చదవటం పూర్తయిత తరువాత కాసేపు ప్రశాంతంగా కళ్లుమూయించి ఆహ్లాదాన్ని మిగిల్చిన కథ. “ఈ వెచ్చదనం ఈయన ప్రేమవల్లా లేక జ్వరంవల్లా” అనే మాటలో అనుభూతి, ఆదుర్దా కలిసి ఎంత వాస్తవికంగా వుంది!
అనువాదపు అసహజత్వం కాస్తయినా కనబడుతుందేమో అనే అనుమానపు తత్వంతో ఈ కథను చదవడం మొదలెట్టినా, ముగింపుకొచ్చేసరికి ఆ ఆలోచనే లేకుండా పోయింది. ఇది కథావస్తువు యొక్క సార్వజనీనవల్లనే అనడానికి లేదు. ఇందులో అనువాదపు చాతుర్యం తప్పకుండా వుండే వుంటుందనుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగులోనికి నిరంతరంగా విరివిగా అనువాద రచనలు చేస్తున్నవారిగా నేనెరిగిన ఒకే ఒక వ్యక్తి సోమశంకర్ గారు. ఆయనకు అభినందనలు. మూలకథారచయితకు కూడా.
Rajarao garu, I am delighted to read your follow-up comment .I would also be interested to see an article that discusses in depth the old and new idealogies concerning scientific thought. Personally I believe that Karl Popper’s Scientific Philosophy is enough to rationalize many things we encounter in day to day life. But, as you said, more informed readers would certainly like more modern and in-depth discussions on the subject. I will keep this in mind while writing the next parts. Thanks once again.
ప్రసాద్ గారు, జ్యోతిషం మీద పరిశోధనలు జరిపిన సైంటిస్టులు కొంతమంది జ్యోతిషంలో నిష్ణాతులు. వాళ్ళు జ్యోతిషం మీద నమ్మకం లేకుండానే కోర్సులు చేసి జ్యోతిషాన్ని అధ్యయనం చేసినవాళ్ళు. అటువంటి వాళ్ళలో ఒకళ్ళని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. రాబోయే భాగంలో వాళ్ళెవరో, వాళ్ళు చేసిన పరిశోధనలేమిటో తెలియజేస్తాను. నాకు తెలిసినంతవరకు వాళ్ళు హేతువాదులు. నేను నాస్తికులన్న అర్ధంలో ఆ పదం వాడలేదు. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు గానీ, కేవలం ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో తాను అంతవరకూ నమ్మిన వాటికి పూర్తి విరుధ్ధమైన విషయాలగురించి తెలుసుకోడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు.
సంఖ్యాబలాన్ని బట్టి జ్యోతిషం ప్రామాణికమైనదని నేను అనడం లేదు. జ్యోతిషం యొక్క ప్రజాదరణ రెండు రకాలుగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకటి, జ్యోతిషం పని చెయ్యదు అని శాస్త్రీయంగా నిరూపించబడి ఉంటే, ఎందుకు పని చెయ్యదో, ఆ నిరూపణలేమిటో జనసామాన్యానికి చేరలేదు అన్నమాట. రెండు, జ్యోతిషంలో నిజంగానే పస ఉంటే నా దృష్టిలో అది భూమి బద్దలయ్యేంత పెద్ద విషయం. భవిష్యత్తు ముందే నిర్ణయింపబడింది, అది తెలుసుకోవచ్చుట అంటే, నా దృష్టిలో అది చాలా పెద్ద సైంటిఫిక్ డిస్కవరీ అవ్వాలి. అందుచేత రెండు రకాలుగానూ అది నాకు ఆశ్చర్యకరమైన విషయమే.
హనుమ గారు
చాలా చక్కగా తెలుగులో ఇప్పటిదాకా, నాకు తెలిసి, ఇంతగా లభించని లైబ్నిట్జ్ వివరాలతో ఒక్కచోట అందించిన కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు.
అప్పటి తన సమకాలీన గొప్ప తత్త్వవేత్తలందరిలోనూ జీవన భృతి కోసం కష్టపడ్డది ఒక్క లైబ్నిట్జ్ మాత్రమే. అందుకే పలు రంగాలలో పలు రీతులుగా తన ప్రతిభను ప్రదర్శించుకోగలిగాడేమో కూడా!
అలుపెరుగని క్రియాశీలి, గొప్ప శాస్త్రవేత్త, దేశభక్తుడు అయిన లైబ్నిట్జ్ కీర్తి అతను జీవించినప్పటి కన్నా తరువాతనే ఎక్కువగా వృద్ధి చెంది అతని కృషిని వెలుగులోకి తీసుకొచ్చింది.
లైబ్నిట్జ్ యొక్క 360 వ జన్మదినోత్సవ సందర్భంగా జర్మనీలోని హానోవర్ విశ్వవిద్యాలయానికి లీబ్నిజ్ పేరు పెట్టి గౌరవించారు.
ఆయన పేరు మీద 1985 నుంచి ప్రతి ఏడాది, ప్రయోగపరమైన (Experimental) మఱియు, సిద్ధాంతపరమైన(Theoretical) పరిశోధనలకు
పురస్కారాలను ఇస్తున్నారు. ప్రయోగపరమైన పరిశోధనలకిచ్చే Leibnitz
పురస్కారం ప్రపంచంలోనే అతి పెద్ద మొత్తం. నోబెల్ పురస్కారానికి దాదాపు
మిలియన్ యూరోలిస్తే, ప్రయోగపరమన పరిశోధనలకు గాను ఇచ్చే Leibnitz పురస్కారానికి ఇచ్చే మొత్తం దాదాపు మిలియన్నర యూరోలు! జీవన భృతికై ఎన్నో విధాలుగా కష్టించిన Leibnitz పేరనే అతి పెద్ద మొత్తమిచ్చే పురస్కారం ఉండడం విశేషం.
Leibnitz ఎప్పుడో అన్న ఈ మాటలు ఇప్పటికీ, ఎప్పటికీ కూడా సత్యమే, స్ఫూర్తిదాయకమే.
“I have hope that society may be reformed when I see how much education may be reformed.” Leibnitz
కేయాటిక్ సమీకరణం గురించి aswartha గారి అభిప్రాయం:
03/06/2008 1:05 am
చాల బాగుంది.
మరల ఆ రోజులు రావాలని
అనుకుంటూ, ఆకాంక్షిస్తూ!
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Sowmya గారి అభిప్రాయం:
03/06/2008 1:04 am
ఇక్కడ నాకు యండమూరి కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదు కానీ,
ఈ కవిత మాత్రం చాలా నచ్చింది !
ఆహా గురించి aswartha గారి అభిప్రాయం:
03/06/2008 12:50 am
చెప్పిన పదాలన్ని నీవే
అవి చెప్పే అర్థాలన్ని నీవే
కాని ఆ భావాలు మాత్రం మాలోనే నింపుకున్నాం.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Srinivas V గారి అభిప్రాయం:
03/05/2008 10:38 pm
అద్బుతమైన వ్యాసం. నాటకాల గురించి ఇంత విపులంగా నేనెప్పుడూ చదివినట్లు గుర్తులేదు.
నాటకాలు వేసే వాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన వ్యాసం ఇది.
-శ్రీనివాస్ వి
ప్రేమికుల దినం గురించి Sowmya గారి అభిప్రాయం:
03/05/2008 9:41 pm
🙂 అంతా బానే ఉంది గానీ…చెప్పగదలుచుకున్న విషయం ఏమిటో మరి…నాకు అర్థం కాలేదు 🙁
వినినంతనె వేగ పడక గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:
03/05/2008 9:34 pm
సరదాగా అనిపించింది కానీ… పూర్తిగా లేనట్లు అనిపించింది.
ఉన్నట్లుండి ముగిసినట్లు కూడా అనిపించింది.
వెచ్చని మనసులు గురించి రానారె గారి అభిప్రాయం:
03/05/2008 5:06 pm
చదవటం పూర్తయిత తరువాత కాసేపు ప్రశాంతంగా కళ్లుమూయించి ఆహ్లాదాన్ని మిగిల్చిన కథ. “ఈ వెచ్చదనం ఈయన ప్రేమవల్లా లేక జ్వరంవల్లా” అనే మాటలో అనుభూతి, ఆదుర్దా కలిసి ఎంత వాస్తవికంగా వుంది!
అనువాదపు అసహజత్వం కాస్తయినా కనబడుతుందేమో అనే అనుమానపు తత్వంతో ఈ కథను చదవడం మొదలెట్టినా, ముగింపుకొచ్చేసరికి ఆ ఆలోచనే లేకుండా పోయింది. ఇది కథావస్తువు యొక్క సార్వజనీనవల్లనే అనడానికి లేదు. ఇందులో అనువాదపు చాతుర్యం తప్పకుండా వుండే వుంటుందనుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగులోనికి నిరంతరంగా విరివిగా అనువాద రచనలు చేస్తున్నవారిగా నేనెరిగిన ఒకే ఒక వ్యక్తి సోమశంకర్ గారు. ఆయనకు అభినందనలు. మూలకథారచయితకు కూడా.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగ మురళి గారి అభిప్రాయం:
03/05/2008 3:24 pm
Rajarao garu, I am delighted to read your follow-up comment .I would also be interested to see an article that discusses in depth the old and new idealogies concerning scientific thought. Personally I believe that Karl Popper’s Scientific Philosophy is enough to rationalize many things we encounter in day to day life. But, as you said, more informed readers would certainly like more modern and in-depth discussions on the subject. I will keep this in mind while writing the next parts. Thanks once again.
ప్రసాద్ గారు, జ్యోతిషం మీద పరిశోధనలు జరిపిన సైంటిస్టులు కొంతమంది జ్యోతిషంలో నిష్ణాతులు. వాళ్ళు జ్యోతిషం మీద నమ్మకం లేకుండానే కోర్సులు చేసి జ్యోతిషాన్ని అధ్యయనం చేసినవాళ్ళు. అటువంటి వాళ్ళలో ఒకళ్ళని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. రాబోయే భాగంలో వాళ్ళెవరో, వాళ్ళు చేసిన పరిశోధనలేమిటో తెలియజేస్తాను. నాకు తెలిసినంతవరకు వాళ్ళు హేతువాదులు. నేను నాస్తికులన్న అర్ధంలో ఆ పదం వాడలేదు. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు గానీ, కేవలం ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో తాను అంతవరకూ నమ్మిన వాటికి పూర్తి విరుధ్ధమైన విషయాలగురించి తెలుసుకోడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు.
సంఖ్యాబలాన్ని బట్టి జ్యోతిషం ప్రామాణికమైనదని నేను అనడం లేదు. జ్యోతిషం యొక్క ప్రజాదరణ రెండు రకాలుగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకటి, జ్యోతిషం పని చెయ్యదు అని శాస్త్రీయంగా నిరూపించబడి ఉంటే, ఎందుకు పని చెయ్యదో, ఆ నిరూపణలేమిటో జనసామాన్యానికి చేరలేదు అన్నమాట. రెండు, జ్యోతిషంలో నిజంగానే పస ఉంటే నా దృష్టిలో అది భూమి బద్దలయ్యేంత పెద్ద విషయం. భవిష్యత్తు ముందే నిర్ణయింపబడింది, అది తెలుసుకోవచ్చుట అంటే, నా దృష్టిలో అది చాలా పెద్ద సైంటిఫిక్ డిస్కవరీ అవ్వాలి. అందుచేత రెండు రకాలుగానూ అది నాకు ఆశ్చర్యకరమైన విషయమే.
వెచ్చని మనసులు గురించి kiran venkata గారి అభిప్రాయం:
03/05/2008 11:57 am
beautiful….
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/05/2008 11:36 am
హనుమ గారు
చాలా చక్కగా తెలుగులో ఇప్పటిదాకా, నాకు తెలిసి, ఇంతగా లభించని లైబ్నిట్జ్ వివరాలతో ఒక్కచోట అందించిన కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు.
అప్పటి తన సమకాలీన గొప్ప తత్త్వవేత్తలందరిలోనూ జీవన భృతి కోసం కష్టపడ్డది ఒక్క లైబ్నిట్జ్ మాత్రమే. అందుకే పలు రంగాలలో పలు రీతులుగా తన ప్రతిభను ప్రదర్శించుకోగలిగాడేమో కూడా!
అలుపెరుగని క్రియాశీలి, గొప్ప శాస్త్రవేత్త, దేశభక్తుడు అయిన లైబ్నిట్జ్ కీర్తి అతను జీవించినప్పటి కన్నా తరువాతనే ఎక్కువగా వృద్ధి చెంది అతని కృషిని వెలుగులోకి తీసుకొచ్చింది.
లైబ్నిట్జ్ యొక్క 360 వ జన్మదినోత్సవ సందర్భంగా జర్మనీలోని హానోవర్ విశ్వవిద్యాలయానికి లీబ్నిజ్ పేరు పెట్టి గౌరవించారు.
ఆయన పేరు మీద 1985 నుంచి ప్రతి ఏడాది, ప్రయోగపరమైన (Experimental) మఱియు, సిద్ధాంతపరమైన(Theoretical) పరిశోధనలకు
పురస్కారాలను ఇస్తున్నారు. ప్రయోగపరమైన పరిశోధనలకిచ్చే Leibnitz
పురస్కారం ప్రపంచంలోనే అతి పెద్ద మొత్తం. నోబెల్ పురస్కారానికి దాదాపు
మిలియన్ యూరోలిస్తే, ప్రయోగపరమన పరిశోధనలకు గాను ఇచ్చే Leibnitz పురస్కారానికి ఇచ్చే మొత్తం దాదాపు మిలియన్నర యూరోలు! జీవన భృతికై ఎన్నో విధాలుగా కష్టించిన Leibnitz పేరనే అతి పెద్ద మొత్తమిచ్చే పురస్కారం ఉండడం విశేషం.
Leibnitz ఎప్పుడో అన్న ఈ మాటలు ఇప్పటికీ, ఎప్పటికీ కూడా సత్యమే, స్ఫూర్తిదాయకమే.
“I have hope that society may be reformed when I see how much education may be reformed.” Leibnitz
Regards,
Srinivas