ఏది శాస్త్రీయం? ఏది అశాస్త్రీయం? అన్న చర్చ ఈ రోజుల్లో ఏమంత సులువైనది కాదు. ఇప్పుడు థీరెటికల్ ఫిజిక్సులోజరుతున్లో నవ్య నూతన పరిశోధనలు మనమందరమూ రేషనల్ అని భావించే మూసలో ఇమడ లేవు.
జ్యోతిషశాస్త్రం రాసుల లెక్కలు కట్టేవరకూ శాస్త్రమే! అది నక్షత్రశాస్త్రం. అయితే ఆ రాసులు మన భవిష్యత్తుని చెప్పగలవు అని predictive astrology చదివి చెప్పేటప్పుడే వస్తుంది చిక్కు, కాకుల లెక్కల్లా!
నేను ఎక్కడో చిన్నప్పుడు చదివాను; వీలు చూసుకొని రిఫరెన్సులు ఇస్తా. ఈజిప్ట్ నుంచి మనకి దిగుమతి అయ్యింది ఈ predictive astrology అని! అంతకుముందు, మన astrology నిజంగా astronomy.
సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష శాస్త్రంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇది పునహ్ పునహ!
రచయితగారు రెండవ భాగంలో అన్ని రిఫరెన్సులూ ఇస్తారని భావిస్తూ,
ఏదన్నా “శాస్త్రీయమైనది” అని ఎవరన్నా అంటే, దానర్థం, నమ్మడం, నమ్మకపోవడం అనే వాటితో సంబంధం లేకుండా, ఒక విషయం తాలూకు ప్రభావం అందరి మీదా ఒకేలాగా వుండీ. శాస్త్రీయంగా రుజువు చెయ్యగలిగేటట్టు వుంటుంది అని అర్థం.
జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమైనది అంటారు. అది అవునో కాదో పరిశీలించడానికి జ్యోతిషం నేర్చుకుని పరిశోధించిన హేతువాదులు ఉన్నారు. వాళ్ళ పరిశీలనలు ఏమిటో తరువాతి భాగాల్లో చర్చిస్తాను.
నా వ్యాసం ఉద్దేశ్యం కూడా జ్యోతిషాన్ని కొద్దిగా పరిచయం చేస్తూ, అది “శాస్త్రీయమైనదా” కాదా అని చర్చించడమే. అంటే నమ్మకాలకి అతీతంగా పని చేస్తుందా లేదా అని పరిశీలించడమే. ఇదే ఉద్దేశ్యాన్ని ఈ మొదటి భాగం లోనే స్పష్టంగానే చెప్పడానికి ప్రయత్నించాను. అయినా కొంచం కన్ఫ్యూజ్ చేసినట్టుగా రాసి ఉంటే తప్పు నాదే.
మీరడిగిన ప్రశ్నలు తరుచుగా ఎదురయేవే. నేను కొన్ని లెక్చర్ డెమాన్ స్ట్రేషన్లలో ఇటువంటివే విని ఇన్ ఫార్మల్ గా కొంతవరకూ సమాధానాలు చెప్పాను. ఇవన్నీ విశదీకరించగలిగిన పెద్దలు చాలామందే ఉంటారు. ఇతర మార్గాలూ ఉంటాయి. నాకు తెలిసినంత మేరకు, వీలు వెంట కొన్ని వ్యాసాల్లో మీరడిగిన విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తాను.
రోహిణీప్రసాద్ గారూ,
రాగాలని పరిచయం చేస్తూ మీరు, లక్ష్మన్న గారూ వ్రాసిన వ్యాసాలు బాగున్నాయి. ఇవి సంగీతం నేర్చుకుంటున్నవాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా నాలాటి వారితొనే. సంగీతాన్ని విని ఆనందించడం తప్ప దాని గురించి ఓనమాలు తెలియని నాలాంటి వాళ్ళకి కలిగే చొప్పదంటు అనుమానాలు ఎన్నెన్నో. ఉదాహరణకు, కేవలం స్వరాలవలనే పాట Tune తయారవుతుందా? (కాదని నేననుకుంటున్నాను కాని స్వరాలు కాక ఇంకా ఏమి కావాలన్నది నాకు అంతు బట్టని విషయం, బహుశా ఊనికా?). ఆరోహణ, అవరోహణ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? అంటే, ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరరచన చేసేటప్పుడు ఇవి స్వరాల క్రమాన్ని నిర్దేశిస్తాయా? ఫలానా వారి పాటలో ఎన్నో సంగతులున్నాయి అంటారు, ఈ సంగతులు ఏమిటి? ఈ సంగతులు లేకపోయినా, అపస్వరం రాకుండా పాడితే సరిగ్గా పాడినట్లే (గాత్ర సంగీత విషయంలో) లెక్కా? గమకాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇలా వ్రాసుకుంటూ పోతే విసిగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంచేత, మీరు సంగీతంలో ఉన్న ప్రాథమికాంశాలన్నిటినీ వివరిస్తూ నాలాంటి వారికోసం ఒక వ్యాసం వ్రాస్తే, మీ తక్కిన వ్యాసాలని కూడా చదివి ఆనందించే అవకాశాన్ని మాకు కలగజేసిన వారవుతారు.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
ఈ వ్యాసంలో వ్యాసకర తన అభిప్రాయాలనూ, తన నమ్మకాలనూ వివరించారు. వీటి గురించి ఎంతో మంది హేతువాదులు చాలా కాలం కిందటే వ్యతిరేకంగా వాదించారు. ఆ విషయాల జోలికి పోకుండా, కేవలం వ్యాసకర్త హేతువాదుల మీద గుప్పించిన వ్యాఖ్యల మీదే నా అభిప్రాయం రాస్తున్నాను.
“హేతువాదుల విషయానికి వస్తే వాళ్ళలో చాలా మంది జ్యోతిషాన్ని ఎరిగిన వారు కారు. వాళ్ళ అజ్ఞానం జ్యోతిష్కులకి కొంత వరకూ ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది.” అని వ్యాసకర్త అన్నారు. ఇందులో ఏమన్నా అర్థం వుందా? జ్యోతిష్యాన్ని నమ్మని వాళ్ళకి జ్యోతిష్కులతో పనేమిటీ? నమ్మకం లేని విషయాల గురించి ఎవరన్నా పట్టించుకుంటారా? ఈ జ్యోతిష్కులు తాము నమ్మని మార్క్సు శ్రమ సిద్ధాంతం గురించి జ్ఞానం సంపాదిస్తారా ఎక్కడన్నా? ఈ జ్యోతిష్కుల అజ్ఞానం (శ్రమ సిద్ధాంతం విషయంలో) మార్క్సిస్టులకి అస్త్రంగా వుపయోగపడుతుందా, ఎక్కడన్నా? “భవిష్యత్తు ముందరే నిర్ణయమయి లేదూ, అది ప్రకృతి నియమాల మీదా, మానవ ప్రవర్తన మీదా ముఖ్యంగా ఆధారపడి వుంది” అని నమ్మే హేతువాదులు, కూర్చుని జ్యోతిష్య శాస్త్రంలో ఏం రాశారూ అని చదవరు. ఎటొచ్చీ వున్న జ్యోతిష శాస్త్రాన్ని సహేతుకంగా విమర్శించ వలసి వచ్చినపుడు మాత్రం, ఆ శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించాల్సి వుంటుంది. లేనప్పుడు దాని జోలికి పోనే అవసరం లేదు. దేముడి వునికినే నమ్మని హేతువాదులు, భవిష్యత్తు తెలుసుకోవడం గురించి ఎందుకు నమ్ముతారూ? అలా నమ్మితే, వారు హేతువాదులు కారని అర్థం.
న్యూటన్ జ్యోతిష్యాన్ని నమ్ముతాడని వ్యాసకర్త శలవిచ్చారు. అయితే ఏమిటీ? సైన్సు తెలిసిన వాళ్ళందరూ, హేతువాదులవ్వాలని ఏమన్నా రూలుందా? నాస్తికుడయిన డాక్టరు దగ్గర ఆస్తికులయిన పేషంట్లు వైద్యం చేయించుకోరా? నాస్తికులయిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయాలను ఆస్తికులు వుపయోగించరా? భూమ్యాకర్షణ శక్త్రి గురించి కనిపెట్టడం అనేది మనిషిని హేతువాదిగా మారుస్తుంది అని అనుకుంటే, అది నిజంగా అమాయకత్వమే. హేతువాదం అనేది వుత్త ప్రాకృతిక విషయాలకి మాత్రమే సంబంధించినది కాదు. అది సాంఘీక విషయాలతో కూడా కలిసి వుంటుంది. హిందూ మతాన్ని నమ్మేవాళ్ళలో చాలా మంది ఖురాన్ గానీ, బైబిల్ గానీ చదివి వుండరు. (వీరిలో చాలా మంది భగవద్గీత గానీ, రామాయణం గానీ కూడా పూర్తిగా చదివి వుండరు లెండి. అయినా వీరికి వాటి మీద నమ్మకం వుంటుంది. జ్యోతిష శాస్త్రాన్ని చదవని వారికి కూడా జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం వున్నట్టు!) అయినా వారు తమ మతాన్నే నమ్ముతూ, ఇతర మతాల్ని నమ్మరు. అయితే, ఇతర మతస్తుల మీద మత యుద్ధానికి దిగక పోవడం వేరే విషయం. వారు తమ మతాన్ని నమ్ముకుంటూ, ఇతర మతాల్ని నమ్మరు (ఫాలో అవ్వరు). కాబట్టి, ఆ మత సంబంధిత శాస్త్రాల జోలికి కూడా పోరు. నమ్మకం లేని విషయాల్ని అనవసరంగా స్టడీ చెయ్యడం శుద్ధ దండగ. ఏదన్నా “అశాస్త్రీయమైనది” అని ఎవరన్నా అంటే, దానర్థం, నమ్మడం, నమ్మకపోవడం అనే వాటితో సంబంధం లేకుండా, ఒక విషయం తాలూకు ప్రభావం అందరి మీదా ఒకేలాగా వుండీ. శాస్త్రీయంగా రుజువు చెయ్యగలిగేటట్టు వుంటుంది అని అర్థం. “భవిష్యత్తు తెలుసుకోవడం అసంభవం” అని నమ్మే హేతువాదులు, ఆ అసంభవ విషయం మీద ఆధారపడి వున్న శాస్త్రాన్ని స్టడీ చెయ్యరు. మార్క్సు సిద్ధాంతం గురించి మిగిలిన వాళ్ళలో వున్న అజ్ఞానం, ఆ సిద్ధాంతాన్ని రుజువు చేసెయదు. దాని శక్త్రే దాన్ని రుజువు చేస్తుంది.
“సైన్సు నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్మకూడదు” అని అనుకోవడం అర్థం లేని విషయం. నమ్మినా నమ్మకపోయినా సైన్సు అందరికీ ఒకేలాగా వుపయోగపడుతుంది. ఒకే విధంగా రుజువు అవుతుంది. దీనర్థం ప్రతీ విషయం సైన్సుకి అర్థం అయిపోయిందని కాదు. “ఆ సైన్సుని సృష్టించింది కూడా ఆ దేముడే” అని వాళ్ళు నమ్ముతారు మరి. దేముడూ, జ్యోతిష్యం, వగైరాలు నమ్మకాల మీద ఆధారపడి వున్న శాస్త్రాలు. అవి లేకపోతే ఆ శాస్త్రాల జోలికి వెళ్ళనవసరం లేదు. ఒక మనిషికి అన్నిశాస్త్రాలతోనూ పూర్తిగా పరిచయం వుండదు. ఒక మనిషికి ఒక శాస్త్రంతో వున్న జ్ఞానం ఆ శాస్త్ర వునికిని రుజువు చెయ్యదు. ఇది అర్థం లేని తర్కం. గతి తార్కిక భౌతిక వాదం, హేతువాదం, గట్రా గురించి సరిగా తెలియదు కాబట్టి, అవి కరెక్టే అని వాదించడం ఎంత అర్థమయిన విషయమో, వ్యాసకర్త రాసింది కూడా అంతే అర్థవంతమైన విషయం.
తెలుగు అభిమానిగారు కొత్త సినిమాపాటల రాగాలని గుర్తుచేసి నా లోపాన్ని చక్కగా సవరించారు. ఈమధ్య ‘హృదయం ఎక్కడున్నది’ అనేపాట విన్నప్పుడు అందులో ఖరహరప్రియ నాకు వినబడింది. అలాగే ‘నవమన్మథుడా’ అనే పాట శుద్ధధన్యాసి రాగం. కొత్తపాటలు విని వాటి రాగాలను ఉదహరించేంత ఓపికా, వ్యవధీ, ఆసక్తీ లేకపోవడమే నా లోపం.
శాస్త్రీయసంగీతం వెంట విధిగా ఉండే కొంత ‘చాదస్తం’ ప్రతివారికీ రుచించకపోతే వారిని తప్పుపట్టలేం. మెలొడీని విని ఆనందించేందుకు సరిపోయేంత మటుకు కొంత గ్రామరును పరిచయం చేస్తే తెలుగువారిలో సంగీతం మరింత బలపడుతుందని ఆశ. ఈ ప్రయత్నం చాలా గొప్పదని కాని, తద్వారా కీర్తిప్రతిష్ఠలు వస్తాయనిగాని కలలో కూడా అనుకోను.
తెలుగు వారిలో ఇంతమందికి రషోమాన్ సినిమా అంటే ఇష్టమని తెలిసి ఆనందం కలిగింది. దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి సారిగా ఈ సినిమా చూసినప్పుడు ఏదో అర్ధం అయినట్టు అనిపించింది, కానీ సరిగ్గా అర్ధం కాలా! అప్పటికి నాకు వయస్సు, అనుభవం – రెండూ తక్కువే.
రషోమాన్ నేను ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తు లేదు. కురొసావా తీసిన “ఇకిరు”, “డెర్సు ఉజాలా”, చాలా మందికి తెలిసిన “సెవెన్ సామురై” కూడా నాకు ఇష్టమైన సినిమాల్లో కొన్ని. ఫణి గారు చెప్పినట్టు, “రాన్” సినిమా కూడా నాకు ఇష్టం.
“Our films their films” అన్న సత్యజిత్ రాయ్ పుస్తకం, రాయ్ సినిమాలపై Andrew Robinson పుస్తకం “Inner eye” కూడా ఆర్టు సినిమాలపై వచ్చిన రెండు మంచి పుస్తకాలు.
ఈమాట సంపాదక వర్గంలో ఉన్న పద్మ ఇంద్రకంటి నా వ్యాసాన్ని నేను రాసిన దాని కంటే ఇంకా బాగా ఉండటానికి సాయపడ్డారు. ఆమెకు నా ధన్యవాదాలు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి P. N. Raja Rao గారి అభిప్రాయం:
03/05/2008 4:00 am
ఏది శాస్త్రీయం? ఏది అశాస్త్రీయం? అన్న చర్చ ఈ రోజుల్లో ఏమంత సులువైనది కాదు. ఇప్పుడు థీరెటికల్ ఫిజిక్సులోజరుతున్లో నవ్య నూతన పరిశోధనలు మనమందరమూ రేషనల్ అని భావించే మూసలో ఇమడ లేవు.
జ్యోతిషశాస్త్రం రాసుల లెక్కలు కట్టేవరకూ శాస్త్రమే! అది నక్షత్రశాస్త్రం. అయితే ఆ రాసులు మన భవిష్యత్తుని చెప్పగలవు అని predictive astrology చదివి చెప్పేటప్పుడే వస్తుంది చిక్కు, కాకుల లెక్కల్లా!
నేను ఎక్కడో చిన్నప్పుడు చదివాను; వీలు చూసుకొని రిఫరెన్సులు ఇస్తా. ఈజిప్ట్ నుంచి మనకి దిగుమతి అయ్యింది ఈ predictive astrology అని! అంతకుముందు, మన astrology నిజంగా astronomy.
సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష శాస్త్రంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇది పునహ్ పునహ!
రచయితగారు రెండవ భాగంలో అన్ని రిఫరెన్సులూ ఇస్తారని భావిస్తూ,
పి.యన్.ఆర్.
ప్రేమికుల దినం గురించి kalhara గారి అభిప్రాయం:
03/05/2008 3:23 am
intelligent!!
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగ మురళి గారి అభిప్రాయం:
03/04/2008 10:57 pm
ప్రసాద్ గారూ, మీరు అన్నారు –
జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమైనది అంటారు. అది అవునో కాదో పరిశీలించడానికి జ్యోతిషం నేర్చుకుని పరిశోధించిన హేతువాదులు ఉన్నారు. వాళ్ళ పరిశీలనలు ఏమిటో తరువాతి భాగాల్లో చర్చిస్తాను.
నా వ్యాసం ఉద్దేశ్యం కూడా జ్యోతిషాన్ని కొద్దిగా పరిచయం చేస్తూ, అది “శాస్త్రీయమైనదా” కాదా అని చర్చించడమే. అంటే నమ్మకాలకి అతీతంగా పని చేస్తుందా లేదా అని పరిశీలించడమే. ఇదే ఉద్దేశ్యాన్ని ఈ మొదటి భాగం లోనే స్పష్టంగానే చెప్పడానికి ప్రయత్నించాను. అయినా కొంచం కన్ఫ్యూజ్ చేసినట్టుగా రాసి ఉంటే తప్పు నాదే.
చెట్టు కూలిన వేళ గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/04/2008 7:06 pm
సాధుసజ్జనులను చెట్టుతో పోల్చే తులసీదాసు దోహాని జ్ఞప్తికి తెచ్చిందీ కవిత:
తులసీ సంత్ సుఅంబ్ తరూ ఫూల్ పలహి పర్ హేత్
ఇతతే వే పాహన్ హనత్ ఉతతే వే ఫల్ దేత్
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 6:19 pm
రాజాశంకర్ గారూ,
మీరడిగిన ప్రశ్నలు తరుచుగా ఎదురయేవే. నేను కొన్ని లెక్చర్ డెమాన్ స్ట్రేషన్లలో ఇటువంటివే విని ఇన్ ఫార్మల్ గా కొంతవరకూ సమాధానాలు చెప్పాను. ఇవన్నీ విశదీకరించగలిగిన పెద్దలు చాలామందే ఉంటారు. ఇతర మార్గాలూ ఉంటాయి. నాకు తెలిసినంత మేరకు, వీలు వెంట కొన్ని వ్యాసాల్లో మీరడిగిన విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తాను.
కల్యాణి రాగం – అనుబంధం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/04/2008 5:01 pm
రోహిణీప్రసాద్ గారూ,
రాగాలని పరిచయం చేస్తూ మీరు, లక్ష్మన్న గారూ వ్రాసిన వ్యాసాలు బాగున్నాయి. ఇవి సంగీతం నేర్చుకుంటున్నవాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా నాలాటి వారితొనే. సంగీతాన్ని విని ఆనందించడం తప్ప దాని గురించి ఓనమాలు తెలియని నాలాంటి వాళ్ళకి కలిగే చొప్పదంటు అనుమానాలు ఎన్నెన్నో. ఉదాహరణకు, కేవలం స్వరాలవలనే పాట Tune తయారవుతుందా? (కాదని నేననుకుంటున్నాను కాని స్వరాలు కాక ఇంకా ఏమి కావాలన్నది నాకు అంతు బట్టని విషయం, బహుశా ఊనికా?). ఆరోహణ, అవరోహణ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? అంటే, ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరరచన చేసేటప్పుడు ఇవి స్వరాల క్రమాన్ని నిర్దేశిస్తాయా? ఫలానా వారి పాటలో ఎన్నో సంగతులున్నాయి అంటారు, ఈ సంగతులు ఏమిటి? ఈ సంగతులు లేకపోయినా, అపస్వరం రాకుండా పాడితే సరిగ్గా పాడినట్లే (గాత్ర సంగీత విషయంలో) లెక్కా? గమకాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇలా వ్రాసుకుంటూ పోతే విసిగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంచేత, మీరు సంగీతంలో ఉన్న ప్రాథమికాంశాలన్నిటినీ వివరిస్తూ నాలాంటి వారికోసం ఒక వ్యాసం వ్రాస్తే, మీ తక్కిన వ్యాసాలని కూడా చదివి ఆనందించే అవకాశాన్ని మాకు కలగజేసిన వారవుతారు.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
03/04/2008 4:29 pm
ఈ వ్యాసంలో వ్యాసకర తన అభిప్రాయాలనూ, తన నమ్మకాలనూ వివరించారు. వీటి గురించి ఎంతో మంది హేతువాదులు చాలా కాలం కిందటే వ్యతిరేకంగా వాదించారు. ఆ విషయాల జోలికి పోకుండా, కేవలం వ్యాసకర్త హేతువాదుల మీద గుప్పించిన వ్యాఖ్యల మీదే నా అభిప్రాయం రాస్తున్నాను.
“హేతువాదుల విషయానికి వస్తే వాళ్ళలో చాలా మంది జ్యోతిషాన్ని ఎరిగిన వారు కారు. వాళ్ళ అజ్ఞానం జ్యోతిష్కులకి కొంత వరకూ ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది.” అని వ్యాసకర్త అన్నారు. ఇందులో ఏమన్నా అర్థం వుందా? జ్యోతిష్యాన్ని నమ్మని వాళ్ళకి జ్యోతిష్కులతో పనేమిటీ? నమ్మకం లేని విషయాల గురించి ఎవరన్నా పట్టించుకుంటారా? ఈ జ్యోతిష్కులు తాము నమ్మని మార్క్సు శ్రమ సిద్ధాంతం గురించి జ్ఞానం సంపాదిస్తారా ఎక్కడన్నా? ఈ జ్యోతిష్కుల అజ్ఞానం (శ్రమ సిద్ధాంతం విషయంలో) మార్క్సిస్టులకి అస్త్రంగా వుపయోగపడుతుందా, ఎక్కడన్నా? “భవిష్యత్తు ముందరే నిర్ణయమయి లేదూ, అది ప్రకృతి నియమాల మీదా, మానవ ప్రవర్తన మీదా ముఖ్యంగా ఆధారపడి వుంది” అని నమ్మే హేతువాదులు, కూర్చుని జ్యోతిష్య శాస్త్రంలో ఏం రాశారూ అని చదవరు. ఎటొచ్చీ వున్న జ్యోతిష శాస్త్రాన్ని సహేతుకంగా విమర్శించ వలసి వచ్చినపుడు మాత్రం, ఆ శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించాల్సి వుంటుంది. లేనప్పుడు దాని జోలికి పోనే అవసరం లేదు. దేముడి వునికినే నమ్మని హేతువాదులు, భవిష్యత్తు తెలుసుకోవడం గురించి ఎందుకు నమ్ముతారూ? అలా నమ్మితే, వారు హేతువాదులు కారని అర్థం.
న్యూటన్ జ్యోతిష్యాన్ని నమ్ముతాడని వ్యాసకర్త శలవిచ్చారు. అయితే ఏమిటీ? సైన్సు తెలిసిన వాళ్ళందరూ, హేతువాదులవ్వాలని ఏమన్నా రూలుందా? నాస్తికుడయిన డాక్టరు దగ్గర ఆస్తికులయిన పేషంట్లు వైద్యం చేయించుకోరా? నాస్తికులయిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయాలను ఆస్తికులు వుపయోగించరా? భూమ్యాకర్షణ శక్త్రి గురించి కనిపెట్టడం అనేది మనిషిని హేతువాదిగా మారుస్తుంది అని అనుకుంటే, అది నిజంగా అమాయకత్వమే. హేతువాదం అనేది వుత్త ప్రాకృతిక విషయాలకి మాత్రమే సంబంధించినది కాదు. అది సాంఘీక విషయాలతో కూడా కలిసి వుంటుంది. హిందూ మతాన్ని నమ్మేవాళ్ళలో చాలా మంది ఖురాన్ గానీ, బైబిల్ గానీ చదివి వుండరు. (వీరిలో చాలా మంది భగవద్గీత గానీ, రామాయణం గానీ కూడా పూర్తిగా చదివి వుండరు లెండి. అయినా వీరికి వాటి మీద నమ్మకం వుంటుంది. జ్యోతిష శాస్త్రాన్ని చదవని వారికి కూడా జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం వున్నట్టు!) అయినా వారు తమ మతాన్నే నమ్ముతూ, ఇతర మతాల్ని నమ్మరు. అయితే, ఇతర మతస్తుల మీద మత యుద్ధానికి దిగక పోవడం వేరే విషయం. వారు తమ మతాన్ని నమ్ముకుంటూ, ఇతర మతాల్ని నమ్మరు (ఫాలో అవ్వరు). కాబట్టి, ఆ మత సంబంధిత శాస్త్రాల జోలికి కూడా పోరు. నమ్మకం లేని విషయాల్ని అనవసరంగా స్టడీ చెయ్యడం శుద్ధ దండగ. ఏదన్నా “అశాస్త్రీయమైనది” అని ఎవరన్నా అంటే, దానర్థం, నమ్మడం, నమ్మకపోవడం అనే వాటితో సంబంధం లేకుండా, ఒక విషయం తాలూకు ప్రభావం అందరి మీదా ఒకేలాగా వుండీ. శాస్త్రీయంగా రుజువు చెయ్యగలిగేటట్టు వుంటుంది అని అర్థం. “భవిష్యత్తు తెలుసుకోవడం అసంభవం” అని నమ్మే హేతువాదులు, ఆ అసంభవ విషయం మీద ఆధారపడి వున్న శాస్త్రాన్ని స్టడీ చెయ్యరు. మార్క్సు సిద్ధాంతం గురించి మిగిలిన వాళ్ళలో వున్న అజ్ఞానం, ఆ సిద్ధాంతాన్ని రుజువు చేసెయదు. దాని శక్త్రే దాన్ని రుజువు చేస్తుంది.
“సైన్సు నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్మకూడదు” అని అనుకోవడం అర్థం లేని విషయం. నమ్మినా నమ్మకపోయినా సైన్సు అందరికీ ఒకేలాగా వుపయోగపడుతుంది. ఒకే విధంగా రుజువు అవుతుంది. దీనర్థం ప్రతీ విషయం సైన్సుకి అర్థం అయిపోయిందని కాదు. “ఆ సైన్సుని సృష్టించింది కూడా ఆ దేముడే” అని వాళ్ళు నమ్ముతారు మరి. దేముడూ, జ్యోతిష్యం, వగైరాలు నమ్మకాల మీద ఆధారపడి వున్న శాస్త్రాలు. అవి లేకపోతే ఆ శాస్త్రాల జోలికి వెళ్ళనవసరం లేదు. ఒక మనిషికి అన్నిశాస్త్రాలతోనూ పూర్తిగా పరిచయం వుండదు. ఒక మనిషికి ఒక శాస్త్రంతో వున్న జ్ఞానం ఆ శాస్త్ర వునికిని రుజువు చెయ్యదు. ఇది అర్థం లేని తర్కం. గతి తార్కిక భౌతిక వాదం, హేతువాదం, గట్రా గురించి సరిగా తెలియదు కాబట్టి, అవి కరెక్టే అని వాదించడం ఎంత అర్థమయిన విషయమో, వ్యాసకర్త రాసింది కూడా అంతే అర్థవంతమైన విషయం.
– ప్రసాద్
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 2:24 pm
తెలుగు అభిమానిగారు కొత్త సినిమాపాటల రాగాలని గుర్తుచేసి నా లోపాన్ని చక్కగా సవరించారు. ఈమధ్య ‘హృదయం ఎక్కడున్నది’ అనేపాట విన్నప్పుడు అందులో ఖరహరప్రియ నాకు వినబడింది. అలాగే ‘నవమన్మథుడా’ అనే పాట శుద్ధధన్యాసి రాగం. కొత్తపాటలు విని వాటి రాగాలను ఉదహరించేంత ఓపికా, వ్యవధీ, ఆసక్తీ లేకపోవడమే నా లోపం.
శాస్త్రీయసంగీతం వెంట విధిగా ఉండే కొంత ‘చాదస్తం’ ప్రతివారికీ రుచించకపోతే వారిని తప్పుపట్టలేం. మెలొడీని విని ఆనందించేందుకు సరిపోయేంత మటుకు కొంత గ్రామరును పరిచయం చేస్తే తెలుగువారిలో సంగీతం మరింత బలపడుతుందని ఆశ. ఈ ప్రయత్నం చాలా గొప్పదని కాని, తద్వారా కీర్తిప్రతిష్ఠలు వస్తాయనిగాని కలలో కూడా అనుకోను.
ఓ చందమామ గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
03/04/2008 2:20 pm
ఆర్ద్రంగా ఉందండీ.
ఇలాగే ఇంకో తండ్రి మమకారం ఇక్కడ:
http://eemaata.com/em/library/ata-2006/271.html
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి #vishNubhoTla lakshmanna# గారి అభిప్రాయం:
03/04/2008 2:01 pm
తెలుగు వారిలో ఇంతమందికి రషోమాన్ సినిమా అంటే ఇష్టమని తెలిసి ఆనందం కలిగింది. దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి సారిగా ఈ సినిమా చూసినప్పుడు ఏదో అర్ధం అయినట్టు అనిపించింది, కానీ సరిగ్గా అర్ధం కాలా! అప్పటికి నాకు వయస్సు, అనుభవం – రెండూ తక్కువే.
రషోమాన్ నేను ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తు లేదు. కురొసావా తీసిన “ఇకిరు”, “డెర్సు ఉజాలా”, చాలా మందికి తెలిసిన “సెవెన్ సామురై” కూడా నాకు ఇష్టమైన సినిమాల్లో కొన్ని. ఫణి గారు చెప్పినట్టు, “రాన్” సినిమా కూడా నాకు ఇష్టం.
“Our films their films” అన్న సత్యజిత్ రాయ్ పుస్తకం, రాయ్ సినిమాలపై Andrew Robinson పుస్తకం “Inner eye” కూడా ఆర్టు సినిమాలపై వచ్చిన రెండు మంచి పుస్తకాలు.
ఈమాట సంపాదక వర్గంలో ఉన్న పద్మ ఇంద్రకంటి నా వ్యాసాన్ని నేను రాసిన దాని కంటే ఇంకా బాగా ఉండటానికి సాయపడ్డారు. ఆమెకు నా ధన్యవాదాలు.
నా రాతలను చదివి అభిప్రాయాలను చెప్పిన వారందరికీ,
కృతజ్ఞతలతో,
లక్ష్మన్న