Comment navigation


15798

« 1 ... 1338 1339 1340 1341 1342 ... 1580 »

  1. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    10/26/2008 10:58 pm

    మంచి గతమున కొంచెమేనోయ్”

    చంద్రశేఖర రెడ్ది గారి వ్యాసంలో భాష చక్కగా ఉంది. పల్లె జీవితం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అయితే జీవితం బహుముఖమైనది. వారి వ్యాసం చదివి, పల్లెటూళ్ళ గురించి బొత్తిగా తెలియని వాళ్ళు, “గుప్తుల కాలం స్వర్ణయుగమందురు” అన్నట్లు, ఒకప్పటి పల్లెలు స్వర్గసీమలని భ్రమపడే ప్రమాదముంది. దానిక్కాస్త విరుగుడుగా నా చిన్నతనంలో, స్వాతంత్ర్యం వచ్చిన పాతికేళ్ళకి, మా ఊళ్ళో జీవితం ఎలా ఉండేదో కాస్త రాస్తాను.

    కాలకృత్యాలకీ, బర్రెగొడ్లని కడగడానికీ, చాకిరేవుకీ – అన్నిటికీ ఊరిచెరువే! జబ్బునపడితే మాఊళ్ళోనయితే కనీసం మంచి వైద్యులున్నారు. పొరుగు ఊళ్ళ వాళ్ళకి నాటువైద్యులే దిక్కు.

    అతివృష్టీ,, కాకపోతే అనావృష్టీ. ఎండాకాలంలో రెండు మూడు మైళ్ళు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం.

    ఈ వ్యాసంలో పెద్దగా కనబడని వాళ్ళు మాలమాదిగ వాళ్ళు. ఊరికి వెలిగా ఉండేవాళ్ళు. కూలీలుగా రైతుల ఇళ్ళలో పాలేర్లుగా, జీతగాళ్ళుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళని అన్ని కులాలకన్నా అతి హీనంగా చూసేవాళ్ళు.

    బళ్ళో “ఆంటరానితనం మహా పాపం,” అని వల్లె వేసేవాళ్ళం. బడి బయట విధిగా అంటరానితనాన్ని పాటించేవాళ్ళు! నాకిప్పటికీ గుర్తు; పెద్ద బజార్లో హోటల్లో పెద్ద మనుషులంతా పేపర్లు చదువుతూ, అన్ని వ్యవహారాలూ మాట్లాడుకునే వాళ్ళు. వాళ్ళెదుటనే, గూట్లో వేరేగా గ్లాసులుండేవు. పబ్లిక్ ప్రదేశాలలోనే అలా ఉంటే ఇళ్ళల్లో విషయం చెప్పేదేముంది? నేను కాలేజీ సెలవులకి ఊరికెళ్ళినప్పుడు, ఓ పెద్దమనిషి, మాలా మాదిగోళ్ళని “ఒరేయ్” అనడానికి జంకాల్సొస్తుందని వాపోయాడు.

    బాబాయ్, పిన్నాం, ఇలా వరస పెట్టి పిలుచుకునేవాళ్ళు – వేరే కులమయినా. కాని ఎవరి స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. కుల ధర్మం తప్పక పాటిస్తారు. కులాంతర వివాహాలు అసంభవం; కులాంతర వివాహేతర సంబంధాలు మాత్రం అతి సామాన్యం!

    ఊరి ప్రెసిడెంటుకి ఎన్నికలు జరిగేవి. రెండు పార్టీల వాళ్ళూ ఒకరికొకరు దాయాదులే. ఎన్ని తరాలు గడిచినా వేరే వాళ్ళు నిలబడే ప్రసక్తే లేదు. అసలా మాటే ఎక్కడా రాదు. ఈ మధ్యనే ఓ మాల ఆయన ప్రెసిడెంటు అయ్యాడు – రిజర్వేషన్ మూలాన. పెద్దమనుషుల చెప్పుచేతల్లో ఉండకుండా పోలేడు.

    ధర్మవ్యాధుణ్ణి ప్రస్తావించారు కనుక చెప్తాను. మన సంస్కృతిలో కింద వర్ణాల వారిని పైవారు హీనంగా చూస్తే ఆశ్చర్యం లేదు – అది సంస్థాగతం. కాని తమని తామే హీనంగా భావించుకోవడం – “హీన యోనిజుండనయ్యును నిర్మలుండనైతిం” అని ధర్మవ్యాధుడు సగర్వంగా చెప్పుకోడంలో ఉంది విషాదమంతా.

    చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు – వీళ్ళంతా పండక్కీ పబ్బానికీ ఆసాముల ఇళ్ళకి బుట్టతో పొయ్యేవాళ్ళు. “వండుకున్న అమ్మకి ఒక్కటే కూర; అడుక్కునమ్మకి అరవై కూరలు,” అన్న సామెతని బట్టి ఇదెంత గౌరవప్రదమైనదో తెలుస్తుంది. లాండ్రీ షాపో, బార్బర్ షాపో, గిన్నెల కొట్టో, లేకపోతే ఆ దిక్కుమాలిన వృత్తులకి సంబంధించకుండా కాస్త చదువుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే గాని ఆ జీవితాలకి విముక్తి లేదు. అందుకు పల్లెటూళ్ళని వదిలి పారిపోతే విచారమెందుకు?

    “మాలపల్లి” లో సంగందాసు అన్నట్లు, “సర్వేగుణాః కాంచన మాశ్రయంతే అని ధనాకర్షణ మార్గాలు చూపించందే, తక్కిన మంచి గుణాలు అలవాటుపడవు.”

    కొడవళ్ళ హనుమంతరావు

  2. షికారు పోయి చూదమా …. గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    10/26/2008 12:54 pm

    పైన ఒక తప్పు దొర్లింది. కాస్త 🙂 ఆలస్యమయినా తప్పుని నేనే గుర్తించాను, ఇలా దిద్దుకుంటున్నాను :).

    మరో రామబ్రహ్మం చిత్రానికి (అపవాదు (1941), “కోయిలొకసారొచ్చి కూసిపోయింది” లాంటి సుమధుర గీతాలతో) పని చేసిన …

    అపవాదు లో నేను చెప్పదలచుకున్న పాట: “కోకిల పాట – ఈ మానుపైనుండి నీవు, ఆ మానుపైనుండి …”.

    “కోయిలొకసారొచ్చి కూసిపోయింది” కూడా సాలూరి పాటే (ఇల్లాలు, 1940, గా: ఎస్. వరలక్ష్మి). తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా, ముఖ్యంగా ఈపాట ద్వారా గొప్పగా చూపెట్టాడు సాలూరి.

    –శ్రీనివాస్

  3. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి eksarma గారి అభిప్రాయం:

    10/26/2008 2:27 am

    చక్కగా వున్నది.మిగిలిన కావ్యాలను కూడా మీరు వ్రాస్తే చదవాలనుంది

  4. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి యన్.సీతారాంరెడ్డి గారి అభిప్రాయం:

    10/25/2008 10:06 pm

    మీ వ్యాసం విజ్ఞానదాయకంగా ఉంది. జీవితానికి గణితానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఫ్రేగ్ చేసిన కృషిని అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదములు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ మెంట్ సిస్టంలో ఈ భావనలు బాగా ఉపకరిస్తాయి.

  5. ప్రేమ కవితలు గురించి mahesh గారి అభిప్రాయం:

    10/24/2008 9:35 am

    మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది. ఇంకా మంచి కవితలు మీ కలం నుంచి ఆశిస్తూ…

  6. పడవ మునుగుతోంది గురించి mahipal గారి అభిప్రాయం:

    10/23/2008 10:09 pm

    నిజంగా హృదయాన్ని తాకింది మీ కథ.

  7. రాగలహరి: మోహనం గురించి Bhanu Murthy గారి అభిప్రాయం:

    10/23/2008 5:51 pm

    చాలా బాగా రాసారు. సంతోషం. కృతజ్ఞతలు.
    భానుమూర్తి

  8. వాడుక భాషలో పద్యాలు గురించి rahamthulla గారి అభిప్రాయం:

    10/21/2008 6:07 pm

    సంస్కృతంలోఉన్నట్లే తెలుగులో కూడా పాదాంతంలో విరామం ఉండనిస్తే పద్యాలు వాడుక భాషలో బాగుంటాయి.ఛందోబద్దమైన పద్యాలలో ఏఏ ఆటంకాలు కవులకు ఎదురౌతున్నాయో చక్కగా వివరించారు.వాటిని అధిగమించి వాడుక భాషలో పద్యాలు రావాలి.ఈనాటి భాషకు సరిపడే విధంగా కొత్త తెలుగు ఛందస్సురూపొందించుకోవాలి. పూర్వం రంగస్థల పద్యాలవల్లనే పల్లె ప్రజలకు రాగాల జ్ఞానం అబ్బింది.

  9. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి karvera babu గారి అభిప్రాయం:

    10/21/2008 2:39 pm

    రహంతుల్ల రాసింది చూసేవరకు, ఈ వ్యాసము చదనందుకు చింతిస్తున్న. చంద్రశేఖర రెడ్డి గారు రాసిన నాటి పల్లెసీమల పరశోధక జీవనవ్యాసం, నా చిన్నతనములో పల్లెటూరి జీవనాన్ని గుర్తు కు తెచ్చింది.నా చిన్నతనాని కే మా రేపల్లే ప్రాంతాన, రెడ్డి గారు చెప్పిన గ్రామ కళాకారులు, సంచార యాచక కళా ఆకారులు కొంతమంది అంతరించి పోయారు. కొన్ని గ్రామ వృత్తులు , చేతి పనుల కళాకారులు (artisans-తెలుగు లో “శెట్టి” సమాన పదమ్ గా గుర్తించాను) కరువయ్యారు. కవులు, రచయతలు,సామ్యవాద కళాకారులు, నిరుద్యొగులు మా రేపల్లె లో క్రిత శతాబ్ద మధ్య కాలానికి బాగ వృద్ది చెందినారు.రేపల్లె నిరుద్యొగ సంఘం దేవులపల్లి వారికి నిరుద్యొగులయిన సంధర్భము లో, సన్మానము చేసిందట! మా ప్రాంతపు తుమ్మల వారు మా రేపల్లె హైస్కూల్లొ ప్రసంగిచినప్పుడు చెప్పిన పండుమిరపకాయ గోగు కూర పచ్చడి పద్యము, ఈ వ్యాసము గుర్తుకు తెచ్చింది.

  10. నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    10/20/2008 8:36 pm

    మోహన రావు గారికి

    అదే చేత్తో భాసుని శ్లోకాన్నీ, భావాన్నీ రాయమని మనవి.

    శ్రీనివాస్

« 1 ... 1338 1339 1340 1341 1342 ... 1580 »