కవితలు చాలా చాలా బాగున్నాయి, కొన్ని పోలికలు సహజంగా మనస్సు ని సులువైన పద్ధతిలో ఆకట్టుకున్నాయి.
వర్షం కురిసిన ప్రతిసారీ
ఆమె గుర్తుకు రావడంలో
ఆశ్చర్యం ఏముంది?
తరచి తరచి చూశాకా
దేనికీ అర్ధంలేదని తెలిశాకా
నిఘంటువును చూస్తే
నవ్వొస్తోంది
ఇది చదివాకా గుండె జలదరించింది నాకు. It takes years or centuries to understand above few words. It gets very tough to indulge in such thoughts when one considers life in practical terms. It’s a good depiction. I bow humbly to your great work!
చూసావా సుబ్బారావు, అదయ్యా విషయం. అంతా నీకళ్ళారా చూసావుకదా. అంచేత ప్రేమికుల దినాలూ, దివసాలూ, రోజుల గురించి నువ్వేమి బాధ పడక్కరలేదు. ప్రేమికురాలి గురించి వాచి పోనక్కర లేదు. చక్కగా నీ ఉద్యోగం చేసుకో. ఐనా నీ ధైర్యం మెచ్చుకొవాలోయి. అలాంటి అఘాయిత్యపు ఐడియా లెలా ఒచ్చాయి? అవతలి వాడు రాక్షసుడని తెలిసి కూడా అందరి తరుఫునా వత్తాసుపాడింది నువ్వే కదూ? ఏదీ మిగతా ఆ ప్రేమికులలా అడగగలిగారా? అబ్బే, లేదే. నువ్వు నాకునచ్చావోయ్!
అంచేత మురళిగారు, మన సుబ్బారావు కి వచ్చే సంచికలోనో ఆపై సంచికలోనో, ఓ మంచి అమ్మడ్ని చూసి పెట్టండి.
నాగ మురళి గారికి కృతజ్ఞతలు. మీరు ప్రచురించిన ఈ బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్నో ప్రాధమిక సందేహాలకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇక చాలా మంది హేతువాదులు అంటే నాస్తికులు అని అనుకుంటారు, అది ఎంతమాత్రము సమ్మతం కాదు. హేతువు అంటే కారణం, కారణం లేకుండా దేనినీ నంమ్మని వారిని హేతువాదులు అంటారు.
నావికులు సముద్రంలో ప్రయాణించేటప్పుడు గాలివాటం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని ప్రయాణిస్తారు, అలాగే జ్యోతిష్యం కూడా, మనకు రాబోవు కాలం అనుకూలంగా ఉందా లేదా, దాన్ని బట్టి మన కార్యాచరణను నిర్దేశించుకునే వీలు కల్పిస్తుంది.
జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకునే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చేప్పాలంటే, ముందుగా అండం తల్లి కడుపులో ఎప్పుడు ఫలదీకరించిందో తెలుకుంటే, ఆ సమయాన్ని బట్టి గణించిన జ్యోతిష్య ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయి, కాని అది అసాధ్యం కాబట్టి తల్లి బిడ్డను ప్రసవించిన సమయాన్ని బట్టి గణిస్తాము. అది కూడా చాలా మంది ఖచ్చితమైన సమయాన్ని తెలుపరు దాని వల్ల గణించడంలో తేడాలు ఉంటాయి.
సాహిత్య పఠనం నా ప్రవృత్తి. సాఫ్ట్ వేర్ జాబ్ నా వృత్తి. కళాపూర్ణోదయం చదవాలని ఎన్నో రోజులనుండి అనుకుంటున్నాను. వృత్తికి ప్రవృత్తికి దూరమెక్కువయినందున నా కోరిక తీరలేదు. కానీ మీ వెబ్ సైట్ ద్వారా నా కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉన్నది.
ధన్యవాదములు.
పెద్దన ఏనాటికీ కవులకి పెద్దనే సుమండీ ! నాకు కూడా మీకు మల్లెనే అల్లసాని భలే ఇష్టం. అయితే మీరు వుదహరించిన పద్యమే కాకుండా పెద్దన సుర్యాస్తమయం గురించి, చంద్రోదయం గురించి కూడా చేసిన మహాద్భుతమైన వర్ణనలు ఇంకావున్నాయి. చంద్రుడిని “దంతపు దువ్వెన” లాగ వున్నదని వుత్ప్రేక్షించ గలిగిన ఊహాచతురుడు పెద్దన. “తరణి ఇదే గ్రుంకుచున్నడరుదెమ్మని చంద్రుబిలువ నరిగెడు రజనీ తరుణీ మణి దూతికలన అరిగెను తూర్పునకు నీడలతి దీర్ఘములై” అన్నవాడు పెద్దనే. చీకటికి నీడలు చెలికత్తెలని వూహ చెసిన వాడు పెద్దన. పెద్దన వూహ ఎంత విశిష్ట మైనదో చెప్పడానికి మనుచరిత్ర లో ఎన్నో పద్యాలు వుదాహరణ కి దొరుకుతాయి.
మీరు మరిన్ని రుచి కలిగిన పద్యాలని పరిచయం చెయ్యండి. మీకు నా అభినందనలు.
ఎడిటర్లు తమ నియమాల్ని సడలించుకుని, వంగూరి వారి తొమ్మిదవ సంకలనంలో ముద్రితమైన ఈ సరదా కబుర్లని కథగా పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు. హాయిగా నవ్వుకున్నాను.
[Editors’ Note: మునుపెక్కడైనా ప్రచురింపబడ్డ కథల్నీ కవితల్నీ వ్యాసాల్నీ (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప)ఈమాటలో పునర్ముద్రించగూడదనే నియమం ఉన్నదని మీకందరికీ తెలిసిన విషయమే.అయితే కొన్నిసార్లు పొరపాట్లు సహజం. ఫణి డొక్కా గారి ఈ కథ పునర్ముద్రితమని మాకు తెలియగానే మా నియమాన్ననుసరించి కథను తొలిగించి వేశాం. కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. మరొక్కసారిగా – ప్రచురితమైనవే కాక, ఇంకెక్కడైనా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు కూడా ఈమాటకి ఆమోదయోగ్యం కావు. కొన్ని కొన్ని చోట్ల, ఒక రచనని ప్రచురిస్తున్నారో లేదో ఒక పట్టాన చెప్పరు. అటువంటి సందర్భంలో, ఈమాటకు పంపేటప్పుడు, ఆ ఇంకో చోటినుంచి ఆ రచనను తప్పక ఉపసంహరించుకునే బాధ్యత రచయితదే. ]
కథ చదివి, అభిప్రాయం చెపినందుకు ధన్యవాదాలు. మీ అంచనా
కరెక్టే. అసలు నేను మొదట్లో రాసిన కథలో ఇంకొంచెం పొడిగింపు
వుంది. కాలేజీలో, కెమిస్ట్రీ లాబుల్లో పిప్పెట్ లోంచి పొటాసియం
పెర్మాంగనేట్ పొరపాట్న తాగేసి పగటి డ్రాకులాల్లా నవ్వుతూ
కాలరెగరేసిన కబుర్లూ, ట్యూనింగు ఫోర్కు విరుగుతుందా లేదా? అని
బెట్టు కట్టుకుని మరీ విరక్కొట్టి, ఫైను కట్టిన ఊసులూ, ఫైనలెక్సాము
లో లేబ్ అసిస్టెంటుకి డబ్బులిచ్చి సాల్ట్ ఎనాలసిస్ లో ఏం కలిపాడో
కనుక్కున్న ఫ్రెండ్ల ముచ్చట్లూ, సీనియర్ల రికార్డులు చిల్లు కొట్టకుండా
లాబ్ అసిస్టెంట్ ని కాకా పట్టి తీసేసుకుని, వాటిపై తమ పేరు
పెట్టేసుకుని, రీయూజ్ చేసిన అల్లరి అమ్మాయిల కబుర్లూ, మరో రెండు
మూడు పేరాలు వచ్చింది. కానీ, నా మొదటి శ్రోత విని, ఈ పొడిగింపు
వల్ల కథలో అమాయకత్వం, సున్నితత్వం తగ్గిపోతునట్టనిపిస్తోంది,
మరో మాటు ఆలోచించండి అనడంతో, కాస్త ఆలోచించి, ఆ పేరాలు
దాచేసాను. ఇవన్నీ నా అనుభవాలే అయినా, ఇటువంటివి అందరికీ
జరిగే వుంటాయనే నమ్మకంతో, కథ రూపం ఇద్దామని
ప్రయత్నించాను.
ఆహా గురించి Sivasankar గారి అభిప్రాయం:
03/11/2008 7:42 pm
సుబ్బు,
కవితలు చాలా చాలా బాగున్నాయి, కొన్ని పోలికలు సహజంగా మనస్సు ని సులువైన పద్ధతిలో ఆకట్టుకున్నాయి.
వర్షం కురిసిన ప్రతిసారీ
ఆమె గుర్తుకు రావడంలో
ఆశ్చర్యం ఏముంది?
తరచి తరచి చూశాకా
దేనికీ అర్ధంలేదని తెలిశాకా
నిఘంటువును చూస్తే
నవ్వొస్తోంది
ఇది చదివాకా గుండె జలదరించింది నాకు. It takes years or centuries to understand above few words. It gets very tough to indulge in such thoughts when one considers life in practical terms. It’s a good depiction. I bow humbly to your great work!
Keep up!
Reg
ur siva
ప్రేమికుల దినం గురించి kosyasura గారి అభిప్రాయం:
03/11/2008 8:41 am
చూసావా సుబ్బారావు, అదయ్యా విషయం. అంతా నీకళ్ళారా చూసావుకదా. అంచేత ప్రేమికుల దినాలూ, దివసాలూ, రోజుల గురించి నువ్వేమి బాధ పడక్కరలేదు. ప్రేమికురాలి గురించి వాచి పోనక్కర లేదు. చక్కగా నీ ఉద్యోగం చేసుకో. ఐనా నీ ధైర్యం మెచ్చుకొవాలోయి. అలాంటి అఘాయిత్యపు ఐడియా లెలా ఒచ్చాయి? అవతలి వాడు రాక్షసుడని తెలిసి కూడా అందరి తరుఫునా వత్తాసుపాడింది నువ్వే కదూ? ఏదీ మిగతా ఆ ప్రేమికులలా అడగగలిగారా? అబ్బే, లేదే. నువ్వు నాకునచ్చావోయ్!
అంచేత మురళిగారు, మన సుబ్బారావు కి వచ్చే సంచికలోనో ఆపై సంచికలోనో, ఓ మంచి అమ్మడ్ని చూసి పెట్టండి.
కొ స్యా సు రా
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Keshava Swamy గారి అభిప్రాయం:
03/10/2008 11:02 pm
నాగ మురళి గారికి కృతజ్ఞతలు. మీరు ప్రచురించిన ఈ బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్నో ప్రాధమిక సందేహాలకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇక చాలా మంది హేతువాదులు అంటే నాస్తికులు అని అనుకుంటారు, అది ఎంతమాత్రము సమ్మతం కాదు. హేతువు అంటే కారణం, కారణం లేకుండా దేనినీ నంమ్మని వారిని హేతువాదులు అంటారు.
నావికులు సముద్రంలో ప్రయాణించేటప్పుడు గాలివాటం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని ప్రయాణిస్తారు, అలాగే జ్యోతిష్యం కూడా, మనకు రాబోవు కాలం అనుకూలంగా ఉందా లేదా, దాన్ని బట్టి మన కార్యాచరణను నిర్దేశించుకునే వీలు కల్పిస్తుంది.
జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకునే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చేప్పాలంటే, ముందుగా అండం తల్లి కడుపులో ఎప్పుడు ఫలదీకరించిందో తెలుకుంటే, ఆ సమయాన్ని బట్టి గణించిన జ్యోతిష్య ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయి, కాని అది అసాధ్యం కాబట్టి తల్లి బిడ్డను ప్రసవించిన సమయాన్ని బట్టి గణిస్తాము. అది కూడా చాలా మంది ఖచ్చితమైన సమయాన్ని తెలుపరు దాని వల్ల గణించడంలో తేడాలు ఉంటాయి.
తిరునగరి కేశవ స్వామి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
03/10/2008 8:46 am
తిథులగురించి నా బ్లాగులో ఒక వ్యాసం రాశాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడవచ్చు. http://nagamurali.wordpress.com
వినినంతనె వేగ పడక గురించి peru గారి అభిప్రాయం:
03/10/2008 6:28 am
సూపరు స్టోరీ!
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Keshava Swamy గారి అభిప్రాయం:
03/10/2008 3:55 am
సాహిత్య పఠనం నా ప్రవృత్తి. సాఫ్ట్ వేర్ జాబ్ నా వృత్తి. కళాపూర్ణోదయం చదవాలని ఎన్నో రోజులనుండి అనుకుంటున్నాను. వృత్తికి ప్రవృత్తికి దూరమెక్కువయినందున నా కోరిక తీరలేదు. కానీ మీ వెబ్ సైట్ ద్వారా నా కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉన్నది.
ధన్యవాదములు.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/09/2008 11:26 pm
అయ్యా, బృందావన రావు గారు,
పెద్దన ఏనాటికీ కవులకి పెద్దనే సుమండీ ! నాకు కూడా మీకు మల్లెనే అల్లసాని భలే ఇష్టం. అయితే మీరు వుదహరించిన పద్యమే కాకుండా పెద్దన సుర్యాస్తమయం గురించి, చంద్రోదయం గురించి కూడా చేసిన మహాద్భుతమైన వర్ణనలు ఇంకావున్నాయి. చంద్రుడిని “దంతపు దువ్వెన” లాగ వున్నదని వుత్ప్రేక్షించ గలిగిన ఊహాచతురుడు పెద్దన. “తరణి ఇదే గ్రుంకుచున్నడరుదెమ్మని చంద్రుబిలువ నరిగెడు రజనీ తరుణీ మణి దూతికలన అరిగెను తూర్పునకు నీడలతి దీర్ఘములై” అన్నవాడు పెద్దనే. చీకటికి నీడలు చెలికత్తెలని వూహ చెసిన వాడు పెద్దన. పెద్దన వూహ ఎంత విశిష్ట మైనదో చెప్పడానికి మనుచరిత్ర లో ఎన్నో పద్యాలు వుదాహరణ కి దొరుకుతాయి.
మీరు మరిన్ని రుచి కలిగిన పద్యాలని పరిచయం చెయ్యండి. మీకు నా అభినందనలు.
లిటిల్‌సైంటిస్టు గురించి srinivas Chilakapati గారి అభిప్రాయం:
03/09/2008 5:02 pm
ఎడిటర్లు తమ నియమాల్ని సడలించుకుని, వంగూరి వారి తొమ్మిదవ సంకలనంలో ముద్రితమైన ఈ సరదా కబుర్లని కథగా పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు. హాయిగా నవ్వుకున్నాను.
[Editors’ Note: మునుపెక్కడైనా ప్రచురింపబడ్డ కథల్నీ కవితల్నీ వ్యాసాల్నీ (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప)ఈమాటలో పునర్ముద్రించగూడదనే నియమం ఉన్నదని మీకందరికీ తెలిసిన విషయమే.అయితే కొన్నిసార్లు పొరపాట్లు సహజం. ఫణి డొక్కా గారి ఈ కథ పునర్ముద్రితమని మాకు తెలియగానే మా నియమాన్ననుసరించి కథను తొలిగించి వేశాం. కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. మరొక్కసారిగా – ప్రచురితమైనవే కాక, ఇంకెక్కడైనా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు కూడా ఈమాటకి ఆమోదయోగ్యం కావు. కొన్ని కొన్ని చోట్ల, ఒక రచనని ప్రచురిస్తున్నారో లేదో ఒక పట్టాన చెప్పరు. అటువంటి సందర్భంలో, ఈమాటకు పంపేటప్పుడు, ఆ ఇంకో చోటినుంచి ఆ రచనను తప్పక ఉపసంహరించుకునే బాధ్యత రచయితదే. ]
లిటిల్‌సైంటిస్టు గురించి Phani DokkA గారి అభిప్రాయం:
03/09/2008 3:40 pm
సౌమ్య గారూ,
కథ చదివి, అభిప్రాయం చెపినందుకు ధన్యవాదాలు. మీ అంచనా
కరెక్టే. అసలు నేను మొదట్లో రాసిన కథలో ఇంకొంచెం పొడిగింపు
వుంది. కాలేజీలో, కెమిస్ట్రీ లాబుల్లో పిప్పెట్ లోంచి పొటాసియం
పెర్మాంగనేట్ పొరపాట్న తాగేసి పగటి డ్రాకులాల్లా నవ్వుతూ
కాలరెగరేసిన కబుర్లూ, ట్యూనింగు ఫోర్కు విరుగుతుందా లేదా? అని
బెట్టు కట్టుకుని మరీ విరక్కొట్టి, ఫైను కట్టిన ఊసులూ, ఫైనలెక్సాము
లో లేబ్ అసిస్టెంటుకి డబ్బులిచ్చి సాల్ట్ ఎనాలసిస్ లో ఏం కలిపాడో
కనుక్కున్న ఫ్రెండ్ల ముచ్చట్లూ, సీనియర్ల రికార్డులు చిల్లు కొట్టకుండా
లాబ్ అసిస్టెంట్ ని కాకా పట్టి తీసేసుకుని, వాటిపై తమ పేరు
పెట్టేసుకుని, రీయూజ్ చేసిన అల్లరి అమ్మాయిల కబుర్లూ, మరో రెండు
మూడు పేరాలు వచ్చింది. కానీ, నా మొదటి శ్రోత విని, ఈ పొడిగింపు
వల్ల కథలో అమాయకత్వం, సున్నితత్వం తగ్గిపోతునట్టనిపిస్తోంది,
మరో మాటు ఆలోచించండి అనడంతో, కాస్త ఆలోచించి, ఆ పేరాలు
దాచేసాను. ఇవన్నీ నా అనుభవాలే అయినా, ఇటువంటివి అందరికీ
జరిగే వుంటాయనే నమ్మకంతో, కథ రూపం ఇద్దామని
ప్రయత్నించాను.
కృతజ్ఞతలతో,
ఫణి డొక్కా
లిటిల్‌సైంటిస్టు గురించి Phani DokkA గారి అభిప్రాయం:
03/09/2008 2:18 pm
కొస్యాసురా గారూ, ప్రసాద్ గారూ,
కథ చదివినందుకు, అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
ఫణి డొక్కా