మీ పుస్తకాలు అందాయి. ఆకలిగొన్న పులిలా మీద పడ్డాను. తెలుగు మాధ్యమంలో చదువుకున్న నాకు విందు భోజనంలా అనిపించింది. ముఖ్యంగా విశ్వాంతరాళం లో బొమ్మలు కూడా చేరడంతో చాలా శోభనిచ్చింది.
ఆంగ్ల పదాలను ఆచి తూచి వాడడం వలన తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలుగులో ముందుగానే ఉన్న పదాలకు కొత్త పదాలు సృష్టించి గందరగోళం చెయ్యకుండా చక్కగా రాసినందుకు వీటి విలువ మరింత పెరిగింది.
కొన్ని చటుక్కున తట్టిన ఆలోచనలు:
1. ఇంత మంచి పుస్తకానికి ముద్రించిన ప్రతులు వెయ్యేనా? ప్రతి
గ్రంధాలయంలో ఉండవలసిన పుస్తకం. దీనికేమైనా మార్గాలు లేవా?
2. పుస్తకానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్థాలు వివరిస్తూ
అనుబంధం వేస్తే బాగుండేదని అనిపించింది.
3. మొన్న మా అమ్మాయికోసమని “Solar System” అని ఒక
పుస్తకం తెచ్చాను. చాలా చిన్న పుస్తకం, ఒకటవ రెండవ తరగతి పిల్లలకు చదవడం అభ్యాసం చెయ్యడానికని (ఆంగ్లంలో ఉంది) అటువంటి పుస్తకాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఆంధ్రాలో అర్థ వ్యవస్థ అటువంటి పుస్తకాలు పిల్లలకి కొనిపెట్టేటంత ఎత్తుకు ఎదగలేదేమో.
ఎంతైనా మీ పుస్తకాలు చాలా బాగున్నాయి. ఈ మాత్రమైనా తెలుగు పుస్తకాలు వస్తున్నాయంటే అదంతా మీ వంటి పెద్దల వలనే.
మీ దగ్గర ఇంకా ఏమన్నపుస్తకాలు ఉన్నాయా? తెలుపగలరు.
ఇట్లు
గరికపాటి పవన్ కుమార్
చాలా బాగున్నది. సున్నితమైన,మ0ద్రమైన కథ! కాని అతనెవరొ నాకు తెలియలెదు?
అమ్మ ఉత్తరం గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:
11/19/2009 11:16 pm
ఫోన్లలోనూ, ఈ-మెయిళ్ళలోనూ సున్నితమైన భావాల్ని పూర్తిగా వ్యక్తం చెయ్యడం నా మట్టుకు సందేహమే. ఫోన్ల విషయం
తీసుకుంటే సహజంగా పైపై విషయాలు మాట్లాడుకోవచ్చు. లోతైన భావాలు చెప్పాలనుకునేవారు ఫోన్లని ఆశ్రయించరు.
ఇక ఈ-మెయిళ్ళ విషయానికొస్తే – తెలుగులో మెయిల్ పంపించాలంటే బోలెడు తతంగం. స్పెల్లింగులు అవీ
చూసుకోవడంలోనే చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది. ఇక ఇంగ్లీషు ఈ-మెయిల్ అయితే – ఎవరైనా వాళ్ళు
చెప్పాలనుకునే భావాల్ని మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేరుగా! వీటిని బట్టి చూస్తే, నా
అభిప్రాయమైతే ఎంచక్కా మాతృభాషలో వుత్తరాలు రాసుకుంటేనే కమ్యూనికేషన్ కరక్టుగా వుంటుంది.
ఉత్తరాలా, ఈమెయిళ్ళా సంగతులని పక్కన పెడితే, రమ గారు చెప్పినట్టు ముఖ్యంగా గమనించాల్సింది బిడ్డకి దూరంగా వుంటూ తల్లి పడే మనోవేదన. ఆ వేదనని రక రకాలుగా వెలిబుచ్చడం
ఈ కథ బాగా ఉంది. బుచ్చిబాబు కథ లా అనిపిచింది అంటే కోపం వస్తుందేమో. భూషణ్ గారు మీరు కేవలం కవిత్వాన్ని, కవిత్వ విమర్శని పట్టించుకుని కథకు అన్యాయం చేస్తున్నారు. ఇన్కా కథలు రాయొచ్చుగా.
“కథా రచనకు నిరంతర అభ్యాసం అవసరమని గుర్తించడంవల్లనే అలా చేసేవాణ్ణని ఆయన అన్నారు. ఏదైనా విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవటానికి నిదర్శనం దాన్ని గురించి రాయగలగడమే అని అప్పటి నుంచే ఆయన నమ్మేవారనిపిస్తుంది.”
మంచి మాటలు. కథలే కాదు, ఏ రచనకైనా కళకైనా నిరంతర అభ్యాసం నిత్యావసరం అనుకుంటాను. ఇప్పుడొచ్చేవి కొన్ని మాత్రం సరిగ్గా అర్థంచేసుకోకపోవటానికి చూపించే రాతల ప్రదర్శనం అనిపిస్తుంది.
______
విధేయుడు
Srinivas
అందం అన్న అంశం పూర్తిగా వ్యక్తిగతమైన అభిరుచికి సంబంధించినది.
దానిని ఇథమిథమని నిర్నయించగలగటం చాలా కష్టం. అటువంటి దాన్ని ఒక
చర్చని చేయబూనటం అది కధలో కొ.కు చేసినా..లేదా విమర్శలో రారా బోలెడంత రాసినా కూడా రాతినించి నార తీయటమే!!
కాళీపట్నం మాస్టారి కధ ‘నో రూమ్ ” లాంటి వాటిలోని ఆ పల్లెపడుచు అందం ఏమిటో మాస్టారు ఏమీ చెప్పరు. ఆమె భర్త సైతం చెప్పడు. అయినా వాళ్ళిద్దరూ చక్కని వాళ్ళనే మనం అనుకుంటాం!! కొ.కు శిక్షణ ప్రధానంగా మధ్యతరగతి బ్రాహ్మణ నేపధ్యం గనక ఈ అంశాలు కధలో ముఖ్యమైనవి గా
చర్చించబడ్డాయి. రారా విమర్శలో సైతం సాహిత్య ప్రధానమైన కధల్లోని నాయికా నాయికలు అందమైన వాళ్ళన్న సంగతిని ఎక్కువగా పరిగణించడం ఆశ్చర్యం!!అలా అనుకుంటే ఎన్నో విషయాలని పోల్చాలి.అది సరైంది కాదు.
పైగా చలంతో అఖ్ఖరలేని పోలిక కూడా ఆ విమర్శకి ఎటువంటి అదనపు ఉపయోగాన్నీ తీసుకురాలేదు.
ఏకపక్షంగా “మార్క్సిస్ట్ ” చూపుతో_ లేని అంశాన్ని తీసుకుని బోలెడంత
సిధ్ధాంత..రాధ్ధాంతాలు తప్ప.
ప్రేమించుకున్న వాళ్ళ స్పందనలు అనేకమైన విషయాలకి అతీతంగా ఉంటాయన్నది వీళ్ళకి తెలియదని ఎవరం అనుకోలేము. అయినా ఈ రచ్చలెందుకంటే..శరీరాలని దాటి “హృదయ సౌందర్యం” అన్నది ముఖ్యమైనది
అని చెప్పాలన్న ఒక రొమాంటిక్ దృష్టి!!. ఇష్టపడటంలో అనేకమైన అంశాలుంటాయి. అందులో శరీరం కూడా ముఖ్యమైనదే!! హృదయం అంతగానూ కూడా!! ఇవన్నీ మగవారి వైపునించి ఆలోచించిన సంగతులు.
కురూపుడైన నాయకుడు..అందమైన నాయిక కధలో ఉండి..నాయకుడు గనలోకురూపి కధలోని..
సరస్వతి స్థానంలో రసచర్చ చేస్తే అప్పుడు ఈ కధ లోని మరోకోణం బయటికి
వచ్చేది. కానీ ఈ ప్రశ్నలు వేసుకోగల సంయమనం కొ.కు కధ లోనీ లేదు…
రారా విమర్శలోనీ లేదు. అందువల్ల రెండూ అసమగ్రాలే!!
నింగి-నేల గురించి sky baba గారి అభిప్రాయం:
11/24/2009 9:48 am
పొయెమ్ బాగుంది. తెలుగు పత్రికలకి కూడ పంపండి. ఇంకా ఇ-పత్రికలు చూసేంత మన పాఠకులు ఎదగలేదు కదా.. నేనే ఇన్ని రోజులకు మీ పొయెం చూశాను..
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
11/23/2009 4:01 pm
రోహిణీ ప్రసాద్ గారు,
మీ పుస్తకాలు అందాయి. ఆకలిగొన్న పులిలా మీద పడ్డాను. తెలుగు మాధ్యమంలో చదువుకున్న నాకు విందు భోజనంలా అనిపించింది. ముఖ్యంగా విశ్వాంతరాళం లో బొమ్మలు కూడా చేరడంతో చాలా శోభనిచ్చింది.
ఆంగ్ల పదాలను ఆచి తూచి వాడడం వలన తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలుగులో ముందుగానే ఉన్న పదాలకు కొత్త పదాలు సృష్టించి గందరగోళం చెయ్యకుండా చక్కగా రాసినందుకు వీటి విలువ మరింత పెరిగింది.
కొన్ని చటుక్కున తట్టిన ఆలోచనలు:
1. ఇంత మంచి పుస్తకానికి ముద్రించిన ప్రతులు వెయ్యేనా? ప్రతి
గ్రంధాలయంలో ఉండవలసిన పుస్తకం. దీనికేమైనా మార్గాలు లేవా?
2. పుస్తకానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్థాలు వివరిస్తూ
అనుబంధం వేస్తే బాగుండేదని అనిపించింది.
3. మొన్న మా అమ్మాయికోసమని “Solar System” అని ఒక
పుస్తకం తెచ్చాను. చాలా చిన్న పుస్తకం, ఒకటవ రెండవ తరగతి పిల్లలకు చదవడం అభ్యాసం చెయ్యడానికని (ఆంగ్లంలో ఉంది) అటువంటి పుస్తకాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఆంధ్రాలో అర్థ వ్యవస్థ అటువంటి పుస్తకాలు పిల్లలకి కొనిపెట్టేటంత ఎత్తుకు ఎదగలేదేమో.
ఎంతైనా మీ పుస్తకాలు చాలా బాగున్నాయి. ఈ మాత్రమైనా తెలుగు పుస్తకాలు వస్తున్నాయంటే అదంతా మీ వంటి పెద్దల వలనే.
మీ దగ్గర ఇంకా ఏమన్నపుస్తకాలు ఉన్నాయా? తెలుపగలరు.
ఇట్లు
గరికపాటి పవన్ కుమార్
“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kavitha గారి అభిప్రాయం:
11/21/2009 3:37 pm
చాలా బాగున్నది. సున్నితమైన,మ0ద్రమైన కథ! కాని అతనెవరొ నాకు తెలియలెదు?
అమ్మ ఉత్తరం గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:
11/19/2009 11:16 pm
ఫోన్లలోనూ, ఈ-మెయిళ్ళలోనూ సున్నితమైన భావాల్ని పూర్తిగా వ్యక్తం చెయ్యడం నా మట్టుకు సందేహమే. ఫోన్ల విషయం
తీసుకుంటే సహజంగా పైపై విషయాలు మాట్లాడుకోవచ్చు. లోతైన భావాలు చెప్పాలనుకునేవారు ఫోన్లని ఆశ్రయించరు.
ఇక ఈ-మెయిళ్ళ విషయానికొస్తే – తెలుగులో మెయిల్ పంపించాలంటే బోలెడు తతంగం. స్పెల్లింగులు అవీ
చూసుకోవడంలోనే చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది. ఇక ఇంగ్లీషు ఈ-మెయిల్ అయితే – ఎవరైనా వాళ్ళు
చెప్పాలనుకునే భావాల్ని మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేరుగా! వీటిని బట్టి చూస్తే, నా
అభిప్రాయమైతే ఎంచక్కా మాతృభాషలో వుత్తరాలు రాసుకుంటేనే కమ్యూనికేషన్ కరక్టుగా వుంటుంది.
ఉత్తరాలా, ఈమెయిళ్ళా సంగతులని పక్కన పెడితే, రమ గారు చెప్పినట్టు ముఖ్యంగా గమనించాల్సింది బిడ్డకి దూరంగా వుంటూ తల్లి పడే మనోవేదన. ఆ వేదనని రక రకాలుగా వెలిబుచ్చడం
ప్రయాణం గురించి ajay గారి అభిప్రాయం:
11/19/2009 6:27 am
ఈ కథ బాగా ఉంది. బుచ్చిబాబు కథ లా అనిపిచింది అంటే కోపం వస్తుందేమో. భూషణ్ గారు మీరు కేవలం కవిత్వాన్ని, కవిత్వ విమర్శని పట్టించుకుని కథకు అన్యాయం చేస్తున్నారు. ఇన్కా కథలు రాయొచ్చుగా.
కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/18/2009 3:24 pm
ఆహ్లాదంగా ఆత్మీయంగా చెప్పారు.
“కథా రచనకు నిరంతర అభ్యాసం అవసరమని గుర్తించడంవల్లనే అలా చేసేవాణ్ణని ఆయన అన్నారు. ఏదైనా విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవటానికి నిదర్శనం దాన్ని గురించి రాయగలగడమే అని అప్పటి నుంచే ఆయన నమ్మేవారనిపిస్తుంది.”
మంచి మాటలు. కథలే కాదు, ఏ రచనకైనా కళకైనా నిరంతర అభ్యాసం నిత్యావసరం అనుకుంటాను. ఇప్పుడొచ్చేవి కొన్ని మాత్రం సరిగ్గా అర్థంచేసుకోకపోవటానికి చూపించే రాతల ప్రదర్శనం అనిపిస్తుంది.
______
విధేయుడు
Srinivas
ప్రేమ కవితలు గురించి DEVI గారి అభిప్రాయం:
11/18/2009 3:24 am
కవితలు చలా బాగున్నాయీ చాలా చాలా
అమ్మ ఉత్తరం గురించి రాఘవ గారి అభిప్రాయం:
11/17/2009 8:48 am
యథాలాపంగా చదివాను దీన్ని… చదివితే నేను ఒకప్పుడు వ్రాసుకున్న పద్యాలు మళ్లీ గుర్తొచ్చాయి. బాగుందండీ మీ కథ.
ప్రేమ కవితలు గురించి sravan గారి అభిప్రాయం:
11/17/2009 5:15 am
చాల చక్కగా ఉంది మీ కవిత.
భావుకుల రచయిత కొ.కు. గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/16/2009 1:56 pm

రమ.