Comment navigation


15807

« 1 ... 1345 1346 1347 1348 1349 ... 1581 »

  1. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి vasu M.S.C. గారి అభిప్రాయం:

    09/23/2008 6:56 am

    మీరు రాసిన ఈ వ్యాసము బాగుంది.

  2. పడవ మునుగుతోంది గురించి aswartha గారి అభిప్రాయం:

    09/23/2008 4:53 am

    మనసును తాకిన మానవత్వపు వాస్తవం…

  3. ఈమాట గురించి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/22/2008 8:44 pm

    బాబ్జీలుగారు అడిగిన ప్రశ్న సబబే. సంగీతమైనా, సాహిత్యమైనా, సినిమాలైనా వాటి గురించి కామెంట్లు చేసే ఒక మేధావి (?) వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒకరకంగా arm chair criticism. ‘వేళ్ళకు మట్టి అంటుకోకుండా’ వెలిబుచ్చే అభిప్రాయాలు ఎటువంటివైనా వాటికి ground realities తో సంబంధం లేకపోవచ్చు (కొన్ని సందర్భాల్లో). ఉదాహరణకు ఫలానా సినిమా, లేదా పాట గురించి చేసే కామెంట్లు in isolation అనిపించవచ్చు. సినిమా తీసిన దశాబ్దాల అనంతరం కూడా వాటి మంచిచెడ్డల గురించి చెప్పుకోవడం పరిపాటి. అప్పటి దర్శకులూ, సంగీత దర్శకులూ, నటులూ ఎటువంటి సమకాలీన సమస్యలకు లోనయారో ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. అయినా మన విమర్శ కటువుగానే ఉంటుంది. రచయితల్లో ‘కూటి కోసం’ పాకులాడేవాళ్ళు తక్కువే కనక వారి గురించిన ప్రతి విమర్శా కర్కశంగానే ఉంటుంది.

    అయితే ఈ పడక్కుర్చీ విమర్శకుల విలువ చాలా ఎక్కువ. ఇదొక రకమైన informed (?) public opinion. అంచేత ఇది సాహిత్య సేవా అనడిగితే అవుననే చెప్పాలి. అందులో కాస్త ఎక్కువతక్కువలుండచ్చుగాక.

  4. ఈమాట గురించి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/22/2008 7:56 pm

    బాబ్జీలు గారూ,

    మీరేమడుగుతున్నారో నాకు బొత్తిగా అర్థమవలేదు. సందర్భం ఏమిటో గూడా తెలియలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా – అంటే ఏమిటో అసలే తెలియదు. ఇంటర్నెట్ లో వెతికితే అమ్రాపుర్కార్ సినిమా మనిషని తెలిసింది. సంబంధం అగమ్యగోచరం.

    మిగిలిన రచయితలకుండి ఈమాట రచయితలకి లేని ఇబ్బందులేమిటి? పొట్టపోషణకి సంబంధించినదా? వెంటనే సాహిత్య సేవ ని తెచ్చారు. నాకయోమయంగా ఉంది. క్షమించండి. కాస్త విపులీకరిస్తే సంతోషిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    09/22/2008 11:29 am

    చాలా బాగుంది. సరస్వతీ స్తుతిపరంగా చెప్పిన సీసపద్యం చిట్టచివరగా చెప్పినా, చిరకాలం గుర్తుంచుకునేదిగా ఉంది.
    విధేయుడు
    Srinivas

  6. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి దిలీపు మిరియాల గారి అభిప్రాయం:

    09/22/2008 3:50 am

    మీ సుదీర్ఘ మైన వ్యాసం చదివాను. ఇప్పటి వరకు ఎవరూ కూడా తమ అభిప్రాయం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇన్ని రాజకీయాలు, సాంఘిక పరిస్థితులు రామాయణాన్ని శాసించాయా?? మళ్ళీ ఇంకో సారి పూర్తిగా చదువుతాను.

  7. ఈమాట గురించి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    09/21/2008 8:04 am

    బాబూ,

    ఈయేలే, ఓ పత్రిక లో యండమూరి, మల్లాది ల జమిలి ఇంటర్వ్యూ చదివేను. సాన్నాళ్ళకి వీలు దొరికి. ఆళ్ళిద్దరూ, గొప్ప రచయతలు కారో, అవునో చివరాకరికి తేలుద్ది. వొగ్గేయండి, దానికోసం మాటాడుకోడం దండగ. కానీ ఒహటి తేలిపోనాది. ఆళ్ళకున్న ఇబ్బందులు, “ఈ మాట” లో రాసీవోళ్ళకి లేవు. లేవు గాక లేవు. ఆళ్ళకేగాదు, ఆళ్ళముందోళ్ళకీ, తరవాతోళ్ళకీ కూడా.

    కడుపెంత తా కుడుచు కుడుపెంత? దీనికై పడని పాట్లనెల్ల పడిదొరలనేల?

    అందుకే “ఈ మాట” లో మనందరం “సాహిత్య సేవ” పేరిట చేసీది ఎంతవరకూ రైటు? మనందరం అని నన్ను కూడా కలిపీసుకున్నందుకు, చెమించాల. చివరాకరికి, “స్టేంపులు” అంటించినప్పుడు, అయి నాలుక్కంటుకుపోయి, చేతికి రాకపోయీ బాధకూడాలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా.

    మనద్రుష్టం, మనద్రుష్టవేనా?(మనదృష్టం, మనదృష్టవేనా?)

    మనం “సాహిత్య సేవ” సేస్తన్నావాఁ? “ఆళ్ళకీ మా అందరికీ ఏటివోయ్ సంబందం?” అంటారా. “మావాళ్ళలాటోళ్ళవిఁ కావంటారా?” ఎందుకు లేదో? ఎందుకు కాదో? తేల్చీవోళ్ళెవరు?

  8. నిద్ర గురించి Sai Kiran Kumar గారి అభిప్రాయం:

    09/21/2008 4:27 am

    నిద్ర కనురెప్పల గవాక్షాలను…
    ఖండిక సూపర్.

  9. చంద్రోదయం గురించి Audisesha Reddy Kypu గారి అభిప్రాయం:

    09/20/2008 5:53 am

    కవిత చిన్నదే అయినా చక్కగా వుంది.

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి satyasai kovvali గారి అభిప్రాయం:

    09/20/2008 3:33 am

    చాలా బాగుంది మీవ్యాస పరంపర. ఎవరైనా మంచి ఫలితాలు చెప్తే జరిగినా, జరక్కపోయినా వినడానికి బాగుంటుంది. కానీ ఈమధ్యలో భయపెట్టి హోమాలూ, జపాలు చేయించే జ్యోతిష్కులూ ఎక్కువైపోయి జ్యోతిషులు బోగస్ అని నమ్మడానికే ఎక్కువ అవకాశం కలుగుతోంది.

« 1 ... 1345 1346 1347 1348 1349 ... 1581 »