Comment navigation


15803

« 1 ... 1200 1201 1202 1203 1204 ... 1581 »

  1. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి raju ponthapilli గారి అభిప్రాయం:

    11/03/2009 4:34 am

    వేటూరి రాసిన పాటల్లో చాలా అమృత గీతాలు వుంటాయి .
    అతని పాటల్లో చాల వరకు సదరు ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేయగలడు.

  2. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Vamsi Mohan గారి అభిప్రాయం:

    11/03/2009 3:02 am

    అద్భుతంగా వున్నాయి. గజేంద్రమోక్షం ఉంటే బాగుంటుంది.

  3. నింగి-నేల గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    11/03/2009 2:18 am

    మంచి కవిత్వం రాసే అతికొద్ది కవుల్లో రవిశంకర్ గారొకరు. ఆయన పేరు చూడగానే మంచి కవిత చదువబోతామన్న ధీమా వస్తుంది. కానీ ఈ కవితలో అగమ్యగోచరమైన ఖాళీ వుంది. అసంపూర్ణమైన పోలికలు కనిపించాయి.

    మోహన రావుగారికొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. ఒక పాదంలో ఇద్దరు వనితలంటూ చెప్పి, చివరి పాదంలో ఇద్దరు ప్రేమికులుగా చెప్పడంతో, నేలా, నింగీ లని స్త్రీ, పురుష ద్వయంగా వర్ణించారేమిటా అని అనుకున్నాను. ( ఇద్దరు స్త్రీలు ప్రేమించుకోకూడదా? అని మాత్రం నన్నడగకండి) పోలికలు గతిభేదం తప్పినట్ట్లుగా అనిపించిది.

  4. డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి జలసూత్రం గారి అభిప్రాయం:

    11/03/2009 1:06 am

    మోహనరావుగారూ – మీరు “తత్ భోజనం తద్రసం” అని ఒకందుకు వ్రాస్తే, వేచి చూస్తూన్న కొంతమందికి ఇంకొకందుకు “తత్ భావం తదర్థం” అయినట్టు కనపడుతోంది. కడుపులో కందిగింజ ఇమడకుండానూ, నోట్లో నువ్వుగింజ నానకుండానూ కామెంటు వ్రాయటమూ ఎంతో విచారకరం. అందులో ఈమాటలో – ఈ కామెంట్లు ప్రచురించబడటం మరింత ఆశ్చర్యం.

    జలసూత్రం విక్రమార్క శాస్త్రి

  5. అమ్మ ఉత్తరం గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:

    11/03/2009 12:40 am

    వుత్తరానికున్న సున్నితత్వాన్ని ఎంత బాగా చెప్పారో ప్రసాద్ గారు ! కుక్కని ‘కుక్క’ అనకూడదనీ (దానికి పేరున్నప్పుడు), పిల్లి చేష్టల్నీ చదువుతున్నప్పుడు నవ్వొచ్చింది. దూరాన్ని తగ్గించడంలో ఫోనుకన్నా, ఈ-మెయిలు కన్నా వుత్తరమే బెస్టు అన్నది నిజమే. – భూషణ్

  6. తెలుగు నిఘంటువు గురించి… గురించి gaddeswarup గారి అభిప్రాయం:

    11/02/2009 5:50 pm

    Some links
    patrika padakosam
    Adhunika Vyavahara Kosam
    gwynn
    brown
    Check also
    Srisodhana
    Telugu Parisodhana has also made many books available online or has links to them
    English-Telugu Dictionary Technical and Scientific by Digavalli Siva Rao partly available at google books

  7. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి రానారె గారి అభిప్రాయం:

    11/02/2009 4:00 pm

    మంచి వ్యాసం. సినిమాపాటప్రయాణంతోపాటు ఒక జీవితసత్యాన్నీ చెప్పినట్టున్నారు రచయితలు. ముగ్గురు కలిసి రాసిన ఇలాంటి పరిశోధనాత్మక వ్యాసాలు మరిన్ని రావాలి.

  8. నింగి-నేల గురించి mOhana గారి అభిప్రాయం:

    11/02/2009 1:20 pm

    నింగీ నేలా వేద కాలంనుండి ప్రేమికులుగానే పరిగణించబడుతున్నారు. నేను దీనిని నన్నయ హంసగీతికలులో కూడా ప్రస్తావించాను. సామాన్యముగా నేల వనిత, నింగి పురుషుడని భావన. ఇందులో మీరు ఇద్దరిని వనితలుగా చిత్రించారు. ఇది ఒక కొత్త ఊహయే! ఇందులో నాకు తెలియని గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా?
    విధేయుడు – మోహన

  9. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    11/02/2009 10:05 am

    అరవయ్యో దశకంలోని బాల్యం గుర్తుకొచ్చింది. అల్లలాడిన చమురుదీపాలు నులకమంచాన్ని విడిచి ఒక్క అరుగుపైచేరి కుంపటి ఎగదోసుకుంటూ, జాగారపు గీతాలను ఆలపించిన గొంతులేవో అస్పష్టంగా వినబడుతున్నాయి.

    అభినందనలు

  10. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    11/02/2009 3:33 am

    అద్బుతమైన దృశ్య చిత్రణ. చాలా గొప్పగా సాగింది.

    చెడ్డ గాలి అన్న పదప్రయోగం నప్పలేదనిపిస్తుంది.

« 1 ... 1200 1201 1202 1203 1204 ... 1581 »