Comment navigation


15803

« 1 ... 1273 1274 1275 1276 1277 ... 1581 »

  1. కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar గారి అభిప్రాయం:

    03/06/2009 7:28 am

    రమ గారూ,
    Glad you were able to enjoy the song. మీరు అడిగిన వివరాల కోసం నేనూ ప్రయత్నిస్తున్నాను. ఏ శారదా అశోకవర్ధన్ గారినో, పాలగుమ్మి విశ్వనాథం గారినో లేక వేదవతీ ప్రభాకర్, చిత్తరంజన్ గారి వంటి ఆనాటి కళాకారులని అడిగితే తెలియవచ్చు. ఇక పాట రచన విషయానికి వస్తే, నేనూ మొదట ఇది కృష్ణశాస్త్రిగారి రచన అనుకున్నాను కానీ ఎంత వెతికినా, ఆయన రచనల్లో ఇది కనబడలేదు (ఇంకా జాగ్రత్తగా మరొక సారి చూడాలి). కృష్ణశాస్త్రిగారి బాణీ నాకు తెలిసి మరొకరికే ఉంది. అది మల్లవరపు విశ్వేశ్వరరావుగారు. వీళ్ళిద్దరూ సమకాలికులు. శాంతినికేతన్ లో ఉన్నప్పుడు విశ్వకవి రవీంద్రుడి ప్రభావం ఇద్దరిమీదా కనపడుతుంది. ఆందుకే భావకవిత్వంతో పాటు, ఇద్దరూ దేశభక్తి గీతాలు చాలానే రచించడం జరిగింది. “భారత భేరీ మ్రోగిందోయ్”, “ఓహో యాత్రికుడా” లాంటి ప్రేరణ గీతాలే కాకుండా, విశ్వకవి గేయాలని కూడా కొన్ని తెలుగులోకి తర్జుమా చేశారు మల్లవరపు వారు. “ఎవరూ నీ కేక వినీ రాక పోయినా సరే, ఒకడవె పదవోయ్” (ఓక్లె చలో కి అనువాదం) వంటి పాటలు, ఈయనవి బాగా గుర్తింపుని పొందాయి.

    Let us hope that someone like Sri Parachuri Srinivas who has the right contacts can find out more information.

    రాజాశంకర్

  2. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/06/2009 7:24 am

    పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.

    పై కవిత్వంలో “ధార” ఎక్కడుందీ?????

    “(వెర్రి) పీర్లనీ, సంపాదకులనీ దాటుకుని” అశ్లీల నీడలు తారాడుతున్న ఈ గొప్ప కవితాధార” ఇక్కడెలా “లీకు” అయిందీ?

  3. కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/06/2009 6:10 am

    రాజశంకర్ గారూ !

    ఎత్తవోయీకేల”..తో ఒక్కసారి నా హైస్కూల్ కాలం లోకి వెళ్ళిపడ్డాను. అంత సుతిమెత్తగా పాడిందెవరూ ? గొంతు పోల్చుకోలేదు. పాట కృష్ణశాస్త్రి కదా? కాదా? సంగీతం ఎవరూ?? తెలిస్తే ఎవరైనా ఒకసారి చెప్పండీ.పాట text కావాలంటే ఎలా? ఆ వాక్యాల సరళి తెలిసీ తెలియన ట్టుంది. ఆ ఊహలింకా మనసులో ఊగుతున్నాయి.

    రమ.

  4. బోడి పద్యం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    03/06/2009 5:56 am

    ఈ కవితలో మంచి ఇమేజెస్ ఉన్నాయి.

    కృతకమయిన పద్యం రాసిన రాత్రి
    కంటి రెప్పల్ని ఇనప తాళ్లతో లాగుతారు, ఎవరో, దేనికో!

    బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
    గుక్కపట్టి ఏడుస్తోంది

    పద్యానికీ నిద్రపట్టదు
    నాకు మల్లెనే!

    పునరపి ఖననం పునరపి దహనం

    అశ్లీల నీడలు కవితలో తారాడుతున్నా, గొప్ప కవిత్వ కాంతి ధారలో అవి మరుగున పడినట్లు తోస్తోంది.

  5. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి రవి గారి అభిప్రాయం:

    03/06/2009 1:26 am

    చాలా మంచి పరిచయం. అంత తొందరగా అయిపోయిందా అనిపించేంత చక్కగా వ్రాశారు.

  6. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    03/05/2009 10:26 pm

    మలుపు చూచాయగా ఊహించినట్టే వుందనిపించింది. ఆ మలుపే కొసమెరుపై వుంటే మరింత బాగుందేది. ఆపక చదివించే, ఆకట్టుకునే శైలి. అభినందనలు. ఉద్దేశ్యం, ఆలశ్యం: ఇవి సంపాదకులే సవరించాలి.
    [తప్పులు సరిదిద్దాము, క్షంతవ్యులం. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/05/2009 9:58 pm

    “మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”

    రామారావ్,

    థాంక్స్. నువ్వన్న మాటలు , “When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period,” చదివితే నాకు రెండు గుర్తొచ్చాయి. మొదటిది నీకు తెలిసిందే; రెండోది బహుశా తెలియనిది – రాసింది తెలిసిన వాడే అయినా.

    Weinberg తన పుస్తకాన్ని [1] ముగిస్తూ అంటాడు: “The more the universe seems comprehensible, the more it also seems pointless. But if there is no solace in the fruits of our research, there is at least some consolation in the research itself. Men and women are not content to comfort themselves with tales of gods and giants, or to confine their thoughts to the daily affairs of life; they also build telescopes and satellites and accelerators, and sit at their desks for endless hours working out the meaning of the data they gather. The effort to understand the universe is one of the very few things that lifts human life a little above the level of farce, and gives it some of the grace of tragedy.”

    రెండోది సంతానం కవిత [2]:
    స్వర్ణలత

    కొందరు ధనార్జనలో అహర్నిశలు శ్రమిస్తారు
    మరికొందరు జ్ఞానమునే ఆశ్రయించి బతుకుతారు
    జిజ్ఞాసువుల లోకంలో శాంతిభావమే విరిసెను
    అజ్ఞాతములో ఉన్నా, వారి జన్మ ధన్యము

    అనవరతము జాగృతిలో స్వధర్మమును నెరవేర్చుచు
    చల్లదనము ప్రసరించెడు జ్ఞానులు వెన్నెల నెలవులు

    జ్ఞానులైన వారెప్పుడు లోకహితము కాంక్షింతురు
    మేనిలోని తాపాలను దైవఘటనగా ఎంతురు
    తనవలెనే ఇతరులనుచు తలపోసెడు జ్ఞానమతులు
    మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”

    ఎ. వి. సంతానం, REC Warangal లో BTech చేశాడు (1976-81). నా క్లాస్ మేట్, స్నేహితుడు. 1987 నాటికి తిరుపతిలో ఉండేవాడు. ఎవరికైనా జాడ తెలిస్తే నాకు కబురు చెయ్యమని కోరిక.

    ఈవ్యాసం చాలా ఆలస్యంగా పంపి వెంటనే ఇండియా వెళ్ళాను. నేను అందుబాటులో లేకపోయినా, సరిదిద్ది మెరుగు పెట్టినందుకు సంపాదకులకు కృతజ్ఞతలు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1] “The First Three Minutes: A Modern View of the Origin of the Universe,” by Steven Weinberg. Basic Books, 1993.

    [2] “వెన్నెల రాణి,” ఎ. వి. సంతానం, 1987.

  8. అతడు, నేను, అతడి కథ గురించి Vamsi గారి అభిప్రాయం:

    03/05/2009 8:44 pm

    Seems like even suicide follows Darwin’s rule of survival. “It is not the strongest of the species that survives, nor the most intelligent that survives. It is the one that is the most adaptable to change.”

    Btw, thanks for this analysis and I would love to see more of this stuff in eemaata in future.

    –Vamsi

  9. పురూరవ: శ్రవ్య నాటిక గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    03/05/2009 8:11 pm

    చాలా అరుదైన నాటకం. మీరు దీనిని ఈ వెబ్ సైట్ లో పెట్టి చాలా గొప్ప పని చేశారు.

  10. బోడి పద్యం గురించి Lakshmi Kallakuri – ‘Sailakshmi’ గారి అభిప్రాయం:

    03/05/2009 7:39 pm

    పేరు వచ్చిన వాళ్ళు ఏ మాట రాసినా చెల్లుతుందని ‘ఈ మాట’ వాళ్ళు ప్రచురించడము ఏమీ బాగలేదు. మాటలన్నిటిని మురికి చేసి కుండ మీదబెట్టి కోసి ముక్కలు చేసి నెత్తుటితో దహనము చేసి సూపీని, గంగానమ్మని, గాయతృలను బిస్మిల్లా అంటూ వక్రంగా ఖననము చేస్తూ మూఢమతిని అంటే మెచ్చుకోవాలా?
    ‘సాయిలక్ష్మి’

« 1 ... 1273 1274 1275 1276 1277 ... 1581 »