త్యాగరాజు కృతుల్లో పల్లవికీ, అనుపల్లవికీ మీరు చెప్పిన ప్రాస నియమాలు గమనించాను. ప్రతీ చరణానికీ ఒక్కో అక్షరప్రాస ఉన్నదీ తెలుసు. చరణాల్లో ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు పాడడం అనేదొక పద్ధతి మాత్రమే! దాన్ననుసరించి చరణం్ పాదాన్ని నిర్ణయించరని అనుకుంటున్నాను. అలాగే పాడే కాలన్ని బట్టీ ఇది వుండదు. “నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది.” అని మీరు రాసారు. ఉదాహరణకి, మీరు చెప్పిన ఎందరో మహాను భావులు కృతిలో కొన్ని చరణాలు తీసుకోండి. అందులో మీరు చెప్పిన సూత్రాలూ, ప్రాస నియమాలూ ఎలా అమలయ్యాయో చెప్పండి? నాకు తెలీకపోతే తెలుసుకుంటాను. మీ కోసం ఎందరో మహానుభావులు కృతిలో కొన్ని చరణాలు తాళ ఆవృత్తాన్ని బట్టి ఎలా వుదో అలాగే ఇక్కడిస్తున్నాను.
త్యాగరాజు చందస్సు నియమాలని అంతగా పట్టించుకోలేదని నేనన్న మాటలు కావు. సంగీత సాహిత్యాల్లో దిట్టయిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారూ రాసిన వ్యాస పరంపరలో ఇవన్నీ చెప్పారు. అందులో కొన్ని ఈ వ్యాసంలో యథాతధంగా సూచించాను. త్యాగరాజు వాడిన కొన్ని వాక్యప్రయోగాలూ, సంస్కృత సమాసాలూ పేలవంగా ఉన్నాయని రాళ్ళపల్లి వారు చెప్పారు. శిష్యులు సరిగా రాసుండకపోయే అవకాశముందని అన్నా, కొన్ని వాక్యదోషాలు పునరావృత్తమయ్యాయని అభిప్రాయపడ్డారు.
కుడి ఎడమ కులాలు
“ఎడమ చేతి కులాలూ..కుడిచేతి కులాలూ అన్న విభజన ఎ.కె.రామానుజన్ తమిళ సమాజంలో ఉన్న ట్టు చెప్పారు. అటువంటి విభజన ఏదీ తెలుగు సమాజంలో ఉన్న ట్టు కన్పించదు.” అన్నారు రమ గారు.
నిన్ననే చదివిన ఆరుద్ర గారి వేమన ఉపన్యాసాలలో ఈ కుడి ఎడమల ప్రస్తావన చూశాను:
“వస్తూత్పత్తి చేసే వాళ్ళూ, వ్యాపారాలు చేసే వాళ్ళూ, వాటికి సంబంధించిన వ్యాపకాల వాళ్ళూ స్వలాభాలను సంరక్షించుకోవాలంటే కలిసికట్టుగా ఉండాలి. ఆర్థిక కారణాల వల్ల గ్రామాలలోని వివిధ వృత్తుల వాళ్ళు ఎడమ చేతి కులాలుగా కుడి చేతి కులాలుగా చీలారు” (మన వేమన అనే పుస్తకంలో ‘సామాజిక జీవనం – విశ్లేషణ’ అనే వ్యాసం).
పై పేరాగ్రాఫు తరువాత, ఓ తొమ్మిది ఎడమ చేతి కులాలనీ, ఓ 16 కుడిచేతి కులాలనీ పేర్కొని, ఇంకో 89 కులాలు ఎడమచేతి వర్గంలో చేరేందుకు ఒప్పందం చేసుకున్నాయనీ, ఒక కులంలో రెండు వర్గాలు ఉన్నాయనీ, మరి కొందరు తటస్థంగా ఉండేవారనీ పేర్కొన్నారు. ఈ వివరాలకు ఆయన “CS SRINIVASA CHARI: ‘THE ORIGIN OF THE RIGHT AND LEFT HAND CASTE DIVISIONS’ Journal of Andhra Historical Research Society Vol-4′ ని ఆకరం్గా చూపించారు.
కామేశ్వర రావు గారికి ఇంకా తదితర రసజ్ఞులైన పాఠకులకు –
నేనంతగా చదువుకున్న వాడిని కాదు (యస్ యస్ యల్ సీ) గౌరన గారిని గురించి వ్రాసే అంత పాండిత్యం వున్నవాడినీ కాదు. సాహిత్య ఎకాడెమీ వారి పుస్తకంలో వారు చూపించినంత వరకు మాత్రమే ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పుస్తకం కూద నా దగ్గర ఇప్పుడుపలబ్దం కాదు. ఐనా నా స్మృత్యనుసారంగా నాకు గొప్ప అనిపించిన గౌరన సంభాషణారూప కవిత్వాన్ని మీముందుంచి ద్విపద సాహిత్యం మీద మీకున్న తక్కువ భావాన్ని దూరం చేయ ప్రయత్నిస్తాను. ద్విపదలో కూదా పోతన, నన్నయ ల వలె మనోరంజకమైన కవిత్వాన్ని వ్రాయవచ్చునని నాకు గౌరనను చదివిన తరువాతనే తెలిసింది.
చంద్రమతిని అమ్మేటప్పుడు పౌరులు
కటకటా యిట్టి వెంగలి రాజు కలడె
మటుమాయ తపసి యే మరులు గొల్పినను
నెమ్మది తను ఏలు నేలకు తోడు
సొమ్ములన్నియు నిల్లు చూరగా నిచ్చి
అమ్మెద కడమకై ఆలి గొండనెడు
తమ్ము మాలిన యట్టి ధర్మంబు గలదె?
చదువులు విని మీద జరుగు సౌఖ్యంబు
మది నమ్మి బ్రతుకు బ్రాహ్మణునకు నిచ్చె
పనుపడి మొయిలులోపలి నీళ్ళు నమ్మి
దొన నీళ్ళు చల్లు వేదురుడెందు గలడు?
కరి రొంపి దిగబడ్డ కమ్మరి నెత్త
కరి యోపుగాక సూకరమెట్టు లోపు?
ధర నింత వాని దుర్దశ నివారింప
నరులోపుదురె విశ్వనాధుండు దక్క
నక్షత్రకుడు హరిశ్చంద్రుడితో
నలినాప్త కులనాధ! నా తోడ నీవు
పలికిన మాటల పధ్ధతి తప్పె
మునినాధునకు నీవు మునుకొన్న యట్టి
ధనమిచ్చువానికి దాసుని గాగ
గొనిపోయి నిన్నమ్ముకొమ్మంటి గాని
వినుత సత్కులజుని వెదకి యిమ్మనవు
వీని కులంబేల? వీని సొంపేల?
వీని గుణంబేల? వీని పెంపేల?
మాలడైనను నేమి? మరి బ్రాహ్మడేమి?
తోలు గప్పిన నేమి? తులువైన నేమి?
గంజాయి దినెనేమి? కలుద్రావెనేమి?
నంజక ధనమిచ్చు నతడె నా మెచ్చు.
కోరిన ధనమిచ్చి కొనరండటంచు
వూరక మొర వెట్టు చుంట నా పాలు
వారక నిను గొన వచ్చిన వారి
తో రాయిడించి పో ద్రోల నీ పాలె?
నిను నేడు మొగమున నెత్తురు బామి
కొని గుల్ల పరుపక కొలికికి రావు
కాల కౌశికుడు హరిశ్చంద్రుడితో
కసవు కట్టెలు మోయ కాయ పండ్లమ్మ
పసుల జంగిలి గాయ పాలేరు దున్న
కొరమాలి మ్రుచ్చుల గూడి దూరమున
చెరవట్టి దెచ్చిన చెలువ నాలనుచు
మొరగి ఈ రీతి నమ్ముట మాకు దోచె
ఎరిగిరే తలవరు లిప్పుడే పట్టి
కొరత వేయుదు రోరి కోమలి విడచి
పరచి నీ ప్రాణముల్ బ్రతికించు కొనుము
కాదేని వరవుడు గా ధార పోసి
మోదంబు తోడ నీ ముదిత మా కొసగు
ఎనయంగ నీ తప్పులేము వహించి
కొని కాచెదము బ్రహ్మ కొడుకు వచ్చినను
దానికి హరిశ్చంద్రుడు
దారుణ కరవాల ధారాహతారి
వీర మాణిక్య నవీన కోటీర
శస్తమైనట్టి ఈ క్షత్రియోత్తముని
హస్తమే రీతిని నలవడు కృషికి ?
మరి బ్రాహ్మణుడు వచ్చి మరుగు జొచ్చినను
దరమిడి రక్షింప దగుగాక మాకు
పరభయంబున నిట్లు బరగ నీ మరుగు
చొరబార నగునె? ఈ చొప్పైన మాకు
బాణాసనంబేల? బాణంబులేల?
ప్ర్రాణంబులేల? కృపాణంబులేల?
భేతాళుడు హరిశ్చంద్రుడితో
దేవతలకునైన దృష్టింప రాని
నా వటమూలంబునకు వచ్చుటెట్లు?
వచ్చి పోనీక కావలి భూతములకు
చెచ్చెర ముక్కులు చెక్కుట యెట్లు?
చెక్కి యంతట పోక చేరి నా యెదుట
పెక్కులు పేలి దర్పించుట యెట్లు?
గడగి మహమ్మారి కడుపు పొట్టేలు
వడిచొచ్చి వాలిన వడువున నీవు….
కాలకౌశికుడి భార్య చంద్రమతితో
కట్టెలు దెమ్మన ఘన భుజంగముల
పుట్టలెక్కగ నేల పోయె నీ కొడుకు?
చేకొని యిది మేము చేసిన తప్పె?
వాకట్ట మైతిమి వసుధ పాములకు
మందుల విలువలు మాకేడ గలవు
మందులు తేలేము మాకు తేలేము
ఇలా అనేక సామెతలు జాతీయాలతో గూడిన సంభాషణలు వర్ణనలు హృదయంగమంగా వుంటాయి. వ్యాసంగా కాక అభిప్రాయంగా వ్రాసే దీనిలో ఇంత కన్న ఎక్కువ వ్రాయటం భావ్యం గాదు. నా కలవి కాదు కూడా.
ఇప్పుడు ఈ గ్రంధాన్ని చదివి మీరు వ్యాసం వ్రాయగలరని భావిస్తాను.
మంచి ఉచ్చ స్థాయిలో ఉంది పద్యం. “మొండి గోడల” కేసులో రాముణ్ణి నిలబెట్టి కడిగేయడం బాగుంది. అదే జిహాదీ కేసులనుకోండి, అక్కడ “ఉగ్రవాదులకి మతం లేదు”. ఇంకో వింత ఏమిటంటే విమర్శకులు ఇసుమంటి బోడి పద్యాల్లో “కవిత్వ ధార” నే ఆనందిస్తారు. విషయం జోలికి పోకుండా. బాగుంది ట్రెండు.
రమ భరద్వాజ గారూ,
మీరు ఇదివరకు (మార్చ్ 14) “నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు,” అన్నారు. ఇప్పుడు “.శ్రీశ్రీ..కాళీపట్నం… వారి సృజన అర్ధాంతరంగా ఆగిపోయిన పాపం మాత్రం తప్పకుండా విరసానిదే!! ” అంటున్నారు.
విరసంతో సంబంధం లేని రచయితలు కూడా తొందరగా విషయానికి వద్దాం అనే ఆరాటంలో కథల పేరుతో వ్యాసాలు రాస్తున్నారు. విరసం పుట్టక ముందే సంఘ సంస్కరణ పేరుతో, స్వాతంత్ర పోరాటం పేరుతో ఎన్నోఉపన్యాసాల్లాంటి కథలొచ్చాయి. ప్రస్తుతానికి కొంచెం ఓపిక పెరగటం, పీర్ రివ్యూ ను విస్తృతంగా ఆచరణలోకి తీసుకురావటం – ఇలాంటివి ముఖ్యంగాని, రచయితలు విరసం సభ్యులా కాదా, ఇందులో విరసం బాధ్యత ఎంత – ఇవి పక్కమార్గం పట్టించే చర్చలేగాని ఉపయోగకరమైనవి కాదని నా అభిప్రాయం.
సంస్కృతంలో ప్రార్ధనలు ఏం బాగుంటాయీ!? ఎందరికి అర్ధం అవుతాయీ!? ఓ ప్రభువా!! మేము నీకు మేల్కొలుపులు..అనగా సుప్రభాతం ఈ విధంగా జరిపింతుము. అంత పొద్దుటే మేము లేవలేము.నిన్ను లేపలేము. గాన[ఇది మరీ classic telugu అవుతుందేమో?]..కాబట్టీ..[ఇక్కడ మళ్ళీ మాండలికం సమ స్య రావొచ్చునేమో?!]..ఏదైనా..సరే..ఓ ప్రభువా!! నీవే మా కాపరివి!నీ బిడ్డలైన మమ్ములను ఆశీర్వదింపుము… ఈ దేవ భాషలో దేవుడవైన నిన్ను మేము మరి స్తుతి చేయలేము. మాకు భాషా స్వాతంత్రం రావలెను. మా ప్రార్ధనలకోసం..ఈ పూజారి వర్గం {ఇది so feudal u know ]..మాకిక వద్దు.
కానీ electoral reforms తేడానికే [ఓట్లు పోతాయని జంకే మా ప్రభుత్వం]..ఇలా మత పరమైన రిఫార్ములు తెచ్చునా? అన్న ది కోటి డాలర్ల ప్రశ్న..అది అటుంచిననూ..మా అర్జీలనైననూ తెనుగున చదవని ప్రభుత్వం మీద మాకు ఆశ లేనందుననే.”.ఈమాట” వారి ద్వారా నీకు ఇలా ఒక అర్జీ పెట్టుకొను చున్నాము. ఒక నాటికి మా కల నెరవేరును గాక ! వేలూరి వేంకటేశ్వర రావు పంతులు[వీరేశలింగం పంతులు లాగా అని నీవు గ్రహించగలవు.]…ఈ ప్రార్ధనా విషయమై ఇహ తెనుగుజాతిని జాగృతము చేయవలయును. ఇంక ఈ భూమిపై సంస్కృతము ఆవిరైపోవును గాక[ఇప్పుడు మాత్రం ఉండి ఏడ్చింది గనకనా!?]…తెనుగులోనే నుడులు జరుగుగాక[ ఏ తెలుగు!?? తెలంగాణమా..రాయల్సీమా?/ఉత్త్రాంధ్రా??కోస్తాంధ్రా//..కేసిఆర్ ..నారా నాయుడు ఎర్రన్నాయుడూ..లగడ్పాటి..రాజశేఖరుడూ..ముందు తేల్చినాక..నీకిష్టమైన నానా తెనుగులోనీ..[ఈ” దోపిడీ పూజారి” వర్గమును తప్పించి..వారికెటూ ఓటు బ్యాంకు లేదు గన్క..మా పని మరింత సులువు. ఆదాయంలేని వృత్తి గన్క వారునూ వేద మంత్రములును వచన కవితల వలే వల్లించు భారమును మాపై పెట్టి తప్పుకొనుటకు..సిద్దంగా ఉన్నారు.]..ఒక్క నువ్వు ఒప్పుకొనిన్ చాలును. ప్రభువా!! ఇహ నీ దయ..ఈమాట సంపాదకుల చలవాను.
బాబ్జీలు గారూ!! మీ చురుకుంది చూసారూ..భలే సర్దా లెండి. యుగంధరులే కాదు..తిమ్మరుసులూ ఉన్నారని చెప్పిన ట్టుంటుంది. “వరద” అంటే అబ్బూరి వరద అని చెప్పండి. అప్సరుడు[absurd], అన్న pun ఆ తిక్క..ఆయనవే!! ;))
రవికిరణ్ గారూ!! మీ చాలా అభిప్రాయాలు ఒప్పుకోవలసినవే!! రచయితల సృజన కి సంబంధించినంత వరకూ మీ ఉద్దేశ్యంలో సబబు ఉంది. కానీ అందరూ ఈ పరిస్థితి లోకి తప్పనిసరిగా రావాలనేం లేదు. రచయితకి వ్యక్తీకరణ స్వేచ్చ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో..వారు బ హుశా మరికొంత పదును కలిగి ఉండే వీలుంది రచనాపరంగా!! అలాంటి స్వాతంత్ర్యం తప్పనిసరిగా వారు కోల్పోవలసిందే.. రాజకీయ పరమైన విధివిధానాల్లో బందీ అయ్యాక. మంచి పద్యం..మంచి గేయం..శ్రీశ్రీ రచనకి బలం. అదే వచన కవిత..ఇంకా యాస లో రాయడం శ్రీశ్రీ కి రాదు. కానీ విరసం భావజాలం కారణంగా..శ్రీశ్రీ ఈ గేయ కవితాప్రక్రియలు బూర్జువా వ్యక్తీకరణలని చెప్పి..వీటిని వదిలేసి “జట్కావాలా” లాంటివి రాసే ప్రయత్నంచేసి విరసాన్ని మెప్పించబోయాడు. ఇటువంటివాటి వల్ల విరసానికి ఒన గూరిన మేలు ఏమిటో నాకైతే తెలీదు గానీ..సాహిత్యం విషయానికి వస్తే మాత్రం తప్పకుండా లోటే!! వంగపండు ప్రసాదరావు రాసినట్టో..ఒక గద్దర్ రాసినట్టో..రాయడం..శ్రీశ్రీ వల్ల కాలేదు. ఇలా శ్రీశ్రీ తన శైలికి తానే దూరమై..ఆగిపోయేడు. సృజన అన్న అనుభవం..స్వేచ్చగా జరగాలి. విరసంలో రచయితలకి స్వేచ్చ సున్నా!! ఇలా కాకపోయివుంటే..శ్రీశ్రీ..కాళీపట్నం..మరికొన్ని రాయగలిగి ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళు ఆగిపోయివుంటే అది వేరేమాట. కానీ వారి సృజన అర్ధాంతరంగా ఆగిపోయిన పాపం మాత్రం తప్పకుండా విరసానిదే!! అలాగే ఇప్పటికీ ఒక మూస ధోరణిలో విరసం రూపొందించిన చట్రం..దాని పరిభాష దాటలేని పరిస్థితి ఇంకా..”ఇంగువ కట్టిన గుడ్డ” లా..తెలుగు సాహిత్యరంగంలో విరాజిల్లుతున్నాదే!! ఇందువల్ల ఒక మొనాటనీ..తెలుగు కవితల్లోనూ..కధల్లోనూ అలాగే నిలిచిఉంది. అది మరి చిన్న నష్టమా??
వేలూరి గారు,
“విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం.”
మీరు చెప్పింది చాలా బాగుంది. ఇది ఒక్క పుస్తకాలకు సంబందించేదే కాదు. మన దేవాలయాల సంగతేమి? అక్కడ ప్రార్దనలన్ని సంస్కృతములోనే. దాని గురించి ఈమాట లో చర్చ జరగడం లేదు. అక్కడ పనిచేసే పూజారులు, దేవాలయాలు తమ స్వంతం, ప్రజలకు అర్దంకాకున్న సంస్కృతంలోనే పూజలు చేస్తారు. మన సమాజంలో మార్పు రావాలంటె మన ప్రార్దనలు తెలుగులొకి అనువాదం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చి 62 సంవత్సరాలు గడిచినా మన గుడులలో తెలుగు ప్రార్దనలు లేకపోవడం మన దురదృష్టం. ఆలోచించండి!!
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/23/2009 8:02 am
యుగంధర్ గారూ,
త్యాగరాజు కృతుల్లో పల్లవికీ, అనుపల్లవికీ మీరు చెప్పిన ప్రాస నియమాలు గమనించాను. ప్రతీ చరణానికీ ఒక్కో అక్షరప్రాస ఉన్నదీ తెలుసు. చరణాల్లో ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు పాడడం అనేదొక పద్ధతి మాత్రమే! దాన్ననుసరించి చరణం్ పాదాన్ని నిర్ణయించరని అనుకుంటున్నాను. అలాగే పాడే కాలన్ని బట్టీ ఇది వుండదు. “నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది.” అని మీరు రాసారు. ఉదాహరణకి, మీరు చెప్పిన ఎందరో మహాను భావులు కృతిలో కొన్ని చరణాలు తీసుకోండి. అందులో మీరు చెప్పిన సూత్రాలూ, ప్రాస నియమాలూ ఎలా అమలయ్యాయో చెప్పండి? నాకు తెలీకపోతే తెలుసుకుంటాను. మీ కోసం ఎందరో మహానుభావులు కృతిలో కొన్ని చరణాలు తాళ ఆవృత్తాన్ని బట్టి ఎలా వుదో అలాగే ఇక్కడిస్తున్నాను.
1. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమార్గ
2. ముతోను పాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు తెలియు వా(రెందరో)
1. హరి గుణ మణి-మయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో
2. తెలివితో చెలిమితో కరుణ కల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా(రెందరో)
1. హొయలు మీర నడలు కల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీ
2. రులై- ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము కల వా(రెందరో)
1. పరమ భాగవత మౌని వర శశి విభా-కర సనక సనందన
2. దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
3. పవన సూను బాల చంద్ర ధర శుక సరోజ భవ భూ-సుర వరులు
4. పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక(యెందరో)
1. నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధై
2. ర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ
3. సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీ మది-
4. నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము సేయు వా(రెందరో)
1. భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు
2. మర్మములను శివాది షణ్మతముల గూఢములను ముప్పది ముక్కో
3. టి సురాంతరంగముల భావంబుల- నెరింగి భావ రాగ లయాది సౌఖ్య
4. ముచే చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వా(రెందరో)
త్యాగరాజు చందస్సు నియమాలని అంతగా పట్టించుకోలేదని నేనన్న మాటలు కావు. సంగీత సాహిత్యాల్లో దిట్టయిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారూ రాసిన వ్యాస పరంపరలో ఇవన్నీ చెప్పారు. అందులో కొన్ని ఈ వ్యాసంలో యథాతధంగా సూచించాను. త్యాగరాజు వాడిన కొన్ని వాక్యప్రయోగాలూ, సంస్కృత సమాసాలూ పేలవంగా ఉన్నాయని రాళ్ళపల్లి వారు చెప్పారు. శిష్యులు సరిగా రాసుండకపోయే అవకాశముందని అన్నా, కొన్ని వాక్యదోషాలు పునరావృత్తమయ్యాయని అభిప్రాయపడ్డారు.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
03/23/2009 7:39 am
కుడి ఎడమ కులాలు
“ఎడమ చేతి కులాలూ..కుడిచేతి కులాలూ అన్న విభజన ఎ.కె.రామానుజన్ తమిళ సమాజంలో ఉన్న ట్టు చెప్పారు. అటువంటి విభజన ఏదీ తెలుగు సమాజంలో ఉన్న ట్టు కన్పించదు.” అన్నారు రమ గారు.
నిన్ననే చదివిన ఆరుద్ర గారి వేమన ఉపన్యాసాలలో ఈ కుడి ఎడమల ప్రస్తావన చూశాను:
“వస్తూత్పత్తి చేసే వాళ్ళూ, వ్యాపారాలు చేసే వాళ్ళూ, వాటికి సంబంధించిన వ్యాపకాల వాళ్ళూ స్వలాభాలను సంరక్షించుకోవాలంటే కలిసికట్టుగా ఉండాలి. ఆర్థిక కారణాల వల్ల గ్రామాలలోని వివిధ వృత్తుల వాళ్ళు ఎడమ చేతి కులాలుగా కుడి చేతి కులాలుగా చీలారు” (మన వేమన అనే పుస్తకంలో ‘సామాజిక జీవనం – విశ్లేషణ’ అనే వ్యాసం).
పై పేరాగ్రాఫు తరువాత, ఓ తొమ్మిది ఎడమ చేతి కులాలనీ, ఓ 16 కుడిచేతి కులాలనీ పేర్కొని, ఇంకో 89 కులాలు ఎడమచేతి వర్గంలో చేరేందుకు ఒప్పందం చేసుకున్నాయనీ, ఒక కులంలో రెండు వర్గాలు ఉన్నాయనీ, మరి కొందరు తటస్థంగా ఉండేవారనీ పేర్కొన్నారు. ఈ వివరాలకు ఆయన “CS SRINIVASA CHARI: ‘THE ORIGIN OF THE RIGHT AND LEFT HAND CASTE DIVISIONS’ Journal of Andhra Historical Research Society Vol-4′ ని ఆకరం్గా చూపించారు.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
03/23/2009 3:59 am
కామేశ్వర రావు గారికి ఇంకా తదితర రసజ్ఞులైన పాఠకులకు –
నేనంతగా చదువుకున్న వాడిని కాదు (యస్ యస్ యల్ సీ) గౌరన గారిని గురించి వ్రాసే అంత పాండిత్యం వున్నవాడినీ కాదు. సాహిత్య ఎకాడెమీ వారి పుస్తకంలో వారు చూపించినంత వరకు మాత్రమే ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పుస్తకం కూద నా దగ్గర ఇప్పుడుపలబ్దం కాదు. ఐనా నా స్మృత్యనుసారంగా నాకు గొప్ప అనిపించిన గౌరన సంభాషణారూప కవిత్వాన్ని మీముందుంచి ద్విపద సాహిత్యం మీద మీకున్న తక్కువ భావాన్ని దూరం చేయ ప్రయత్నిస్తాను. ద్విపదలో కూదా పోతన, నన్నయ ల వలె మనోరంజకమైన కవిత్వాన్ని వ్రాయవచ్చునని నాకు గౌరనను చదివిన తరువాతనే తెలిసింది.
చంద్రమతిని అమ్మేటప్పుడు పౌరులు
కటకటా యిట్టి వెంగలి రాజు కలడె
మటుమాయ తపసి యే మరులు గొల్పినను
నెమ్మది తను ఏలు నేలకు తోడు
సొమ్ములన్నియు నిల్లు చూరగా నిచ్చి
అమ్మెద కడమకై ఆలి గొండనెడు
తమ్ము మాలిన యట్టి ధర్మంబు గలదె?
చదువులు విని మీద జరుగు సౌఖ్యంబు
మది నమ్మి బ్రతుకు బ్రాహ్మణునకు నిచ్చె
పనుపడి మొయిలులోపలి నీళ్ళు నమ్మి
దొన నీళ్ళు చల్లు వేదురుడెందు గలడు?
కరి రొంపి దిగబడ్డ కమ్మరి నెత్త
కరి యోపుగాక సూకరమెట్టు లోపు?
ధర నింత వాని దుర్దశ నివారింప
నరులోపుదురె విశ్వనాధుండు దక్క
నక్షత్రకుడు హరిశ్చంద్రుడితో
నలినాప్త కులనాధ! నా తోడ నీవు
పలికిన మాటల పధ్ధతి తప్పె
మునినాధునకు నీవు మునుకొన్న యట్టి
ధనమిచ్చువానికి దాసుని గాగ
గొనిపోయి నిన్నమ్ముకొమ్మంటి గాని
వినుత సత్కులజుని వెదకి యిమ్మనవు
వీని కులంబేల? వీని సొంపేల?
వీని గుణంబేల? వీని పెంపేల?
మాలడైనను నేమి? మరి బ్రాహ్మడేమి?
తోలు గప్పిన నేమి? తులువైన నేమి?
గంజాయి దినెనేమి? కలుద్రావెనేమి?
నంజక ధనమిచ్చు నతడె నా మెచ్చు.
కోరిన ధనమిచ్చి కొనరండటంచు
వూరక మొర వెట్టు చుంట నా పాలు
వారక నిను గొన వచ్చిన వారి
తో రాయిడించి పో ద్రోల నీ పాలె?
నిను నేడు మొగమున నెత్తురు బామి
కొని గుల్ల పరుపక కొలికికి రావు
కాల కౌశికుడు హరిశ్చంద్రుడితో
కసవు కట్టెలు మోయ కాయ పండ్లమ్మ
పసుల జంగిలి గాయ పాలేరు దున్న
కొరమాలి మ్రుచ్చుల గూడి దూరమున
చెరవట్టి దెచ్చిన చెలువ నాలనుచు
మొరగి ఈ రీతి నమ్ముట మాకు దోచె
ఎరిగిరే తలవరు లిప్పుడే పట్టి
కొరత వేయుదు రోరి కోమలి విడచి
పరచి నీ ప్రాణముల్ బ్రతికించు కొనుము
కాదేని వరవుడు గా ధార పోసి
మోదంబు తోడ నీ ముదిత మా కొసగు
ఎనయంగ నీ తప్పులేము వహించి
కొని కాచెదము బ్రహ్మ కొడుకు వచ్చినను
దానికి హరిశ్చంద్రుడు
దారుణ కరవాల ధారాహతారి
వీర మాణిక్య నవీన కోటీర
శస్తమైనట్టి ఈ క్షత్రియోత్తముని
హస్తమే రీతిని నలవడు కృషికి ?
మరి బ్రాహ్మణుడు వచ్చి మరుగు జొచ్చినను
దరమిడి రక్షింప దగుగాక మాకు
పరభయంబున నిట్లు బరగ నీ మరుగు
చొరబార నగునె? ఈ చొప్పైన మాకు
బాణాసనంబేల? బాణంబులేల?
ప్ర్రాణంబులేల? కృపాణంబులేల?
భేతాళుడు హరిశ్చంద్రుడితో
దేవతలకునైన దృష్టింప రాని
నా వటమూలంబునకు వచ్చుటెట్లు?
వచ్చి పోనీక కావలి భూతములకు
చెచ్చెర ముక్కులు చెక్కుట యెట్లు?
చెక్కి యంతట పోక చేరి నా యెదుట
పెక్కులు పేలి దర్పించుట యెట్లు?
గడగి మహమ్మారి కడుపు పొట్టేలు
వడిచొచ్చి వాలిన వడువున నీవు….
కాలకౌశికుడి భార్య చంద్రమతితో
కట్టెలు దెమ్మన ఘన భుజంగముల
పుట్టలెక్కగ నేల పోయె నీ కొడుకు?
చేకొని యిది మేము చేసిన తప్పె?
వాకట్ట మైతిమి వసుధ పాములకు
మందుల విలువలు మాకేడ గలవు
మందులు తేలేము మాకు తేలేము
చంద్రమతీ దేవి వర్ణన
సుందరి గాదిది, సొబగు రాయంచ
అంచగాదిది, నడపారు క్రొమ్మించు
మించుగాదిది, రాచ మెచ్చుల ప్రతిమ
ప్రతిమ గాదిది, పచ్చి పగడంపు లతిక
లతిక గాదిది, నవ లావణ్య సరసి
సరసి గాదిది, పుష్ప చాపుని శరము
శరము గాదిది, రతి సవరించు చిలుక
చిలుక గాదిది, వికసించు చెంగలువ
కలువ గాదిది, చంద్రకళ వంటి చెలువ
కంతు సంకుకు బొమ్మ గట్టిన గళము
అనటి కంబముల గయ్యాళించు తొడలు
ఆమె ఏడ్పు : మెరుగు ముత్యముల మ్రింగు మీనమ్ము
లరుగక వెసగ్రక్కు నట్టీ చందమున
పలుమారు గ్రమ్మెడి భాష్ప బిందువుల తో…..
నేలను పుడుకుచు నిగిడిన వగల
వాలు గన్నుల నీరు వరదలై పార
వశిష్ట విశ్వామిత్ర సంవాదంలో వశిష్టుడు
రంతుగా నాబోతు రంకె వైచినను
గంతులు దక్కునే కంఠీరవంబు?
కల్ల జంఝాటంబు కౌశిక యిచట
చెల్లదు సుమ్ము వశిష్టుడుండంగ
స్ఫుట రోష శేషాహి ఫూత్కార ఘోర
చటుల విషానల జ్వాలల కంటె
కుపిత కౌశిక మహా కుటిల కఠోర
విపుల శాపాగ్నుల వేడిమి ఘనము
ఇలా అనేక సామెతలు జాతీయాలతో గూడిన సంభాషణలు వర్ణనలు హృదయంగమంగా వుంటాయి. వ్యాసంగా కాక అభిప్రాయంగా వ్రాసే దీనిలో ఇంత కన్న ఎక్కువ వ్రాయటం భావ్యం గాదు. నా కలవి కాదు కూడా.
ఇప్పుడు ఈ గ్రంధాన్ని చదివి మీరు వ్యాసం వ్రాయగలరని భావిస్తాను.
బోడి పద్యం గురించి vineet గారి అభిప్రాయం:
03/22/2009 7:49 pm
మంచి ఉచ్చ స్థాయిలో ఉంది పద్యం. “మొండి గోడల” కేసులో రాముణ్ణి నిలబెట్టి కడిగేయడం బాగుంది. అదే జిహాదీ కేసులనుకోండి, అక్కడ “ఉగ్రవాదులకి మతం లేదు”. ఇంకో వింత ఏమిటంటే విమర్శకులు ఇసుమంటి బోడి పద్యాల్లో “కవిత్వ ధార” నే ఆనందిస్తారు. విషయం జోలికి పోకుండా. బాగుంది ట్రెండు.
భ్రంశధార గురించి విభు గారి అభిప్రాయం:
03/22/2009 10:56 am
కనకప్రసాద్ గారు,
మానససరోవరంలో గురి చూసి విసిరిన గులకరాయి మీ కవిత.
వలయాలతో కలవరం సృష్టిస్తోంది.
లోతు తెలియదు – అలలు ఆగవు.
rich, striking imagery ; unique expression.
Always loved reading your stuff. Thank you.
కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:
03/22/2009 10:17 am
రమ భరద్వాజ గారూ,
మీరు ఇదివరకు (మార్చ్ 14) “నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు,” అన్నారు. ఇప్పుడు “.శ్రీశ్రీ..కాళీపట్నం… వారి సృజన అర్ధాంతరంగా ఆగిపోయిన పాపం మాత్రం తప్పకుండా విరసానిదే!! ” అంటున్నారు.
విరసంతో సంబంధం లేని రచయితలు కూడా తొందరగా విషయానికి వద్దాం అనే ఆరాటంలో కథల పేరుతో వ్యాసాలు రాస్తున్నారు. విరసం పుట్టక ముందే సంఘ సంస్కరణ పేరుతో, స్వాతంత్ర పోరాటం పేరుతో ఎన్నోఉపన్యాసాల్లాంటి కథలొచ్చాయి. ప్రస్తుతానికి కొంచెం ఓపిక పెరగటం, పీర్ రివ్యూ ను విస్తృతంగా ఆచరణలోకి తీసుకురావటం – ఇలాంటివి ముఖ్యంగాని, రచయితలు విరసం సభ్యులా కాదా, ఇందులో విరసం బాధ్యత ఎంత – ఇవి పక్కమార్గం పట్టించే చర్చలేగాని ఉపయోగకరమైనవి కాదని నా అభిప్రాయం.
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/22/2009 10:14 am
ఔనండీ కాకులవరం గారూ!!
సంస్కృతంలో ప్రార్ధనలు ఏం బాగుంటాయీ!? ఎందరికి అర్ధం అవుతాయీ!? ఓ ప్రభువా!! మేము నీకు మేల్కొలుపులు..అనగా సుప్రభాతం ఈ విధంగా జరిపింతుము. అంత పొద్దుటే మేము లేవలేము.నిన్ను లేపలేము. గాన[ఇది మరీ classic telugu అవుతుందేమో?]..కాబట్టీ..[ఇక్కడ మళ్ళీ మాండలికం సమ స్య రావొచ్చునేమో?!]..ఏదైనా..సరే..ఓ ప్రభువా!! నీవే మా కాపరివి!నీ బిడ్డలైన మమ్ములను ఆశీర్వదింపుము… ఈ దేవ భాషలో దేవుడవైన నిన్ను మేము మరి స్తుతి చేయలేము. మాకు భాషా స్వాతంత్రం రావలెను. మా ప్రార్ధనలకోసం..ఈ పూజారి వర్గం {ఇది so feudal u know ]..మాకిక వద్దు.
కానీ electoral reforms తేడానికే [ఓట్లు పోతాయని జంకే మా ప్రభుత్వం]..ఇలా మత పరమైన రిఫార్ములు తెచ్చునా? అన్న ది కోటి డాలర్ల ప్రశ్న..అది అటుంచిననూ..మా అర్జీలనైననూ తెనుగున చదవని ప్రభుత్వం మీద మాకు ఆశ లేనందుననే.”.ఈమాట” వారి ద్వారా నీకు ఇలా ఒక అర్జీ పెట్టుకొను చున్నాము. ఒక నాటికి మా కల నెరవేరును గాక ! వేలూరి వేంకటేశ్వర రావు పంతులు[వీరేశలింగం పంతులు లాగా అని నీవు గ్రహించగలవు.]…ఈ ప్రార్ధనా విషయమై ఇహ తెనుగుజాతిని జాగృతము చేయవలయును. ఇంక ఈ భూమిపై సంస్కృతము ఆవిరైపోవును గాక[ఇప్పుడు మాత్రం ఉండి ఏడ్చింది గనకనా!?]…తెనుగులోనే నుడులు జరుగుగాక[ ఏ తెలుగు!?? తెలంగాణమా..రాయల్సీమా?/ఉత్త్రాంధ్రా??కోస్తాంధ్రా//..కేసిఆర్ ..నారా నాయుడు ఎర్రన్నాయుడూ..లగడ్పాటి..రాజశేఖరుడూ..ముందు తేల్చినాక..నీకిష్టమైన నానా తెనుగులోనీ..[ఈ” దోపిడీ పూజారి” వర్గమును తప్పించి..వారికెటూ ఓటు బ్యాంకు లేదు గన్క..మా పని మరింత సులువు. ఆదాయంలేని వృత్తి గన్క వారునూ వేద మంత్రములును వచన కవితల వలే వల్లించు భారమును మాపై పెట్టి తప్పుకొనుటకు..సిద్దంగా ఉన్నారు.]..ఒక్క నువ్వు ఒప్పుకొనిన్ చాలును. ప్రభువా!! ఇహ నీ దయ..ఈమాట సంపాదకుల చలవాను.
రమ.
బోడి పద్యం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/21/2009 10:16 pm
బాబ్జీలు గారూ!! మీ చురుకుంది చూసారూ..భలే సర్దా లెండి. యుగంధరులే కాదు..తిమ్మరుసులూ ఉన్నారని చెప్పిన ట్టుంటుంది. “వరద” అంటే అబ్బూరి వరద అని చెప్పండి. అప్సరుడు[absurd], అన్న pun ఆ తిక్క..ఆయనవే!! ;))
రమ.
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/21/2009 9:18 pm
రవికిరణ్ గారూ!! మీ చాలా అభిప్రాయాలు ఒప్పుకోవలసినవే!! రచయితల సృజన కి సంబంధించినంత వరకూ మీ ఉద్దేశ్యంలో సబబు ఉంది. కానీ అందరూ ఈ పరిస్థితి లోకి తప్పనిసరిగా రావాలనేం లేదు. రచయితకి వ్యక్తీకరణ స్వేచ్చ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో..వారు బ హుశా మరికొంత పదును కలిగి ఉండే వీలుంది రచనాపరంగా!! అలాంటి స్వాతంత్ర్యం తప్పనిసరిగా వారు కోల్పోవలసిందే.. రాజకీయ పరమైన విధివిధానాల్లో బందీ అయ్యాక. మంచి పద్యం..మంచి గేయం..శ్రీశ్రీ రచనకి బలం. అదే వచన కవిత..ఇంకా యాస లో రాయడం శ్రీశ్రీ కి రాదు. కానీ విరసం భావజాలం కారణంగా..శ్రీశ్రీ ఈ గేయ కవితాప్రక్రియలు బూర్జువా వ్యక్తీకరణలని చెప్పి..వీటిని వదిలేసి “జట్కావాలా” లాంటివి రాసే ప్రయత్నంచేసి విరసాన్ని మెప్పించబోయాడు. ఇటువంటివాటి వల్ల విరసానికి ఒన గూరిన మేలు ఏమిటో నాకైతే తెలీదు గానీ..సాహిత్యం విషయానికి వస్తే మాత్రం తప్పకుండా లోటే!! వంగపండు ప్రసాదరావు రాసినట్టో..ఒక గద్దర్ రాసినట్టో..రాయడం..శ్రీశ్రీ వల్ల కాలేదు. ఇలా శ్రీశ్రీ తన శైలికి తానే దూరమై..ఆగిపోయేడు. సృజన అన్న అనుభవం..స్వేచ్చగా జరగాలి. విరసంలో రచయితలకి స్వేచ్చ సున్నా!! ఇలా కాకపోయివుంటే..శ్రీశ్రీ..కాళీపట్నం..మరికొన్ని రాయగలిగి ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళు ఆగిపోయివుంటే అది వేరేమాట. కానీ వారి సృజన అర్ధాంతరంగా ఆగిపోయిన పాపం మాత్రం తప్పకుండా విరసానిదే!! అలాగే ఇప్పటికీ ఒక మూస ధోరణిలో విరసం రూపొందించిన చట్రం..దాని పరిభాష దాటలేని పరిస్థితి ఇంకా..”ఇంగువ కట్టిన గుడ్డ” లా..తెలుగు సాహిత్యరంగంలో విరాజిల్లుతున్నాదే!! ఇందువల్ల ఒక మొనాటనీ..తెలుగు కవితల్లోనూ..కధల్లోనూ అలాగే నిలిచిఉంది. అది మరి చిన్న నష్టమా??
రమ.
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి మదు కాకులవరం గారి అభిప్రాయం:
03/21/2009 8:00 pm