Comment navigation


15795

« 1 ... 1295 1296 1297 1298 1299 ... 1580 »

  1. కొండ నుంచి కడలి దాకా గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    01/01/2009 9:20 am

    Oh..by the way…the artistes who participated did “pUrti nyAyam” to it…can you pls throw in some light on who these artistes are ?

    Thanks

    Vamsi

  2. కొండ నుంచి కడలి దాకా గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    01/01/2009 9:13 am

    Thanks a million Sreenivas gaaru…enjoyed the master piece..

    Right from the 1st minute, you will know it’s got something to it, not like others..may be it’s the mood you are being setup right from the beginning, be it with the music or narration…

    Thanks again…

    Vamsi

  3. తారామతి బిరాదరి గురించి beekay గారి అభిప్రాయం:

    12/31/2008 10:10 am

    WOW.
    Great Imagery. Well done.
    A bit prematurely ended, but I think every good poem does that.

  4. పద్యాలు – వాడుకభాష గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/31/2008 8:54 am

    కావేఁశ్వరరావు గారికి,
    తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
    నన్నెచోడుడో, నన్నయో ఆదికవి ఎవరెనే గొడవ వద్దు (ప్రాచీన/క్లాసికల్ భాష స్థాయి తెలుగుకి వచ్చీసింది కాబట్టి) వీళ్ళైనా గ్రాంధిక భాషని ఎలా తయారుచేశేరు? అసలు గ్రాంధికాన్ని ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది?
    ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది? కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు? అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు? వ్యాకరణం భాషని శాసించదు, “రికార్డ్” చేస్తుంది. కాదా? రేపు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ “అమ్మ వొచ్చేడు, నాన్న వొచ్చింది” అని వాడితే భాషా శాస్త్రవేత్తలు/వ్యాకరణ పండితులు – ఆ పుంజీడు మందీ – అదే “రికార్డ్” చేస్తారు తప్ప ఇంకేం చేస్తారు?
    ఇన్ని “కొశ్చిన్ మార్కులా?” అని అనుకోవచ్చు. అవును “ప్రశ్నార్ధకాలే?”

    “తెవికీ” సభ్యులకి: అయ్యలారా! అమ్మలారా! తెవికీ అంటే తెలీదు నాకు. కానీ ఇదేదో తెలుగు భాషనుధ్ధరించడానికి చేసే పనని అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో తెలుగు భాషా శాస్త్రవేత్తల్నీ, తెలుగు భాషా పండితుల్నీ సంప్రదించకండి. తెలుగు మాట్లాడే ప్రజల్ని సంప్రదించండి. మీ శ్రమకి ఫలితం, మీ శ్రమకి కృతజ్నత, మీ శ్రమకి తెలుగు ప్రజల జేజేలు అందుకోవచ్చు. మీకవక్కర్లేదని అందరికీ తెలుసు. అయినా సరే.

    కావేఁశ్వరరావు గారికి: మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. మీరు గురు తుల్యులు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
    అందరికీ “అమ్మ(భాష)” రాణెమ్మలా బతకాలనే దుగ్ధ. అయితే అది సమకూర్చడానికి పిల్లలు తగవులాడుకున్నట్టు లేదూ ఇదంతా?
    చందోబధ్ధమైన పద్యము వ్రాయగల్గిన కుర్రాళ్ళూ, నియమాలేవీఁ లేని శ్రీశ్రీ “తిలకా”లూ, ఆయమ్మకి మనకాడ పూసిన పూలనే “ఒట్టుకెళ్ళిచ్చి, ఇయెట్టుకో కొప్పులో, ఎంత బాగుంటావో తెల్చా” అనే చాత్రిబాబులూ, అన్నీ తెలిసిన రవఁణలూ, ఏవీఁ తెలీని నామినులూ, తెలిసీ తెలీనట్టుండే శ్రీశ్రీరవఁణలూ, అన్నీ తెలుసు మాకన్నీ తెలుసు అని “రికార్డింగ్ డేంచు కట్టే” నాలాటి వాళ్ళూ వీళ్ళందర్నీ “బజ్జో, మళ్ళీ పొద్దున్నే లెగాల” అని దెబ్బలాడతాదాయమ్మ్మ. కాదా?

  5. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    12/31/2008 12:54 am

    వీణ తీగలకీ పేర్లున్నాయి.

    అనుమంద్ర – మొదటి తీగ,
    మంద్ర – రెండవ తీగ,
    అనుసారణి – మూడవ తీగ,
    సారణి – నాల్గవ తీగ

    ఈ పేర్లకి ప్రస్తుతం వాడుక తగ్గింది. సంఖ్యా పరంగానే చెబుతున్నారు.

  6. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి rama గారి అభిప్రాయం:

    12/30/2008 10:30 pm

    తప్పకుండా హనుమంతరావు గారూ !

    smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.

    “వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.

    Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!

    రమ.

  7. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/30/2008 7:50 am

    రమ గారికి,

    ముస్లిం అస్తిత్వంతో స్మైల్ ముందుమాటలు రాసిన పుస్తకాలలో కొన్నిటివయినా పేర్లివ్వమని మనవి. వాటిని చదివి పాఠకులు ఆయనలో వచ్చిన మార్పు మంచికో చెడుకో, కొంతవరకైనా బేరీజు వేసుకునే వీలుంటుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. పద్యాలు – వాడుకభాష గురించి Dr.tadepalli patanjali గారి అభిప్రాయం:

    12/30/2008 1:29 am

    విశ్వనాథ పలుకు ‘బడి’లో నిలబడి రచయిత మంచి క్లాసు తీసుకొన్నారు. అభినందనలు.
    -డా.తాడేపల్లి పతంజలి

  9. రచయితలకు సూచనలు గురించి Dr.tadepalli patanjali గారి అభిప్రాయం:

    12/30/2008 1:06 am

    నమస్తే. మీ నవంబరు సంచిక చూసాను. మీ ప్రయత్నం అభినందనీయం
    -డా.తాడేపల్లి పతంజలి

  10. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి rama గారి అభిప్రాయం:

    12/29/2008 11:28 am

    వేలూరి గారికి,

    మీరు smile ని తలుచుకోవడం బాగుంది. smile సౌమ్యుడు. సంస్కారి. కానీ ఆయన చివరికి క్రమంగా “ముస్లింవాద సంఘాల” వైపు మొగ్గు చూపేడు.వాటికి దగ్గరయ్యాడు. వాళ్ళకి పెద్దదిక్కుగా మారి వాళ్ళ పుస్తకాలకి ముస్లింగా ఆ అస్తిత్వంతో ముందు మాటకూడా రాసేడు. అదీ ఆశ్ఛర్యం. మొదటి రోజుల్లో smile ని ఎరిగిన వారికి ….ఈ మార్పు కొంతవింతని కలిగించక పోలేదు. ఇవాళ తెలుగు దేశంలో ఇదీ పరిస్థితి. స్మయిలు సైతం ఈ ప్రవాహంలో పడక తప్పలేదు. ఇది ఒక మార్పు ఆఖరి రోజుల్లో smile లో.

    స్మయిల్ ని సైతం మారేలా చేసిన ఈ ధోరణులు..వీటి భవితవ్యాలు..మంచివో..చెడ్డవో నాకు తెలీదు. కానీ ఇదిగో …ఇది మరో కోణం …smile వ్యక్తిత్వంలో….అన్న సంగతిని కూడా చెప్పాలని.

    భవదీయ
    రమ.

« 1 ... 1295 1296 1297 1298 1299 ... 1580 »