నాకు సంగీతం గురించి తెలిసింది చాలా తక్కువ. కొద్దికాలం భారతీయ విద్యాభవన్ లో వేణువు నేర్చుకున్నాను. డాక్టర్ జాన్ మార్ గారు చెప్పిన మొదటి, రెండు సంవత్సరాలు థియరీ కోర్సు నేర్చుకున్నాను. జనక, జన్య రాగాల గురించి పెద్ద కాంట్రవర్సీ ఉన్నదనే ఆయనా చెప్పారు. కొన్ని జన్య రాగాలుగా చెప్పబడుతున్నవి వాటి జనక రాగాలుగా చెప్పబడుతున్నవాటి కన్న చాలా పాతవి ఉన్నాయట(ముందే కనిపెట్టబడ్డాయి). ఆయన ఉదాహరణలు చెప్తూ ఖరహరప్రియ 18వ శతాబ్దంలో పుట్టిందనీ, దాని జన్య రాగమైన శ్రీ రాగం 13వ శతాబ్దంలోనే (అధమంగా 16వ శతాబ్దంలో) పుట్టిందనీ చెప్పారు. అలాంటప్పుడు వాటిల్ని జనక, జన్య రాగాలుగా పేర్కొనడంలో ఔచిత్యమేమిటని కూడా ఆయన అన్నారు. అలాగే హరికాంభోజి కన్నా దాని జన్యంగా పేర్కొనే కాంభోజి పాతదిట.
నా మటుకు రాగాలనేవి సజీవంగా మోగుతూ, శ్రోతలను ఆనందపరిచేవి. నా వ్యాసాల ఉద్దేశం కూడా సంగీతాన్ని సామాన్యశ్రోతలకు దగ్గర చేర్చాలనే.
ఇక కాంట్రవర్సీ మాటకొస్తే జన్యరాగం అనేదాని పేరెంటేజిని నిర్ణయించడానికి తంటాలు తప్పవు. ఉదాహరణకు మోహనరాగంలో మ, ని స్వరాలు ఉండవు. సిద్ధాంతరీత్యా దాన్ని రి2, గ2, ద2 ఉన్న హరికాంభోజి(28), ధీరశంకరాభరణం(29), వాచస్పతి(64), మేచకల్యాణి(65) లలో ఏ మేళకర్తనుంచయినా జన్యంగా అనుకోవచ్చు. సంప్రదాయాన్ని బట్టీ, అనుస్వరాలనిబట్టీ పండితులు హరికాంభోజికి జన్యమని అంటారు.
మేళకర్త రాగాలతో లిబర్టీస్ తీసుకోవడం కష్టమనీ, కల్యాణిలో నిరిగమ మొదలైన ప్రయోగాలు యథేచ్ఛగా చెయ్యవచ్చనీ కొందరు గాయకులు నాతో అన్నారు. ప్రాక్టికల్ మ్యూజిషియన్లకి ఈ సంగతులు తెలుస్తాయి. మేళకర్త సిస్టం పక్కాగానూ, మరీ పక్కాగానూ ఉంటుందనీ, హిందుస్తానీ వారి పది ఠాఠ్ ల పద్ధతి మరీ తక్కువగానూ అనిపిస్తుందనీ రవిశంకర్ ఒక సందర్భంలో అన్నాడు. మేళకర్త రాగాలను గురించి నేను బాలమురళిగారినీ, సంగీతరావుగారినీ, రజనీకాంతరావుగారినీ అడిగాను. ఎవరి అనుభవాన్నిబట్టి వారు సమాధానాలు చెప్పారు.
సంగీతాన్ని చూసి జడవకుండా వీలయినంత ఎక్కువమంది విని తెలుసుకోవాలని నా ఉద్దేశం. మేచకల్యాణిని దాటి ముందుకు వెళ్ళి, నా వ్యాసం కల్యాణి రాగంతో పరిచయాన్ని పెంచగలిగిందో లేదో మీరు చెపితే సంతోషిస్తాను.
గిల్టీ రీడర్ గారు, జ్యోతిషం కేవలం డబ్బు సంపాదించడం కోసం ఆడే నాటకమని భావించడం సులభమేగానీ, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు. చాలామంది జ్యోతిష్కులు జ్యోతిషం నిజంగా సైన్సు అనీ, దాన్ని ఉపయోగించి తాము అందరికీ దారి చూపిస్తున్నామనీ గట్టిగా నమ్ముతారు. వాళ్ళకు అలాంటి నమ్మకం కలగడానికి కారణమేమిటో వివరించి, అది అసలు నిజంగా సైన్సు అయ్యే అవకాశం ఉందో లేదో చర్చించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
రాజాశంకర్ గారూ, తప్పకుండా మీ సందేహాలు తెలియజేయండి. వీలునిబట్టి నాకు తెలిసినంతవరకు సమాధానాలిస్తాను. కొంచం పెద్ద వ్యాసాలు రాయాల్సి వస్తే, నా బ్లాగు లో రాస్తాను. అయితే ఒక మనవి. నేను జ్యోతిష్కుణ్ణి కాను. జాతకాలు చెప్పేవాణ్ణీ కాను. జ్యోతిషం కొంత తెలిసినవాణ్ణి. అయినా అది ఖచ్చితంగా పనిచేస్తుందని నమ్మేవాణ్ణి కాను. నా మెయిల్ అయిడీ: vadavalli_nm@yahoo.com
రోహిణీ ప్రసాద్ గారూ, మీరు చెప్పిన పోలిక చాలా సమంజసమైనది. గ్రహాల్లాగానే ఆకాశంలో కనిపించే నక్షత్ర రాశులకి కూడా భూమి మీద, మనుషులమీద ప్రభావం ఉన్నదని జ్యోతిషం నమ్ముతుంది. దాని ప్రకారం – గ్రహాల ప్రభావం, రాశుల ప్రభావం సమ్మిళితంగా పని చేస్తాయి. అంటే కిటికీ ఊచలేగాక వెనకాల కనిపిస్తున్న చెట్లూ, కొండలూ కూడా మనమీద పనిచేస్తాయనుకోవాలి. భూమి నుంచి చూసినప్పుడు గ్రహాలు కూడా నక్షత్రాల్లాగే కనిపిస్తాయి. అవి ఒక్కో రాశి (నక్షత్ర మండలం) లో ఉన్నట్టు కనిపిస్తాయి. భూమి నుంచి చాలా చిన్నగా కనిపిస్తాయి కాబట్టి ఏ కోణం లోంచి చూసినా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఆ స్థితి మారినట్టు కనిపించదు. కానీ చూసే కోణాన్నిబట్టి మొత్తంగా గ్రహ-రాశి స్థితి మారుతుంది. అంటే ఒక రాశి ఇండియాలో మా ఇంటి నుంచి చూస్తే ఈ క్షణంలో నడినెత్తిమీద ఉండవచ్చు. అదే క్షణంలో లండన్ నుంచి చూస్తే అదే రాశి ఉదయిస్తూ కనపడవచ్చు. అది నడినెత్తిమీద ఉంటే ప్రభావం ఒకరకంగా ఉంటుందనీ, ఉదయిస్తుంటే మరో రకంగా ఉంటుందనీ జ్యోతిషం చెప్తుంది. (ఈ కోణాల్నే భావాలు అంటారు అని వివరించాను). అందుకే జాతకం వేసేటప్పుడు పుట్టిన ప్రదేశాన్నిబట్టి గ్రహాలూ రాశులూ ఏ ఏ భావాల్లో (కోణాల్లో) ఉన్నాయో లెక్కిస్తారు.
అయితే ఈ రాశి చక్రం ఎక్కడి నుంచి లెక్కపెట్టాలో, ఈ భావాలు ఎలా గణించాలో చాలా గందరగోళం ఉన్నది. ఒకదానికొకటి పొసగని సిధ్ధాంతాలు, సాంప్రదాయాలు జ్యోతిషంలో చాలా ఉన్నాయి. వాటి గురించి తరవాతి భాగంలో వివరిస్తాను. కేవలం సారాంశం బోధపడడానికి సరళంగా ఒక outline మాత్రమే ఇస్తున్నానని మనవి.
This is an excellent idea to introduce one particular ragam to students like me. Thank you Prasadgaru. Only you can think of such innovative ideas and make good use of.a web magazine.
Before reading this article, I used to think that Kalyani and Mechakalyani are one and the same. Though it is not very important in the context, I did some R&D, consulted my gurus, and came to know that they are slightly different in fact and have a little variance in bhavams.
Thanks to Eemaata for a useful and interesting article.
Please keep this series up and give similar articles in future also.
వ్యాసం పూర్తవలేదు కాని నాకు మొదటినుంచీ కొన్ని సందేహాలున్నాయి. గ్రహాలను భూమినుంచి వీక్షించినప్పుడు వాటి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రరాశులు కనబడతాయి. చూస్తున్న కోణాన్నిబట్టి ఆ నేపథ్యం మారుతుంది. గ్రహాల ప్రభావం జరగబోయే సంఘటనలమీద ఉంటుందని అనుకున్నా కిటికీ చువ్వలకూ, కిటికీనుంచి కనబడే దూరపు కొండలకూ ముడిపెట్టినట్టు ఈ రాశుల ప్రమేయం ఏమిటో అర్థం కాదు.
రాగాలలో కళ్యాణి మకుటంలేని మహరాణి అనడంలో సందేహం లేదు. చక్కటి వ్యాసం అందించినందుకు నెనరులు. ‘ప్రతి మధ్యమం’ పంచమం’ స్వరాలు కళ్యాణి రాగం మాధుర్యానికి కారణమనిపిస్తుంది. కళ్యాణిలో కీరవాణి స్వరపరిచిన రెండు పాటలు . 1) ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో ‘ఒక మనసును’ 2) బొంబాయి ప్రియుడు లో ‘చందన చీరలు కట్టి’ . చక్కని గీతాలు. అలాగే శంకర్ మహదేవన్ ‘breathless’ కూడా కళ్యాణిలో చందన చర్చలు చేస్తుంది.
జ్యోతిషంలోని మౌలికమైన అంశాలని ఈ విషయంలో ఏ మాత్రమూ ప్రవేశంలేని నాలాంటివారికి కూడా బాగా అర్థం అయ్యేటట్లు వివరించారు. పంచాంగంలోని అతిముఖ్యమైన అంగం – తిథి, దానిని ఎలా గణిస్తారు అనే విషయం గురించి వివరిస్తూ మీరు మరొక వ్యాసం వ్రాస్తే బావుంటుంది. ఇది అత్యాశగా మీకు అనిపించవచ్చు కానీ ఇలా అడగడానికి అవసరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, ప్రపంచంలో (ప్రత్యేకించి అమెరికాలో) అనేక చోట్ల స్థిరపడ్డ నాలాంటివాళ్ళు కొంతమందికి వచ్చే సందేహం – భరత ఖండానికి గణింపబడ్డ చాంద్రమాన పంచాంగాన్ని మరొక time zone లో ఉన్నప్పుడు ఎలా అన్వయించుకోవాలని. ఈ విషయం గురించి నేను కొంత తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాల కారణంగా మరిన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇక రెండవ కారణం కొంత అవగాహన పెంచుకుందామన్న కోరికే. మీ e-mail చిరునామా తెలిపినట్లైతే, నా సందేహాలు మీకు పంపుతాను.
ఒకటొ పేజీ అంతా రైల్వే time table లో పేజీలు చదువుతున్నట్టనిపించింది.
చాలా చిన్న సంఘటనని సాగదీసినట్టనిపించింది..
మొత్తానికి ఏంటో సంతృప్తిగా లేదు.
కొ శ్యా సు రా
ఈమాట కి సంపాదకులైన వేలూరి వెంకతేశ్వర రావు గారికి నమస్కారం (వెల్చేరు కి మిత్రులైన మీకు కాదు అని మనవి)
వాస్తవం ఒకటే వుంటుందండీ. దాన్ని చూసే దృష్టి లో వుండే భేదం వల్ల మాత్రమే అది వేరు వేరు గా వ్యక్తం అవుతుంది. ఇది కల్పనకైన వాస్తవానికైన కూడ. ఇద్దరి అభిప్రాయాలు ఎంతగా కలిసినా కూడా వాటిని వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా బేధం వుంటుంది. అది వాస్తవం లేదా చరిత్ర ఎదైనప్పటికి.
వెల్చెరు వారు తెలుగు సాహితీ తర్జుమాలకి దొరికిన ఒక వరం. ఇహ తానా ఆయనకి గుమ్మడి గారితో ఒకే వేదిక మీద ఇవ్వలేదని వగచటం అర్థం లేనిది. ఎందుకంటే అప్పుడు నారాయణ రావు గారిని సినిమా వాళ్ళతో కలిపేసి ఒక మెట్టు తగ్గించినట్టు అవుతుంది. అటువంటి పని చేయక వారు వెల్చేరు ని కాస్తా ప్రత్యేకంగా ఉంచి మంచి పనే చెసారు కదందీ. విప్లవ్ గారు! మరి మీరింక బాధ పడనక్కర లేదు.
ఎప్పుడో నేను ఒకసారి వెల్చేరు వారి వుపన్యాసం విన్నాను. ఆయన Ph.D. పుస్తకం కూడ చదివేను. అది చాల వుత్కంఠం గా వుంటుంది, చదువుతున్నప్పుడు. నారాయణ రావు గారు చాల గడుసువారు అన్న భావం కలుగుతుంది కూడాను. ఆయన అభిప్రాయాలలో కొన్ని ఎంత ఇష్టంగ, ఆకర్షణ తో వుంతాయో, మరి కొన్ని అంతే నీరసం గాను, అంతగా ఒప్పుదలకనట్టు గాను కూడ వుంతాయి. వెల్చేరు వారి బలహీనతలు వెల్చేరు వారివి. అయినప్పటికీ, వెల్చేరు నారయణ రావు గారు తెలుగు సాహిత్యం విషయంలో చేసిన కృషి ప్రత్యేకమైనదీ. ఇతరులు ఆయనంత విశేషంగా చేయనిదీను.
తెలుగు లో ముఖ్యులు ఎవరినీ తెలుగు జాతి గుర్తుంచుకునేటంత గా గౌరవించినట్టులేదు. అందువల్ల వెల్చేరు కి దక్కిన ఆపాటి పురస్కారమైనా మరి గొప్పదేగా. అది కూద ఆయన టాణా వాళ్ళకి అస్మదీయులు కాకపోయినప్పటికీ. అందుకు మరీ సంతొషించాలి మనమందరను.
ఆయన గురించి మీరు రాసిన వ్యాసం మరీ క్లుప్తం గాను, కొంచెం మొహమాటం గాను సాగింది.
ఆయనకీ, మీకు, TANA వారికీ, ఆయన పై వ్యాసానికి మిమ్మల్ని ప్రేరేపించిన చౌదరి గారికి… నా అభినందనలు.
కల్యాణి రాగం – అనుబంధం గురించి నాగ మురళి గారి అభిప్రాయం:
03/04/2008 11:55 am
నాకు సంగీతం గురించి తెలిసింది చాలా తక్కువ. కొద్దికాలం భారతీయ విద్యాభవన్ లో వేణువు నేర్చుకున్నాను. డాక్టర్ జాన్ మార్ గారు చెప్పిన మొదటి, రెండు సంవత్సరాలు థియరీ కోర్సు నేర్చుకున్నాను. జనక, జన్య రాగాల గురించి పెద్ద కాంట్రవర్సీ ఉన్నదనే ఆయనా చెప్పారు. కొన్ని జన్య రాగాలుగా చెప్పబడుతున్నవి వాటి జనక రాగాలుగా చెప్పబడుతున్నవాటి కన్న చాలా పాతవి ఉన్నాయట(ముందే కనిపెట్టబడ్డాయి). ఆయన ఉదాహరణలు చెప్తూ ఖరహరప్రియ 18వ శతాబ్దంలో పుట్టిందనీ, దాని జన్య రాగమైన శ్రీ రాగం 13వ శతాబ్దంలోనే (అధమంగా 16వ శతాబ్దంలో) పుట్టిందనీ చెప్పారు. అలాంటప్పుడు వాటిల్ని జనక, జన్య రాగాలుగా పేర్కొనడంలో ఔచిత్యమేమిటని కూడా ఆయన అన్నారు. అలాగే హరికాంభోజి కన్నా దాని జన్యంగా పేర్కొనే కాంభోజి పాతదిట.
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 10:41 am
సాయి గొర్తి గారూ,
నా మటుకు రాగాలనేవి సజీవంగా మోగుతూ, శ్రోతలను ఆనందపరిచేవి. నా వ్యాసాల ఉద్దేశం కూడా సంగీతాన్ని సామాన్యశ్రోతలకు దగ్గర చేర్చాలనే.
ఇక కాంట్రవర్సీ మాటకొస్తే జన్యరాగం అనేదాని పేరెంటేజిని నిర్ణయించడానికి తంటాలు తప్పవు. ఉదాహరణకు మోహనరాగంలో మ, ని స్వరాలు ఉండవు. సిద్ధాంతరీత్యా దాన్ని రి2, గ2, ద2 ఉన్న హరికాంభోజి(28), ధీరశంకరాభరణం(29), వాచస్పతి(64), మేచకల్యాణి(65) లలో ఏ మేళకర్తనుంచయినా జన్యంగా అనుకోవచ్చు. సంప్రదాయాన్ని బట్టీ, అనుస్వరాలనిబట్టీ పండితులు హరికాంభోజికి జన్యమని అంటారు.
మేళకర్త రాగాలతో లిబర్టీస్ తీసుకోవడం కష్టమనీ, కల్యాణిలో నిరిగమ మొదలైన ప్రయోగాలు యథేచ్ఛగా చెయ్యవచ్చనీ కొందరు గాయకులు నాతో అన్నారు. ప్రాక్టికల్ మ్యూజిషియన్లకి ఈ సంగతులు తెలుస్తాయి. మేళకర్త సిస్టం పక్కాగానూ, మరీ పక్కాగానూ ఉంటుందనీ, హిందుస్తానీ వారి పది ఠాఠ్ ల పద్ధతి మరీ తక్కువగానూ అనిపిస్తుందనీ రవిశంకర్ ఒక సందర్భంలో అన్నాడు. మేళకర్త రాగాలను గురించి నేను బాలమురళిగారినీ, సంగీతరావుగారినీ, రజనీకాంతరావుగారినీ అడిగాను. ఎవరి అనుభవాన్నిబట్టి వారు సమాధానాలు చెప్పారు.
సంగీతాన్ని చూసి జడవకుండా వీలయినంత ఎక్కువమంది విని తెలుసుకోవాలని నా ఉద్దేశం. మేచకల్యాణిని దాటి ముందుకు వెళ్ళి, నా వ్యాసం కల్యాణి రాగంతో పరిచయాన్ని పెంచగలిగిందో లేదో మీరు చెపితే సంతోషిస్తాను.
[This comment has been edited – Editors]
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగ మురళి గారి అభిప్రాయం:
03/04/2008 10:17 am
గిల్టీ రీడర్ గారు, జ్యోతిషం కేవలం డబ్బు సంపాదించడం కోసం ఆడే నాటకమని భావించడం సులభమేగానీ, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు. చాలామంది జ్యోతిష్కులు జ్యోతిషం నిజంగా సైన్సు అనీ, దాన్ని ఉపయోగించి తాము అందరికీ దారి చూపిస్తున్నామనీ గట్టిగా నమ్ముతారు. వాళ్ళకు అలాంటి నమ్మకం కలగడానికి కారణమేమిటో వివరించి, అది అసలు నిజంగా సైన్సు అయ్యే అవకాశం ఉందో లేదో చర్చించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
రాజాశంకర్ గారూ, తప్పకుండా మీ సందేహాలు తెలియజేయండి. వీలునిబట్టి నాకు తెలిసినంతవరకు సమాధానాలిస్తాను. కొంచం పెద్ద వ్యాసాలు రాయాల్సి వస్తే, నా బ్లాగు లో రాస్తాను. అయితే ఒక మనవి. నేను జ్యోతిష్కుణ్ణి కాను. జాతకాలు చెప్పేవాణ్ణీ కాను. జ్యోతిషం కొంత తెలిసినవాణ్ణి. అయినా అది ఖచ్చితంగా పనిచేస్తుందని నమ్మేవాణ్ణి కాను. నా మెయిల్ అయిడీ: vadavalli_nm@yahoo.com
రోహిణీ ప్రసాద్ గారూ, మీరు చెప్పిన పోలిక చాలా సమంజసమైనది. గ్రహాల్లాగానే ఆకాశంలో కనిపించే నక్షత్ర రాశులకి కూడా భూమి మీద, మనుషులమీద ప్రభావం ఉన్నదని జ్యోతిషం నమ్ముతుంది. దాని ప్రకారం – గ్రహాల ప్రభావం, రాశుల ప్రభావం సమ్మిళితంగా పని చేస్తాయి. అంటే కిటికీ ఊచలేగాక వెనకాల కనిపిస్తున్న చెట్లూ, కొండలూ కూడా మనమీద పనిచేస్తాయనుకోవాలి. భూమి నుంచి చూసినప్పుడు గ్రహాలు కూడా నక్షత్రాల్లాగే కనిపిస్తాయి. అవి ఒక్కో రాశి (నక్షత్ర మండలం) లో ఉన్నట్టు కనిపిస్తాయి. భూమి నుంచి చాలా చిన్నగా కనిపిస్తాయి కాబట్టి ఏ కోణం లోంచి చూసినా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఆ స్థితి మారినట్టు కనిపించదు. కానీ చూసే కోణాన్నిబట్టి మొత్తంగా గ్రహ-రాశి స్థితి మారుతుంది. అంటే ఒక రాశి ఇండియాలో మా ఇంటి నుంచి చూస్తే ఈ క్షణంలో నడినెత్తిమీద ఉండవచ్చు. అదే క్షణంలో లండన్ నుంచి చూస్తే అదే రాశి ఉదయిస్తూ కనపడవచ్చు. అది నడినెత్తిమీద ఉంటే ప్రభావం ఒకరకంగా ఉంటుందనీ, ఉదయిస్తుంటే మరో రకంగా ఉంటుందనీ జ్యోతిషం చెప్తుంది. (ఈ కోణాల్నే భావాలు అంటారు అని వివరించాను). అందుకే జాతకం వేసేటప్పుడు పుట్టిన ప్రదేశాన్నిబట్టి గ్రహాలూ రాశులూ ఏ ఏ భావాల్లో (కోణాల్లో) ఉన్నాయో లెక్కిస్తారు.
అయితే ఈ రాశి చక్రం ఎక్కడి నుంచి లెక్కపెట్టాలో, ఈ భావాలు ఎలా గణించాలో చాలా గందరగోళం ఉన్నది. ఒకదానికొకటి పొసగని సిధ్ధాంతాలు, సాంప్రదాయాలు జ్యోతిషంలో చాలా ఉన్నాయి. వాటి గురించి తరవాతి భాగంలో వివరిస్తాను. కేవలం సారాంశం బోధపడడానికి సరళంగా ఒక outline మాత్రమే ఇస్తున్నానని మనవి.
ఆహా గురించి తెలుగు అభిమాని గారి అభిప్రాయం:
03/04/2008 9:36 am
ప్రకృతి ఒడిలో కరిగింపజేసే ఆల్కెమీ నీకు తెలుసు. ప్రకృతి నీకు రహస్యపాఠాలు నేర్పింది కదా! చాలా బాగుంది సుబ్రమణ్యం.
కల్యాణి రాగం – అనుబంధం గురించి D.Girija గారి అభిప్రాయం:
03/04/2008 8:48 am
This is an excellent idea to introduce one particular ragam to students like me. Thank you Prasadgaru. Only you can think of such innovative ideas and make good use of.a web magazine.
Before reading this article, I used to think that Kalyani and Mechakalyani are one and the same. Though it is not very important in the context, I did some R&D, consulted my gurus, and came to know that they are slightly different in fact and have a little variance in bhavams.
Thanks to Eemaata for a useful and interesting article.
Please keep this series up and give similar articles in future also.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 7:56 am
వ్యాసం పూర్తవలేదు కాని నాకు మొదటినుంచీ కొన్ని సందేహాలున్నాయి. గ్రహాలను భూమినుంచి వీక్షించినప్పుడు వాటి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రరాశులు కనబడతాయి. చూస్తున్న కోణాన్నిబట్టి ఆ నేపథ్యం మారుతుంది. గ్రహాల ప్రభావం జరగబోయే సంఘటనలమీద ఉంటుందని అనుకున్నా కిటికీ చువ్వలకూ, కిటికీనుంచి కనబడే దూరపు కొండలకూ ముడిపెట్టినట్టు ఈ రాశుల ప్రమేయం ఏమిటో అర్థం కాదు.
కల్యాణి రాగం – అనుబంధం గురించి తెలుగు అభిమాని గారి అభిప్రాయం:
03/04/2008 7:47 am
రాగాలలో కళ్యాణి మకుటంలేని మహరాణి అనడంలో సందేహం లేదు. చక్కటి వ్యాసం అందించినందుకు నెనరులు. ‘ప్రతి మధ్యమం’ పంచమం’ స్వరాలు కళ్యాణి రాగం మాధుర్యానికి కారణమనిపిస్తుంది. కళ్యాణిలో కీరవాణి స్వరపరిచిన రెండు పాటలు . 1) ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో ‘ఒక మనసును’ 2) బొంబాయి ప్రియుడు లో ‘చందన చీరలు కట్టి’ . చక్కని గీతాలు. అలాగే శంకర్ మహదేవన్ ‘breathless’ కూడా కళ్యాణిలో చందన చర్చలు చేస్తుంది.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/04/2008 7:40 am
నాగమురళిగారూ,
జ్యోతిషంలోని మౌలికమైన అంశాలని ఈ విషయంలో ఏ మాత్రమూ ప్రవేశంలేని నాలాంటివారికి కూడా బాగా అర్థం అయ్యేటట్లు వివరించారు. పంచాంగంలోని అతిముఖ్యమైన అంగం – తిథి, దానిని ఎలా గణిస్తారు అనే విషయం గురించి వివరిస్తూ మీరు మరొక వ్యాసం వ్రాస్తే బావుంటుంది. ఇది అత్యాశగా మీకు అనిపించవచ్చు కానీ ఇలా అడగడానికి అవసరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, ప్రపంచంలో (ప్రత్యేకించి అమెరికాలో) అనేక చోట్ల స్థిరపడ్డ నాలాంటివాళ్ళు కొంతమందికి వచ్చే సందేహం – భరత ఖండానికి గణింపబడ్డ చాంద్రమాన పంచాంగాన్ని మరొక time zone లో ఉన్నప్పుడు ఎలా అన్వయించుకోవాలని. ఈ విషయం గురించి నేను కొంత తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాల కారణంగా మరిన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇక రెండవ కారణం కొంత అవగాహన పెంచుకుందామన్న కోరికే. మీ e-mail చిరునామా తెలిపినట్లైతే, నా సందేహాలు మీకు పంపుతాను.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
వినినంతనె వేగ పడక గురించి kosyasura గారి అభిప్రాయం:
03/04/2008 7:13 am
ఒకటొ పేజీ అంతా రైల్వే time table లో పేజీలు చదువుతున్నట్టనిపించింది.
చాలా చిన్న సంఘటనని సాగదీసినట్టనిపించింది..
మొత్తానికి ఏంటో సంతృప్తిగా లేదు.
కొ శ్యా సు రా
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/04/2008 6:32 am

rama