ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
అనేది ప్రపంచంలో లేదు.
వ్యాసమొక్కటే గాక దానిపై పలువురు పండితుల అభిప్రాయాలు కూడా చాలా హృద్యంగాఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి వ్యాసాలు, వాటిపై అభిప్రాయాలు, చర్చలూ అనంతంగా కొనసాగాలని ఆశిస్తూ
భవదీయుడు
ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
భాషాధివ, శెషాహివ,
భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
దోషాచర, దోషాచర,
దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..
విద్యాసుందరి గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/20/2009 6:53 am
మోహన గారూ,
మీ వ్యాసంలో – “త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది….” అంటూ రాసారు.
ఇది సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే త్యాగరాజు మనవడు ఆయన కంటే ముందే చనిపోయాడు. త్యాగరాజు 1847 లో చనిపోతే, ఈయన మనవడు 1843 ప్రాంతంలో పోయాడు.
ఈమాటలో కామెంట్ చూసేక మరోసారి ఈ వ్యాసం చదివితే ఇది కనిపించింది.
నాకున్న శాస్త్ర పరిజ్ఞానం ఈ వ్యాసం అర్ధం చేసుకోడానికి చాల లేదు. ఖగోళ, రసాయనిక, జీవ శాస్త్రాలలో వున్నంతటి ప్రాధమిక పరిచయం కూడా ఈ రంగంలో లేకపోవడం కారణం. మీరు వ్రాసిన విషయంలో ప్ర్రాధమిక పరిజ్ఞానం సమ్పాదించడానికి ఏమైనా పుస్తకాలు సూచించగలరా?
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
అల్లాష్టకము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/23/2009 1:41 am
ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
అనేది ప్రపంచంలో లేదు.
శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి ఆర్కే గారి అభిప్రాయం:
04/22/2009 10:25 pm
కథ బావుంది. ముగింపు సరియైనదిగా లేదు.అది తప్పు. ఒకరి అవసరాన్ని(భయాన్ని) అడ్డుపెట్టుకుని లాభం పొందడమే ఈ కాలం నీతిగా మారిందా!
నన్నయ హంసగీతికలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/22/2009 1:16 am
వ్యాసమొక్కటే గాక దానిపై పలువురు పండితుల అభిప్రాయాలు కూడా చాలా హృద్యంగాఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి వ్యాసాలు, వాటిపై అభిప్రాయాలు, చర్చలూ అనంతంగా కొనసాగాలని ఆశిస్తూ
భవదీయుడు
సముద్రం గురించి Swapna గారి అభిప్రాయం:
04/21/2009 11:48 am
అంత ధైర్యంగా నిజం చెప్పిన అమ్మాయి చివరికి సముద్రం లోకి దూకడం ఎమిటీ? This story is very depressing and unconvincing.
షష్ఠ్యంతములు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/21/2009 3:29 am
ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
భాషాధివ, శెషాహివ,
భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
దోషాచర, దోషాచర,
దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్
పాపాయిత, కోపాయత
భూపాయిత దనుజ మధన పూజిత మతికిన్
గోపాలన, గోపాలన,
గోపాలన నిబిడ రతికి, గోహిత మతికిన్
కమలాస జనక నాభికి,
కమలన్మోహాంధ తమస కమలాంకునకున్
కమలాలయ, కమలాలయ,
కమలాలయ శయన ధృతికి, కాంతాకృతికిన్
శరణాగత పరిరక్షణ
చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్
నరకాసుర, నరకాసుర,
నరకాసుర బాణహృతికి, నరసారధికిన్
సమధికమైన ప్రతిభ, విద్వత్తు కలిగిన మీ లేఖిని నుండి ఇటువంటి అనేక వ్యాసాలు జాలువారి రసజ్ఞ హృదయాలనలరింపజేయాలని ఆశిస్తూ
భవదీయుడు
అసమర్థులు గురించి Sree గారి అభిప్రాయం:
04/20/2009 11:25 pm
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..
విద్యాసుందరి గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/20/2009 6:53 am
మోహన గారూ,
మీ వ్యాసంలో – “త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది….” అంటూ రాసారు.
ఇది సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే త్యాగరాజు మనవడు ఆయన కంటే ముందే చనిపోయాడు. త్యాగరాజు 1847 లో చనిపోతే, ఈయన మనవడు 1843 ప్రాంతంలో పోయాడు.
ఈమాటలో కామెంట్ చూసేక మరోసారి ఈ వ్యాసం చదివితే ఇది కనిపించింది.
-సాయి బ్రహ్మానందం
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/20/2009 3:32 am
నాకున్న శాస్త్ర పరిజ్ఞానం ఈ వ్యాసం అర్ధం చేసుకోడానికి చాల లేదు. ఖగోళ, రసాయనిక, జీవ శాస్త్రాలలో వున్నంతటి ప్రాధమిక పరిచయం కూడా ఈ రంగంలో లేకపోవడం కారణం. మీరు వ్రాసిన విషయంలో ప్ర్రాధమిక పరిజ్ఞానం సమ్పాదించడానికి ఏమైనా పుస్తకాలు సూచించగలరా?
విద్యాసుందరి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/20/2009 2:50 am
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/20/2009 1:37 am
లైలా గారికి
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్