Comment navigation


15814

« 1 ... 1190 1191 1192 1193 1194 ... 1582 »

  1. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/04/2010 3:47 pm

    “కవికి ఒకరి మరణం కంటే ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.” దానికి రవిశంకర్ గారిచ్చిన ఉదాహరణలు చక్కగా ఉన్నాయి. ఐతే రవిశంకర్ గారు వారి పరిశీలనని అక్కడతోనే ఆపెయ్యకుండా మరికొంచం ముందుకుపొయ్యుంటే, శ్రీశ్రీ గారి మరో కోణం, సహజంగా కవులని చెప్పుకునే వాళ్ళలో కనపడని మరో ఒకట్రెండు లక్షణాలు తెలిసుండేవి. అవేవిటంటే శ్రీశ్రీ ప్రపంచపు ఉదాసీనత వల్ల మనిషిగా తనకు కలిగిన బాధని కవిగా వ్యక్తం చెయ్యడంతోనే ఆగిపోకుండా, ఆ వ్యక్తం చెయ్యడంలో కూడా ఆ బాధమీద సున్నితవైన కవిత్వపు మేలిముసుగులు కప్పకుండా, చావు ఎంత భయంకరవైనదో తన కవిత్వంలో చూపించాడు. ఆ చావుకన్నా భయంకరవైన ఆ ఉదాసీన ప్రపంచాన్ని, చొక్కా పట్టుకుని ప్రశ్నించాడు. ఆ చావుకి కారణవెవరో చెప్పమని, ఆలోచించమని తన కవితని పెనుప్రశ్నగా మలచాడు.
    “కొంపెల్ల జనార్ధనరావు కోసం” లో
    మా బురద రోజూ హాజరు
    మా కాళ్ళకు డెక్కలు మొలచాయి
    మా నెత్తిన కొమ్ముల లాగే!
    …….

    నిన్న వదిలిన పోరాటం
    నేడు అందుకొనక తప్పదు!
    కావున ఈ నిరాశామయ లోకంలో
    కదనశంఖం పూరిస్తున్నాను!

    “అట్లాగే భిక్షు వర్షియసి” లో
    ఆ అవ్వే మరణిస్తే
    ఆ పాపం ఎవ్వరి”దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ
    వెళ్ళిపోయింది

    అని చెప్పడంలో ఉదాసీన లోకానికి తన కవిత్వపు షాక్ ట్రీట్మెంట్ రుచి చూపించాడు. అందువలననే గురజాడ రచనలో మీక్కనిపించిన గోప్యత శ్రీశ్రీ బాటసారిలో కనిపించదు.

    బాటసారి కళేబరంతో
    శీతవాయువు ఆడుకొంటుంది
    పల్లె టూళ్ళో తల్లికేదో
    పాడు కలలో పేగు కదిలింది.

    రవిశంకరు గారు చెప్పినట్టు శ్రీశ్రీ మరణాన్ని ఎక్కడా కీర్తించలేదు. “ఊగరా, ఊగరా, ఉరికొయ్య నందుకుని ఊగరా” అన్న కవితలో వీరుని మరణాన్ని సందేహం లేకుండా కీర్తించారు. ఐతే ఆ వీరుని మరణం పదిమంది బతుక్కోసం చేసిన త్యాగవని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా అది బతుకుని కీర్తించడం గానే నాకనిపిస్తుంది. పదిమందికి మంచి బతుక్కోసం తపనగానే నా మనసుకి తెలుస్తుంది.

    చేదుపాట, కేక, దేనికొరకు గీతాల్లో శ్రీశ్రీ వ్యక్తిగత ఆశ, నిరాశల దోబూచులాట కనిపిస్తుందని చెప్పేరు రవిశంకర్ గారు. నాకు మాత్రం ఆ గీతాలు ఆ కాలపు (ఈ కాలం కూడా) ఒక సామాన్యుడి, బతుకుబాటలో నడుస్తూ, ఆ బాట, తనలాటి సామాన్యులకి ముళ్ళబాట ఎందుకైందో తెలుసుకునే నేపధ్యంలో, ఆ కారణాలేవో తెలుసుకుని వాటిని మార్చే పోరాటానికి సమాయత్తవయ్యే తరుణంలో ఆ కాలపు కవి శ్రీశ్రీ నే కాదు, ఏ కవిత్వం వ్రాయని సామాన్య శ్రీశ్రీలు మార్పు కోసం, మంచి కోసం, పదుగురి మంచికోసం స్టేటస్ కోను ప్రస్నించపూనుకున్న ఇకనోక్లాస్ట్ మనస్తత్వవే నాక్కనిపిస్తుంది.

    శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళల గురించి కవిత్వం వ్రాయలేదన్నారు మీరు. కానీ శ్రీశ్రీ వ్రాసిన కవిత్వం దాదాపు అంతా కూడా వాటి గురించే కదా రవిశంకర్ గారు. సమాజంలో హీనాతి హీనవైన బతుకు బతుకుతున్న సామాన్యుడి గురించే కదా ఆయన కవిత్వవంతా, ఆయన తపనంతా. తమలోతు కనుక్కోమనే ఆ అత్యంత హీనవైన బతుకు నిజాల్ని ఆవిష్కరించడవే కదా ఆయన కవిత్వం చేసింది.

    వాక్యం వాక్యం విమర్సించడం నా ఉద్దేశం కాదు. ఆఖరగా ఒక విషయం, అన్వేషణ కట్టిపెట్టి, ఒక ఖచ్చితత్వం వైపు ప్రయాణిస్తే కవిత్వం దెబ్బతింటుందన్నారు మీరు. కానీ ఒక ఖచ్చిత తత్వం వైపు ప్రయాణించడవంటే కళ్ళకు గంతలు కట్టుకోవడం కాదు కదా. ఆ ప్రయాణపు బాట పట్టడానికి, ఎంత అన్వేషణ, ఎంత సంఘర్షణ, ఎంత పరిశీలన, ఎన్ని ప్రశ్నలు, ఎంత ప్రయత్నం. నిస్చయత్వం అనేది ఒక సాపేక్షవైన విషయవే కాదా? కవి కూడా సంఘంలో ఒక మనిషే, అందరితోబాటూ కవిక్కూడా, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, మంచిచెడులుంటాఅయి. నిశ్చితానిశ్చయాలుంటాయి. బతుకుబాటలో అందరిలాగే అన్నిరకాల సంఘర్షణలుంటాయి. రాజకీయాలు, రాజకీయ తాత్వికత కూడా అందులో భాగవే. అవి లేని కవి కవి కాలేడేవో. నాలుగు పదాలని నగిషీచెక్కడం నేర్చుకోవటవే కవిత్వవయితే మీరు చెప్పింది నిజవే, కానీ నలుగురు మనుషుల మనసుల్నిచెక్కాలంటే కవి మనిషై వుండాలి, ఒపీనియేటెడ్ అయ్యితీరాలి. అందువలనే మిగిలిన వాళ్ళు కవులయ్యేరేవో గాని శ్రీశ్రీ అసంఖ్యాక కవుల్ని సృష్టించ గలిగేడు, మహా కవికాగలిగేడు.

    శ్రీశ్రీని చూడడానికి అద్దాలెందుకు సార్ మనచుట్టూ మనం కళ్ళు తెరిచి చూస్తే శ్రీశ్రీ కనిపిస్తాడు. మనం పుట్టిపెరిగిన ఊర్లని, మనతో పెరిగిన మనషుల్ని చూస్తే మనకు శ్రీశ్రీ కనిపిస్తాడు. శ్రీశ్రీ నిశ్చితాభిప్రాయాలు ఆయన కవిత్వాన్ని అపేయోలేదో గాని, మన కళ్ళ గంతలు తీస్తే శ్రీశ్రీ కపడతాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని, శ్రీశ్రీ కవిత్వంలో వ్యక్తవైన తాత్వికతని, ఆ తాత్వికతకి కారణవైన దేశకాల పరిస్థితుల్ని వదిలేసి, శ్రీశ్రీ ని మాత్రం వేరుచేసి చిన్న అద్దం ముక్కలో ఆయన్ని మీరు చూపించ ప్రయత్నించారు. కానీ ఆ అద్దం ముక్క మసిబారి, మకిలిపట్టిపోయింది మీరు గమనించలేదేవో రవిశంకర్ గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  2. కలైన గోర్వెచ్చని పాట గురించి అపూర్వ గారి అభిప్రాయం:

    01/04/2010 9:52 am

    నులక కౌశలంకోసమేనా?? తాత పదాలు అల్లిన చిత్రం మాసిపోయిన గ్రామాన్ని వెతకటంలేదా?????

  3. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి kameswara rao గారి అభిప్రాయం:

    01/04/2010 7:25 am

    అద్భుతమయిన వ్యాసం. చాలా బాగున్నది.

  4. కలైన గోర్వెచ్చని పాట గురించి N N Muralidhar గారి అభిప్రాయం:

    01/04/2010 7:02 am

    చాలా బాగా వ్రాసారు.

  5. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/04/2010 3:08 am

    కామేశ్వరరావు గారూ!!

    ఏ విషయాన్ని తేల్చడానికీ ఎవరిదగ్గరా ఖత్చితమైన data అంటూ ఉందా?? అదీకాక “ఆనాటికాలంలో” సైతం కవిత్వం పట్ల ఆ మాటకొస్తే సాహిత్యం విషయంలోనూ నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళ శాతం ఎంతా??ఇవేవీ ఎవరి లెఖ్ళకీ తేలేవికావు. ఇవాళ్టికీ కవిగా శ్రీశ్రీ పేరే ఎక్కువగా కుర్రకారుకి తెలుసన్నది [సాహిత్యం గురించి కాస్తగా తెలిసిన కుర్రకారు] అర్ధమౌతున్న విషయం!

    otto reno castillo కవితనికూడా ఒకదానిని[మెక్సికన్ కవి అనుకుంటాను]శ్రీశ్రీ తెనుగున అనువాదంచేసాడు. కానీ ఆ అనువాదం కూడా ఏమంత బాగా అన్పించదు. కానీ అదే శ్రీశ్రీ ” మరీముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి” అని పూర్తిగా తెలుగువాతావరణం తీసుకొచ్చి కవితని ఎత్తుకున్నప్పుడు మాత్రం అలా ఒక్కశ్రీశ్రీవే చేయగలడు అనికూడా అన్పించకపోదు.కవులు కూడా మానవమాత్రులే గనక ఆ క్షణంలో వాళ్ళలోని భావుకత స్థాయిని అనుసరించే ఆ అనువాదం రూపొందుతుంది. ఒక్కోసారి అత్యధ్బుతమైన మెరుపులు కురిపించగల్గిన వారే ఒక్కోసారి యాధాలాపంగా సరిచూసుకోకుండా కూడా వాక్యనిర్మాణం చేయడాన్ని మనం గమనించవచ్చు.అది సహజం కూడా!కవి తాలూకు సృజన ఐనా లేదా అనుసృజన ఐనా అన్నిసార్లూ ఆహా!! అని అన్పించేలా ఉండదు…అని మనకి శ్రీశ్రీ ఇంకా ఇతర కవుల కవిత్వం చదివినప్పుడు స్పస్టంగానే తెలుస్తుంది. అయితే సృజన అన్న అనుభవం తెలిసినవారు కవిలోని ఉత్తమోత్తమమైన ఊహలనీ కవితావాక్యాలనీ గౌరవించి అంతగా బాగారాని వాటిని ఆ కవి కవితాపటిమ మీదున్న గౌరవం తో ఉపేక్షించి లేదా సహించి వారు రాసిన ఆ గొప్పకవిత్వానికి కైమోడుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ సాహిత్యకారుల పట్ల ఆ ప్రాంతపు ప్రజలు అనుసరించిన ఒక గౌరవం!! వారి అక్షరానికి చేసిన ఒక మన్నన.

    రమ.

  6. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/03/2010 1:30 pm

    రోహిణీప్రసాద్‌గారూ, రమగారి అనుభవం బట్టి శ్రీశ్రీ కవిత్వం ఈనాటి యువతని కూడా అప్పటి కాలంలో లాగానే ఉర్రూతలూగిస్తుందని నిశ్చయించలేము కదా. రమగారు అన్నట్టు, ఈనాటి యువతకి కూడా ఆసక్తి కలిగించే విషయాలు ఆ కవిత్వంలో ఏమిటన్నది పరిశీలించాల్సిన అంశం.

    సౌమ్యగారూ, అవును. శ్రీశ్రీ కవిత్వేతర సాహిత్యాన్ని కూడా అనువదించాడు. ఈ వ్యాసం, మొదటి పేరాలో చెప్పినట్టు, కవిత్వ అనువాదాలకే పరిమితం.

    రవిశంకర్‌గారూ, మీ అనువాదం నాకు శ్రీశ్రీ అనువాదం కన్నా నచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం ఆంగ్ల మూలంలో ఉన్న తేడా అయ్యుండవచ్చు. ఈ వ్యాసం రాసిన తర్వాత వెతుకుతూ ఉంటే, మరో ఆంగ్ల అనువాదం కనిపించింది. శ్రీశ్రీ అనువాదానికి ఇదే మూలం. ఇది Nanors Valaoritis and Bernard Spencer చేసిన అనువాదం.

  7. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:

    01/03/2010 12:34 pm

    I feel it better to respond in the desired language, which is neither the authoritative nor the most spoken one, either in the globe or even in Europe, as was mentioned. By accepting one side that Telugu is no way less competitive with any other universal languages, it is very much astonishing to mention, Telugu to limit with literature etc. and to leave monopoly to English in sciences. Does it mean that all sciences were scripted only in English and all the words we read as English are from English vocabulary? Was this accepted even in Europe? Why we the Indians, that too Telugus crave for English? Is it because we were once a “Common Wealth” (common property being slaves)country?

    When we compete in literature, why not in sciences, with little effort, as was mentioned in my earlier comment? Are we incapable or is it lack of initiation? In what way “our” initiation in making efforts to take the sciences to the village level in mother tongue, curtails the advancement of our future generations? Love towards mother tongue is not at all prejudiced. Rather, it is a pride. If it is believed that we are “Developed” only by shunning Telugu and embracing English then what Ms.Rama wrote is absolutely right.

    It is not out of place to mention that the entire judicial business, whether it is argument or presentation, is taking place in Andhra exclusively in Telugu only but not at all in English as was mentioned impossible by Mr.Hareesh. When Mr. Hareesh made up his mind and concludes that discussion of subjects in Telugu, other than literature is a crime and deception to future generations, no words left to answer. Any way it is very much out of way that of our comments and counter comments upon the language, the subject was discussed, rather than the subject.

    Jagannadham Alapati

  8. గుండుగొమ్ములనుమానం – 1 గురించి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:

    01/03/2010 11:29 am

    త్రిపుర గారిని కలవకపోయినా కథల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని చాలా వరకూ ఊహించాను. ఇప్పుడు మీ వ్యాసంతో నేనూహించింది నిజమే అని తెలీడంతో చాలా ఆనందం కలిగింది. త్రిపుర తన కథల్లో , మాటల్లో ఎంత చెప్తాడో, మాటల మధ్య విరామాలు, పదాల్ని కోట్స్ లో పెట్టడం, చుక్కలు ఇలా వీటితో అంతకంటే ఎక్కువే చెప్తాడు. సముద్రపు హోరులో కెరటానికీ కెరటానికీ మధ్య ఉండే నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశ పెట్టగల ప్రజ్ఞ ఆయన సొంతం. త్రిపుర గారంత డిటాచ్మెంట్‌తో రాసిన వాళ్ళు బహుశా తెలుగులో ఎవరూ లేరేమో! ఆయన కథల్లో అంతర్లీనంగా ఉండే జెన్ తాత్వికత గురించి ఎప్పటినుంచో రాద్దామనుకుంటున్నాను. చూడాలి.

    ఇక మీ ప్రశ్న “కవిత్వం, కథలు ఎందుకు?” అన్నది నన్ను కూడా చాలా రోజులు వేధించింది. ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం”లో చాలా చోట్ల ఈ ప్రస్తావన ఉంది. ఆయన చెప్పిన విషయాలు నన్ను చాలావరకు సంతృప్తి పరిచాయి. ఒకానొక ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ గారిని అడిగిన ప్రశ్న దానికి ఆయన సమాధానం కింద ఇస్తున్నాను.

    “కళ కళ కోసమే” అన్న వాదన మళ్ళీ ఎదో వొక రూపంలో బహిర్గతమవుతుంది. కారణం? “శుద్ధకళా” వాదన మనుగడకు పరిస్థితులున్నాయా?

    జ. “కళ కళ కోసమే” అనే వాదన తలెత్తిందని నేననుకోను. ఈ మధ్య నేను ఎక్కడా వినలేదు. “కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని అనుకుంటున్నాను.

    చాలా రోజులకి మీనుండి ఒక సమగ్రమైన వ్యాసపరంపర మొదలవడం ఆనందంగా ఉంది. మీ తదుపరి వ్యాసాల కోసం ఎదురుచూస్తూ..

    — సుబ్రహ్మణ్యం

  9. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి V Chowdary Jampala గారి అభిప్రాయం:

    01/03/2010 3:50 am

    ఈ సంకలనంలో శ్రీశ్రీ సంధ్యాసమస్యలు కవితకి బాపు వేసిన చిత్రం లేదు. ఆంధ్రజ్యోతికోసం వేసిన చిత్రాల పరంపరలోని ఈ చిత్రం తానా తెలుగు పలుకు (10వ సంపుటం, చికాగో, 1995)లోనూ, తెలుగునాడి జూన్‌ 2009్ సంచికలోనూ పునర్ముద్రించబడింది.

    – జంపాల చౌదరి, మండలీన్‌, ఇల్లినాయ్‌.

    [నిజమే. అది బొమ్మల స్కాన్లను ఒకటే డాక్యుమెంటుగా సంకలించడంలో జరిగిన పొరపాటు. ఆ బొమ్మను కూడా ఈ సంకలనంలోకి జత చేశాం. పొరపాటు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]

  10. శ్రీశ్రీ తో ముఖాముఖీ – 1 గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    01/03/2010 1:06 am

    ఆడియో చాలా వేగంగా ప్లే అవుతున్నది. 33ఆర్ పి ఎమ్ రికార్డు 78 ఆర్ పి ఎమ్ లో తిప్పినట్టుగా ఉన్నది. ఇదే కాదుమిగిలిన ఆడియోలన్ని అల్లాగే వస్తున్నాయి. ఈ కింది బొమ్మలు చూడండి.

    [మీ పోస్టులో బొమ్మలేమీ లేవు. మేము రెండు మూడు బ్రౌజర్లలో టెస్ట్ చేశాము. ఆడియో మామూలుగానే వస్తున్నది. పాతకాలం ఆడియో కావడంతో క్వాలిటీ తక్కువగా ఉన్నా ప్లే సరిగ్గానే అవుతున్నాయి. ఐనా ఈ సమస్యకి మూలమూ పరిష్కారమూ వెతుకుతున్నాం – సం.]

« 1 ... 1190 1191 1192 1193 1194 ... 1582 »