Comment navigation


15807

« 1 ... 1541 1542 1543 1544 1545 ... 1581 »

  1. తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి R.Vasundhara Devi గారి అభిప్రాయం:

    11/15/2006 6:16 pm

    Sartre’s article is interesting. He stresses the New Culture/Old Culture perceptions of America of the early twentieth century. As he says, Americans continually attempt to escape “Americanism” and that activity is their existential ethos, their freedom to be. Just another way of expressing what Sri Naveen felt about America – his American experience. Right?

  2. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/15/2006 8:09 am

    విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు. అది: కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో నేను చేర్చిన వాక్యం. ఆ వాక్యం అనవసరమైనదే! Guilty as charged!

    అయితే, “కవిత్వతత్త్వవిచారము” లో నిండుగా ఉన్న అవహేళన, అపహాస్యాలతో పోల్చిచూస్తే నా పొరపాటు క్షమార్హమనే అనుకుంటాను. అయినా తప్పు తప్పే! మరోసారి Guilty as charged.

    మరొక విషయం: ఉమాకాంతంగారి పై మంచి విమర్శ-సమీక్ష ఇంతవరకూ రాకపోవడం క్షమార్హం కాదు. ఆ పని ఎవరైనా సహృదయులు తలపెడితే మంచిది.

    అల్లాగే, మార్క్సిస్టు దృక్పథం అన్న పేరుతో ప్రస్తుతం పత్రికల్లో వచ్చిన సాహిత్య విమర్శలపై ఒక సమీక్షా వ్యాసం ఎవరైనా రాస్తే బాగుంటుందేమో!
    And the field is open, I suppose!

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  3. రాత్రి నృత్యం గురించి Pavan గారి అభిప్రాయం:

    11/15/2006 5:44 am

    చాలా బాగుంది.

  4. అన్నీ చెప్పగల భాష గురించి sri rama murthy గారి అభిప్రాయం:

    11/15/2006 2:58 am

    ఉపమానాలు ఎక్కువ అయినాయి.Average poem.

    Sri Rama Murthy.

  5. పిచ్చి నాన్న గురించి Mahesh గారి అభిప్రాయం:

    11/14/2006 11:44 pm

    ఫ్రసాద్ గారు ,
    చాలా చాలా బాగుంది, మనము చాలా ఇల్లల్లో చూసేదే ఐనా, అది పదముల్లో వర్ణించిన మీ ప్రతిభ చాలా గొప్పది. ఎంత దూరంగా ఉన్నా “మీ పిచ్చి నాన్న ” చూసిన వారు చలించాల్సిందే.

  6. బస్సెడు దూరం గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/14/2006 10:30 pm

    శ్రీనివాస్ గారూ
    ఆటో ప్రయాణం… మీరు వ్యంగ్యంగా అన్నా కూడా నాకు ఆలోచన నచ్చింది. ప్రయత్నిస్తాను… 🙂

  7. భయం గురించి Ramesh Gullapalli గారి అభిప్రాయం:

    11/14/2006 1:17 am

    అంటే అతను బ్రతికి ఉన్నట్టా లేక చచ్చి దెయ్యమయ్యాడా ?

  8. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    11/13/2006 2:05 pm

    కామేశ్వరరావు గారూ మీరు చెప్పింది, నాకు అర్ధమైంది జోడించి నా ఆలోచన కొంత ఇక్కడ:

    “విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. … ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది.”

    అంటే “విమర్శ” ఏ ప్రాతిపదిక పైన చేస్తున్నారో దానికి లోబడి ఉన్నంత వరకూ ఆ సిద్ధాంతాన్ని ఎటువంటి కవిత్వ (ప్రబంధాలనుండి దిగంబరాల దాకా, ఎటువంటి కవిత్వం అయినా..) ప్రక్రియ పైన అయినా ఉపయోగించ వచ్చు.. అని అర్ధం చేసుకుంటున్నాం.

    వల్లంపాటి చెప్పిందీ ఇదే అనిపిస్తుంది.

    మరోలా చెప్పాలంటే “మార్క్సిస్టు విమర్శ” చేయతలచిన వాళ్ళు అలంకారాల వైపు, శైలి వైపు, శిల్పం వైపు దృష్టి పెట్టాలనుకోవటం అత్యాశే.

    ఇక్కడొక చిన్న detour:

    పై మాట దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ వ్యాసం తాను ఉదహరించిన కట్టమంచి చేసిన విమర్శ నేపధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే తానూ (అంటే వేలూరి) అదే మూసలో చేసిన ప్రసంగ పాఠంలా తోచింది.

    కట్టమంచి చేసిన విమర్శ ఒక కోవలోకి (satire కావచ్చు) వస్తే వేలూరి ప్రసంగం అదే దోవలోకి వస్తుంది. satire (తెలుగు పదం నాకు తెలవదు) కూడా ఒక ఆర్టే. దానిక్కావలసిన లక్షణాలు చూపెట్టి కట్టమంచి వారి విమర్శ ఎందుకు ఫెయిలయిందో చెబితే వేలూరి గారన్న ప్రయోజనం {“అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.} నెరవేరేది.

    వేలూరివారి ప్రసంగం కూడా {అవహేళన, అపహాస్యం!} అదే లక్షణాలు కలిగిందిగా కనిపించే అవకాశం ఎక్కువ {ఉదా: (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)}. అది ఆయన రాతలనెరిగిన వారు (his writing style) ఆయన లెవెలుకు సరిపోయే రీతిలో వాతలు పెట్టారా లేదా అన్నది తేల్చగలరు.

    ప్రబంధాలను ఒక రకమైన విమర్శా పరిధినుండి మినహాయించమంటే అది కుదరని పని; ఆ విమర్శ సహేతుకమా కాదా అన్నది ఆ విమర్శ కే చెందిన లక్షణాలను బట్టి ఉంటుంది అన్నవిశయం పైన మార్క్సిస్టు విమర్శ పరిధి నుండి తెలుసుకున్నాం.

    వేలూరి గారు చేసిన విమర్శ మీద నాకు complaint లేదు. దానికున్న పరిధిలో ఆయన చెప్పింది చేసారా లేదా అన్నదే కావాలి. On the space that he provided, he may have criticized CR Reddy but he seemed to have taken off off from the same origin. That truly in my opinion is a meeting place for a contradiction. It is full circle that way & this is a good writing for that reason. Had he written in any other way (without the satirical element, he would have fallen flat).

    end of detour.

    మళ్ళీ మొదటికొస్తే:

    వేలూరి రాసింది:

    కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.

    ఒక రచయిత లేక కవి తన ఉద్దేశం ముందే చెప్పి ఈ పరిధిలోనే నా కృతిని విమర్శించండి అనడం కరెక్టేనా? నా మటుకు నేను ఒక చెట్టును వేస్ట్ చేయటం, కొన్ని ఠావులు ఖరాబు చెయ్యటం మాత్రమే నా రచనల లక్షణం, అంతవరకే ఏ విమర్శకుడైనా పరిమితం కావాలి అని ఇప్పటినుండీ ఒక disclaimer తగిలించాలిక.

    విప్లవ్

  9. బస్సెడు దూరం గురించి Srinivas గారి అభిప్రాయం:

    11/13/2006 7:40 am

    దీన్ని కథ అనడం సాహసమే. మ్యూజింగ్స్ అనవచ్చేమో! వెనకటి రోజుల్లో కాలేజీ సావనీర్లలో వచ్చే ఇలాంటి వాటిని స్కెచ్ (కథకు చెల్లో, తమ్ముడో మరి : ) అనే వారు. ఇది ఏదయినా నవల్లో ఒకట్రెండు పేజీలుగానో, కథలో ఒకట్రెండు పేరాలుగానో ఇమడ్చదగింది.
    ఏమయినా పాఠకులని ఇంతగా రంజింపచేస్తుంది కనక ఈ సీరీస్ ను సంపాదకులు కొనసాగిస్తారనే ఆశిద్దాము. రైలూ, బస్సూ అయ్యాయి, ఇక పడవ ప్రయాణం, విమానప్రయాణం, మిగిలాయి. అన్నట్టు ఆటో ప్రయాణం కూడా (ఎంత భయానక థ్రిల్లింగాత్మకంగా ఉంటుందో!). Any takers?

  10. అక్టోబరు పులి గురించి mohan mohan గారి అభిప్రాయం:

    11/12/2006 10:30 pm

    మీ కవిత బాగుంది. నెల్లూరు ముచ్చట్లు ఎన్నో జ్ఞాపకాలను వెలికి తెచ్చింది.

    Keep writing good poetry.

    Mohan

« 1 ... 1541 1542 1543 1544 1545 ... 1581 »