Comment navigation


15549

« 1 ... 1413 1414 1415 1416 1417 ... 1555 »

  1. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/07/2008 8:46 am

    అసమీక్షసమీక్ష్యకారి గారి అభిప్రాయం చదివాను. “భవిష్యత్తు ముందుగానే నిర్ణయమై వుందదని” నేనన్నానంటే, అది ఎటువంటి భవిష్యత్తు? అసమీక్షసమీక్ష్యగారు చెప్పినట్టు విశ్వం గురించా? వాతావరణ శాస్త్ర రీత్యా రెండ్రోజుల్లో తుఫాను వస్తుందని చెబితే, అది నిజమైతే, అలాంటి భవిష్యత్తు గురించా? లేదా సుబ్బారావుకి వచ్చే నెల్లో వుద్యోగం వస్తుందా, రాదా (శుక్రుడు పంచమ దశలో శని వేపు ప్రేమగా చూస్తున్నాడు కాబట్టి) లాంటి భవిష్యత్తా? అన్ని రకాల విషయాలనూ కలగా పులగంగా కలిపేశారు. వార ఫలాల్లో కనబడే భవిష్యత్తులాంటి విషయాల గురించి అంటున్నాను. గ్రహాల కదలికలూ, వాటి స్థానాలూ మానవ జీవితాన్ని సాంఘీకంగా నిర్దేశించే విషయాల గురించి మాట్టాడుతున్నాను. విశ్వం ఎలా వుందో, అది ఏ లెక్కల ప్రకారం ఏ విధంగా మారుతుందో లాంటి విషయాల గురించి మాట్టాడ్డం లేదు.

    ప్రకృతికి సంబంధించిన విషయాలు ప్రకృతి శాస్త్రాలకి అనుగుణంగా ఎలా నడుస్తాయో, సమాజానికి సంబంధించిన విషయాలు కూడా సామాజిక శాస్త్రాలకి అనుగుణంగా వుంటాయి. ఈ రెండు రకాల విషయాలూ ఒకదాని మీదొకటి ప్రభావాన్ని చూపించుకుంటాయి. మానవ జీవన విధానం వల్ల జరిగే వాతావరణ కాలుష్యం ప్రకృతి శాస్త్ర విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

    విషయాలు సరిగా అర్థం చేసుకోకపోతే, మోకాలికి, బోడి గుండుకీ ముడి పెట్టినట్టు వుంటుంది. ఈ అభిప్రాయ వేదికలో ఇంతకన్నా వివరంగా రాయడానికి కుదరదు. ఇప్పటికే ఇటువంటి విషయాల మీద చాలా పుస్తకాలు వున్నాయి.

    — ప్రసాద్

  2. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి Siddi Raju గారి అభిప్రాయం:

    03/07/2008 8:33 am

    చాలా బాగుంది. ఇంత క్లిష్ట విషయాల్ని ఇంత సులభంగా చెప్పడం, subject మీద మంచి ఆసక్తి, పట్టూ వున్నప్పుడు మాత్రమే సాధ్యమని నా ఉద్ధ్యేశ్యం. కాబట్టి మేము ఇంకా చాలా వ్యాసాలు ఆశించొచ్చు అన్న ఆలోచన చాలా అనందంగా వుంది.

  3. రచయితలకు సూచనలు గురించి pnvijaykumar గారి అభిప్రాయం:

    03/07/2008 6:12 am

    ఈ పత్రిక చాలా బాగుంది.

  4. బ్లాగుల గురించి – నా మాట గురించి surya గారి అభిప్రాయం:

    03/07/2008 4:54 am

    ఆర్టికల్ బ్లాగు బ్లాగు; కొస్యాసుర కామెంట్ భ్లేషు భ్లేషు!

  5. షష్ఠ్యంతములు గురించి P. N. Raja Rao గారి అభిప్రాయం:

    03/07/2008 3:54 am

    మోహన రావు గారూ:

    నమో నమః మంచి వ్యాసం మాకు అందించారు.
    మనుచరిత్ర గురించి చెప్పి, విజయ విలాసములోని ” ఏతాదృగ్గుణ ఖనికిన్…”, వగైరా ఉదహరించపోవడం ఆశ్చర్యంగా ఉన్నది.
    విశ్వనాథ వారు రామాయణం మొట్టమొదటి ప్రచురణలో ఈ షష్ట్యంతాలు ఉన్నాయని విన్నాను. తరువాతి ప్రచురణలలో ముప్పాళ్ళ రాజా గారిని పొగుడుతూ రాసిన పద్యాలు కత్తిరింబడ్డాయని వినికిడి. ఆ మొదటి ప్రతి పద్యాలు మీ దగ్గిర ఉంటే వాటిని మాకు చెప్పండి.

    అభినందలతో,

    పి.యన్.ఆర్.

  6. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి P. N. Raja Rao గారి అభిప్రాయం:

    03/07/2008 3:37 am

    వ్యాసం చాలా బాగున్నది. చివర ఒక్క రిఫరెన్సుకూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. తెలుగు నాటకరంగంపై చాలా పుస్తకాలు చూసిన గుర్తు.
    మిక్కిలినేని గారు, అంతకన్నా ప్రాచీనులు కృత్తివెంటి వారు, ఆ తరువాత స్థానం వారి స్వీయకథ, ఇలా ఎన్నో పుస్తకాలు తెలుగులో నాటక ప్రక్రియ గురించి, సదరు చరిత్ర వివరంగా ఉన్నట్టు నాకు గుర్తు.

    బ్రహ్మానందం గారికి అభినందనలు..
    పి.యన్.ఆర్.

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగ మురళి గారి అభిప్రాయం:

    03/06/2008 9:41 pm

    రవి గారూ, కృతఙ్ఞతలు. తప్పకుండా తిథులగురించి త్వరలో రాస్తాను.

  8. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి రవి గారి అభిప్రాయం:

    03/06/2008 8:30 pm

    నాగ మురళి గారూ,

    నాకు జ్యోతిషం మీద అభిప్రాయాల్లేవు., చిన్నప్పుడు 12 యేళ్ళు సంస్కృతం వెలగబెట్టినా కూడా. ఐతే మీ అభిలాష, తపన చూసి నిజంగా ఆశ్చర్యపడ్డాను.

    ఇక పోతే, రాజశేఖర్ గారి ప్రశ్నే నాదీనూ. తిథులు ఎలా గుణిస్తారు ? ఆ లాజిక్ యేమిటి, మీరు ఓ బ్లాగు తప్పక రాయాలి.

    ఇలానే మంచి మంచి బ్లాగులు రాస్తుండండి. ఉబుసుపోక రాతలు రాయడానికి నా లాంటి బ్లాగర్లం ఎలానూ వున్నాము 🙂

  9. కల్యాణి రాగం – అనుబంధం గురించి surya గారి అభిప్రాయం:

    03/06/2008 7:54 pm

    విన్నవించుకోనా చిన్న కోరికా, ఐనదేదో ఐనది, ఎవరివో నీవెవరివో, నాదు ప్రేమ భాగ్య రాశి, నా ప్రియ కుటీర, ఓం నమో నమ యవ్వనమా … the list is endless. What is interesting is that all noteworthy Kalyanis are creations of yester-year composers only, like Saluru vaaru and Pendyala gaaru.

    I appreciate Mr.Rohini Prasad’s commitment in adorning the articles with audio support. The article is simply ‘add-to-favorites-able’.

  10. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/06/2008 6:53 pm

    నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు్ తదితర తెలుగు హీరోలకు లెక్కలేనన్ని పాటలు పాడిన ఘంటసాల శివాజీ గణేశన్ కు కూడా పాడారని మనకు తెలియదు. భానుమతితో పాడిన ఈ యుగళగీతం చూడండి.

« 1 ... 1413 1414 1415 1416 1417 ... 1555 »