Comment navigation


15803

« 1 ... 1543 1544 1545 1546 1547 ... 1581 »

  1. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    11/07/2006 8:26 am

    వేలూరి గారు రెండు ఉద్దేశాలు చెప్పారు మొదట్లోనే, అందులో ఒకటి:

    “సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.”

    ఇందులో కొంతైనా నెరవేరినట్టుంది. ఆయన రెండవ ముఖ్యోద్దేశం గా చెప్పినది (“ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా”) కొద్దిగా నైనా జరగాలంటే పై మొదటిది విమర్శకులు దాటుకుని వెళ్ళాలి.

    నాకు చాలా డౌట్లు ఉన్నయి, వాటికి తొందర లేదు.

    కామేశ్వర రావు గారన్న మాట:

    “రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు.”

    ఈ మాట మీద కొంచెం వివరణ అవసరం అనుకుంటాను. నా ప్రశ్న: మనం మార్క్సిస్టు విమర్శ అనే సిద్ధాంతకోణం లోనించి ఒక శతాబ్దం లేక దశాబ్దం లో వచ్చిన సాహిత్యాన్ని critic చేయటం తప్పంటారా? (“మార్కిస్టు విమర్శ” మీద అభ్యంతరాలు ఉంటే దాని బదులు మోరలిస్ట్ విమర్శ కాకపోతే మరొకటి అనుకోండి ఇప్పటి మటుకు).

    విప్లవ్

  2. నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు గురించి lakshmi గారి అభిప్రాయం:

    11/07/2006 7:25 am

    చాలా బాగా చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లొ సమీక్షలు చాలా అవసరం అని అనిపిస్తోంది.

  3. పనిపిల్లలు గురించి Akella గారి అభిప్రాయం:

    11/07/2006 3:52 am

    కథలో ఏదో చెప్పాలనే తపన ఉంది కానీ ఏమి చెప్పాలో దిశానిర్దేశం లేదు, అసంపూర్తిగా ముగిసిందనిపించింది

  4. పనిపిల్లలు గురించి Sriram గారి అభిప్రాయం:

    11/06/2006 12:04 pm

    Hi Prasad, it’s good…

  5. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 10:57 am

    కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

    తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

    అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

  6. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/06/2006 10:04 am

    ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

  7. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి PATHAKUDU గారి అభిప్రాయం:

    11/06/2006 8:56 am

    త్రేతాయుగంలోనే, ద్వాపరయుగానికి చెందిన “భాగవతం” అనే పదం సీతకి ఎలా తెలుసు? ఈ పదానికి వేరే అర్థం కూడా వుందా?
    అడవుల్లో కాపాడేవాళ్ళు ముందు నడుస్తారా, లేక వెనక నడుస్తారా?
    సృష్టికర్త బ్రహ్మకి నారదుడు చెబితేనే గానీ, రామాయణ కథ తెలియదా?
    అంగదుడు రాజవడమేమిటీ? సుగ్రీవుడు కదా రాజు? అంగదుడు యువరాజవుతాడు. రాజూ, యువరాజూ ఒక్కటేనా?
    పడవుల్లో వెళ్ళడానికి సముద్రుడిని అడగడం ఎందుకు, నీళ్ళమీద రాళ్ళేసుకుని వెళ్ళాలంటే అడగాలి గానీ? అడగకపోతే కోపం వొచ్చి, పడవులని ముంచేస్తాడా సముద్రుడు?
    “కాలిలో ముల్లు కూడా తియ్యడు మీ అన్న” అని సీత అనడానికి ఆధారం ఏమిటి?
    తప్పుగా అడిగితే, మన్నించండి.

  8. బహుశా ఇంకో నిజం గురించి Akella గారి అభిప్రాయం:

    11/06/2006 5:05 am

    Time waste story, why its so boring on the net normally, why again in eemata, this kind of stuff?

  9. రాత్రి నృత్యం గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 4:26 am

    OK

  10. ఉద్యోగం గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:

    11/06/2006 4:24 am

    కథ, కథనం రెండూ బాగున్నాయి. కథ చదివాక నాకు కల్గిన ఆలోచనలు… విమర్శలు కావు..
    1. ఈ కథ తెలుగులో నే ఎందుకు రాయాలి? నాలాంటి వాడయితే ఇంగ్లీషు రాక అని టక్కున చెప్పచ్చు. ఇంగ్లీషు, తెలుగు రెండూ వచ్చిన వాళ్ళు దీన్ని ఏభాష లో రాయాలి? నా ఉద్దేశం ఏదో తప్పు జరిగిందని కాదు. ఇలాంటి కథని తెలుగులో రాయాలి అనే నిర్ణయానికి రావడానికి ఏ ప్రాతిపదిక అవసరం అని సందేహం. ఇందులో డాక్టరు ఇండియనే కానక్కర లేదు. రచయిత/త్రి ఇలాంటి విషయాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలీ అనే ఉద్దేశం ఒక్కటే నాకు స్ఫురిస్తోంది. అదే నిజమయితే, రచయిత్రి కి నా అభినందనలు… ఎన్ని కొత్త వస్తువులు తెలుగులోకి వస్తే తెలుగు సాహిత్యం అంత విస్తృత మవుతుంది.

    2. కథలో చాలా డ్రామా ఉంది. ఆ పాల్ భార్యకి ఆ సమస్య రాక పోయుంటే ఏమయ్యేది? అవసరమయిన కారెక్టర్లకి అవసర మయినప్పుడు అవసర మయిన జబ్బులు రావటం తెలుగు సినిమా టెక్నిక 🙂 (ఇందులో తప్పేం లేదు… ఎంతో కొంత డ్రామా కథ నడిపించడానికి అవసరమే)

    అక్కిరాజు

« 1 ... 1543 1544 1545 1546 1547 ... 1581 »