతి పాఠంచెప్పే మేష్టారే అనిపిస్తుంది
తొలితరం తెలుగు వెబ్-పత్రిక అయిన “ఈమాట” ఆ తరంలోనే ఆగిపోకుండా నవ్యతకు పెద్దపీట వేస్తూ సాగుతూండటం ఆనందదాయకం! మరిన్ని హంగులనూ త్వరలోనే సాధించుకుంటుందని నా ఆశ.
వ్యథ – 2004 గురించి అసమీక్ష్యసమీక్ష్యకారి గారి అభిప్రాయం:
05/02/2006 7:44 am
మోతాదుకు మించిన అపహాస్యం, మితిమీరిన పాంటిఫికేషనూ, ఆంగ్లాంధ్ర సంస్కృతాలు కలగాపులగమైన కృత్రిమ భాష, అనవసరమైన కక్కసపాటులతో ఏ ప్రయోజనం ఉంది? ఇంతటి అసమీక్ష్యకారిత్వమున్న ఈ రచనను సమీక్షగా ప్రచురించడానికి సంపాదకులెలా ఒప్పుకున్నారో?
ఈమాట క్రొత్తవేషం అద్భుతంగా ఉంది. సురేశ్, పద్మగార్లకు ప్రత్యేక అభినందనలు.
‘వ్యయ’ ప్రయాస గురించి చంద్రశేఖర్ వల్లభనేని గారి అభిప్రాయం:
05/01/2006 10:53 pm
Article చాలా బాగుంది.
మీ Articles ఇంతకుముందు తెలుగు పేపర్లలో(బహుశా వార్తలో అనుకుంట) చదివేవాళ్ళం.
అదేవిధంగా ‘ఈమాట’ లో కూడా మీ అనుభవాలు అందరితో పంచుకుంటారని ఆకాంక్షిస్తున్నాము.
గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి Raveendra Kumar గారి అభిప్రాయం:
05/02/2006 11:20 am
ఇటీవల ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఈ సంభాషణ కూడా ఈ కధ లాగే చాలా బాగుంది.
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2006/feb/24edit4
కృష్ణరాయల కవిపోషణ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
05/02/2006 10:45 am
రాయలు కవి పోషకుడా కాదా అన్నది academic. అది తేల్చినందు వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు. కానీ, రాయల కాలంలో రాసిన కావ్యాలు, రచనలు, అవి చేసినవాళ్ళతో సహా, ఇప్పటి దాకా తెలిసినవి ఒక లిస్టు ఉంటే ఇవ్వండి. ఒక వేళ సాహిత్యం ఆయన కాలంలో (మిగతా సమయాలతో పోల్చుకుంటే) disproportionate గా వచ్చి ఉంటే దానికర్ధం, ఏదో ఒక incentive ఆ కాలంలో సాధ్యమైందనే నేననుకుంటాను.
చరిత్రలో మిగిలిన గ్రంథాలను, వాటి ఈ విషయం తేల్చి చెప్పగల వాళ్ళు ఒక “సమయ” నిర్ధారణ సాధ్యమైనంతలో చేయగలిగితే అది చాలు మొదటి మెట్టుగా.
ఈ వ్యాసం చాలా శ్రమ తీసుకుని రాసింది, కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది. నా.రా. గారి (తెలుగునాడి) వ్యాసం కూడా మరో లింకుతో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.
‘వ్యయ’ ప్రయాస గురించి Ramanath గారి అభిప్రాయం:
05/02/2006 10:28 am
మారుతీ రావు గారు,
మీ వ్యయ ప్రయాస బావుంది. గుర్తుంచుకోదగ్గ వాక్యాలు చాలా ఉన్నాయి. కింద నేను గమనించిన కొన్ని విషయాలు. నా అవగాహన లేమికి సూచనలు 🙁
1. ” నెత్తావిని పుక్కిలించే పూల బాలలు ”
నెత్తావి అంటే సువాసన అయినట్టయితే పుక్కిలించడం అర్ధం కాలేదు. మకరందం అయితే పరవాలేదు.
2. ” చిలుక తత్తడి రౌతు ”
రహస్యంలో గిరిజా కల్యాణం తరవాత మళ్ళీ ఈ ప్రయోగం ఇదే వినడం. ఆనందం గా ఉంది. కాకపోతే మన్మధ విన్యాసాలు మన వాళ్ళకు మన సినిమాల ద్వారా బాగానే అందుతున్నాయి. వాటిని మీరు విన్యాసాలు గా కాక వికారాలు అన్న
ఉద్దేశ్యంతో రాసేరేమో.. 🙂
3. “దేశభక్తి చిప్పలే జాతి వైభవానికి అభిగ్న( క్షమించాలి ఎలా టైపు చెయ్యాలో తెలియదు).ఆనాటి నా పేరు ” ఇది అర్ధం కాలేదు. అభిగ్న అంటే కీర్తి అని అర్ధం ఉంది. ఎలా అన్వయించాలో అర్ధం కాలేదు.
4. “రుజ క్షుధ ఆకలి..” క్షుధ అన్నా ఆకలి అన్నా ఒకటేనా లేక విశేషార్ధం ఉందా?
5. సీతా కోక చిలుక – రసాయనపు జాడీ .. చాలా బావుంది.
– రమానాథ
‘వ్యయ’ ప్రయాస గురించి PhaNi DokkA గారి అభిప్రాయం:
05/02/2006 10:23 am
మారుతీరావు గారూ..
అయ్యా, మహానుభావా, మార్తాండ తేజా, నమస్కారం..
మీ రచనలంటే నాకు ప్రాణం. అలాగని అన్నీ చదివానని కాదు. చదివినవన్నీ నచ్చాయి, మళ్ళీ చదివేంతగా. అప్పుడెప్పుడో మీరు (కూడా) రాసిన “ఈడియట్” గొలుసునవల నుండి, నిన్న మొన్న మీరు రాసిన మీ “టాంజేనియా” విహార యాత్ర వివరాలదాకా అన్నీ నాకిష్టమే. మా ఈమాటకు సుస్వాగతం. ఇది నిజంగా పండుగ రోజు మాకు…
మీ ఫణి (శ్రీనివాస ఫణికుమార్ డొక్కా)
ఈమాట కొత్త వేషం గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారి అభిప్రాయం:
05/02/2006 10:06 am
కొత్త వేషం చాలా బాగుంది. NYTimes, CNN లాంటి సైట్లతో పోల్చతగినట్టు గా ఉంది. మీ శ్రమ వృథా పోలేదు, పోదు.
ఏ వ్యాసం కామెంట్లు ఆ వ్యాసం కిందే ఇవ్వటం హాయిగా ఉంది. అదే సందర్భంలో, మొత్తం అన్ని వ్యాసాల, కథల, కవితల కామెంట్లూ చదివేశేయాలానే నాలాంటి దురాశా పరులకి కొంత కష్టమవుతోంది. బోలెడు క్లిక్కులు కొడితేగానీ ఏమన్నా కొత్త కామెంట్లు వచ్చాయో లేదో తెలియకుండా ఉంది. మరో పేజీ, “అన్ని కామెంటులూ” అని ఒకటి తయారు చేసి, దాంట్లో అన్నింటినీ చూప గలరేమో ప్రయత్నించండి. వెనకాల డేటాబేస ఉందన్నారు కాబట్టి సాధ్యమవాలి.
అక్కిరాజు భట్టిప్రోలు
తుది ప్రార్ధన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/02/2006 9:01 am
అమ్మా నాన్న వద్దు అందామనుకుంటే
“అమ్మ, నాన్న” లను చేసింది నా పుట్టుకే అనిపిస్తుంది
అడవి కాని ఇల్లు వాకిలి వద్దు అందామనుకుంటే
అవేవీ కట్టకముందు అంతా అడవే అనిపిస్తుంది
చదువుకోవడానికి మేష్టార్లు వొద్దనుకుంటే
ప్రతి అనుభూతి పాఠంచెప్పే మేష్టారే అనిపిస్తుంది
సోదర సోదరీమణులు వొద్దు అందామనుకుంటే
కాళ్ళూ చేతులూ సోదర సోదరీమణులే అనిపిస్తున్నాయి
మూడుముళ్ళ బంధమే వద్దు అందామనుకుంటే
తలపుల బంధాలు రోజూ ముడివేసుకుంటున్నాయి అనిపిస్తుంది
బిడ్డలే బరువని వద్దు అందామనుకుంటే
కవితయే కన్యగా కళ్ళెదుట కనిపిస్తుంది
పుట్టుకే లేని భాగ్యం కావాలనుకుంటే
పుట్టకపోతే అది భాగ్యమని తెలిసేదెట్లా అనిపిస్తుంది !
విధేయుడు
Srinivas
ఈమాట కొత్త వేషం గురించి నచకి గారి అభిప్రాయం:
05/02/2006 8:46 am
తొలితరం తెలుగు వెబ్-పత్రిక అయిన “ఈమాట” ఆ తరంలోనే ఆగిపోకుండా నవ్యతకు పెద్దపీట వేస్తూ సాగుతూండటం ఆనందదాయకం! మరిన్ని హంగులనూ త్వరలోనే సాధించుకుంటుందని నా ఆశ.
వ్యథ – 2004 గురించి అసమీక్ష్యసమీక్ష్యకారి గారి అభిప్రాయం:
05/02/2006 7:44 am
మోతాదుకు మించిన అపహాస్యం, మితిమీరిన పాంటిఫికేషనూ, ఆంగ్లాంధ్ర సంస్కృతాలు కలగాపులగమైన కృత్రిమ భాష, అనవసరమైన కక్కసపాటులతో ఏ ప్రయోజనం ఉంది? ఇంతటి అసమీక్ష్యకారిత్వమున్న ఈ రచనను సమీక్షగా ప్రచురించడానికి సంపాదకులెలా ఒప్పుకున్నారో?
ఈమాట కొత్త వేషం గురించి మురళి నందుల గారి అభిప్రాయం:
05/02/2006 5:50 am