Comment navigation


15549

« 1 ... 1412 1413 1414 1415 1416 ... 1555 »

  1. వినినంతనె వేగ పడక గురించి hymarao kolluru గారి అభిప్రాయం:

    03/09/2008 4:58 am

    నేను కూడా stations లో వింటున్నా ముక్కలముక్కలుగ అతికించినట్లు ఉండే announcements ని.

  2. లిటిల్‌సైంటిస్టు గురించి kosyasura గారి అభిప్రాయం:

    03/09/2008 1:30 am

    ప్రసాద్ గారూ

    రచయిత వలంగావున్నవాళ్ళని వెక్కిరించలేదు. ఆక్షణంలో కుమార్తె కోటు అడిగిన వెంటనే ఆ విసుగులో తనలో తాను అనుకున్న అభిప్రాయం. మనలోనూ చాలమంది తల్లి తండ్రులు ఇలాంటి పరిస్థితులలో అలానో ఇంకో లానో అనుకునేదే (రెండిళ్ళకి సరిపడా చెక్క అన్న మాట… ఈ ప్రయోగం చాలా కాలం క్రింతం విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో వాడుకలో వుండేది). ఆ తర్వాత నాలిక కొరుక్కుని ఉండొచ్చు.

    నాకనిపిస్తూ ఉంటుంది, ఈరొజుల్లో మనలో సహనం తగ్గుతుందేమోనని. నా చిన్నపుడు “నే నర్రా గుడ్డి సోదిని . తలుపు తీయండి” అంటూ మా దూరపు చుట్టం అంటే పరుగు పరుగు న ఇంటిల్ల పాదీ పరుగెత్తే వాళ్ళం. తాను అంతగా చదువుకో లేదు. అందుకేనేమో, తాను తన కంట్లో పువ్వుని గొప్పగాచెప్పుకునేది. శ్రీరామనవమి చందా దండుకుంటు “ఏం పేరు రాయాలీ, రసీదు మీద?” అంటే బొడ్డులోంచి రెండు ఇచ్చురూపాయలు చేతిలో పెడుతూ “సొట్టసోమన్న… అన్రాసుకొండి” అన్నసోమన్న తన అవిటితనాన్ని లోకువుగా తీసుకొలేదు.అసలు తనపేరు మైకులో వినేవాడో లేదో తెలీదు. “వలంపాటి పిన్నిగారు మీరేనా? ఇదిగో, ఈ వాయనం ” అంటే “అలాగే ఉండు. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, లేచి ఆ వాయనం అందుకుంటాను.” అని లేచి వాయనం అందుకుని “నాలో సగం ఒళ్ళు తీసుకోకూడదూ. ఉత్తినే ఇస్తాను” అన్న పిన్నిగార్లు ఏరీ ?

    కొ స్యా సురా

  3. ప్రేమికుల దినం గురించి Murali Chari గారి అభిప్రాయం:

    03/08/2008 5:37 pm

    కథని రచయిత ఎక్స్‌ప్లేన్ చేయడం, జోకుని విశ్లేషించినట్టే. కానీ వచ్చిన కామెంట్లలో ఒకటి తప్ప మిగతావన్నీ ఏదో ఒక రకంగా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి కాబట్టి, చిన్న వివరణ ఇవ్వదల్చుకున్నాను.

    ఇది ఒక “అబ్సర్డ్” కథ అని మీకు అర్థమయ్యిందనే భావిస్తాను. ఇది ఒక ఊహాత్మకమైన సంఘటన. చదివిన ప్రతి పాఠకుడిని/పాఠకురాలిని ఈ విషయం వైపు కొంచెం ఆలోచింపజేయడమే దీని ఉద్దేశం. వారి వారి విలువలని బట్టి, విశ్లేషణాత్మక శక్తిని బట్టి, ఎవరి సమాధానాలు వారికి దొరుకుతాయి.

    నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించిన విషయం, అమ్మాయిలు అబ్బాయిలని అసహ్యంగా చూశారు అనే లైన్ల మీద వచ్చిన కామెంట్స్. అబ్బాయిలు వాళ్ళ వైపు అంతే క్రూరంగా చూశారు అన్న దాని వల్ల, అమ్మాయిలు ఏమీ తీసిపోలేదు అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాను.

    కామెంట్లు రాసిన వాళ్ళందరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎంతో ఓపికగా అంత పెద్ద వ్యాఖ్య రాసిన ప్రసాద్ గారికి!

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Nagas గారి అభిప్రాయం:

    03/08/2008 8:14 am

    నాగ మురళి గారు,

    ముందుగా మీకు మా ధన్యవాదములు.
    మీ సమీక్ష చాలా బాగుంది.

  5. కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/08/2008 7:59 am

    శంకరాభరణం వర్ణం (సామినిన్నే)లో స ద ప మ పా అనే ప్రయోగం ఉంది. ఇది బుద్ధిపూర్వకంగా చేసినదని అంటారు.

    మేళకర్తల పేర్లు కటపయాది సూత్రం కోసమని తయారుచేసినవనేది తెలుస్తూనే ఉంటుంది. రాగాలు ప్రాచీనమైనవి. మేళకర్త సిస్టం ఆ తరవాత ఎప్పుడో ఏర్పాటైనది.

    మేళకర్త కాకపోతే సందర్భాన్ని బట్టీ, మూడ్ ను బట్టీ రాగాన్ని కొంత వైవిధ్యంతో ఆవాహన చెయ్యవచ్చు. ఉదాహరణకు హిందూస్తానీ పద్ధతిలో విద్యార్థులకు యమన్ నేర్పుతున్నప్పుడు ని రి గమ అని నేర్పుతారు. స రి గమ అని పాడితే మార్కులు తగ్గిస్తారు. అయితే కొన్ని ఖయాల్, గత్ రచనల్లో ఆ ప్రయోగం వినిపిస్తుంది. బిస్మిల్లా ఖాన్ రికార్డు ఒకటి గత్ స ని సారిరిగారీ సనిసని దానీసా అని మొదలవుతుంది.

  6. షష్ఠ్యంతములు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/07/2008 9:58 pm

    విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షాన్ని ఈశ్వరునికే అంకితం చేసారు.
    ముత్యాల రాజా వారికి చెపుతున్నట్లుగా రాసారు. ఆ రాజావారి వంశచరిత్ర మాత్రం ఉంది. షష్ఠ్యంతాలు లేవు, నాకు తెలిసి.

    కామేశ్వర రావు

  7. కల్యాణి రాగం – అనుబంధం గురించి Srinivas గారి అభిప్రాయం:

    03/07/2008 7:12 pm

    కళ్యాణి అనే రాగాన్ని కటపయాది సూత్రం కోసం మేచ కళ్యాణి గా మార్చారనేది నిర్వివాదాంశం. మేచ కళ్యాణి వేరే రాగం అయితే అందులో ఒక కృతి చెప్పండి? శంకరాభరణం, ధీరశంకరాభరణం రాగాలు కూడా అంతే. మీరు అన్న ఆ ‘చెప్పబడుతున్న’ తేడా ఏంటి? మీరనుకునే ధీరశంకరాభరణం లో ఒక ఉదాహరణ ఇవ్వండి.

    ఇంకొకాయన అన్నట్టు జన్య రాగం ముందు ఉండి జనక రాగం తర్వాత పుట్టడం లో అసంబద్ధత ఏమీ లేదు. ఉన్న రాగాల్ని categorize చెయ్యడానికి, అర్థం చేసుకోటానికి మనం కల్పించుకున్న formulaలు జనక రాగాలు. జగమెరిగిన సత్యాల్ని science కోడీకరించినట్లు.

  8. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/07/2008 12:31 pm

    రాజా రావు గార్కి,

    మీకు ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.
    వ్యాస సూచికలు వ్యాసం మొదటి భాగంలో ఇచ్చాను. ఒక్కసారి చూడండి.
    మీ సూచన ప్రకారం మరలా రెండో భాగంలోనూ పెట్టమని సంపాదకుల్ని అడిగాను.

    -సాయి బ్రహ్మానందం

  9. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి mOhana గారి అభిప్రాయం:

    03/07/2008 11:49 am

    మంచి వ్యాసము. సాయి గారికి అభినందనలు. మేము చిన్నప్పుడు
    బడిలో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి సంవత్సరము ఒక నాటకము,
    ఒకటో రెండో నాటికలు వేసేవాళ్లము. మా బడి పక్క సౌందర్యమహలు
    అనే నాటకప్రదర్శనశాల ఉండేది అప్పుడు. శ్రీ కృష్ణ లీలలు, కరుణామయి
    అనే రెండు నాటకాలు జ్ఞాపకానికి వస్తుంది. తిరుపతిలో ఆ కాలంలో
    నాటకాల పోటీలు ఉండేవి. మంచి నాటకాలు, నాటికలు
    ప్రదర్శించే వాళ్లు. సురభి నాట్యమండలివారిని గురించి ఈ పుస్తకములో చదువవీలగును. తెలుగు సాంఘిక నాటకాల పరిణామము, వికాసము అనే పుస్తకం కూడా చదవతగినది.

    పై పుస్తకాలను డవున్లోడ్ చేసికోవచ్చు.
    ఆ కాలపు నాటకాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని గురించి నేను కన్నడములో ఒక మంచి సినిమా చూసియున్నాను. దాని పేరు రంగనాయకి. కన్నడములో గిరీశ్ కర్నాడ్ వంటివారు నాటకాల ద్వారా చిత్రరంగం ప్రవేశించారు. గుబ్బి వీరన్న కూడ నాటకాల పురోభివృద్ధిలో చాల ముఖ్య పాత్ర వహించారు. ఇక విజయ్ తెందుల్కర్ వంటి వారిని గురించి చెప్పనక్కరలేదు. చలం రాసిన కొన్ని కథలలో కూడ నాటక రంగం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది.

    కావ్యేషు నాటకం రమ్యం అనే మాట మరువరాదు. – మోహన

  10. ఆహా గురించి damayanthi గారి అభిప్రాయం:

    03/07/2008 10:27 am

    Hi,

    After reading the maniharam, I remembered Sree Sree, Chalam, and UG. Great poetry. Keep writing.

    Cheers,
    Damayanthi

« 1 ... 1412 1413 1414 1415 1416 ... 1555 »