Comment navigation


15812

« 1 ... 1192 1193 1194 1195 1196 ... 1582 »

  1. కృష్ణం వందే జగద్గురుం గురించి mOhana గారి అభిప్రాయం:

    01/01/2010 2:56 pm

    నాకు కూడా ఈ ఆల్బం అంటే చాలా ఇష్టం. Music India online లో దీనిని విన్నాను. మామియం చలితా అష్టపదిని సుశీల గళంలో నేను విన్నది లేదు. గీతగోవిందములో వదసియది దంతరుచి తరువాత నాకు నచ్చిన అష్టపది ఇది. ఈ అస్టపదిలోని కొన్ని చరణాలు మహాకవి కాళిదాసు భావాలవలె ఉంటాయి. ఈ మధ్య దీనిని నిత్యసంతోషిణి కంఠంలో విన్నాను. చక్కటి సంగీతవ్యాసాన్ని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి వందనాలు. లలితలవంగలతా అష్టపదిలో ఎందుకో రాజేశ్వర రావు గారు విహరతి హరిరిహ సరస వసంతే అనే ధ్రువమును (పల్లవిని) వాడలేదు. సంస్కృతగీతాలలో పల్లవి చరణము తరువాత వస్తుంది. సువ్వి పాటలలో, లాలి పాటలలో పాత పుస్తకాలలో (అప్పకవీయము లాటిది) సువ్వి, లాలి అని వ్రాయరు. కాని పాడేటప్పుడు ఆ పదాలను ఉపయోగించాలి.

    ఇందులో చాలా అచ్చు తప్పు లున్నాయి. నా కంటికి కనబడ్డ కొన్నిటిని కింద జత చేస్తున్నాను.
    శ్లోకం – సంకాశం (శంకాశం కాదు)
    2) కుంద రదన అని ఉండాలి, తాండవ లీలా అని ఉండాలి.
    4) త్వరిత ముపైతి అని ఉండాలి.
    5) నళిన వదన, మండిత గుణశీల అని ఉండాలి
    6) వాసుదేవం తరువాత బృందాలోలం అని పాటలో ఉంది.
    9) దుండగంపు అని ఉండాలి.
    విధేయుడు – మోహన

  2. రెండు శ్రీల కవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/01/2010 2:38 pm

    రేఖామాత్రంగా నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవిత్వం గురించి చేసిన కొన్ని ఊహలమీద రేఖామాత్రంగా నాలో కల్గిన సందేహాలు క్లుప్తంగా ఇలాంటివి.

    ఇటీవల హైద్రాబాద్ లో పుస్తకప్రదర్శన జరిగింది. అందులో నా దృష్టిలో పడిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు సరిగ్గా చదవనుకూడా తెలియని..అర్ధంకాని కొందరు కుర్రకారు పనిగట్టుకుని పుస్తకాల షాపుల్లో అడిగి మరీ శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని కొనుక్కోవడం. నేను వారిని ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారని అడిగాను. అందులో మెడిసన్ ఆఖరు సంవత్సరం చదివే ఒక అమ్మాయి నాతో చెప్పిన జవాబు ఇదీ!! “మామ్ నాకు మహాప్రస్తానం భాష ఏమీ బోధ పడదు. కానీ ఆ పోయెమ్స్ చదివితే నాకు బాగుంటుంది. ఒక ఆకర్షణ ఏదో ఆ మాటల్లో ఉంది. అందుకని కస్టపడి అయినా నేను మహా ప్రస్తానాన్ని చదవాలని అనుకుంటున్నాను అంది.

    నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి విప్లవ సంస్థల్లో పనిచేసే అమ్మాయి కాదు. మహాప్రస్థానపు పూర్వాపరాలేవీ ఆ అమ్మాయికి తెలియవు. ఆ అమ్మాయి ఆరుద్రని గాని విరసం ఆవిర్భావాన్ని గానీ ఎరగదు. వాటివేటిమీదా ఆ అమ్మాయికి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.

    ఒకానొక రాజకీయ సంక్షుభిత కాలం గడిచిపోయేకా నారాయణ రావు అభిప్రాయం ప్రకారం మహాప్రస్థానం నాటి ఆవేశాలు సంపూర్తిగా చల్లారాకా నిజానికి ” మరోప్రపంచం” లాంటి కవిత్వపు అవసరం లేని కాలానికి ఆ కవిత్వం మీద ఆసక్తీ లేదా అనురక్తీ కలగడానికి మరి వీలు లేదు. చాలావరకూ “అభ్యుదయ కవిత్వపు స్పందనలు అలా ఎన్నో అలా చల్లారిపోయినవి ఉన్నాయి కూడా!! కానీ మహాప్రస్థానం విషయంలో ఆనాటి రాజకీయ సందర్భం ప్రపంచంలో మారిన ఈనాటికీ ఆ సంకలనం మీద మాత్రం ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేక పోవడాన్ని మనంచూడవచ్చు.

    నారాయణరావుగారు ఏ వయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చేత ప్రేరణ పొందారో ఆ వయసులోని యువతీ యువకులు ఈనాటి తరం వాళ్ళు సైతం ప్రేరణపొందటం వెనక గల కారణాన్ని కేవలం “జాంతవమైన ప్రేరణ గా మాత్రమే” క్లుప్తీకరించి మాట్లాడలేం!! ఈనాటి తరానికి కూడా ఆ పుస్తకంలో కావలసినదేదో ఉందన్న అంచనాకి రావాల్సి ఉంటుంది.

    శ్రీశ్రీతో తన నడివయసు దాకా సరిపడా పరిచయం కల్గిన నారాయణరావు సూటీగా తనకి కల్గిన అనుమానాలనీ..లేదా తన పరిశీలననీ శ్రీశ్రీతోనే ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారన్న ప్రశ్నకి ఇక్కడ చోటుంది. అది అటుంచితే.. శ్రీశ్రీ జతించిన ఒక పాతిక ఏళ్ళకి నారాయణరావుకి మహాప్రస్థానం లోని గేయాలు రష్యా మీద రాసిన దానితో సహా ” నవ్వొచ్చేలా ఉండి ఉండొచ్చు”. కానీ ప్రపంచానికి రష్యా ఒక కాల్పనికమైనదే అయినా ఒక స్వప్నాన్ని అందించిన మాట వాస్తవం. ప్రపంచ సాహిత్యానికి రష్యన్ రచయితలు ఎన్నో రకాలుగా ప్రేరణని ఇచ్చారన్నది ఒక వాస్తవం. ఇక్కడ రష్యా అన్న దాని ఉథ్థాన పతనాలు మనం చూసాము గనక ఆ మాట అనగలుగుతున్నాం!! అది మనకి సమీప కాలంలో జరిగిన రాజకీయ ఘటన. అదే మనకి సుదూరమైన రోమన్ గ్రీక్ రాజకీయ సాహిత్య ఘటనల మీద మనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలమా?? రాజకీయ సంక్షోభం సంభవించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆనాటి కాలంలో దానికి సంబంధించిన సాహిత్య స్పందనలు వస్తాయి.ఆనాటికి అవి సత్యం అవి ఆనాటికి ఒక ఆదర్శం! శ్రీశ్రీ మహాప్రస్థానం తో సహా!!

    ఇంక శ్రీశ్రీ సృజనలోని నిజాయితీని మనం ఇవాళ శంకించడంలో అర్ధంలేదు. ఆయన మార్క్సిస్ట్ గా మారి వాటిని రాసాడా లేదా కేవలం నిబధ్ధత లేని ఉత్తుత్తి తెచ్చుకోలు ఉద్రేకాన్ని ప్రదర్శంచాడా అన్నది ఏ రుజువులకీ దొరకనిది.అలాంటి ప్రకటనలకి ఏ చెల్లుబాటూ ఉండదు . అలాగే ఆయన నాయకత్వం మీద కూడా!!

    శ్రీశ్రీ ప్రభావం అన్నది ఒక వాస్తవం. శ్రీశ్రీ సాహిత్యం ఒక అవసరం అయిన మాట వాస్తవం.ఒక తరానికి కాదు రెండు తరాలకి కాదు. ఈనాటికీ ఆయన సాహిత్యంలో ఉత్తేజ పూరితమైన ఒక ప్రాణశక్తి కవిత్వ పిపాసువులకి దొరుకుతోంది. నారాయణరావుగారికి అర్ధ రహితంగా కన్పించి ” నవ్వుతెప్పిస్తూన్న’ విధానంలో కాకుండా శ్రీశ్రీ గేయంలోంచి తమతమ ఆవేశాలకి తమతమ ప్రేరణలకి మార్గాలు వెతుక్కుంటున్న ఈనాటితరం శ్రీశ్రీలో చూస్తున్నదేమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.

    శ్రీశ్రీ కాలంనాటి వ్యక్తిగత స్పర్ధలతో సంబంధం లేని తరాలు ఆయన కవిత్వంలో ఏమిటి వెతుక్కుంటూ ఇవాళ్టికీ మహాప్రస్థానాన్ని కొనుక్కుంటున్నారో గమనించవలసి ఉంది. అది తెలియందే అతి సునాయాసంగా శ్రీశ్రీని అంచనా వేయడం కస్టం. కవితాస్పందన వేరు. అకడమిక్ విశ్లేషణ వేరు. శ్రీ శ్రీ కవిత్వం మెదడు పైపై పొరలనే తాకిందో..మరింతగా ఇంకి ఈనాటికీ మనసులోతులనే అంటిందో తెలుసుకోగల కొలమానం ఒక్క శ్రీశ్రీ కవిత్వమే!! దానికి సాటి అయినది అది మాత్రమే!! ఆకాశానికి సాటి అయినది ఆకాశమే అయినట్టూ..సముద్రానికి సాటి అయినది ఒక్క సముద్రమే అయినట్టు!!

    రమ.

  3. రెండు శ్రీల కవి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 12:26 pm

    కవులూ, రచయితలూ కూడా మామూలు మనుషుల్లాగే ఆలోచిస్తూ, తమ శక్తిసామర్థ్యాల మేరకు రచనలు చెయ్యడం మొదలెడతారు. ఆ రచనల ప్రభావం సాహితీరంగంమీదా, సమాజంమీదా రకరకాలుగా పనిచేస్తుంది. వాటి ఫలితాలు మళ్ళీ ఆ రచయితలని ప్రభావితం చేస్తాయి. వీటన్నిటివల్లా వారి అభిప్రాయాలు బలపడడమో, బలహీనపడడమో, మరింత స్పష్టతని సంతరించుకోవడమో స్వాభావికంగా జరగడంతో వారి తరవాతి రచనలూ, వారి దృక్పథమూ మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామాలు ప్రసిద్ధ రచయితలందరిలోనూ కనిపిస్తాయి. ఇది సహజమే.

    కొన్ని దశాబ్దాలపాటు, వివిధ సందర్భాల్లో, వివిధ ప్రేరణలూ, ఒత్తిళ్ళూ పనిచేస్తున్నప్పుడు వారు వెలువరించే రచనలన్నీ ఒకేలా ఉండాలని అనుకోవడం సరికాదు. ఎంత గొప్ప రచయితయినా మనం అతని రచనల్లో కొన్ని బావున్నాయనీ, కొన్ని బాలేవనీ అనుకోవడంలో తప్పులేదనుకుంటాను.

    రచయితలూ, రాజకీయపార్టీలూ ఒకరినొకరు సందర్భానుసారం ‘వాడుకోవడం’ మామూలే. కేవలం ఆ కారణంగా రచయితలను దుమ్మెత్తిపొయ్యవలసిన అవసరం లేదనుకుంటాను. ప్రేరణ ఎటువంటిదైనా రచనను evaluate చెయ్యవచ్చు. వ్యాసకర్త చెప్పినట్టుగా సమకాలీన వాతావరణం గడిచిపోయిన తరవాత భావితరాలు ఆవేశ కావేషాలకతీతంగా వాటిని సమీక్షించుకోవచ్చు.

    కన్యాశుల్కమనేది సమస్య కాకుండాపోయిన తరవాత కూడా గురజాడ నాటకం చదివి ఆనందిస్తున్నాం కదా. నిజాం జులుం గతించిపోయాక కూడా బండెనక బండిగట్టి పాట ప్రేక్షకులను ఎంత ఉత్తేజపరుస్తుందో ముంబయిలో 2008లో నేను నిర్వహించిన సంగీతవిభావరిలో అందరం గుర్తించాం.

    శ్రీశ్రీనో, మరొక రచయితనో ఈనాడు మనం అర్థంచేసుకుంటున్నప్పుడు గతంలో అతను పొందిన ప్రశంసలనూ, విమర్శలనూ అతిగా పట్టించుకోకుండాఉంటే మనకే మంచిదేమో. అందరూ గొప్ప కవులే అయినప్పటికీ శ్రీశ్రీ, విశ్వనాథ, ఆరుద్ర, సినారె మొదలైన కవులందరినీ కాలమే వారికి సముచితమనిపించే స్థానాల్లో నిలబెడుతుంది.

  4. నాకు నచ్చిన పద్యం: ధర్మజుని గుణవిశేషం గురించి mOhana గారి అభిప్రాయం:

    01/01/2010 11:49 am

    అందమైన చిన్న వ్యాసం. చిత్రం ఏమంటే ఈ పద్యపు గొప్పదనము నాకు దీని అనుకరణ, అనుసరణల ద్వారా అవగాహన అయినది. తిక్కనకు బహుశా సమకాలీనురాలైన మొల్ల తన రామాయణములో ఇంత చక్కని పద్యమే రాసింది. ఆ పద్యం –

    ఎవ్వాని వీటికి నేడు వారాసులు పెట్టని గోడలై పెచ్చు పెరుఁగు
    నెవ్వాని సేవింతు రింద్రాది దేవత లనుచర బలు లయి యనుదినంబు
    నెవ్వాని చెఱసాల నే ప్రొద్దు నుందురు గంధర్వ సుర యక్ష గరుడ కాంత
    లెవ్వాని భండార మిరవొంద విలసిల్లు నవ నిధానంబుల వివిధ భంగి
    సకల లోకంబులును మహోత్సాహ వృత్తి
    నెవ్వనికిఁ జెల్లుఁ బుష్పక మెక్కి తిరుగ
    నాకె తక్కంగఁ గలదె యే నాటనైన
    మద్భుజాశక్తి ప్రతి పోల్ప ద్భుతంబు – మొల్ల రామాయణము, సుందర, 47.

    రావణుడు సీతముందు అశోకవనంలో ప్రగల్భాలు చెప్పుకుంటున్నప్పుడు తానే “సొంత డబ్బా” కొట్టుకొన్న ఘట్టం ఇది.

    దీనిని చదివిన తరువాత తిక్కనగారి పద్యాన్ని చదివాను. తిక్కనగారి ఈ సీసపద్యం ఒక మూసలాటిది. సీసపద్యపు గొప్పదనానినికి ఇది ఒక నిదర్శనం.

    బృందవనరావుగారికి నస్సులతో – మోహన

  5. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 11:35 am

    బొంబాయిలో సాహిత్యాభిలాషగల కేరళ మిత్రులు కొందరు శ్రీశ్రీ కవితల ఇంగ్లీషు, మలయాళం అనువాదాలను తాము చదివి ఆనందించామని నాతో అన్నారు. శ్రీశ్రీకి తెలుగుభాష మీద ఉండిన పట్టు వారికి తెలియదు కనక కవితావస్తువూ, భావనలే వారిని ఆకట్టుకుని ఉండాలి. రావిశాస్త్రి అన్నట్టు శ్రీశ్రీ గొప్పతనానికి ముఖ్యకారణం ఆయన ప్రజలపక్షాన నిలబడడమే.

  6. ఈమాట నవంబర్ 2009 కొ.కు ప్రత్యేక సంచికకు స్వాగతం గురించి jhansi గారి అభిప్రాయం:

    12/31/2009 1:19 am

    సంపాదకులకు నమస్కారములు.
    ఈ పత్రిక చాలా బావుంది.ఇలాగే కొనసాగించండి.ఈ పత్రికకు ఏమైనా వ్యాసాలు పంపుటకు గాను మీ చిరునామా తెలియపరచగలరు.
    ఇట్లు…
    మీ పత్రికా అభిమాని

    [ఈమాటకు రచనలు ఎలా పంపాలో రచయితలకు సూచనలు లో చూడండి – సం.]

  7. కొ.కు ఉత్తరాలు – 1 గురించి రాజశేఖర్ గారి అభిప్రాయం:

    12/30/2009 2:26 pm

    చందమామ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అసందర్భమయినా ఈ వ్యాఖ్యకు పూనుకుంటున్నాను. 1950ల లోనే కాదు ఈనాటికి అంటే 2009 చివరలో కూడా తెలుగు చిరునామాతో ఏదయినా పాఠకుల ఉత్తరం గానీ కవర్ కానీ చెన్నయ్ పోస్టల్ శాఖకు వచ్చిందంటే అది ఖచ్చితంగా చందమామకే వచ్చి తీరుతుంది. అంతే కాదు మరాటీ, గుజరాతీ, ఒరియా, హిందీ, మలయాళం తదితర భాషల్లో చిరునామాలు చెన్నయ్‌కి వచ్చాయంటే అవి చందమామకు రావలిసిందే. పోస్టల్ శాఖలో దశాబ్దాలుగా చందమామకు వచ్చిన విశిష్ట గుర్తింపు అలాంటిది మరి. చివరకు ఫార్మాసూటికల్ సంస్థలకు, ఇతర అవసరాలకు కూడా రాష్ట్రం నుంచి చెన్నయ్‌కి తెలుగు చిరునామాలతో వచ్చే ఉత్తరాలు కూడా నేరుగా చందమామకే వస్తున్నాయంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. తమిళం, ఇంగ్లీషు భాషలలో కాకుండా మరే భారతీయ భాషలో అయినా చెన్నయ్‌కి లెటర్ వచ్చిందంటే అది చందమామకే కాబోలు అని పోస్టల్ ఉద్యోగులు గుడ్డిగా నిర్ధారించుకుని చందమామ కార్యాలయానికి పంపుతున్నారు. కుటుంబరావు గారి అనుభవం యాభై ఏళ్ల తర్వాత కూడా చందమామకు ఉత్తరాల విషయంలో చెల్లుబాటవుతోంది. చందమామ చరిత్రకు సంబంధించిన ఈ విషయాన్ని గుర్తుచేసినందుకు రోహిణీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    రాజు
    చందమామ

  8. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి korrapati sudhakar గారి అభిప్రాయం:

    12/30/2009 3:42 am

    రోహిణీ ప్రసాదు గారు – పుష్పవిలాపం గురించి వ్యాసం బాగుంది. మీరు తెలుగు భాషకు మరియు సంగీతానికి చాలా సేవ చేస్తున్నారు.

  9. హెల్లో…శంకరం… గురించి beena గారి అభిప్రాయం:

    12/27/2009 2:23 am

    hi raoji,

    your story is simply excellent.Nowadays we can see these type of situations in many familys .
    I identified myself in your story.
    thanks alot.

  10. నాయినమ్మ యిల్లు గురించి naren g గారి అభిప్రాయం:

    12/26/2009 11:30 pm

    క్లుప్తంగా వ్రాసినా, చాలా బాగా వ్రాసారు.

    గతించిన మా అమ్మమ్మతో పాటూ నా జీవితాన్ని అల్లుకున్న అనేక మంది బామ్మలను వారు వదలి వెళ్ళిన పరిసరాల పరిమళాల్ని జ్ఞప్తికి తెచ్చారు.

    ధన్యవాదాలు,
    నారాయణ గరిమెళ్ళ.

« 1 ... 1192 1193 1194 1195 1196 ... 1582 »