చాలా చక్కని వ్యాసాన్ని, అంతకంటె చక్కని పాటలను అందజేసిన శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతాంజలులు. ఎస్. వరలక్ష్మి నిజముగా సుస్వరలక్ష్మియే. ఈమె తమిళ సినిమాలలో కూడా చక్కగా పాడేవారు. వీరపాండ్య కట్టబొమ్మన్‌లో శివాజీ గణేశన్‌తో నటించి పాడారు. వీరు నాగేశ్వరరావు పెళ్లిలో ఫాడారట. బాలమురళీకృష్ణ మొదటి సినిమా పాట ఈమె చిత్రములోనే అట. ఈమె భర్త శ్రీనివాసన్‌గారి సహోదరుడే సుప్రసిద్ధ తమిళ కవి కణ్ణదాసన్. ఆసక్తిగల వారికి సేవాసదనములో సుబ్బులక్ష్మిగారితో ఈమె చిత్రాన్ని ఇక్కడ చూడగలరు.
చాలా చక్కగా విశ్లేషించారు. అయితే ఒక్క విషయం.. తీవ్రమైన అసహనం లోనుంచి సీతారామారావు ఉన్మాది గా ప్రవర్తించాడు. మనసు లోపలి విపరీత ఆలోచనలు బయట పెట్టలేకపోయినా , కొన్నిసార్లు ఆ వ్యక్తే నియంత్రించుకోలేని స్థితిలో ప్రవర్తన ద్వారా బయట పడుతుంది. కాబట్టి , సభలో వ్యంగ్యంగా ప్రవర్తించటం, మేనేజరుతో ప్రవర్తన ఆ పాత్ర స్వభావానికి సరితూగాయనే అనుకుంటున్నాను.
శ్రీనివాస్ గారూ!! నా అభిమాన గాయని s.వరలక్ష్మి గారు. చాలా ప్రత్యేకమైన కంఠం ఆమెది. “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా!!” నేను తరుచూ hum చేసుకునే పాటల్లో ముఖ్యమైనది. ఆవిడ పాటలే కాదు తన ధాటీ ఐన కంఠం తో పద్యాల్ని కూడా ఎంతో బాగా చదివేది. పద్య పఠనంలో పి.లీల గారిదీ , యస్ . వరలక్ష్మి గారిదీ ప్రత్యేకమైన బాణీ!! శాస్త్రీయ సంగీతం లోనూ ఆమె కంఠం పాలువాయి భానుమతి గారిలాగా విశిష్టమైనది.
సినిమా రంగం వారూ..సంగీత రంగం వారూ ఏమాత్రం గుర్తుంచుకోని ఆమెని మీరు గుర్తుపెట్టుకుని స్మరించారు. ఎంతో సంతోషం!! రోహిణీ ప్రసాద్ గారు అబిప్రాయ పడినట్టు లత లాగా సుశీల లాగా పాడేవాళ్ళూ మనకి దొరుకుతారు . కానీ ఆయన ఉదాహరించిన ఇతర గాయనుల్లో ఉన్న విశేషం మరి మన యస్ . వరలక్ష్మిగారి గొంతులోనూ ఉంది.
ఈమాటలో ఆసక్తిని కల్గించే రాతలు తగ్గిపోతున్న తరుణంలో మీ పరిచయ వ్యాసం నిజంగా తేటగా ఉంది.ఆ మంచి గాయనికి మీ వ్యాసం తో గొంతు కలిపి నేను కూడా నా నమస్కారాలు అందజేస్తున్నాను.
లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం “మంచి” లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది.
లతాకన్నా ఎక్కువ “పర్సనాలిటీ” ఉన్న గొంతుతో ఆశా భోంస్లే రెండోస్థానంలోకి వచ్చింది.
ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది. తెలుగులో సుశీల సరిగ్గా లతా పద్ధతిలోనే తయారయింది.
నూర్జహాన్, సురైయా ఇతరులకు ప్లేబాక్ పాడలేదు కనక వారికి ఇది పెద్ద సమస్య కాలేదు. మనవారిలో భానుమతిదీ, ఎస్ వరలక్ష్మిదీ కూడా అదే పరిస్థితి. వీరిలో వరలక్ష్మి మరెవరికైనా పాడడానికి సిద్ధపడేదేమో తెలియదు కాని ఆమెకు కూడా “ప్రత్యేకంగా” వినిపించే గొంతు ఉండేది. అయితే ఆమె గానపటిమ అసామాన్యమైనదని ఏ పాట విన్నా తెలిసిపోతుంది. ఆమె చివరి రోజుల ఆర్థిక ఇబ్బందుల గురించి రావి కొండలరావు బాగా రాశారు.
ఆమెను తలుచుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్ అభినందనీయుడు.
అపురూపమైన పాటలందించారు. అక్షరాలని స్పష్టంగా ఉచ్చరిస్తూ పాడేవాళ్ళలో వరలక్షి ఒకరు. స్పష్టతకి శ్రావ్యత చేరితే ఆ పాట కలకాలం నిలుస్తుందన్నదానికి ఉదాహరణ, తిమ్మరుసు చిత్రంలో “లీలా కృష్ణా” పాట. ఈ పాట చివర్లో “మైమరిచిన చెలి మాటే లేదని – ఓరగ చూస్తూ ” అనే చోట విరుపులతో పాడడం వినడానికి తేలికగా అనిపించినా పాడడం మాత్రం సులభం కాదు.
మంచిపాటలందించారు. ధన్యవాదాలు.
మీ పెద్ద సమీక్ష బాగుంది. డయాస్ఫోరా సాహిత్యం గురించి మీరు వెల్లడి చేసిన అభిప్రాయాలు నాకు సమంజసంగానే తోస్తున్నాయి. కానీ, ఈ వ్యాసంలో మీరు వెల్లడించిన అభిప్రాయాలు ఏదో ఒక రూపంలో మీరు ఇంత క్రితం వెల్లడించినవే!
నాకు ఒక అనుమానం! అమెరికా తెలుగు కథానిక రచయితల నుంచి మనం ఎక్కువ ఆశిస్తున్నామా? మీరు, చౌదరి జంపాల గారు, ఇదివరలో కేవియెస్ రామారావు గారు – అందరూ దాదాపు అమెరికా తెలుగు కథానికల నాణ్యతలో ఎకాభిప్రాయం ప్రకటిస్తున్నట్టు నాకు తోస్తోంది. ఏ రకంగానూ వీటిని అమెరికా తెలుగు కథానికలు అనలేమా? ఇందుకు నాకు రెండు ముఖ్య కారణాలు తోస్తున్నవి.
అమెరికా తెలుగు కథానిక రచయిత(త్రు)లు
1. తాము బ్రతుకుతున్న సమాజాన్ని, వ్యవస్థను తగినంత లోతుగా చూడలేకపోతున్నారు, విశ్లేషించ లేకపోతున్నారు.
2. కథానిక అన్న ప్రక్రియను తగినంతగా అధ్యయనం చేయలేక పోతున్నారు.
“తెలుగులో రాయటం వచ్చిన ప్రతివారూ రచయిత(త్రు)లు కాలేరు” అన్న మాట నాకు సమ్మతమే. కానీ, తెలుగులో అంతో, ఇంతో రాయటం వస్తేనే గొప్ప అన్న పరిస్థితుల్లో ఉన్న మనకి,ఇది ఒక ప్రారంభ దశ అనుకుంటే సుఖం! అలా అని ఇంతకు మించి మనం ఎదగలేం అనుకోకూడదు. అలా ఎదగాలంటే, రెండు పనులు జరగాలి.
1. తమ కథానికిలపై వచ్చిన (సత్) విమర్శలని ఒప్పుకోటానికి ‘అహం’ అడ్డురానంతగా రచయిత(త్రు)లు ఎదగాలి. ఇది కష్టమైన పనే.
2. విజ్ఞులైన విమర్శకులు తాము చదివిన కథానికలు ఎందుకు బాగున్నాయో, లేదా ఎందుకు బాగాలేదో ధైర్యంగా చెప్పగలగాలి.
నిజానికి మీ సమీక్షలో పుస్తకం బాగోగులు చెప్పారు కానీ, ఈ పుస్తకంలో ఉన్న రెండో, మూడో కథానికలని లోతుగా విశ్లేషిస్తూ ఈ సమీక్షలో రాస్తే ఆ కథానిక రచయిత(త్రు)లకి, పాఠకులకి ఉపయోగపడేదేమో!
వ్యాకరణాభిలాషులు గారికి!! నేను చాలా క్లుప్తంగానే జవాబు చెప్పేను. దాని మీద మళ్ళీ నాకు చాటభారతమ్ అంత వివరణలతో ఏమీ పని లేదు. ఇంక జ్నానమ్ అజ్నానమ్ ల ప్రసక్తి తమరే తెచ్హారు. మిమ్మల్ని మీరు అజ్నాత పాఠకుని గాను.. అజ్నాన పాఠకుని గానూ చెప్పుకున్నారు.
చాకిరేవు వారికి,!! మీ అభిప్రాయం మీద కూడా నాకు మళ్ళీ కొత్తగా చెప్పే అదనపు భావాలేమీ లేవు. నా అదృష్టం కొద్దీ [దురదృష్టంగా మాత్రం కాదు] మీ లాగే నేను సైతం ఇతర భాషా కవిత్వాలని క్షుణ్ణంగా చదువుకున్నదాన్ని. అందువలన శ్రీశ్రీ విలువ నాకు ఎక్కువ తెలుసు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి mOhana గారి అభిప్రాయం:
03/02/2010 12:33 pm
చాలా చక్కని వ్యాసాన్ని, అంతకంటె చక్కని పాటలను అందజేసిన శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతాంజలులు. ఎస్. వరలక్ష్మి నిజముగా సుస్వరలక్ష్మియే. ఈమె తమిళ సినిమాలలో కూడా చక్కగా పాడేవారు. వీరపాండ్య కట్టబొమ్మన్‌లో శివాజీ గణేశన్‌తో నటించి పాడారు. వీరు నాగేశ్వరరావు పెళ్లిలో ఫాడారట. బాలమురళీకృష్ణ మొదటి సినిమా పాట ఈమె చిత్రములోనే అట. ఈమె భర్త శ్రీనివాసన్‌గారి సహోదరుడే సుప్రసిద్ధ తమిళ కవి కణ్ణదాసన్. ఆసక్తిగల వారికి సేవాసదనములో సుబ్బులక్ష్మిగారితో ఈమె చిత్రాన్ని ఇక్కడ చూడగలరు.
విధేయుడు – మోహన
తెలగాణెము గురించి రాఘవ గారి అభిప్రాయం:
03/02/2010 4:04 am
తెలగాణెము అన్న “ము”ప్రత్యయాన్తమైన పేరు చూడగానే మీరే వ్రాసియుంటారని ఊహించాను. తమరి ఏతల్లఘుకృతి చాల బాగున్నదండీ.
నిజమేనండీ…
తెలుఁగు దెలిపెడి విద్యలఁ దెలిసికొనక
తెలుఁగు జదివెడి భాగ్యము గలిసిరాక
తెలుఁగు మన మని మనమునఁ దెలివి లేక
తెలుఁగువారలఁ గలివిడి వెలుగు నెటుల?
అసమర్ధుని జీవయాత్రే! గురించి రమణ గారి అభిప్రాయం:
03/02/2010 2:46 am
చాలా చక్కగా విశ్లేషించారు. అయితే ఒక్క విషయం.. తీవ్రమైన అసహనం లోనుంచి సీతారామారావు ఉన్మాది గా ప్రవర్తించాడు. మనసు లోపలి విపరీత ఆలోచనలు బయట పెట్టలేకపోయినా , కొన్నిసార్లు ఆ వ్యక్తే నియంత్రించుకోలేని స్థితిలో ప్రవర్తన ద్వారా బయట పడుతుంది. కాబట్టి , సభలో వ్యంగ్యంగా ప్రవర్తించటం, మేనేజరుతో ప్రవర్తన ఆ పాత్ర స్వభావానికి సరితూగాయనే అనుకుంటున్నాను.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/02/2010 1:49 am
శ్రీనివాస్ గారూ!! నా అభిమాన గాయని s.వరలక్ష్మి గారు. చాలా ప్రత్యేకమైన కంఠం ఆమెది. “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా!!” నేను తరుచూ hum చేసుకునే పాటల్లో ముఖ్యమైనది. ఆవిడ పాటలే కాదు తన ధాటీ ఐన కంఠం తో పద్యాల్ని కూడా ఎంతో బాగా చదివేది. పద్య పఠనంలో పి.లీల గారిదీ , యస్ . వరలక్ష్మి గారిదీ ప్రత్యేకమైన బాణీ!! శాస్త్రీయ సంగీతం లోనూ ఆమె కంఠం పాలువాయి భానుమతి గారిలాగా విశిష్టమైనది.
సినిమా రంగం వారూ..సంగీత రంగం వారూ ఏమాత్రం గుర్తుంచుకోని ఆమెని మీరు గుర్తుపెట్టుకుని స్మరించారు. ఎంతో సంతోషం!! రోహిణీ ప్రసాద్ గారు అబిప్రాయ పడినట్టు లత లాగా సుశీల లాగా పాడేవాళ్ళూ మనకి దొరుకుతారు . కానీ ఆయన ఉదాహరించిన ఇతర గాయనుల్లో ఉన్న విశేషం మరి మన యస్ . వరలక్ష్మిగారి గొంతులోనూ ఉంది.
ఈమాటలో ఆసక్తిని కల్గించే రాతలు తగ్గిపోతున్న తరుణంలో మీ పరిచయ వ్యాసం నిజంగా తేటగా ఉంది.ఆ మంచి గాయనికి మీ వ్యాసం తో గొంతు కలిపి నేను కూడా నా నమస్కారాలు అందజేస్తున్నాను.
రమ.
ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం గురించి Ranga గారి అభిప్రాయం:
03/01/2010 11:56 pm
చిత్రలేఖ link పనిచెయ్యట్లేదు.
[సరిదిద్దాము. మళ్ళీ ప్రయత్నించండి. పొరపాటుకు క్షంతవ్యులం – సం.]
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/01/2010 8:50 pm
లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం “మంచి” లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది.
లతాకన్నా ఎక్కువ “పర్సనాలిటీ” ఉన్న గొంతుతో ఆశా భోంస్లే రెండోస్థానంలోకి వచ్చింది.
ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది. తెలుగులో సుశీల సరిగ్గా లతా పద్ధతిలోనే తయారయింది.
నూర్జహాన్, సురైయా ఇతరులకు ప్లేబాక్ పాడలేదు కనక వారికి ఇది పెద్ద సమస్య కాలేదు. మనవారిలో భానుమతిదీ, ఎస్ వరలక్ష్మిదీ కూడా అదే పరిస్థితి. వీరిలో వరలక్ష్మి మరెవరికైనా పాడడానికి సిద్ధపడేదేమో తెలియదు కాని ఆమెకు కూడా “ప్రత్యేకంగా” వినిపించే గొంతు ఉండేది. అయితే ఆమె గానపటిమ అసామాన్యమైనదని ఏ పాట విన్నా తెలిసిపోతుంది. ఆమె చివరి రోజుల ఆర్థిక ఇబ్బందుల గురించి రావి కొండలరావు బాగా రాశారు.
ఆమెను తలుచుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్ అభినందనీయుడు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
03/01/2010 8:39 pm
శ్రీనివాస్ గారూ,
అపురూపమైన పాటలందించారు. అక్షరాలని స్పష్టంగా ఉచ్చరిస్తూ పాడేవాళ్ళలో వరలక్షి ఒకరు. స్పష్టతకి శ్రావ్యత చేరితే ఆ పాట కలకాలం నిలుస్తుందన్నదానికి ఉదాహరణ, తిమ్మరుసు చిత్రంలో “లీలా కృష్ణా” పాట. ఈ పాట చివర్లో “మైమరిచిన చెలి మాటే లేదని – ఓరగ చూస్తూ ” అనే చోట విరుపులతో పాడడం వినడానికి తేలికగా అనిపించినా పాడడం మాత్రం సులభం కాదు.
మంచిపాటలందించారు. ధన్యవాదాలు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
03/01/2010 8:22 pm
ఈమాటలో ఈ మధ్య సంచికల్లోని విశేషాలను పూర్తిగా చదవాలనే నా కోరిక చచ్చిపోతున్న రోజుల్లో ఈ వ్యాసం ఈమాట పై మరికొంత ఆశక్తిని పెంచింది.
శ్రీనివాస్ కు ధన్యవాదాలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
03/01/2010 3:56 pm
వేలూరి వెంకటేశ్వర రావు గారూ:
మీ పెద్ద సమీక్ష బాగుంది. డయాస్ఫోరా సాహిత్యం గురించి మీరు వెల్లడి చేసిన అభిప్రాయాలు నాకు సమంజసంగానే తోస్తున్నాయి. కానీ, ఈ వ్యాసంలో మీరు వెల్లడించిన అభిప్రాయాలు ఏదో ఒక రూపంలో మీరు ఇంత క్రితం వెల్లడించినవే!
నాకు ఒక అనుమానం! అమెరికా తెలుగు కథానిక రచయితల నుంచి మనం ఎక్కువ ఆశిస్తున్నామా? మీరు, చౌదరి జంపాల గారు, ఇదివరలో కేవియెస్ రామారావు గారు – అందరూ దాదాపు అమెరికా తెలుగు కథానికల నాణ్యతలో ఎకాభిప్రాయం ప్రకటిస్తున్నట్టు నాకు తోస్తోంది. ఏ రకంగానూ వీటిని అమెరికా తెలుగు కథానికలు అనలేమా? ఇందుకు నాకు రెండు ముఖ్య కారణాలు తోస్తున్నవి.
అమెరికా తెలుగు కథానిక రచయిత(త్రు)లు
1. తాము బ్రతుకుతున్న సమాజాన్ని, వ్యవస్థను తగినంత లోతుగా చూడలేకపోతున్నారు, విశ్లేషించ లేకపోతున్నారు.
2. కథానిక అన్న ప్రక్రియను తగినంతగా అధ్యయనం చేయలేక పోతున్నారు.
“తెలుగులో రాయటం వచ్చిన ప్రతివారూ రచయిత(త్రు)లు కాలేరు” అన్న మాట నాకు సమ్మతమే. కానీ, తెలుగులో అంతో, ఇంతో రాయటం వస్తేనే గొప్ప అన్న పరిస్థితుల్లో ఉన్న మనకి,ఇది ఒక ప్రారంభ దశ అనుకుంటే సుఖం! అలా అని ఇంతకు మించి మనం ఎదగలేం అనుకోకూడదు. అలా ఎదగాలంటే, రెండు పనులు జరగాలి.
1. తమ కథానికిలపై వచ్చిన (సత్) విమర్శలని ఒప్పుకోటానికి ‘అహం’ అడ్డురానంతగా రచయిత(త్రు)లు ఎదగాలి. ఇది కష్టమైన పనే.
2. విజ్ఞులైన విమర్శకులు తాము చదివిన కథానికలు ఎందుకు బాగున్నాయో, లేదా ఎందుకు బాగాలేదో ధైర్యంగా చెప్పగలగాలి.
నిజానికి మీ సమీక్షలో పుస్తకం బాగోగులు చెప్పారు కానీ, ఈ పుస్తకంలో ఉన్న రెండో, మూడో కథానికలని లోతుగా విశ్లేషిస్తూ ఈ సమీక్షలో రాస్తే ఆ కథానిక రచయిత(త్రు)లకి, పాఠకులకి ఉపయోగపడేదేమో!
విష్ణుభొట్ల లక్ష్మన్న
తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/01/2010 12:34 am
వ్యాకరణాభిలాషులు గారికి!! నేను చాలా క్లుప్తంగానే జవాబు చెప్పేను. దాని మీద మళ్ళీ నాకు చాటభారతమ్ అంత వివరణలతో ఏమీ పని లేదు. ఇంక జ్నానమ్ అజ్నానమ్ ల ప్రసక్తి తమరే తెచ్హారు. మిమ్మల్ని మీరు అజ్నాత పాఠకుని గాను.. అజ్నాన పాఠకుని గానూ చెప్పుకున్నారు.
చాకిరేవు వారికి,!! మీ అభిప్రాయం మీద కూడా నాకు మళ్ళీ కొత్తగా చెప్పే అదనపు భావాలేమీ లేవు. నా అదృష్టం కొద్దీ [దురదృష్టంగా మాత్రం కాదు] మీ లాగే నేను సైతం ఇతర భాషా కవిత్వాలని క్షుణ్ణంగా చదువుకున్నదాన్ని. అందువలన శ్రీశ్రీ విలువ నాకు ఎక్కువ తెలుసు.
రమ.
[ఈ కామెంట్ ఎడిట్ చేయబడింది – సం.]