Comment navigation


15815

« 1 ... 1182 1183 1184 1185 1186 ... 1582 »

  1. గాలిపటం గురించి siva rama prasad గారి అభిప్రాయం:

    02/24/2010 3:04 pm

    CH satyanand kumar garu, do English poems resemble your translation? It cannot be English poetry. its only word to word translation. Somersaulting ? queer usage. గాలిపటాలు గిరికీలు కొడతాయి గాని పల్టీలు కొట్టవండి. Wing stretched birds? I never heard or read/ came across such usage in English.విసిరితే వస్తుందా? విసిరి వచ్చి అక్కడి పదాల కూర్పు విచిత్రంగా అనిపిస్తుంది.

  2. కలవరపెడుతుంది మనస్సును గురించి siva rama prasad గారి అభిప్రాయం:

    02/24/2010 2:51 pm

    గర్భస్త శిశువు ఏడవటం. ప్రయోగం నచ్చ లేదు.నిర్జన ….. జనావాసాల contradictory. ఆకులు మెత్తగ రాలడం? భాషాడంబరం తప్ప భావాడంబరం లేదు.నెర + మోవి=నెమ్మోవి.నెమ్మోవికి అలము కొవడం ఏంటో.

  3. కలైన గోర్వెచ్చని పాట గురించి siva rama prasad గారి అభిప్రాయం:

    02/24/2010 2:37 pm

    బాగున్నది మీ కవిత. దాలి అంటె? నిఘంటువు వెదికితే పాలు మరిగించడానికి పిడకల ప్రోవు అని ఉంది. బాప్ప అంటె అత్త కద. మా కళింగాంధ్రలొ అత్త. నిజమే, నులక మంచాలు పట్టె మంచాలు మరచి పొయాము. ప్లై ఉడ్ మంచాల షోకు వచ్హినది. ఆ అల్లిక ఎంత (artistic) కళాత్మకంగ ఉండేది diamond shape తొ రెండేసి వరసలతొ చిత్రం గీసినట్టుగా. పోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

  4. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/23/2010 12:49 am

    ముందు రవ్వంత మొహమాటంగా మొదలెట్టి పక్క సీట్లో సినారె ఉన్నందు వల్ల కాబోలు..యూనివర్సిటీలలోని పిహెచ్ .డి లని గురించి కూడా ప్రస్తావించి….తెలుగు ఉపన్యాసకుడిలాగా మాట్లాడటమ్ మొదలుపెట్టిన ఆ మహాప్రస్థాన కారుడి నెమ్మదితనం ముందు కొంచెం అసహజంగా అన్పించింది..కానీ మెల్లగా ఆయన కవిత్వం వేపు మళ్ళాకా మాత్రం ఆయన తన ముద్రని అక్కడి శ్రోతల మనసులమీద వేసాడు. “ప్రతిజ్ఙ” కవితని చదివి ముగించాకా అక్కడి వాళ్ళు కొట్టిన చప్పట్లు తరవాత ఆయన ముఖంలోని చిన్నపిల్లవాడి ముఖంలోని ఆ అమాయకపు నవ్వుని గమనించగలిగితే [కవిగా ఆయన ఎంత తేటగా ఉన్నాడో ఆ వయసున కూడా] అన్న సంతోషం కలుగుతుంది.

    ఆయన చదివిన మహాభారతంలోని పద్యాలన్నీ బాగా ప్రసిధ్ధికెక్కిన పద్యాలే!! కానీ వాటిని ఆయన ధాటీగా అనర్గళంగా చదవడం ఆయన పద్యాలని ధారతో గుర్తుపెట్టుకోవడం ఆయన మీద ఉన్న చందస్సు ప్రభావం ..పద్యం మీద ఆయనకున్న పట్టుని కూడా చెపుతోంది.

    మొత్తానికి శ్రీశ్రీ నించి క్లుప్తంగా ఆయనపైని కవిత్వ ప్రభావాలనీ..తెలుగు కవిత్వాన్ని ఆయన అంతే క్లుప్తంగా అక్కడి శ్రోతలకి చెప్పడాన్నీ ఈవీడియో ప్రదర్శించింది.ఆయన “దహ్యప్రభావానల …సలిపిరి దీర్ఘ వాసర నిశల్ ” అన్న మహాభారత పద్యం చదువుతూంటే మాత్రం ..”కన్యాశుల్కం”లో “అట్టె అట్టె దహ్య ప్రభవానలము అంటే అర్ధమేమిటిరా?” అని కరటకశాస్త్రులు వెంకటేశాన్ని అడిగినప్పుడు గిరీశం కల్పించుకుని “ఇప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు….అంటూ వెంకటేశాన్ని కరటక శాస్త్రినించి తప్పించడానికి పడ్డ తమాషా గుర్తొంచింది.

    శ్రీశ్రీ పక్కన కూచున్న నారాయణరెడ్డి అలా కుర్చీలో కదులుతూ ఉండటం మాటిమాటికీ కళ్లజోడుని తుడుచుకుంటూండటం..జుట్టుని సవరించుకోవడమ్ లాంటి అసహజ కదలికలు చూపుకి చికాగ్గా ఉన్నా శ్రీశ్రీని క్లోజ్ అప్ షాట్ లోకి పెట్టాకా ఆ బెడద వదిలి మిగతా శ్రీశ్రీ మాటల్ని స్థిమితంగా ఆస్వాదించడానికి వీలయ్యింది.

    మద్దిపాటి కృష్ణారావు, ఇంకా వడ్లమూడి బాబులకి సంతోషాన్ని తెలియజేస్తూ..
    రమ.

  5. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి IVNS Raju గారి అభిప్రాయం:

    02/20/2010 8:48 am

    It is a rarest footage on the great poet Sri Sri. Many thanks for bringing this out. I wonder if Sri Sri would have been a champion of Sanathana Dharma how he would have excelled in doning that role!! With the unfolding of the spiritual energy hidden in the people of this world, in this information era, we certainly miss Sri Sri. Rendu Sirulanu daachukunna vaadu. Oka siri tana Kavanam and marokasiri noothanatwaanni maanavatvaanni vedake manasu. Idi chaaladu Sri Sri ni Aadhunika Aadhyaatmika Jeevi ani cheppadaaniki.

    Dhoorjati loni power of confession
    Potana loni bhakti paaravasyam
    Telugu biddalaku andacheyaali
    Anduku maroka Sri Sri kaavali.
    Aa Sri Sri Aadhyatmika Kavi
    Adhivaastavikatanunchi Aadhyatmikam vaipu adugulesina Sri Sri kaavali

    Namassulato
    __
    IVNS Raju

  6. పాఠకులకు సూచనలు గురించి BATHINI THIMMAGURUDU గారి అభిప్రాయం:

    02/20/2010 1:18 am

    గౌరవనీయులైన సంపాదకునికి నా నమస్కారాలు.

    అయ్యా!
    మీ వెబ్ సైట్ చాలా బాగుంది. మీరు తెలుగుజాతి గౌరవాన్ని , ప్రతిష్టని పెంచుతున్నాను .దానికి నేను ఆనంద పడిపోతున్నాను . మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

    ధన్యవాదములు

    ఇట్లు
    సాహిత్య అభిమాని,
    బత్తిని తిమ్మగురుడు,
    ఇడుపులపాయ,
    ఎపి ట్రిపుల్ ఐటి,
    కడప జిల్లా,
    ఆంధ్రప్రదేశ్,
    భారతదేశం (ఇండియా).

  7. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి rajendra kumar devarapalli గారి అభిప్రాయం:

    02/19/2010 3:35 pm

    కొన్నాళ్ళ క్రితం యస్పీ బాలసుబ్రమణ్యం గారు ‘చల్లగాలిలోయమునా తటిపై శ్యామసుందరుని మురళి’ అంటూ పాడి ఎవరికో అర్ధం చెప్తున్నారు.చెప్పొద్దూ ఆయన పాట విన్నాక అహోరాత్రులు కష్టపడి రాజేశ్వరరావు గారి స్వంతగొంతులో ఆపాట విన్నదాకా స్వాంతన కలగలేదు నాకు.తెలుగుచలనచిత్ర సంగీతరంగంలోని మొదటి అయిదుస్థానాల్లో రాజేశ్వరరావుగారు ఒకరు,

  8. నౌషాద్‌ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    02/10/2010 7:45 pm

    నౌషాద్‌తో సహా అనేకమంది ప్రసిద్ధులను ఖననం చేసిన ప్రదేశాలకు ముప్పు ఎదురయిందని ఈ వార్తనుబట్టి తెలుస్తోంది.

  9. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/10/2010 1:05 am

    లోకో భిన్నరుచిహి అన్నది ఆర్యోక్తి. మీకు ఆ పాట మీద అంత గాఢమైన భావనలున్నాయి మరి. అందువల్ల మీకు అలా అర్ధమైనట్టుంది. మీ ప్రశ్నలకి జవాబులు శ్రీశ్రీ చెప్పాలి. ఏం చేస్తాం మీకా అవకాశం మరి లేదు. మీకు అర్ధమైన పధ్ధతిలో ఆ పాట నాకు అర్ధం కాలేదు.
    రమ.

  10. రచయితలకు సూచనలు గురించి M.V.S.Prasad & Saroja గారి అభిప్రాయం:

    02/09/2010 11:03 pm

    ఈ మాట అద్భుతం! ఇన్నాళ్ళూ మాకు తెలియక పోవడం మా దురద్దృష్టం. మీ కృషి ఎంతైనా అభినందనీయం.- సరోజాప్రసాదు

« 1 ... 1182 1183 1184 1185 1186 ... 1582 »