Comment navigation


15812

« 1 ... 1191 1192 1193 1194 1195 ... 1582 »

  1. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    01/02/2010 6:24 pm

    మీ విశ్లేషణ బాగుంది. శ్రీశ్రీ అనువాదాల్లో కొంత స్వేచ్చ తీసుకున్నాడని భావించటం సమంజసంగా ఉంటుంది. ఖడ్గసృష్టిలో వీటిని అనువాదాలని గాక, అనుసృజన అనే పేర్కొన్నారు. ఆ కవితలన్నిటిలోను The Snows of Yester Year కి చేసిన అనుసరణ ఎక్కువ ప్రసిద్ది పొందిందనుకుంటాను.

    పిచ్చిదానిమ్మ చెట్టు గురించి ఒక మాట. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఎలీటిస్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ కవిత విపరీతంగా నచ్చటం వల్ల నేను కూడా ఇదే పేరుతో దీనిని అనువదించాను. ఆసక్తి ఉన్నవారు ఆ అనువాదాన్ని చూడవచ్చు:

    అప్పటికి నేను శ్రీశ్రీ అనువాదం చదవలేదు. ఇది ప్రచురితమయ్యాక, చలసాని ప్రసాద్ గారు శ్రీశ్రీ అనువాదాన్ని గుర్తుచేస్తూ, ఈ అనువాదం తేడాగా ఉందని ఆ పత్రికకి ఉత్తరం రాసారు. శ్రీశ్రీ కూడా ఆంగ్లం నుంచే అనువదించి ఉంటారని భావిస్తాను. ఆయన ప్రామాణికంగా తీసుకున్న ఆంగ్లానువాదం – అంటే 1949 కి ముందు ఈ కవితకి వచ్చిన ఆంగ్లానువాదం – దొరికితే శ్రీశ్రీ పాటించిన భేదాలు అందులోనే ఉన్నాయేమో పరిశీలించవచ్చు.

  2. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana గారి అభిప్రాయం:

    01/02/2010 10:49 am

    శ్రీశ్రీ మాత్రమే కాదు, ఎందరో ఉత్తమ శ్రేణి కవులు తెలుగు సినిమాలకు పాటలు రాశారు. వారు అమలులోనికి తెచ్చిన ఒక కొత్త పాత ప్రయోగం అంత్యప్రాస. ఉత్తర భాషలలో పద్యాలలో, పాటలలో (హిందీ వగైరాలు) అంత్య ప్రాస (తుక్) అవసరము. కానీ ప్రాచీన తెలుగు కవులు (పోతన మినహాయించి) రగడలలో తప్ప దీనిని ఎక్కువగా వాడలేదు. పాటలలో, ప్రత్యేకముగా సినిమా పాటలలో ఛందస్సు ఎక్కడ అనే వాళ్ళు ఈ విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. శ్రీశ్రీయే సినిమా పాటలను గురించి “పాడవోయి భారతీయుడా” అనే పుస్తకంలో ఇలాగంటారు –

    “సినిమాకు పాటలు రాయటం చాలామంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగుకు రాయడమనేది మరీ కష్టంతో కూడుకొన్న పని. ఆ రోజుల్లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు ద్విభాషా చిత్రాలు తీసేవారు. తెలుగుకి నేనూ, అరవానికి ఉడుమలై నారాయణకవి పాటలు రాస్తుండే వాళ్లం. ఉడుమలై కవీ నేనూ పాటల రచనకి కలిసే కూర్చుండేవాళ్ళం. “ఆకాశవీధిలో అందాల జాబిలి” అని నేను రాస్తే “ఆగాయ వీదియిల్ అళగాన వెణ్ణిలా” అని అతడు రాశాడు. అలాగే “అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే…” అన్న అయిడియా నారాయణ కవిది. యతిప్రాసల పట్టింపు అతని కెంతో ఎక్కువ. “ఇలక్కణం” (వ్యాకరణం) అనేవాడు, లక్షణ భంగం అనేది అతనికి సుతరాము కిట్టేది కాదు.”

    తమిళ సినిమాలో కణ్ణదాసన్ రాసిన ఎన్నో పాటలకు స్వరబద్ధత పాట రాసిన తరువాతే జరిగింది. అలాగని విశ్వనాథన్ చెప్పారు. తమిళ ఛందస్సులో పద్యాలలో, పాటలలో సామాన్యముగా (ఏవో కొన్ని మినహాయింపులు తప్ప) పదాలు గణాలకు బాగా విరుగుతాయి. అరుణగిరినాథర్ వంటి కవులు తాళవృత్తాలను చాలా లయబద్ధముగా వాడారు. లయనే ఛందస్సు పేరుగా వ్యవహరిస్తారు. ఉదాహరణగా తోటకవృత్తమును (స-స-స-స) బోలిన పద్యపు ఛందస్సును తననా తననా తననా తననా ఛందము అంటారు. ఇందులోని చివరి గురువును లఘువు చేస్తే అది తననా తననా తననా తనతన ఛందము అవుతుంది. ఇది హిందూస్తాని సంగీతములోని బందిష్ లాటిది. ఇట్టి కొత్త లయలను తెలుగులో ప్రవేశ పెట్టాలని నా ఆశ.

    విధేయుడు – మోహన

  3. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/02/2010 6:49 am

    శ్రీశ్రీ స్మారక సంచిక అందించినందుకు కృతజ్ఞతలు.

    “ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అతిశయోక్తులు, అబద్ధాలు లేకుండా రాస్తే, అది శ్రీశ్రీ స్వీయచరిత్ర అవుతుంది”
    ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర సైతం శ్రీశ్రీ స్వీయచరిత్ర అవుతుంది అనికోవడం అభిమానంతో చెప్పిన అతిశయోక్తిగానే అనిపిస్తుంది. శ్రీశ్రీ గారిని ఎక్కువచేసేందుకు మనం గర్వించదగ్గ గణనీయ, మహనీయ ఇతర కవులను తక్కువచేయ అవసరం లేదనుకుంటాను. కరుణశ్రీ, జాషువా, విశ్వనాథ, దాశరథి మొదలైన వారిని శ్రీశ్రీ స్మరణలో సైతం విస్మరించలేం.
    ———
    విధేయుడు
    -Srinivas

  4. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Sowmya గారి అభిప్రాయం:

    01/02/2010 1:05 am

    వ్యాసం ఆసక్తికరంగా ఉంది. అయితే, శ్రీశ్రీ అనువాదాలు అన్నాక, కవిత్వం మాత్రమే చెప్పారే… శ్రీశ్రీ అనువాద కథలు కూడా చాలానే ఉన్నాయి కదా… శ్రీశ్రీ కథలు సంకలనంలో కూడా చాలా అనువాదాలు ఉన్నాయి.
    రో.ప్ర గారు అన్నట్లు – చివరి వరకూ ఆక్టివ్ గా జీవించారనిపిస్తుంది… అధివాస్తవిక కవిత్వాన్ని అనువదిస్తే ఎలా ఉంటుందో…కుతూహలం కలిగించారు. ధన్యవాదాలు.

  5. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 8:55 pm

    “ఆ కాలంలో యువతరాన్ని ఉర్రూతలూగించినంతగా అతని కవిత్వం ఈ కాలపు కుర్రకారును ప్రభావితం చేస్తుందని నేననుకోను.”
    పై వ్యాఖ్యకు ఇటీవలి రమా భరద్వాజ్ అనుభవం కొంతవరకూ సమాధానమిస్తుంది.
    శ్రీశ్రీ చేసిన వచన అనువాదాలూ ఉన్నాయి. మిఖయీల్ షోలఖొవ్ రష్యన్ నవలిక వాటిలో ఒకటి. (పేరు గుర్తులేదు). తనకు నచ్చినవీ, ప్రభావితం చేసినవీ అనేక రచనలను ఆయన అనువదిచాడు. చివరిదాకా నీరసపడకుండా, active గా జీవించాడు. ఇది మనమ్ గుర్తుచుకోవలసిన విషయం.

  6. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 6:49 pm

    ఛందస్సులమీద ఒక doctorate వంటిది సంపాదించగలిగిన మోహనరావుగారే ఇంత మంచి వ్యాసం రాయగలరు. శ్రీశ్రీ సాహిత్యపు విలువలలో మాత్రాఛందస్సు అందాలు పెద్దపీట పొందలేకపోవచ్చుగాని, readability, or rather, ‘recitability’ విషయంలో ఈ అంశం బాగా పనిచేస్తుంది.
    ఎవడి గోల వాడిది అన్న పద్ధతిలో గేయాలను పాడించటానికి ట్యూన్లు తయారు చేస్తున్నప్పుడు నేను గమనించినదేమిటంటే ఆధునిక తెలుగు కవుల్లో మాత్రాఛందస్సును ఖచ్చితంగా పాటించినవారిలో కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సినారె ముఖ్యులు.
    సినీగీతాల్లో పాతరోజుల్లో కూడా ముందు ట్యూన్ చేసి, తరవాత పాటలు రాయించే అలవాటుండేది. ముఖ్యంగా సి.ఆర్‌.సుబ్బరామన్ ఇదే చేసినట్టు కనబడుతుంది. దురదృష్టం కొద్దీ ఆ పాటలన్నీ సముద్రాల సీనియర్ ‘కిట్టించినవే’. అవి నా లెక్కన చెత్త రచనలు. ఏ శ్రీశ్రీకో ఇస్తే చక్కగా రాసి ఉండేవాడు. (జోరుగా హుషారుగా పాటలో ఒక గురువు వెంట ఒక లఘువు వచ్చేటట్టు ఎంత బాగా రాశాడో). అలాగే దీర్ఘాలు అనే శీర్షికతో ఇలా రాశాడు;
    “నా నీవూ, నీ నేనూ, ఆనాడూ, ఈనాడూ, ఆడాలే పాడాలే నాదానా ఓచానా”

    తాళం తమాషాగా నడిచే పాటల్లో మహేశా పాపవినాశా ఎత్తుగడ ఒకటి. అనార్కలీలో కలిసె నెలరాజు అనేది మరొకటి. మరాఠీ భక్తిపాటలు (అభంగ్‌) అచ్చగా తాళానికే రాసినట్టుంటాయి.
    నా లెక్కన ట్యూన్లకు పాటలు రాయడంలో తమిళంవంటి భాషల్లో చాలా కష్టం. ఎందుకంటే వారి పదాలన్నీ polysyllabic గా పెద్దవిగా ఉంటాయి. తెలుగు చాలా నయం. ఒకటి, రెండు అక్షరాలు పుష్కలంగా ఉన్న హిందీ అన్నిటికన్నా సులభం. బొంబాయిలో Hindi-to-Telugu టీవీ డబ్బింగ్ సీరియల్‌ తెలుగు వర్షన్లకు నేను చాలా పాటలు రాశాను. ఒకేసారి దానితోబాటు తమిళ, మలయాళ వర్షన్లు కూడా రికార్డింగ్ చేసేవారు. అప్పుడు ఈ వ్యత్యాసాలను గమనించేందుకు నాకు అవకాశాలు లభిస్తూ ఉండేవి.
    పై భాషల గురించి మోహనరావుగారు ఏమంటారో?

  7. రెండు శ్రీల కవి గురించి mOhana గారి అభిప్రాయం:

    01/01/2010 4:20 pm

    మలయాళంలో ఉందో లేదో తెలీదు కానీ, కన్నడములో మహాప్రస్థానం అనువదించబడినది. మచ్చుకు ఒక ఉదాహరణ –

    శ్రీశ్రీయవర మహాప్రస్థాన మత్తొందు ప్రస్థాన – ఆయ్ద కవితెగళు నుండి
    (అనువాదం – ఎచ్ ఎస్ శివప్రకాశ్, బంజగెరె జయప్రకాశ, రాఘవేంద్ర రావ్
    ప్రచురణ – సాహితీ మిత్రరు, బెంగళూరు, 1991)

    ఒందు రాత్రి (ఒక రాత్రి)

    గగనవెల్లా తుంబి
    హొగె హొగెయంతె హరడి
    బహుళపచమి జ్యోత్స్న
    భయపడిసువుదు నన్న

    ఆకాశద మరుభూమి
    ఎల్లెడె, అకటా!
    ఈ రాత్రి కెరళిదె
    మరళ బిరుగాళి!

    గాళియలి గోచరిసద
    గడసు దెవ్వగళు
    భూ దివగళ మధ్యె
    ఈజుతలివె!

    బాయ్తెరెదు, ఘోషిసి
    ఉక్కువుదు సాగర!
    మదగజద కళేబరదంతె
    చలిసద బెట్ట!

    అంబరద మరుభూమియలి
    కాలు కత్తిరిసి హోద
    ఒంటె ఒంటెయంతె
    ఇహుదు చంద్రమ!

    విశ్వవెల్లా హరడి
    బెళ్ళదిబూదియ తెరది
    బహుళ పంచమి జ్యోత్స్న
    భయ పడిసువుదు నన్న!

    విధేయుడు – మోహన

  8. కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 4:16 pm

    లాలనుచు అనే పాటలో సుశీల ‘లాలనుచు’ అని పలికే పద్ధతిని గమనించండి. ఇప్పటి తరంలాగా అక్షరానికక్షరం కాకుండా ‘లాలి అనుచు’ అన్న అర్థం స్ఫురించేలా పలుకుతుంది. ఆవిడ విశిష్టగాయని కావడానికి ఇటువంటి subtleties చాలా పనిచేశాయి.

    మోహనరావుగారు చెప్పిన పద్ధతిలో లిరిక్‌లో లేకపోయినప్పటికీ లాలి అనాలని తెలియడమే రాజేశ్వరరావు సంస్కారాన్ని సూచిస్తుంది.

  9. కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 4:03 pm

    అచ్చుతప్పులను చూపినందుకు మోహనరావుగారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ‘అందాలరాముడు’లో రాజబాబు చెప్పినట్టు ‘నా సంస్కృతం నాలెడ్జి నిల్లూ’.

    నేను ఇంటర్నెట్ మీద ఆధారపడడంతో కొన్ని లిరిక్స్ కోసం తమిళ సంగీతజ్ఞులు ఇంగ్లీషులో రాసిన సాహిత్యాన్ని తీసుకోవలసివచ్చింది.

    అకస్మాత్తుగా వచ్చిన ప్రేరణ కారణంగా డిసెంబర్ 30వ తేదీన కేవలం రెండు గంటల్లో వ్యాసం రాసి పంపేశాను కనక టైపోల గురించి ఎవరితోనూ చర్చించే వ్యవధి లేకుండాపోయింది. తప్పులెలాగో ఉంటాయి గనక వాటిని విజ్ఞులు point out చేస్తారని అనుకున్నాను. అదే జరిగింది కూడాను. వాటిని సంపాదకులు సవరించగలిగితే మరింత సంతోషం.

    [తప్పులు సవరించాము – సం.]

  10. సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం! గురించి TV Ramakrishna గారి అభిప్రాయం:

    01/01/2010 3:29 pm

    Chalaa Baagundi

« 1 ... 1191 1192 1193 1194 1195 ... 1582 »