Comment navigation


15812

« 1 ... 1193 1194 1195 1196 1197 ... 1582 »

  1. అమ్మ ఉత్తరం గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:

    12/26/2009 12:53 pm

    ఉత్తరానికి సాటి అయిన వేరొక సాధనం లేదు మరి…!

  2. ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం గురించి KOPPAKA.RAMAKRISHNA గారి అభిప్రాయం:

    12/24/2009 5:39 am

    It is extremely heartening to read how Telugu language is spread in western lands.I earnestly wish the efforts made by the concerned people fructify and let the language spread its roots deep into the ground and the branches spread wide and wide and reach INDIA.Mera Bharat Mahan.
    Regards.
    KOPPAKA.RAMAKRISHNA

  3. రెండు అమెరికన్ రుతాలు గురించి VM గారి అభిప్రాయం:

    12/22/2009 3:22 pm

    అరె వాహ్!
    “కదలని కెరటాల పాల సముద్రం” అని పడిన మంచుని ఎంత చక్కగా వర్ణించారండి.

  4. రచయితలకు సూచనలు గురించి Siva Jasthi గారి అభిప్రాయం:

    12/19/2009 7:35 pm

    http://www.google.com/transliterate/indic/telugu
    గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ — ఈ పధ్ధతిలో కూడా మీరు తెలుగు రచనలను స్వీకరించవచ్చు

  5. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/19/2009 2:02 pm

    “సంకుచిత దృష్టి” లాంటి మాటలు “విన్నపం” అన్న మాటలు పరస్పర విరుధ్ధమైన ప్రకటనలు. నేను స్పందించాలా వద్దా అన్న విషయమ్ గానీ..నా అభిప్రాయాలని లోకం మీద రుద్దవద్దని చెప్పే హక్కుగానీ ఏ రకం గానూ చంద్రశేఖర్ గారికి ఉండవని తెలియజేసుకుంటున్నాను.

    అస్థిత్వ ఉద్యమాల గురించిన స్పృహ గురజాడలో ఉంది. కొకులో లేదు. అది వారి సాహిత్యపరమైన సత్యం. వారి సిధ్ధాంతం లో కన్పించే వైరుధ్యం కూడా!! దాన్ని కాదనలేక ఏదో తాను అన్నదాన్ని సమర్ధించుకోవాలనే ఒక చాపల్యంతో నన్ను నియంత్రించాలని చూడటం అసహనాన్ని ప్రదర్సించటమూ సాహిత్య దృక్పధంలోకి రావు. కమ్యూనిస్టుల నియంతృత్వ ధోరణులు అలాంటివి.

    నా అభిప్రాయం నాది…. దానితో చంద్రశేఖర్ లాంటి వారు ఏకీభవిస్తారా..లేదా అన్నది ఆ తర్వాతి అంశం!! ఇవాళ మళ్ళీ కుటుంబరావు కధల్ని చదివినప్పుడు అనేక లోపాలు ..కన్పిస్తాయి. దానికి ఇలా ఈ మాటలో రాసుకునే కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది.ఇవాళ్టి సామాజిక నేపధ్యంలో స్త్రీలు ఆయన సాహిత్యానికి ఎలా ప్రతిస్పందిస్తారూ అన్నది ఎవరికైనా ముఖ్యమైన విషయం కావాలి. స్త్రీవాద దృష్టి ఆయన కధలు రాసిన కాలానికి సాహిత్య సమాజంలోలేదు. కానీ గత పాతిక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేకానేక ఉద్యమాల నేపధ్యంలోంచి కొకు నీ ఆయన కధల్నీ మరోసారి ఈ దృష్టితో విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది..బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
    అందుకు కొత్త అభిప్రాయాల్ని ఎవరైనా ప్రకటిస్తే ఆ సందర్భంలో అసహనం ప్రదర్శించడం వలన ఏ ప్రయోజనమూ లేదు.

    రమ.

  6. జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhaskar Chintha గారి అభిప్రాయం:

    12/19/2009 11:23 am

    It is Excellent.
    I enjoyed it.
    Ilearnt how to speak lovely.
    many many thanks to Smt.Savithri Madem.

  7. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి చంద్రశేఖర్ గారి అభిప్రాయం:

    12/19/2009 7:03 am

    సిద్ధాంతం కోసం జీవితాన్ని కళలో వక్రీకరించరాదని నమ్మినవాడు కుటుంబరావు. ఇలా నమ్మినపుడు రచయితకు దృష్టినిచ్చేది సిద్ధాంతమే అన్న విషయాన్ని ఆయన విస్మరించాడనుకుంటాను. ఐతే తన సిద్ధంతాలను రచయిత బలవంతంగా పాఠకుల మీద రుద్దరాదని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కమ్యూనిజంలాంటి సిద్ధాంతంతో నిబద్ధత లేకుండా రాసి గొప్పగా జీవితాన్ని విమర్శించిన గురజాడ లాంటి కళాకారుల దృష్టివెనుక కూడా ఒక సిద్ధాంతం వుంటుంది, అదేమిటో ఒకోసారి ఆ రచయితకు కూడా తెలియకపోవచ్చు. రచనలోని దృష్టికోణాన్ని పట్టుకుని ఆ సిద్ధాంతాన్ని, దాని ఉపయోగాన్ని, పరిమితులను బయల్పరచవలసిన బాధ్యత సాహిత్యవిమర్శకులకు ఉంటుంది. ఏ సిద్ధాంతానికీ సార్వకాలీనత ఆపాదించలేం. అలాగే ఒక సిద్ధాంతం నుంచి మలి తరాల వారు నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదనీ చెప్పలేం. తన వర్తమాన ప్రపంచానికి మార్గదర్శకమైన దృష్టి ఎప్పటికీ అదే స్థానంలో ఉండాలని పరిణత రచయితలెవరూ కోరుకోరు. అయితే జీవితవిమర్శ పట్ల తాము అవలంబించిన వైఖరి భావి తరాల వారికి ఒక నమూనా కావాలని మాత్రం వారు ఆశిస్తారని నా అనుమానం. గురజాడ అభ్యుదయవాదాన్ని, దార్శనికతని ఆదర్శంగా తీసుకున్న రచయితలెవరైనా గురజాడ అందించిన దృష్టిని, ఆయన వైతాళికతను గౌరవిస్తూనే గురజాడ స్పృశించని జీవితాన్ని, గురజాడకాలానికి ఇంకా తెలుగు జాతికి అందని దృష్టిని తెలుగు సాహిత్యానికి అందించారు. వారి వారి చారిత్రక సందర్భాల్లో కొత్త చూపును ఇచ్చిన కళాకారులను తలచుకోవడం అంటే వారి భావజాలంతో పూర్తిగా ఏకీభవించడం ఎంతమాత్రం కాదు.

    రమా భరద్వాజ్ గారు ప్రస్తావించి గురజాడతో పోల్చిన రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన మహత్తర దృష్టి, చారిత్రకదృక్పథంతో చూస్తే, గురజాడ నుంచి ఆశించడం అవివేకం. గురజాడ దూరదృష్టి ఈ రచయితలకు కొరవడిందనడం రమ గారి సంకుచిత దృష్టికి నిదర్శనం. గురజాడనుంచి రమ గారు కోట్ చేసినట్టు కుటుంబరావు నుంచి నాకు తెలిసి కొన్ని వందలు కోట్ చేయవచ్చు. ఆయన రచనలనుంచి సంస్కారం నేర్చుకున్న అనేకమందినుంచి రమ గారు వీటిని సేకరించొచ్చు. తమ సమకాలీన సమాజపు చరిత్రను కళారూపంలో భద్రపరచడానికి నిజాయితీగా కృషి చేసిన కుటుంబరావులాంటి వారి అవసరం మనకు లేదనుకుంటే మనకు చరిత్ర అవసరం గూర్చి ఏమీ తెలియదనుకోవాలి.

    అదిగాక, సిద్ధాంతాల పట్ల ఎవరి అభిప్రాయం వారిది అని సాపేక్షవైఖరి అవలంబిస్తే, ఏదో ఒక మహాకధనానికి అందరూ కట్టుబడవలసిన అవసరం లేదు అనుకుంటే, కొ.కు. సరిపడని వారు కొ.కు.పై వ్యాసానికి స్పందించవలసిన అవసరమే లేదు.

    అభిప్రాయాలను వార్తలుగా చలామణి చేస్తున్న కొన్ని తెలుగు పత్రికల్లాగ మీ అభిప్రాయాలను ‘సాహిత్యవిదితం’ అంటూ లోకం మీద రుద్దడం మానుకోవాలని రమగారికి నా విన్నపం.

  8. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    12/18/2009 6:35 pm

    వేరువేరు తరాలకి చెందిన రచయితల మధ్య పోటీని ఊహించుకోవటం అర్థంలేని పని. కుటుంబరావు కథలకీ, శ్రీపాద కథలకీ competition పెట్టడం, కుటుంబరావు కథలకీ, రావిశాస్త్రి కథలకీ పోటీ పెట్టడం వగైరాలన్నీ అనవసరం. గతకాలపు రచనలకు ఇప్పటికీ ఏ రకంగానైనా validity ఉందంటే అది ఆలోచించవలసిన విషయం. ఇండియా అయేది, అమెరికా అయేది, తెలుగువారిలో ఈనాటికీ రామప్ప పంతుళ్ళూ, అగ్నిహోత్రావధాన్లూ, సీతప్పలూ, మందుల భీముళ్ళూ కనబడటంలేదా? వ్యాసరచయిత చెప్పదలుచుకున్నది అదేననుకుంటాను. ఏ తరం సమస్యలు ఆ తరం రచయితలు సమర్థవంతంగా tackle చేస్తే అది ఆహ్వానించదగినదే.

  9. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/18/2009 1:06 am

    పాఠకులు తీలివైనవాళ్ళు అని గనక గుర్తుంచుకుంటే అభిప్రాయాలురాసేవాళ్ళు పనిగట్టుకుని వక్రీకరించడం చేయరు. అర్ధం కాకపోయినా…సాహిత్య నేపధ్యం సరిగా తెలియకపోయినా తప్పులేదు. కానీ తెలుసుకునే ప్రయత్నం నిజాయితీగా చెయ్యకపోతే..ఏదో ఒకటి అనేద్దాం అనే ఉబలాటంలో వారే మరింత పొరబడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ గారి అభిప్రాయం ఇందుకు ఒక ఉదాహరణ.

    “థియరీ” అని నేనన్నప్పుడూ..నేను పేర్కొన్న “కొకు” ఇంకా ఇతర కవి రచయితల సిధ్హాంతాలూ..గురజాడా ..గాంధీ ల సిధ్ధాంతాలూ..ఒకటి కావనీ..ఈ రెంటికీ మధ్య ఏమాత్రం సారూప్యం లేదనీ నెను ఎక్కడా నా అభిప్రాయంలో ఇటువంటి అర్ధాన్నిచ్చే మాట వాడలేదనీ నా మాటలని వివరంగా చదివిన వారికి
    వివరంగానే తెలిసే వీలుంది. ఇక్కడ సందర్భం కుటుంబరావు గారు. గురజాడ, గాంధీలు కారు. వీళ్ళందరినీ అర్ధం పర్ధం లేకుండా ఒకే గాట కట్టి మాట్లాడేయడం వల్ల చంద్రశేఖర్ గారికి ఈ బేధం తెలియలేదని తెలుస్తుందే తప్ప నా మాటల్లో ఎలాంటి అయోమయం లేదు.

    నా అభిప్రాయంలో నేను గురజాడని “ద్రష్ట” అని సంబోధించాను. ఆయన ద్రష్ట
    ఎందుకో కూడా వివరించాను. అలాంటి దూరదృష్టి “కొకు” అలాగే ఆ తరహా కమ్యూనిష్టు సిధ్ధాంతాలని నమ్మిన ఇతర రచయితలలో కొరవడిందని ఉదాహరణ పూర్వకంగా అన్నాను..గురజాడా వాక్యాన్ని ఉటంకిస్తూ!!గనక అభిప్రాయం నేను రాసినప్పుడు నాకు ఏమి చెబుతున్నానో..ఎందుకు చెబుతున్నానో స్పష్టత ఉన్నది. పాఠకునిగా చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి అటువంటి స్పష్టత కలగాలని ఆశిస్తాను.
    రమ.

  10. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి చంద్రశేఖర్ గారి అభిప్రాయం:

    12/16/2009 12:49 am

    థియరీ మార్చుకుంటే మార్పులు కనపడతాయని చెప్పి రమా భరద్వాజ్ గారు మాకళ్ళు తెరిపించారు. ఈ విషయం గాంధీ లాంటి పిచ్చివాళ్ళకి, గురజాడలాంటి వెర్రివాళ్ళకి తెలిసుంటే, వాళ్ళ వాళ్ళ థియరీలు మార్చుకుని బ్రిటిషు వారివల్ల మాత్రమే మన అభివృద్ధి సాధ్యమనీ, కన్యాశుల్కం వల్ల ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు లాభమని నమ్మి సుఖంగా జీవించేవారు. ఎంత దురదృష్టం?

« 1 ... 1193 1194 1195 1196 1197 ... 1582 »