Comment navigation


15815

« 1 ... 1188 1189 1190 1191 1192 ... 1582 »

  1. కలకీ కలకీ మధ్య గురించి Aparna గారి అభిప్రాయం:

    01/10/2010 4:46 pm

    నచ్చలెదు..meaningless story

  2. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana గారి అభిప్రాయం:

    01/10/2010 2:02 pm

    జగన్నాధంగారూ, ప్ర, త్ర్య లాటి అక్షరాలవలెనే క్ష అక్షరం కూడా ఒక సంయుక్తాక్షరమే. నిఘంటువులలో క్ష-కారముతో ఆరంభమయ్యే పదాలు క అక్షరం కిందే ఉంటాయి. ప్ర అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు క్ష అక్షరంతో ఆరంభమయ్యే పదాలకంటే ఎక్కువే. కాని దీనికి కొందరు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి కారణం బహుశా క్ష అక్షరం పలికేటప్పుడు, క కు ష ఒత్తు ఇచ్చి పలికేటప్పుడు ఉచ్చరణలో కొద్దిగా భేదం ఉండడంవల్లనేమో? లేకపోతే మతపరంగా (చక్రాలు ఇత్యాదులు) మరేమైనా కారణం ఉందేమో? యూనికోడ్‌లో ఈ అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం లేదు అనే అనుకొంటా. విధేయుడు – మోహన

  3. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి jagannadham alapati గారి అభిప్రాయం:

    01/10/2010 12:18 pm

    భాష పైన, ప్రత్యేకించి గణ, మాత్రా ఛందస్సులపై యింతటి సాధికారత గల్గిన మోహనరావు గారు, చాలా కాలంగా నాకున్న ఒక అభిప్రాయం సరియైనదో, కాదో తెలియజేస్తారని ఇది రాస్తున్నాను.
    “క్ష” అనే అక్షరమూ, “క” కి “ష” వత్తు ఇవ్వడమూ, ఉచ్చారణలోనూ, ఇంచుమించు రూపంలోనూ ఒకే రకంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి “క్ష” అనే అక్షరం యొక్క ఆవస్యకత ఏమైయుండునో తెలుపగలరు.
    జగన్నాథం ఆలపాటి

  4. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr. Apparao Nagabhyru గారి అభిప్రాయం:

    01/08/2010 3:14 pm

    How fortunate we are to see this wonderful video of Sri Sri rendering Maro Prapancham.
    Thanks to Krishnarao garu & Babu garu.
    Apparao

  5. వెదురు వేది గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/07/2010 5:22 pm

    చెట్టంత భావాన్ని చిన్ని పదాలలో చెప్పారు, హృద్యంగా.
    విధేయుడు
    -Srinivas

  6. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి Ramkishore గారి అభిప్రాయం:

    01/07/2010 6:11 am

    చాలా బాగుంది. మనసు లోని భావాలను బయటికి తీస్తే ఇటువంటి మాటలే వస్తాయి.

  7. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kayakay గారి అభిప్రాయం:

    01/07/2010 3:43 am

    కధ చాలా బాగున్నది ! ఏది చూడాలనుకున్న వాళ్లకి అది! ఆ వ్యక్తి నిషా షామల్ ఊహల్లొ నుంచి ఆ రాత్రి కవితా రూపంలొ వొచ్చిన కీట్స్ !

  8. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/07/2010 1:08 am

    పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన పేర్లకి మరికొన్ని ముఖ్యమైన జోడింపులు.

    తెలుగులో భావకవులనీ..అభ్యుదయా కవులనీ ఇంగ్లీషులోకి తొలిగా అనువాదంచేసిన ఒక మంచి అనువాదకుడు శ్రీనివాస్ రాయప్రోల్ గారు. ఆయన జయప్రభ గారి కవిత్వాన్ని కూడా ఇంగ్లీషు లోకి అనువదించారు. ఇంగ్లీషులో కవిగా అంతర్జాతీయ గుర్తింపు కల్గిన వారు శ్రీనివాస్ రాయప్రోల్ . american poet willims carlos willims వంటి వారితో ఆయనకి మంచి స్నేహం ఉండేది.

    శ్రీనివాస్ రాయప్రోల్ తెలుగు కధల్ని కూడా ఇంగ్లీషులోకి అనువాదం చేసినవారు. అలాగే తెలుగు కధలని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మరో అనువాదకుడు రంగారావుగారు. ఆయన అనువాదాలని penguin సంస్థ ప్రచురించింది. అలాగే డి.కేశవరావు గారు కూడా తెలుగు ఆధునిక కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.

    ఇంక శ్రీనివాస్ పరుచూరి చేసిన వ్యాఖ్య”బాగా” అన్నది..ఈ సరికే చర్చింపబడి ఉంది. ఎవరికి “బాగా” అన్నది ముఖ్యం. అనువాదం చేసినవారికా?? లేక ఆ అనువాదాలని చదివిన వారికా?? అని. ఏ భాషలోకి అనువాదం అవుతున్నాయో ఆ భాషలోని నుడికారంతో ఆ భాషకి సొంత కవిత్వంలాగా అన్పించేది మంచి అనువాదంగా అనుకోవాలి. ఇందులో చర్చకి అవసరమైన విషయాలు అనేకం ఉంటాయి.మూలంలోని ప్రాణశక్తి అనువాదంలోకి రాగలగాలి.

    శ్రీశ్రీ కవిత్వం బహుశా భారతీయ భాషలలోకి అనువాదం బాగా అవుతుందేమో గానీ ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు అంత బాగా చేయడం కొంచెం కష్టమైన విషయమే ఏ అనువాదకుడికైనా!! ఇవన్నీ అనువాదం చేసేవారి ముందున్న సమస్యలు. అలాగని అనువాదాలు చేయకుండా కూడా ఉండడం సరికాదు. తగినంత శ్రధ్ధ ఉండాలి అనువాదంచేసేవారికి. తగినంత నైపుణ్యం కూడా ఉండాలి. తగినంత సమయాన్ని వారు వెచ్చించ గలిగి కూడా ఉండాలి. అలా పని చేసేవారికి ఆర్ధికమైన వనరులు కూడా సమకూడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే అనువాదాలు చేయడానికి వ్యక్తులు మరింతగా ముందుకి వచ్చే వీలుంది.
    రమ.

  9. వెదురు వేది గురించి mOhana గారి అభిప్రాయం:

    01/06/2010 3:05 pm

    చక్కని కవిత! విధేయుడు – మోహన

  10. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/06/2010 1:55 pm

    ఓపికతో ఒక్క చోట పుస్తక వివరాలిచ్చినందుకు వేలూరిగారికి కృతజ్ఞతలు. వాటి (చాలా మటుకు?) గురించి “రచ్చబండ”లో వేలూరిగారు, పరుచూరి గారు పరిచయం చేసినట్టు గుర్తు. వేల్చేరుగారి “after word” మొదటగా చదివింపజేసే పుస్తకాల పట్టికలో మనపూర్వకవులవే ఎక్కువగా ఉండడం కాకతాళీయం కాక, వారు చెప్పకుండా చేసే ఇంకో విమర్శేమో అనిపిస్తుంది!

    పరుచూరిగారి ప్రశ్న “వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న” నాది కూడా. శ్రీశ్రీకి మాత్రమే వర్తింపజేస్తూ, “తెలుగునుండి అనువాదాల” గురించి ఒక్క మాట.

    సాధారణ పదాలను అసాధారణంగా వాడడం, శబ్ధాల లయ, ఊగులతో కవితనుర్రూతలూగించడం శ్రీశ్రీ కవితల్లో “కొట్టి”నట్టు కనపడుతుంది. అందుకు శ్రీశ్రీ గారి కవితలు మనకెంతగా నచ్చుతాయో, అందుకే వాటి భారతీయేతర భాషల అనువాదాలు ఎవరివైనా సరే అంతగా నచ్చవేమో అని (చెడ్ద)పెద్ద అనుమానం. భారతీయ భాషల్లో కనిపించే పదాల జిగిబిగి, శబ్దాల లయవిన్యాసం, భారతేతర భాషల్లో (సులభంగా) సాధ్యం కాదని అనిపిస్తుంది. అదీకాక, భాషపైనున్న పర్వతమంత ప్రతిభ శ్రీశ్రీ భావాలలో లోతులేకపోవడం కూడా ఒక కారణమేమో.
    =======
    విధేయుడు
    _Srinivas

« 1 ... 1188 1189 1190 1191 1192 ... 1582 »