Comment navigation


15815

« 1 ... 1243 1244 1245 1246 1247 ... 1582 »

  1. కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/15/2009 5:19 am

    ప్రసాద్ గారూ,

    సిద్ధాంతరీత్యా ఏ సంగీతానికైనా ఆధారశ్రుతి ఏమిటో తెలియకపోతే రాగం పేరు చెప్పడం అసాధ్యం. అందుకే భారతీయ సంగీతంలో తంబురావంటిది మోగుతూ ఉంటుంది. లేకపోతే హిందోళం పాడుతున్నప్పుడు మోహన, శుద్ధసావేరి, మధ్యమావతి, శుద్ధధన్యాసి రాగాల్లో ఏదైనా అనుకుని పొరబడే అవకాశం ఉంటుంది. నల్లమెట్లనే ఉపయోగించి ఈ అయిదింటినీ వినిపించవచ్చని నేను వ్యాసంలో సూచించాను. సిద్ధాంతరీత్యా అని ఎందుకన్నానంటే ఇవన్నీ ప్రసిద్ధరాగాలు కనక స్వరాలమధ్యనున్న సంబంధాలను బట్టి శ్రుతి మోగకపోయినా వాటిని గుర్తుపట్టగలం కనక.
    సెహెరా సినిమాలో లతా పాడిన పంఖ్ హోతే తో ఉడ్ ఆతీరే అనే పాట విషయంలో సరిగ్గా ఇదే అనుమానం వస్తుంది. తుహే దిల్ కా దాగ్ దిఖ్ లాతీరే అని అంటున్నప్పుడు చివరి స్వరం షడ్జమం అని సంగీత దర్శకుడి ఉద్దేశం కాబోలు. అది ధైవతం అని మనం అనుకుంటే హిందోళం అవుతుంది.
    దేన్నైనా వాయిస్తున్నప్పుడు ఆధారశ్రుతి (షడ్జమం) ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఆ తరవాత రాగం పేరు చెప్పడం తేలికే. మీరు జి (అయిదు శ్రుతి) ఆధారశ్రుతిగా నేర్చుకున్నట్టున్నారు. అది స్త్రీల గాత్రానికి పనికొస్తుంది; మగవారికి కాదు.
    స అనేది ఫ్లోటింగ్ స్వరం. రాగాలన్నీ సరిగమల మీద ఆధారపడతాయి; శ్రుతిమీద కాదు. ఒకే రకం భవనాన్ని పల్లంలోనూ, మిట్టమీదా నిర్మించినట్టు ఒకే రాగాన్ని ఏ శ్రుతిలోనైనా వినిపించవచ్చు. తమాషా ఏమిటంటే రాగాలను గుర్తుపట్టేవారు స్వరాల తరవాత గమనించేది వాటిమధ్య గల గమకాలనూ, సంబంధాలనే. Characteristicగా ఉండేవి అవే.

  2. కీబోర్డ్ మీద రాగాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/15/2009 2:57 am

    రోహిణీ ప్రసాద్ గారికి

    ఎప్పుడో 2007 లో వ్రాసిన మీ వ్యాసం మీద నా సందేహం మిమ్మల్ని చేరుతుందో లేదో తెలియదు. ఐనా మీరు గానీ లేక సంగీతజ్ఞులైన పాఠకులెవరైనా నా సందేహం తీర్చగలరేమోనన్న ఆశతో వ్రాస్తున్నాను.
    మేము హార్మోనియం నేర్చుకొనేటప్పుడు G, Gs, B, C, D, Ds, F అని మీరు చూపించిన మెట్లను స,రి,గ,మ,ప,ద,ని లుగా (మాయా మాళవ గౌళ రాగం అనుకుంటా) అభ్యసించాము. శాస్త్రీయ సంగీత సాధన వర్ణాల దగ్గరే ఆగిపోయినా, సాధన కొనసాగించి ఏ పాటనైనా స్వల్ప యత్నంతో 5-6 ఇంస్ట్రుమెంట్స్ మీద వాయించగల సామర్ధ్యం సంపాదించాము. ఏ పాటకైనా ఇతరులకోసం స్వరం కట్టి ఇచ్చేటప్పుడు పైన చెప్పిన మెట్ల ప్రకారం ఇచ్చేవారము. ఉదా: పగలే వెన్నెల – సమమా గామమా, గమమా గాససా. ఇతి ఈ శృతి లో సరి ఐనా వేరే శృతిలో వాయించి స్వరపరచినప్పుడు మా లెక్క ప్రకారం షడ్జం ధైవతంగానో నిషాదంగానో మార్పూ చెందుతుంది. అసలు ఒక శబ్దాన్ని షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాదాలుగా ఎలా గుర్తిస్తారు? మీరు చెప్పిన దాని ప్రకారం సావేరి లో మధ్యమం ధన్యాసిలో గాంధరంగా, మోహనలో షడ్జంగా, మధ్యమావతిలో నిషాదంగా ఔతుందిగదా. అసలు రాగాలను గుర్తించడం ఎలా? ఈ సందేహాలకు సరళంగా మాకు గ్రాహ్యం అయ్యే లాగ వివరించడానికి వీలుంటే తెలుపవలసినది. లేదా దానికి మా అవగాహనా శక్తి పెంచుకోడానికి చేయాలిసిన అభ్యాసం/అధ్యయనం వివరించవలసినది.

  3. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Astro Master గారి అభిప్రాయం:

    05/15/2009 1:50 am

    First of all, I am totally impressed by this article. Got up at 2.30AM and a friend sent me this link. I am pleasantly surprised. Let me introduce myself, I am a reputed astrologer who practices astrology and ‘tries’ to help people, free of charge. Have been reputed across several countries and got recognition. I think that is enough.

    1. Naagamurali garu, most interesting thing is that I know the astrologer you are talking about. I was also around 16 when I met him and I was close to him too, of course I did not join there. I went there several times and saw him predict ‘well’ and heard the eloquent sanskrit slokas.
    2. In the last twenty years I was thinking exactly on the same lines as you about THAT person in Konaseema. I clearly knew all the aspects of HIS astrology. I am really thrilled to see someone else agree with my thinking.
    3. I was totally inspired by him, irrespective of his flaws, astrology has drawn tremendous interest. I started watching closely and he never taught any secrets of his Nadi, but I got the essence of his success and as we know its Prasna blended at times with KP.
    4. I went further and inspired more by meeting Dr.Shrimali and found my own discoveries and techniques. Unfortunately, the vichitra vyakti you mentioned once in a while I met but was unhappy to see him become addicted to drinking and talking insane with ego etc. The thankfulness has been there for inspiring me into this study which I enjoy the most. He indeed got some secrets of nature and knows certainly the impacts of Shakuna, the science of omens. As you said the Nadis are totally false. The difference is that the Nadis I saw have Sandhya vandanam instead of Namakam in my case. We went through same experiences. Happy to know someone else saw those.
    5. The indepth study of the subject reveals existence of an omnipresent energy beyond our general understanding yet which signs quietly into this universe.
    Thanks again for making me inspired to write at morning 3AM.

  4. రెండో పాత్ర గురించి rajeswari poluri గారి అభిప్రాయం:

    05/15/2009 1:31 am

    కవిత ప్రతి తల్లి అనుభవాలకు, మనొభావాలకూ అద్దము లాగ ఉన్నది.

  5. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/14/2009 11:51 pm

    శ్రీనివాస్ గారికి
    దశ సహస్ర శత కోటి ధన్యవాదాలు. ఆర్కైవ్ ఆర్గ్ లోపుస్తకాలు లభిస్తున్నాయి నా కిష్టమైన “శనిగ్రహం” పద్యాలు చదివాను. కానీ “నానా రాజ సందర్శనం” “ఇక్కడ” (మీరు పొందుపరచిన లింకులో) దొరకలేదు. తగిన కంప్యుటర్ పరిజ్ఞానం లేకపోవడమే కారణం. త్వరలో సాధించగలననుకొంటాను. లేదా డీ ఎల్ ఐ వారి సైట్ అడ్రస్ ద్వారా చిక్కించుకుంటాను.

    మరొక్కసారి ధన్యవాదాలతో

    భవదీయుడు

    [శ్రీనివాస్ గారికి “పన్ను” నొప్పి రాకుండా ఒక సహస్ర శత కోటి తగ్గిస్తే బాగుంటుందేమో 🙂 ]

  6. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    05/14/2009 9:48 am

    ప్రసాద్-గారు,

    నానారాజసందర్శనము DLI లో ఇక్కడ దొరుకుతుంది.

    తి.వెం.కవుల పుస్తకాలు కొన్ని ఆర్కైవ్.ఆర్గ్ లో ఉన్నాయి. ఆ వెబ్‌ పేజీలోని అన్ని పుస్తకాలు వాళ్ళవి కావు అని గమనించగలరు.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  7. రెండో పాత్ర గురించి T V KALIDAS గారి అభిప్రాయం:

    05/14/2009 9:13 am

    కవిత తన వెంట చదువరి పాకేలాగా చేసుకుంది. చివరిన పరిమళించింది అని ఉండాలేమో కదా ?

  8. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/13/2009 9:54 pm

    పరుచూరి శ్రీనివాస్ గారికి,
    ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు, సమీక్షలు కొన్ని డిజిటలైజ్ అయి వెబ్ లలో ఉపలభ్యమౌతాయని తెలుసుకుని చాలా ఆనందం కలిగింది. తిరుపతి వేంకట కవుల “నానా రాజ సందర్శనం” అనే పుస్తకం ఎక్కడైనా వెబ్ లో దొరుకుతుందా? దానిని సంపాదించడానికి నేనే విధంగా ప్రయత్నించాలసి వుంటుంది తెలుపగలరు. అలాగే వారికి కొప్పరపు కవులతోనూ, వేంకట పార్వతీశం కవులతోనూ జరిగిన సభా వివాదాల వివరాలను తెలిపే సాహిత్యంగురించి కూడా.

    ధన్యవాదాలతో

    భవదీయుడు

  9. కవిత్వంలో అనూహ్యత గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:

    05/13/2009 4:05 pm

    రవిశంకర్ గారూ, మీరు రెండో పేరాలో చెప్పిన రెండు విధాలుగా మాత్రమే గాక తెలిసిన విషయాన్నే అందంగా చెప్పడం వల్ల కూడా పాఠకుడు ఆనందం పొందుతాడు. దానికి మీరు వ్రాసిన “రెండో పాత్ర” సాక్షి.

  10. రెండో పాత్ర గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:

    05/13/2009 3:54 pm

    కొన్నేళ్ళ క్రితం చదివిన కవిత. ఎప్పటికీ గుర్తు వుంటుంది. అంత అద్భుతంగా వుంది.

« 1 ... 1243 1244 1245 1246 1247 ... 1582 »