Comment navigation


15549

« 1 ... 1408 1409 1410 1411 1412 ... 1555 »

  1. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:

    03/25/2008 6:29 pm

    బ్రహ్మానందంగారు తెలుగు నాటకం గూర్చి, ఈ నాటక పరిస్థితి గూర్చి చాలా విశదంగా ఈ వ్యాసంలో చర్చించారు. ఇంకొక్క మూడు విషయాలు ఈ వ్యాసంలో చేరిస్తే దీనికి సంపూర్ణత చేకూరేదనిపించి ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.

    దీనిలో మొదటిది, నటీనటులకు ముట్టే ప్రతిఫలం. అమెరికా నాటకరంగంలో నటీ నటులకేగాక ఆహార్యాన్ని సమకూర్చేవారందరికీ ప్రతిఫలం ముడుతుంది. Professional నటులు వారానికి నలభై గంటలు రిహార్సల్సుతో బిజీగా వుంటారు. వాళ్ళు ఒకేసారి రెండు నాటకాలల్లో కూడా నటించవచ్చు. వారికి ఈ నాటకాలే జీవనభృతిని కల్పిస్తాయి. ప్రస్తుతం న్యూయార్కులో Tennessee Williams వ్రాసిన Cat on a hot tin roof నాటక ప్రదర్శన జరుగుతోంది. దీనిలో, దాదాపు ఏడేళ్ళు Bill Cosbyతో TV లో నటించిన Phylicia Rashad, సినిమా నటుడు James Earl Jones నటిస్తున్నారు. ఈ నాటకం దాదాపు మూడు నెలలపాటు ప్రదర్శిస్తారు. Londonలో ఈమధ్య Equus నాటకంలో Daniel Radcliffe (Mr. Harry Potter) నటించాడు. ప్రతిఫలం లేనిదే పేరెన్నికగన్న నటులు రంగస్థలంమీదకు ఎందుకు వస్తారు?

    మరి తెలుగు నాటకరంగంమీద నటీనటుల పరిస్థితేమిటి? ఒక్క నటీమణులకే కొంతైనా డబ్బు ముడుతుంది. నటులు, దర్శకులు, రచయితలు, ఆహార్యం సమకూర్చే వారు, అందరూ కూడా ఏదో పరిషత్తులో బహుమతిని పొందితే తప్ప వారి చేతి డబ్బు పెట్టుకునే rehearsalsకే కాక వేరే వూళ్ళో ప్రదర్శనకై టిక్కెట్టు కూడా పెట్టుకుని వెళ్ళాలి. అంటే, భుక్తికై వారందరికీ పగలంతా వేరే వుద్యోగం వుండాలన్న మాట. ఆంధ్రజ్యోతిలో రాళ్ళపల్లిగారు సినిమాల్లో వేషాలకై వెడితే వారి మేనేజరు వుద్యోగంలోనుంచీ తీసేస్తామని బెదిరించారని రాయగా చదివిన గుర్తు. తెలుగు నాటక రంగానికి చేయూత నందించాలనుకునే వారు ముందు నాటకరంగంతో ముడిపడ్డవాళ్ళకి నాటకరంగమే జీవనభృతిని ఎలా సమకూర్చగలదో ఆలోచించాలి.

    రెండవ అంశం: ఆంధ్రాలో గానీ అమెరికాలో గానీ, తెలుగు నాటకానికి ప్రతిబంధకాలు మైకులు. పాతకాలంలో పద్యనాటకాలను ఆహార్యాన్ని చూడడానికీ, పేరెన్నికగన్న నటుడు పద్యం పాడడంలో చూపించే నేర్పరితాన్ని చెవులారా విని ఆనందించడానికీ ప్రజలు వెళ్ళేవాళ్ళు తప్ప, పాత్రల మధ్య movements ఎలా వున్నయ్యోననీ, నటులు మొహంలో ఎలాంటి భావాలు చూపిస్తున్నారనీ పరిశీలించడానికి కాదు. అందువల్ల కలిగే సౌకర్యం ఏవిటంటే, ఆ నటులు మైకుకు ఎదురుగా నుంచుని పద్యం పాడడం. అక్కడక్కడా గాలిలో మైకులను వేలాడదీసేవాళ్ళు. (ఒకసారి గుంటూర్లో మా హైస్కూలు మాస్టారు భీముడి వేషం వేసి విసురుగా గదని భుజానికి ఎత్తుకోబోతుంటే ఆ గద పైన వైరుకు చిక్కుకుంది!) ఈ కాలపు సాంఘిక నాటకాలకు పూర్తిగా మైకు ముందు నిలబడి డైలాగులు చెప్పడం బావుండదు. పోనీ clip-on microphones try చేద్దామా అంటే నాలుగు మించి స్టేజీ మీద ఒకేసారి వాడారా, interference problems వచ్చి గోల గోల అవుతుంది. నేను Washington, DC ప్రాంతంలో చూసిన ఏ నాటకంలోనూ మైకులు వాడలేదు. చూసిన auditoriums లో కెపాసిటీ, 50్ నించీ 2000్ (కెన్నెడీ సెంటర్) దాకా. 300్ కెపాసిటీ వున్న చోట, live musicతో, 14్ ఏళ్ళ పాప గొంతెత్తి పాడిన Seussical Musical లో కూడా! వేలమంది మధ్యలో నాటకం వెయ్యడం వేసేవాడికి అద్భుతంగా వుంటుంది సరైన auditorium వున్నప్పుడు. లేకపోతే, మైకుల, మైకులను కంట్రోల్ చేసేవాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు.

    మూడవ, ముఖ్యమైన అంశం – ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులగూర్చి పరిషత్తులు పట్టించుకుంటున్నాయా? ఈ నాటి నాటకాలను చూసేది ఎవరు? ఆనాటి రాజుల దగ్గరినించీ ఈనాటి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా కళలను పోషించిన వారు ఎప్పుడూ కూడా డబ్బున్న వారే! వాళ్ళు ఈ పరిషత్తు నాటకాలు ఎన్ని చూస్తున్నారు? ఎంతమంది ఇంజనీరులు, డాక్టర్లు, లాయర్లు ఈ నాటకాలకు వస్తున్నారు? వారిమాట అటుంచి, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు సతీ సమేతంగా వీటికి వస్తున్నారు? వారందరి మాట అటుంచితే, ఈ నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసినవాళ్ళే ఎంతమంది సతీ సమేతంగా ఈ నాటకాలను చూస్తారు? జనాదరణకు కరువైన కళ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అమెరికాలో బ్రాడ్వే నాటకాలకు టిక్కెట్లు $200్ దాకా కూడా వుంటాయి. అయినా కూడా Phantom of the Opera is the 2nd longest running opera in New York (just behind the all-time record holder Cats). అదీ, ప్రతీ రోజూ కనీసం ఒక షో వేస్తూ! ప్రస్తుతం తెలుగులో పరిషత్తు నాటకాలంటే కరుణ రసం అధికంగా వుండేవని బ్రహ్మానందం గారనడంలో ఏమాత్రం్ అబధ్ధం లేదు. అంటే, ఎవరైనా ఒక సాయంత్రం ఏడవాలనిపిస్తే పరిషత్తు నాటకాలకు వెళ్ళచ్చునన్నమాట.

    అమెరికాలో, మరాఠీ నాటకాల విడియో కాసెట్లని అద్దెకు తెచ్చుకునల్లా చూస్తారు మహారాష్ట్ర నుండీ వచ్చిన వాళ్ళు. తెలుగు నాటకాన్ని ఉచితంగా స్టేజీ మీద చూపించినా చూసేవాళ్ళకు కొదువ. తెలుగు నాటక రంగాన్ని నేడు నడిపిస్తున్నవాళ్ళు అమెరికాను చూసి నేర్చుకోకపోతే పాయె. కనీసం మన ఇరుగు పొరుగు రాష్ట్ర సోదరులను చూసైనా నేర్చుకోవచ్చుగా?

  2. లిటిల్‌సైంటిస్టు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/25/2008 8:07 am

    సంపాదకులు తిరిగి రచనను అందించినందుకు చాలా సంతోషం.
    చాలా కృతజ్ఞతలు. తొలగించడం కష్టమైన నిర్ణయమైతే, దాన్ని పునః పరిశీలించి తిరిగి ప్రచురించడం కష్టతరమే కాదు, ఎంతో సహృదయం ఉంటే తప్ప సాధ్యపడదు.
    ఆ.
    రచనలెన్నొ చేయు రచయిత లెందరో
    అచ్చు వేయు నెన్నొ అనుదినంబు
    సహృదయంబుగల్గు సంపాదకులుమీరు
    అతిశయోక్తి కాదు అసలు మాట!

    విధేయుడు
    Srinivas

  3. మచ్చ గురించి kosyasura గారి అభిప్రాయం:

    03/25/2008 7:37 am

    మచ్చ లేని కధ.
    మచ్చుకి దాచుకోవల్సినకధ.
    మనిషికి మచ్చ ఎంత మఉఖ్యమోతెలిపే కధ. సాంతం చదివినాక నిట్టూర్పు తెప్పించే కధ.భవితష్యత్తంతా మచ్చలమయం అనిపిస్తోంది.
    “చంద్ర”నుంచి మరిన్ని మచ్చలనాసిస్తూ

    కొ స్యా సు రా

  4. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/25/2008 7:26 am

    సాహితీ మిత్రులకి ఒక సమాచారం.

    అన్నమాచార్యుని పద సాహిత్యాన్ని ప్రముఖ కవయిత్రి జయప్రభ గారు, “వలపారగించవమ్మ వనిత_నీ యలుక చిత్తమున కాకలివేసినది” అన్న టైటిల్‌తో ఒక మూడు వందల పై చిలుకు పేజీలతొ ప్రచురించారు. అన్నమయ్య పదములని , అందులోని కవిత్వాన్ని ఆవిడ తనదైన శైలి లో చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. అన్నమాచార్యుని పదాలని అమె వ్యాఖ్యానించిన పద్ధతి, చాలా ఆసక్తికరం గానూ, చదివించే ఉత్కంఠభరిత శైలి లోనూ వుంది. ఆసక్తి వున్న పాఠకులు తప్పక చదవ వలసిన పుస్తకం.

    రమ.

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/22/2008 9:45 pm

    వెన్నెల, వెర్రి

    KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.

    “అందుచేత ఓ చందమామా!
    అందమైన ఓ పూర్ణసోమా!
    సముద్రం మీదా అరణ్యం మీదా
    సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!

    చెప్పొచ్చిందేమిటంటే
    చెప్పడనికేమీ లేదని!
    అంతమందికీ అన్నీ తెలుసు
    అదే మన అజ్ఞానం.

    ఎవడో చెబితే వినే రోజులు
    ఏనాడో వెళ్ళిపోయాయి
    ఇంకా ఏదో చెప్పాలని
    ఎందుకీ ఉబలాటం?

    అసలు నిజం ఏమిటంటే
    ఎవడికీ ఎమీ తెలియదు
    ఇలా ఎందుకొచ్చామో
    ఇక్కడెంత సేపుంటామో

    ఇక్కడనుంచి వెళ్ళేదెక్కడికో
    ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
    ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి.
    చెబితేమాత్రం నమ్మకండి.”

    నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:

    “పరమాణువు గర్భంలోని
    పరమ రహస్యాలూ
    మహాకాశ వాతావరణంలోని
    మర్మాలూ తెలుసుకున్నాక

    సరాసరి నీదగ్గరకే
    ఖరారుగా వస్తాంలే
    అప్పుడు మా రాయబారుల్ని
    ఆదరిస్తావుకదూ నువ్వు?”

    అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.

    సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.

    భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)

    సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:

    “వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
    వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
    మనోహరమైన సంగీతం వినిపిస్తూ
    ప్రయాణించు శశీ ప్రయాణించు.

    ఇదిగో జాబిల్లీ నువ్వు
    సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
    గాలిదాన్ని చెరిపెయ్యకుండా
    కాలమే కాపలా కాస్తుందిలే.”

    కొడవళ్ళ హనుమంతరావు

  6. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    03/22/2008 5:43 am

    I have just completed reading Satyajit Ray’s comments on “Rashomon”. I am quoting it verbatim from Ray’s book “Our films their films”.

    ” The effect of the film on me, personally, was electric. I saw it three times on consecutive days and wondered each time if there was another film anywhere which gave such sustained and dazzling proof of a director’s command over every aspect of film making. Even after fifteen years, whole chunks of the film come vividly back to mind in all their visual and aural richness: the woodcutter’s journey through the forest, shot with a relentless tracking camera from an incredible variety of angles – high, low, back and front – and cut with axe-edge precision; the bandit’s first sight of the woman as she rides by, her veil lifted momentarily by a breeze, while he lolls in the shade of a tree, slapping away at mosquitoes; the striking formality of the court scene with the judge never seen at all; the scene of witchcraft with the medium whirling in a trance, and the wind blowing from two opposite directions at the same time….”

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి K.S.Hareesh Kumar గారి అభిప్రాయం:

    03/20/2008 9:17 pm

    This article is very thought provoking. I hope the author, in his later parts, will explain the claims of “lunar effect”: the claim that many more number of people behave “lunatic” on a full-moon day. The folk wisdom is that since the moon affects the ocean’s tides, it must be so powerful to affect the human body as well (after all, the human body is 80 percent water). I believe that even if we live in a pre-determined world, we may never be able to predict the future accurately, as long as the questions of why and how this universe came into existence and what the purpose of this creation is, remain mysterious to us.

    Hareesh

  8. బ్లాగుల గురించి – నా మాట గురించి పలువురు మెచ్చినవిప్పుడు పైపైన! at సోది sOdi ( ఒరెమూనా ) గారి అభిప్రాయం:

    03/20/2008 12:26 pm

    […] మన బ్లాగ్ సంకలునులు తెలుగు బ్లాగ్ లోకాన్ని పైపైకి తీసుకెళ్ళడంలోనూ, తెలుగు బ్లాగ్ వీరులకు ప్రోత్సాహాన్నివ్వడంలోనూ, వ్రాయాలా వదా? అనేవారికి ప్రేరణగా నిలిచి వ్రాయించడంలోనూ, బ్లాగా? అదేమిటి? చూద్దాంలే! , హా ఇంకొన్ని రోజులీ వేవ్ కొనసాగితే అప్పుడు బ్లాగ్ మొదలుపెడదాంలే, అనుకునే వారిచేత కూడా బ్లాగ్ మొదలుపెట్టించిన ఘనత మన బ్లాగ్ కూడళ్ళదే! ఇదే విషయాన్ని మొన్న ఈమాట వ్యాసంలోనూ ప్రస్తావించినారు. […]

  9. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి gultireader గారి అభిప్రాయం:

    03/20/2008 7:33 am

    amazing! I could not read this so far but it seems to have reflected my own heart for my own prEyasi. Simply marvellous guruvugAru! Many thanks

  10. వినినంతనె వేగ పడక గురించి Raja gopal. Saripalli గారి అభిప్రాయం:

    03/20/2008 2:43 am

    సరదాగా వుంది. నిజంగా జరిగినట్టనిపించింది.

« 1 ... 1408 1409 1410 1411 1412 ... 1555 »