Comment navigation


15807

« 1 ... 1198 1199 1200 1201 1202 ... 1581 »

  1. భావుకుల రచయిత కొ.కు. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/13/2009 7:51 pm

    కొకు ప్రత్యేక సంచికలోని రచనలపై పాఠకుల అభిప్రాయాలు దాదాపు ఏమీ లేకపోటం ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకి, ఈ వ్యాసం “రారా” విమర్శా పటిమకు నిదర్శనం. కురూపి కథను నేనూ చాలా సార్లు చదివినా, ఈ కొత్త కోణంలో కథను చూడటం కథను మళ్ళి చదివేలా చేస్తుంది. దాచి ఉంచుకోవాల్సిన వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించి మంచి పని చేసారు.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి nagaraju గారి అభిప్రాయం:

    11/13/2009 3:43 pm

    ఇందీవరాక్షుని వృత్తాంతం అని మాకు 1998 SSC లో పాఠం ఉండేది. అది మనుచరిత్ర లోనిది ఏమో? అందులో ఒక పద్యం “కలడుల్లోకయశఃపురంథ్రి …” అని.
    ఒక గద్య భాగం కూడా ఉండేది. అది “అని జటిలుండు హుమ్మని కటమ్ములదర ముకుపుటుమ్ములు నటింప గటా గటా కుటిలాత్మా యటమటమ్మున విద్య గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా యని కటకటంబడి కకపాలలోని బూదికేలంగొని యాసురి యగు మాయ మాయయెడం బ్రయోగించి వంచించి యుపహసించితివి గాన నసురవై పిసితంబును వసనంబుగా మెసవి వసుధ వసియింపుమని బసుమంబు సల్ల గుండె కల్లు వడి మునితల్లజు పదవల్లవంబులంబడి ఇట్లంటి
    నా యజ్ఞానముసైచి సంయమివరేణ్యా కావవే రాక్షసుండైయేనెట్లు భరింతువాడ….”
    అంటూ సాగుతుంది.
    అది ఏ ఆశ్వాసం లోనిదో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయమని కోరుతున్నాను.

    ఇట్లు,
    నాగరాజు
    తప్పులు ఏమైనా ఉన్న మన్నించమని కోరిక.

  3. అమ్మ ఉత్తరం గురించి JL గారి అభిప్రాయం:

    11/13/2009 10:02 am

    కధ చాలా బాగా రాసారు.
    “పోస్టుమేన్ చేతికి ఒక ఉత్తరం అందిస్తే ఎంత బాగుంటుందీ!”
    నిజమే!!
    కాని చివరలొ ఈ వాక్యము అవసరమా?
    ” కంప్యూటర్ యుగంలో ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య ఎంత దూరం ఏర్పడుతోందో అర్థమవుతోంది. ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోనూ, ఫోన్లలోనూ సాగవు ఎప్పటికీ. మనసు పంచి రాసుకోలేక పోతే, ఏం సంతోషంగా వుంటుందీ?”

    ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య దూరం ఎలా ఏర్పడుతోందో నాకు అర్దము కాలేదు.
    ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోను ఎందుకు సాగవు?

  4. ముగ్గురు ముసలమ్మలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/12/2009 6:19 pm

    కథ చదివాను. ‘ఈ మాట’ లోని కామెంట్లు చదివాను.
    ఈ కథలో ముగ్గురు ముసలమ్మలతో పాటు, డాక్టరు సునీత కూడా ఒక పాత్రే.
    అరుణా పాణిని – ఈ పై కథను రాసిన రచయిత్రి.
    కథలో పాత్రలన్నీ ఈ రచయిత్రి కల్పితాలే. అన్ని పాత్రల మాటలూ రచయిత్రి రాసినవే.
    మరి,
    ఈ రచయిత్రి డాక్టరు ఐ ఉన్నందున, కథలో ఉన్న డాక్టరు సునీత మాటలు మాత్రం, రచయిత్రి అభిప్రాయాలుగా పాఠకులు తీర్మానించవచ్చునా?
    ఈ కథ ఒక డాక్టరు కాకుండా ఇంకెవరో రాస్తేనో, లేకుంటే 🙂 ఏదో మారు పేరుతో రాస్తేనో, అప్పుడు డాక్టరు సునీత అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు అవుతాయి? పాఠకులు వాటిని ఎవరికి ఆపాదిస్తారు?

    లైలా

  5. పెట్టె బయట గురించి Prassannam Divakarla గారి అభిప్రాయం:

    11/11/2009 5:37 pm

    పొడుపు కధలతొ కథ చాలా బాగ రాసారు. Nice Concepts in the story, Good Job !!

  6. చెట్టు నా ఆదర్శం గురించి raveender గారి అభిప్రాయం:

    11/11/2009 10:00 am

    తరుచాపము వీడిపోయి గురిమరచిన బాణంలా తిరుగాడును పిట్ట.
    –చాలా గొప్ప వాక్యాలు.

  7. ముగ్గురు ముసలమ్మలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/11/2009 7:44 am

    “చావుతో సరియైన సౌఖ్యంబులో తగిలి”..అంటాడు అన్నమయ్య అలాగే…కేన్సర్ తో బాధ పడి పోతున్న దశలో కూడా అంతే చిరునవ్వుతో అంతే శాంతంతో..శ్రీ రమణ మహర్షి ” బాధ లేదా స్వామీ” అని భక్తులు అడిగినప్పుడు ” బాధ శరీరానికి గానీ తనకి కాదు” అని తను తన శరీరం కాదని జవాబు చెప్తారు. వాళ్ళు జ్నానులు.

    “అనాయాస మరణం వినా దైన్యేన జీవనమ్ ” అని ఈ దేశపు ఆర్యోక్తి!! అయితే ఇది ఒక ఆదర్శమే గానీ ఇందుకు ప్రాణులు అన్నిసార్లూ అనేక కారణాల వల్ల చాలరు.ఎన్నో కోరికల్లాగే ఈ కోరికా అందరికీ తీరేది కాదు.అందు వల్ల మృత్యువుని గురించి బయటివాళ్ళు చెప్పడం, మంచి చావు ఇలా ఉంతుంది అని చావుని నిర్వచించటం హాస్యాస్పదమే కాదు..అన్యాయమ్ కూడా!ఇది ఒక తరహా వివక్ష. ageism అంటారు.

    ageism అన్నదాన్ని racism అంత తీవ్రంగానూ చూడాల్సిందే!! చావు ఉంటుంది. అంతే గానీ అది “హుందా” అయిన చావా?? దిక్కుమాలిన చావా?/ అన్ని ఇన్నిరకాలుండవు. kinship వల్ల ఇలాంటి బాధలూ..ఇలాంటి భావనలూ.. మనుష్యులకుంటాయేమో గానీ సృష్టి లోని ఏ ఇతర ప్రాణులకీ ఉండవు.

    అది స్వచ్చంద మరణమైతే తప్ప ఈ పధ్ధతి లో చావాలని ఎవరైనా అనుకుంటే తప్ప..మృత్యువు ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో తెలిసిన వాళ్ళు లేరు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో దరిచేరేదీ డాక్టర్ లతో సహా చెప్పగలిగినవాళ్ళు లేరు.ఏవో కొన్ని వేదాంతాలు ఆ క్షణానికి వల్లించుకోవడం తప్పితే అందులో ఏ సత్యమూ గోచరించదు.

    చావుని వీలైనంత దూరం పెట్టడం ఆధునిక వైద్యం వల్ల ఎంతో కొంత మనిషికి సాద్యమైంది గనక గానీ… అదే అడవిలో ఎలుగు, ఆకాశంలో ఎగిరే పక్షి ,ఎలా చావుని స్వీకరిస్తున్నాయో చూసిందెవరూ?? చావు అన్నది ఎవరికైనా ఒకటే కదా!!

    ఈ కధ వల్ల “మరణాన్ని” చూడటంలో డాక్టర్ లలో కూడా అసహనాలుంటాయని తెలుస్తోంది.. కానీ వృత్తి ధర్మంగా చావుని “హుందా” చావు గానూ.. నానా చావు గానూ..వర్గీ కరించడం ఒక డాక్టర్ పాత్ర అలా భావించడం మాత్రం ఆశ్చర్యమే! విషాదమే!! రవికిరణ్ గొంతులో కోపం ఉందేమో గానీ ఆయన మాటల్లో మాత్రం నిజం కన్పిస్తోంది. ధర్మాగ్రహం అది! సదుపాయాలు ఉన్నాయి కదా అని అనవసరంగా బతుకుని పొడిగించుకోకండీ..చక్కగా మా తాతయ్య లాగా అలవోకగా అందరికీ ఆదర్శంగా “శివశివా!!” అనుకుంటూ చప్పున చావండీ !!అని దాక్టర్ సునీత ఇస్తున్న సందేశం ఈ కధలో సుస్పస్టం!! అరుణాపాణిని గారి ఈ సందేశం ఎంతమందికి ఒప్పుదలగా ఉంటుందో మరి??

    రమ.

  8. సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి గురించి Sita గారి అభిప్రాయం:

    11/11/2009 7:06 am

    Heart touching story… Hat’s off…

  9. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి బొల్లోజుబాబా గారి అభిప్రాయం:

    11/11/2009 1:42 am

    అంతే అంతే
    మనం ఏం చూడాలనుకుంటామో అవే కనపడతాయి. సాహిత్యంలోనైనా, జీవితంలోనైనా!
    కధ నాకు నచ్చింది. కవిత్వం నిండిన కధలు చదివి చాన్నాళ్లయింది.
    బొల్లోజు బాబా

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి kusuma kumari గారి అభిప్రాయం:

    11/09/2009 3:35 am

    సాయి బ్రహ్మానందం గారికి!
    త్యాగ రాజ కృతులను గురించి ఎన్నెన్నో నూతన విశేషాలను పాఠకులకు చెప్పారు.
    కర్ణాటక సంగీత పరిజ్ఞానము మా వంటి సామాన్యులకు కూడా అందించ గల సరళ శైలిలో ఇచ్చిన మీ వ్యాసము మీ అమోఘ కృషికి నిలువుటద్దము.
    కృతజ్ఞతలు.

« 1 ... 1198 1199 1200 1201 1202 ... 1581 »