Comment navigation


15798

« 1 ... 1336 1337 1338 1339 1340 ... 1580 »

  1. వాడుక భాషలో పద్యాలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/01/2008 5:33 am

    ఈ మధ్య ఇంటర్నెట్టు సౌలభ్యానికి కాస్తంత అభ్యంతరం ఏర్పడి ఈ చర్చని ఇంతవరకూ చూడలేదు. దీని గురించి తాపీగా మళ్ళీ ఆలోచించి రాయాలి. ప్రస్తుతానికి రెండు మూడు విషయాలు.
    మోహనగారు వాడుకభాషలో పద్యాలకి ఆదరణ లభించాలని కోరుకున్నారు. సమంజసమే. వాడుక భాషలో పదునైన, అందమైన పద్యకవిత్వం వస్తే (రా గలిగితే) దానికి ఆదరణ తప్పకుండా లభిస్తుందని నా నమ్మకం.
    తెలుగులో పాదాంత విరామం గురించి. అది సంస్కృతంలో నియమం. తెలుగులో లేదు. కాబట్టి, కావాల్సిన చోటల్లా ఆ విరామాన్ని పాటించడానికీ అవకాశం ఉంది, అక్కరలేదనుకున్నప్పుడు పాటించకపోడానికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలుగు ఛందస్సులో ఎక్కువ వెసులుబాటు ఉందన్నమాట!
    బాబ్జీలుగారు తమ వ్యాఖ్యల్లోకి రెండు మూడు సార్లు నన్ను లాక్కొచ్చారు 🙂 వారికోసం నేను వాడుకభాషలో రాసిన పద్యాలు: “నాన్నా తెలుసా“.

  2. వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/01/2008 5:24 am

    బాబ్జీలు గారు,
    మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.

    వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట. మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.

    అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే, వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.
    ==============
    విధేయుడు
    -Srinivas

  3. వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    10/31/2008 9:52 am

    కృష్ణమోహన్ గారూ,మీకు చేత కాదని నేననుకోవడంలేదు. మీరు రాసిన పద్యాలు నేను చూళ్ళేదు. క్షమించండి. మీరు గానీ, కామేశ్వర రావు గారు గానీ, మరెవరైనా గానీయండి; ఛందోబధ్దమైన పద్యాలు నా “హ్రస్వదృష్టి”కి (దానికి తోడు చెత్వారం)కనబడలేదు. అది నా తప్పే. కానీ ఒక విషయం చెప్పండి, మీ వ్యాసంలో వుదాహరణలు ఇప్పటివాళ్ళవి ఎంత %? అది చా………లా తక్కువనిపించింది నాకు. అందుకని అడిగేను. వాడుక భాషలోనైనా, మరేభాషలోనైనా ఛందొబధ్ధమైన పద్యాల విషయం ఎలాటిదంటే: ఒకప్పటి మన గొప్ప ఆట “హాకీ” ఇప్పటికీ గొప్పదనడంలాటిది. ప్రస్తుతం “హాకీ” గొప్పగా ఆడీవాళ్ళు లేకపోయినా.

    ఇంతకీ శ్రీనివాస్ నాగులపల్లి గారుదహరించిన తేటగీతి చివరి పాదంలోని “మస్తు”
    “తూ చీజ్ బడీ హై “”మస్త్ మస్త్”” లోని మస్తేనా? ఇంకో మస్తా?
    ఇందులో ఇకటాలేటీలేవు. తెలకడగడం అంతే. దయుంచాల.

    లైలాగారు చెప్పిన “ఈమాట” యొక్క “ఎడ్వాంటెజి” వొప్పుడో వొప్పీసుకున్నాను. మౌనంగా అలోచించడవొక్కటే నేర్సుకోవాల. “సబ్మిట్” మీద “క్లిక్” కొట్టినకాణ్ణించీ అదీ మొదలెడతాను.    

  4. వాడుక భాషలో పద్యాలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    10/30/2008 6:05 pm

    శభాష్ S.N. బాగుంది సీసం. Yummy.
    Easy does it బాబ్జీలూ! విశాలాంధ్రలో, మరింత విశాల ప్రపంచంలో, అంతా పద్యాలు రాసే పని మీద ఉండరు కదా! ఎవరికి ఉషారు వచ్చినపుడు వాళ్ళు ఇష్టమైన విషయాల మీద, ఇష్టమైన పద్ధతిలో -వచనమో, పద్యమో, పాటో- రాస్తారు. ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు చదువుతారు. ‘ఈ మాట’ మేగజీన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చయ్యే. రచనలు ప్రచురించిన వరసలోనే చదవక్కర్లేదు కూడా. వెనక వెనక్కూ, మళ్లీ ముందుకీ, వెళ్ళొచ్చు. “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” -అనే అంత హడావిడేం లేదు. మనకు కావాల్సిన విషయాలు మనిష్టమైనప్పుడు చదవొచ్చు. నేనైతే లైబ్రరీలో లాగా నిశ్శబ్దంగా చదువుకుని ఆనందిస్తుంటాను అప్పుడప్పుడూ. ఈ వ్యాసం అలాగే చదివేసి వెళ్ళిపోయాను. చదివినప్ప్పుడల్లా మాట్లాడం కదా. కొన్నిసార్లు మౌనంగా ఆలొచించటం కూడ అవసరమే. ఈ చదవటం, రాయటం అనే కార్యక్రమం అలా సాగుతూనే ఉంటుంది. మరమరాలు తింటూ చదువుకుంటూ ఉంటమే. Relax. Where is the anxiety? Easy does it మై డియర్ బాబ్జీలూ!

    లైలా

  5. వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/30/2008 8:23 am

    బాబ్జీలు గారికి నమస్కారం.
    మోహనగారు వాడుక భాషలోనే కాదు, కొత్త ఛందాలలో కూడా పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా, ఎవరైనా ప్రయత్నిస్తే
    సాయం కూడా చేస్తున్నారు. మనమే చదవట్లేదు!

    సీ. పద్యమా! యెందుకు పాతి పెట్టెదనని
    ప్రతినబూనిరిమన రచయితెపుడొ
    పద్యమా! కాదది పామని కొట్టెద
    కర్రతో యనెమన కవియె నొకరు
    పద్యమా! నీయొక్క పాడు శృంఖలములు
    పగులగొ ట్టెదనని పల్కె నొకరు
    పద్యమా! నీవొట్టి పాతకా లపురోత
    క్రొత్త కావాలనె క్రొత్త కవులు

    తే. కాని భాష నిలబడి పకపక నవ్వె
    సొంత రూపాల పైచిచ్చు వింత గొలుప
    తనదు బిడ్డల మేలునె తలచి పలికె
    మస్తు శుభమస్తు యారోగ్య మస్తు యనుచు!
    ========
    విధేయుడు
    -Srinivas

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    10/30/2008 4:50 am

    Rama M.V గారికీ, సత్యసాయి కొవ్వలి గారికీ ధన్యవాదాలు. మీ కామెంట్లు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.

  7. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి Navin గారి అభిప్రాయం:

    10/30/2008 12:21 am

    నమస్కారం.

    ఈ సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసి అందరు ముందుకు వస్తే బాగుంటుంది.

    “If there is darkness in the room, and we cry there is darkness, nothing will happen,
    bring in light and the darkness will disappear.”… Swamy Vivekananda.

    నాకు తోచిన కొన్ని పరిష్కారాలు:

    1. సెన్సార్ వారిని సిరియస్ గా పనిష్ చెయ్యాలి.

    2. గాంధిగిరి ద్వారా వారి బాధ్యత గుర్తు చెయ్యాలి.

    3. మన సంస్కృతిని, మాతృభాషను కాపాడాలనే ఆకాంక్షించే వారందరూ ఇటువంటి వాటిని ఎదురుకోవటానికి నడుం బిగించాలి. మనమందరము ఒక ఉద్యమం లేవదీయాలి.

    4. రావణాసురుడికి అయిదు తలలు సినిమా వాళ్ళైతే మరో అయిదు తలలు రాజకీయాలు. మనము ఉడతతో సమానం. రాముడు వీరిని నిజంగా గెలవగలడు. మన తెలుగు కళామతల్లిని కాపాడగలడు.

    తెలుగువీర లేవరా …!

  8. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి రానారె గారి అభిప్రాయం:

    10/29/2008 7:47 pm

    ఒక వరసంటూ లేకుండా హాయిగా కబుర్లాడినట్టుగా బాగుందీవ్యాసం. నాలుగు కొత్తవిషయాలు తెలిశాయి. ‘సాహిత్యమొర్మొరాల’ను ఒకసారి చదవాలనిపించేలా వుంది.

    కర్ణాంతాయతలోచనే … అన్నారు … కర్ణాంతాకీర్ణలోచనే అని ఒక అణా ఎక్కువగా మా పాఠాల్లో చదువుకున్నట్టు గుర్తు. అణాలు చెలామణిలో లేని రోజులా అవి!!?

  9. విలువలు గురించి rahamthulla గారి అభిప్రాయం:

    10/29/2008 9:56 am

    “కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” కానీ భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
    కుల వివక్ష భరించలేకే మత మార్చుకున్నారని భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక ఇచ్చారు:-
    న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.
    ‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.
    పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

  10. తెలుగు సినిమా? తెగులు సినిమా? గురించి venugopal.nori గారి అభిప్రాయం:

    10/29/2008 9:39 am

    I do accept your opinion 100%. There is lot of change in society[viewers]. We should know our responsibility in in the country.

« 1 ... 1336 1337 1338 1339 1340 ... 1580 »