“ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…”
అ. ప్రప్రథమంగా విన్నవించవలసింది, తెలుగు భాష వ్యాకరణం ప్రకారం, “తొడలు”, “శృంఖలాలు”, “చురకత్తులు” అనేవి విశేషణాలు కావు. అవి కర్మలు (direct objects). ఇది ముందుగా అర్థం జేసుకోవలయును. “గొట్టి”, “పగులగొట్టి”, “పదును పెట్టి” అనేవి క్రియలు. ఒకే కర్తకు బహు క్రియలు గలవు. ఇది చాలా సరి అయిన విషయమే. అటులనే విశేషణానికి ఏకవచనం, బహువచనం అనేవి వుండను. వచనం అనేది నామవాచకానికి (noun) మాత్రమే ఉండుని. కర్త యొక్క వచనాన్ని అనుసరించి, క్రియా రూపంలో తేడా ఉండును. “రాముడు అరటిపళ్ళు తినెను”, “రాముడూ మరియూ కృష్ణుడూ అరటిపళ్ళు తినిరి” అనే వాక్యములో కర్త వచనము బట్టి, క్రియా రూపములు, “తినెను”, “తినిరి” అని వుండును. గావున విశేషణానికి వచనం లేదు.
ఆ. ఒక వాక్యములో కర్త ఏక వచనంలో వున్నప్పుడు కర్మ అదే వచనంలో వుండనక్కర లేదు. కర్తా, క్రియా రూపం మాత్రమే ఒకే వచనంలో వుండవలయును. “రాముడు అరటిపళ్ళు తిన్నాడు” అన్న వాక్యంలో వున్న కర్మ బహువచనంలో వుంది. అది సరి అయినదే. తప్పు ఎంత మాత్రమూ కాదు. “రాముడూ మరియూ కృష్ణుడూ కలిసి ఒక బొమ్మను తయారుజేసెను” అన్న వాక్యంలో కర్త(లు) బహువచనం. కర్మ (బొమ్మ) ఏకవచనం.
ఇ. ఒక మనిషికి రెండు తొడలు గలవు. ఒక మనిషికి కాళ్ళకూ, చేతులకూ వేరు వేరు శృంఖలాలు వుండగలవు. ఒకే ఒక చురకత్తి బదులు, బహు చురకత్తులు పదును బెట్టవచ్చును ఒక దాని తరువాత ఒకటిగా. ఏకవచనంలో వున్న కర్త (మనిషి)కి బహువచనంలో కర్మలు వుండటం తప్పు కాదు.
ఈ. ఇచ్చట ఉదహరింపబడిన వాక్యంలో ఎటువంటి తప్పూ లేదు. వాక్యం చక్కగానే వున్నది. నేను వ్యాకరణం ప్రకారం “ప్రతి మనిషి” అనేది ఏకవచనం మాత్రమే ననియూ, బహువచనం ఎంత మాత్రం కాదనియూ మాత్రమే ఉటంకించాను. ఇది ఒక భాషకు సంబంధించిన విషయం గావున, భాషా జ్నానం ప్రకారం నేనట్టు చెప్పి ఉంటిని.
ఉ. మీరు, “శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! ” అని అని ఉంటిరి. ఆంగ్ల వ్యాకరణం అనుసరించి తెలుగు వాక్యములను కవి రాయవలెను అని నేను ఉటంకించలేదు. మీరట్లు అపోహ పడి నా మీద ఇటువంటి ఆభాండములు వేయుట విజ్నులయిన మీకు భావ్యము కాదు. అర్థము తెలియజేయగలందుకు మాత్రమే ఆంగ్ల వ్యాకరణం కూడా ఉదహరించితిని. అంతెయును గాక, కర్త, క్రియ, కర్మ, విశేషణం, వచనం వంటి విషయాలలో రెండు భాషల వ్యాకరణం ఒకదానిని ఒకటి పోలి ఉండును. సులభంగా గ్రహించుటకు మాత్రమే అంగ్ల భాషా వ్యాకరణమును వివరించితిని. అందువలన ఇటువంటి వ్యక్తిగత దూషణలు మీకు శోభ నివ్వవు. సాహిత్య చర్చలో కొంచెం సంయమనం అవసరం.
ఊ. ఆఖరుగా మీరు, “మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!” అని నన్ను వ్యక్తిగతంగా దూషించితిరి. ఇది నాకు మిక్కిలి ఖేదము కలిగించెను. నా వ్యాఖ్యానంలో నేను మిమ్ములను ఒక చిన్న మాట చేత కూడా దూషించలేదు. నన్ను దూషించుటకు మీకు ఎటువంటి హక్కు కలదో నాకు ఈ జన్మమున అర్థము కాదు. నాకు సలహా ఇచ్చే ఆగత్యం మీకు ఎంత మాత్రమూ లేదని నేను ఎంత గానో నమ్ముతూ ఉన్నవాడను. మీరు సాహిత్య సంయమనం పాటించకుండా, ఇటుల రహాదారి మీద ఒకరితో ఒకరు కలియబడి, కలహించుకున్నట్లు చర్చించిన, మీ మీద ఈమాట సంపాదక వర్గానికి ఆరోపణ చేయడం తప్ప వేరే మార్గము లేదు.
ఋ. అజ్నాత పాఠకులకు కూడా అభిప్రాయములు ఉండుననియూ, అవి వెలిబుచ్చు హక్కూ, అర్హతా వారికి ఉండుననియూ మీరు గమనించకపోవుట బహు శోచనీయమైన విషయము. ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ ఎంత మాత్రమూ లేదు. కావున మీరు ఇక మీ వాఖ్యలు విషయమునకు మాత్రమే పరిమితం జేయగలరని ఆశిస్తున్నాను. ఒకరు తమకు ఎంత జ్నానం కలదు అని నమ్మినా, లేని జ్నానం ఎంతో ఉండి ఉంటూనే ఉండును. ఏ ఒక్కరూ సర్వ జ్నాని కాలేరు అని నేను బాగుగా నమ్మువాడను. ఎవరి జ్నానమునకు తోచినట్టు వారు వారి అభిప్రాయములను వెలిబుచ్చుట, అటులనే ఇంకొకరు వెలిబుచ్చిన అభిప్రాయములను గౌరవించుట నాగరీక లక్షణమని నేను వేరే నొక్కి ఒక్కాణించవలసిన ఆగత్యం ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరి వాఖ్యలూ విషయమునకు మాత్రమే పరిమితం అయి ఉండవలయు. అది వ్రాసిన వారికి సంబంధించి ఉండి ఉండకూడదు. ఇది మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను.
తనమీద తనకు నమ్మకం లేని వాళ్ళు, ఇతరుల మీద పువ్వులు వేసి పూజించో, రాళ్ళు వేసి నిరసించో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు ఏమి చేస్తున్నారో సర్వే చేసి నిరూపించటానికి సాధ్యం కాని విషయం కాబట్టి వదిలేస్తే మంచిది.
నటశేఖర కృష్ణ , టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన ప్రజలు – ఈ రెండు కాగడాల మధ్యన ప్రజ్వరిల్లుతున్న అఖండ జ్యోతి శ్రీ శ్రీ రాసినపాట అనటమే తప్ప, ఈ పాట గురించి మీకున్న అవగాహన ఏమై వుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. మహాకవి సృష్టిని బేరీజు వేయటానికి మీరు వాడే కొలమానాలు ఇంత పేలవంగా వుంటే ఏమి మాట్లాడాలో తెలియక, మీరు కిందటిసారి రాసిన అభిప్రాయానికి నేను జవాబు చెప్పలేదు. ఇంకొంచెం వూరుకుంటే అన్నమాచార్యుల దగ్గర నించి ఇంకా వెనక్కి వెళ్ళేటట్లున్నారు కాబట్టి మాట్లాడ వలసి వస్తోంది.
తెలుగు వీర లేవరా అన్న పాట తెలుగు భాషా పరమైన జాతీయతని వు ద్బోధించే గీతం. ఆ పాట రాసే నాటికి ఆయన తెలంగాణ ప్రాంతంలో వావిలాల గోపాల కృష్ణ గారితో కలిసి తెలంగాణ వుద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వున్నారు. విరసం సంస్థకి అధ్యక్షుడైనాడు. ఈ కారణాలన్నిటి వలనా, ఆ పాటని ఆనాటి రాజకీయ నేపథ్యంనుంచి వేరు చేసి చూడటం నా వల్ల కాదు. అలాగచూడమని ఆయన కూడా కోరుకునే వాడు కాదనుకుంటాను. మీరు అలాగని కోరుకోక పోవటమే కాక, అట్లా చూడటానికి నిరాకరించిన వాళ్లంతా నిరక్షర కుక్షులయి వుంటా ర నుకుంటున్నారు. అంధకారం కమ్ముకుని వస్తున్న రోజులు అవి. వచనంలో 1970 ల వరకూ కుటుంబరావు గారి లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర ఆ తరువాత దాదాపుగా మాయం అయి పోవటం ఆ అంధకారంలో ఒక భాగమే. కొత్త దీపాలు వెలగలెదని కాదు కాని ఆ చీకట్లలో ఎవరు ఎలాటి దీపాలు వెలిగించారు అన్నది అడగడానికి ఇప్పటికింకా చాలా మంది తటపటాయిస్తారు. ఇన్నేళ్ల తరవాత రాళ్ళు విసరడమా అన్నది కాదు. అలాటి లెక్కలు కట్టడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది అన్నది .ఆలోచించ వలసిన విషయం అని నేనను కుంటే ఆలోచించ వలసి రావటమే మీకు వింతగా వున్నట్లుంది. కనుకనే సంభాషణ ముందుకి సాగడం లేదు.
మీ అభిప్రాయాలు చూసిన తరువాత దేశమంతా ఇన్ని సాయిబాబా గుళ్ళుండగా లేనిది , శ్రీ శ్రీ కి కూడా ఒక దర్గా కట్టి మొక్కుకునే భక్తులుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి లే అనిపిస్తోంది.
విషయం సజావుగా సాగి వుంటే, శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పుడప్పుడు తెలుగు రాని వాళ్ళకి వినిపించి సంతోష పడి వూరుకునే వాడిని. నా కర్మ కొద్దీ, ఆయనకి సమకాలికులైన ఇతర భాషల్లోని కవులు కొంత మందిని చదివాల్సి రావడమూ, ఏవో కారణాల వలన ఎప్పుడో కంఠస్థం చేసి వదిలేసిన తెలుగు ప్రబంధాలలోనివీ, తమిళ దివ్య ప్రబంధంలోనివీ ముక్కలు తెరలు తెరలుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవలసి రావటం, ప్రత్యేకించి తెలుగు భాషలో దేశభక్తి గురించి, సంకుచిత ధోరణులూ, అభ్యుదయ ధోరణుల గురించి అడపా దడపా ఏదో చర్చ రావడం ఇలాటి వాటి వలన శ్రీశ్రీ గురించి మళ్ళీ ఆలోచించ వలసి వచ్చింది.
ఈలోపల, తెలుగు భాష ఏనాటికైనా జాతీయ అధికార భాషగా గుర్తించబడుతుందని ఆయన చెప్పిన మాటలు కూడా కళ్ళ బడ్డాయి. (అది చదివి కళ్ళు తిరిగాయి అని కూడా చెప్పాలి. నా మాతృభాష జన జీవనానికి చలన సూత్రం కావాలి అని ఒక కవి అంటే సంతోషించాలి కానీ, నా మాతృ భాష ఇతర మాతృ భాషలు మాట్లాడే వాళ్ళ జీవితాలను కూడా శాసించాలి అని ఒక కవి కోరుకుంటే ఆయన కవిత్వాన్ని ఆమోదించే ముందు కొంచెం జాగ్రత్త గా చదవాలి అని నా గుండె చెప్తుంది. )
కాల క్రమేణా, నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు.
నేను రాసిన మొదటి సారే స్పష్టంగానే చెప్పానని అనుకున్నాను. సరిపోలేదోమో నని వివరించి మళ్ళీ చెప్పాను. ఏకవచన బహు వచనాలూ, వాస్తవికతా ఇట్లా తప్పులు లెక్కించు కుంటూ పోతే ఎప్పటికీ తేలదు కానీ, ఈ పాటలో వున్న అసలు సమస్య ఇందులో వున్న భావజాలంలోని సంకుచితత్వం. ఆ సంకుచితత్వానికి పూర్తి కారణం శ్రీశ్రీ కాదు. ఆయన పాఠకులూ, ఆయన శ్రోతలూ , ఆయనని అభిమానించినవారూ, ఆయన పాటలు రాసిన సినిమాల నిర్మాతలూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత వహించ వలసి వస్తుంది. అందుకే నేను వేసిన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకోవలసిన పని లేదు. తప్పు మీది. మీరు జవాబు చెప్పలేక ఆయన మీదికి తోసేస్తున్నారు.
కేవలం నా వునికిని నిరూపించుకోవడానికి సాహిత్య రంగంలో చెయ్యి చేసుకునేంత వెసులుబాటు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా రొజు వారీ జీవితంలో వుండని వాళ్ళలో నేనూ ఒకడిని. రాయక తప్పని పరిస్థితి వచ్చిన రోజు, రాయ వలసిన పద్ధతిలో, బాధ్యతగానే దీస్ని గురించి మళ్ళీ రాస్తాను. అప్పటివరకూ, సెలవు.
అజ్నాత పాఠక మహాశయునకు !! అక్కడ వాక్యం “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…” అన్న దానిలోని ప్రతీ విశేషణమ్ కూడా బహువచనలోనే కవి ఎందుకని రాసేడో చూడాలి. ఆయన ఏకవచనమ్ ప్రకారమే అయితే “తొడలు” అనీ..శృంఖలాలు” అనీ ” చురకత్తులు” అనీ అన్నిటినీ బహువచనంలో నిర్వహించడు. ఆ వాక్యం బహువచన సూచిక మాత్రమే!! అక్కడ ప్రతి వ్యక్తీ అన్నది బహువచనము లోనే కవి ఉద్దేసించాడని ఆ విశేషణాలు మొత్తం చెబుతూనే ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దాన్ని గ్రహించడమే!! శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!
ఆంగ్లభాష వ్యాకరణం ప్రకారమూ, మరియూ తెలుగు భాష వ్యాకరణం ప్రకారమూ “ప్రతి మనిషి” అనే ప్రయోగం ఏక వచనం మాత్రమే అగును. ఇచ్చట “ప్రతి” అనేది కర్తా విశేషణం. “మనిషి” అనేది కర్త. ఇచ్చట కర్త ఏకవచనంలో మాత్రమే ఉందని పెద్దలందరూ గ్రహించవలయును. ఇచ్చట తెలుగు భాష వ్యాకరణం గురించి మాత్రమే చర్చిస్తున్నామని తెలుసుకొనవలయును. “Every man” అనేది ఆంగ్ల భాషలో ఎటుల ఏకవచనముగా పరిగణింతురో, అటులనే “ప్రతి మనిషి” అనేది తెలుగు భాషా వ్యాకరణ సూత్ర ప్రకారం ఏకవచనం మాత్రమే. ఇచ్చట వ్యాకరణ సూత్రాలను మాత్రమే ఉటంకిస్తున్నామనియూ, మరియే అదనపు ఉద్దేశ్యమూ లేదనియూ అందరూ గమనించ ప్రార్థన.
వేణుగోపాల్ గారూ మీరన్నది నిజం. భాషా విరించి అయిన శ్రీశ్రీకి ఏకవచనమూ..బహువచనమూ గురించి తెలియదని ఎత్తిపొడుపుగా అనడం తెలిసిన వారికీ, తెలియని వారికీ మధ్య ఉన్న తేడాని చెబుతుంది.
తెలుగు లిఖిత సాహిత్యం ఒక ఎత్తుగా పెట్టి తన సంకీర్తనా సాహిత్యాన్ని దానికి మించి సృష్టించిన అన్నమాచార్యుడు తన పదాలలో భాషలో , వాక్య విన్యాసాలలోనూ చూపించిన స్వతంత్రత ఎంతో ధీటైనది. కవికి మిగిలిన వారికన్నా ప్రయోగాలు చేయడంలోనూ.. పోనీ కొన్ని రకాల”తప్పులు” చేయడంలోనూ తన కవిత్వంలో సాధ్యం! అతని ప్రభుత్వమ్ అక్షరాల మీద ఘనమైనది. దాని గురించి మహా అయితే చర్చించుకోవలసిందే తప్ప అంతకుమించి నెరసులు ఎన్నే పనిని ఎవరూ చేయరు. అలా చేయకపోవడం అనేదికూడా ఒక సాహిత్య మర్యాద. శ్రీశ్రీనికూడా మేం అనగలం అని చెప్పుకోవాలనే సరదా కొందరికి ఉండొచ్చు. కానీ వారి తప్పులెన్నే గుణాలకన్నా మించినది శ్రీశ్రీ అక్షరం! “మనిషి” అన్నదాన్ని బహువచనంలో గ్రహించడానికి అక్కడ అవకాశం ఉందని ఎవరికైనా తెలుస్తుంది.అయినా లౌల్యం వారిచేత ఆ పని చేయనివ్వదు. అందువలన శ్రీశ్రీని ఏదైనా అని కాసింత గుర్తింపు పొందుదామన్నది ఒక ఆశ.
ఒప్పుకుంటే ఇలాంటి వారు అన్నమయ్య గారి వాక్యాలనీ..ఆయన వాడిన “దుష్ట సమాసాలనీ” అలాగే తనదైన పధ్ధతిలో[ వ్యాకరణం ఒప్పని పధ్ధతిలో] అన్నమయ్య రాసిన వాక్యాలనీ కూడా వీళ్ళు మార్చేద్దామని ఉబలాట పడనూ వచ్చు!”తప్పులెన్నువారు తండోపతండంబులు”కదా?
కవిత్వంలో కవి భావప్రేరితుడే గానీ..భాషాపీడితుడు కాలేడు. కవిత్వం గురించి తెలిసిన వారికీ..కల్పన గురించి తెలిసిన వారికీ ఈ సంగతులు తెలుస్తాయి. మిగతా వారికి తెలియవు. వాళ్ళకి మహా కవిత్వాలలోని “కల్పన”- పెళ్ళాల దగ్గర విషయాలని దాచి కాకమ్మ కబుర్లుల చెప్పే మొగుళ్ళ అబధ్ధాలూ..పొట్టకూటికి చెప్పే అబధ్ధాలూ..దొంగలెఖ్ఖలు చెప్పే వారి అబధ్ధాలూ కూడా ఒక్కలాగే కన్పిస్తాయి. “కల్పన” అన్నది అంత తేలికగా కన్పించే వారికీ..అందులోని తారతమ్యాలు తెలియని వారికీ వచ్చే సందేహాలు మరి ఈ స్థాయిలోనే ఉంటాయి. నవ్వుకుని ఊరుకోవాలంతే!! తన “ప్రజ” లో ఇలాంటి ప్రశ్నలని తీసుకుని శ్రీశ్రీ చాలా హాస్యంగా జవాబులు చెప్పనే చెప్పాడు కూడా!!
రమ.
ఇన్ని ప్రక్రియలు ప్రవేశ పెట్టారు గానీ మహా కవి నిర్వహించిన పదబంధ ప్రహేళికల గురించి మరచి పోయారా? లోగడ నేను రచన మాస పత్రికలో ‘శ్రీశ్రీ- ఆ పేరే ఒక పజిల్ ‘ అన్న వ్యాసంలో అష్టావధానం లో నిషిద్ధాక్షరి వగైరా – ఎలా ఉన్నాయో అలానే ఆయన తన పజిల్ కూర్పులో ఆరు విధానాలు అనుసరించారని వాటిని పట్టికలతో వివరించాను. రచన శాయి గారు ముచ్చట పడి స్వయంగా రాసిన లేఖ నా మనసులోనూ, నా కలక్షన్స్ లోనూ ఇప్పటికీ భద్రంగా ఉంది.
కాస్త ఆలస్యంగా చూసాను. వీడియో బావుంది. స్వయానా శ్రీశ్రీ గారు ‘పాట’ను చదువుతూ ఉంటె థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి మనిషి లో ఏక వచనం, సింహా లై లో బహు వచనం ఇవన్నీ శ్రీ శ్రీ గారు తన ‘పాడవోయి భారతీయుడా’ పాటల సేకరణలో చెప్పనే చెప్పారు. సింహంలా అని ఉంటే సరి పోయేది అని అన్నారు కూడా. ప్రతి మనిషి అని అంటునప్పుడు ఒకడే ఎందుకు ఇద్దరూ, ముగ్గురూ కావొచ్చుగా. శృంఖలాలు పగుల గొట్టటం, తొడలు గొట్టడం ఒక మనిషి పైనే మోపేస్తే ఎలా? ఒకడి శృంఖలాలు పగల గొట్టేందుకు ఇంకొకడు తొడలు గొట్టి ముందుకు రాడూ? నట శేఖరుడు కృష్ణ సినీ జీవితంలో ఒక మైలు రాయి అల్లూరి కథ. ఇప్పుడు రాళ్ళు రువ్వడమా? అన్నీ వాస్తవంగా ఏ సినిమా ఉండదు. మొన్నటి అన్నమయ్య , రామదాసులు అంతేగా? ప్రయత్నం అనేది మెచ్చుకోదగ్గది. పాటల్లో తప్పులు అన్ని కాలాల్లో ఉన్నవే- బహు తీపి, ఎన్నెన్ని హొయలో అన్నన్ని లయలు, పాటల పల్లకిలో ( శ్రీశ్రీ గారు మాత్రం ‘కళ్ళలో పెళ్లి పందిరి కనపడ సాగే- పాటలో ఆ తర్వాత పంక్తి ‘పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే’ అనే చెప్పారు. పల్లకీ,బాకీ, బాణీ,తుపాకీ, ఆచూకీ – ఈ పదాలన్నీ దీర్ఘాంతాలనీ కొందరు కొత్త కవులు ఎరుగక పోవడం గమనించారా? దిన పత్రికలూ అంతే-
-తాతిరాజు వేణుగోపాల్
శివరామ ప్రసాద్ గారు
నా బాల్యంలో చూసిన కొన్ని మర్చిపోలేని చిత్రాలను అక్షరీకరించే ప్రయత్నంచేసాను. సాధారణంగా కుక్కలు, పిల్లులు పడుకోవటానికి చిన్న గుంటలాగా చేసుకుంటాయి. అలాగే పల్లెల్లో ఆరోజుల్లో పొయ్యిలు బయట వుండేవి. అందులోని నిప్పు ఆరిపోయాక అందులో కూడా వీలును బట్టి పడుకొనేవి. అలా – దాలి అన్న పదం గుర్తు, నేను నిఘంటువును చూడలేదు. అవును బాప్ప అంటే అత్త(నాన్న వైపు). పాతరోజుల్ని గుర్తు తేగలిగినందుకు సంతసిస్తున్నాను.
తెలుగు వీర లేవరా గురించి ఒక అజ్నాత(న) పాఠకుడు గారి అభిప్రాయం:
02/28/2010 6:11 pm

ఇట్లు,
నమస్కారములతో
అజ్నాత(న) పాఠకుడు.
తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
02/28/2010 6:51 am
రమగారూ,

నాయినమ్మ యిల్లు గురించి ramnarsimha గారి అభిప్రాయం:
02/28/2010 5:15 am
చాలా బాగున్నది.
తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/28/2010 12:34 am
అజ్నాత పాఠక మహాశయునకు !! అక్కడ వాక్యం “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…” అన్న దానిలోని ప్రతీ విశేషణమ్ కూడా బహువచనలోనే కవి ఎందుకని రాసేడో చూడాలి. ఆయన ఏకవచనమ్ ప్రకారమే అయితే “తొడలు” అనీ..శృంఖలాలు” అనీ ” చురకత్తులు” అనీ అన్నిటినీ బహువచనంలో నిర్వహించడు. ఆ వాక్యం బహువచన సూచిక మాత్రమే!! అక్కడ ప్రతి వ్యక్తీ అన్నది బహువచనము లోనే కవి ఉద్దేసించాడని ఆ విశేషణాలు మొత్తం చెబుతూనే ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దాన్ని గ్రహించడమే!! శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!
రమ.
శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి శ్రీనిధీ గారి అభిప్రాయం:
02/27/2010 3:04 pm
రెండు కళల అద్బుత సమ్మేళనము ఈ సంకలనమ్.
తెలుగు వీర లేవరా గురించి ఒక అజ్నాత(న) పాఠకుడు గారి అభిప్రాయం:
02/27/2010 2:57 pm
ఆంగ్లభాష వ్యాకరణం ప్రకారమూ, మరియూ తెలుగు భాష వ్యాకరణం ప్రకారమూ “ప్రతి మనిషి” అనే ప్రయోగం ఏక వచనం మాత్రమే అగును. ఇచ్చట “ప్రతి” అనేది కర్తా విశేషణం. “మనిషి” అనేది కర్త. ఇచ్చట కర్త ఏకవచనంలో మాత్రమే ఉందని పెద్దలందరూ గ్రహించవలయును. ఇచ్చట తెలుగు భాష వ్యాకరణం గురించి మాత్రమే చర్చిస్తున్నామని తెలుసుకొనవలయును. “Every man” అనేది ఆంగ్ల భాషలో ఎటుల ఏకవచనముగా పరిగణింతురో, అటులనే “ప్రతి మనిషి” అనేది తెలుగు భాషా వ్యాకరణ సూత్ర ప్రకారం ఏకవచనం మాత్రమే. ఇచ్చట వ్యాకరణ సూత్రాలను మాత్రమే ఉటంకిస్తున్నామనియూ, మరియే అదనపు ఉద్దేశ్యమూ లేదనియూ అందరూ గమనించ ప్రార్థన.
విధేయుడు,
ఒక అజ్నాత(న) పాఠకుడు
తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/26/2010 2:27 pm
వేణుగోపాల్ గారూ మీరన్నది నిజం. భాషా విరించి అయిన శ్రీశ్రీకి ఏకవచనమూ..బహువచనమూ గురించి తెలియదని ఎత్తిపొడుపుగా అనడం తెలిసిన వారికీ, తెలియని వారికీ మధ్య ఉన్న తేడాని చెబుతుంది.
తెలుగు లిఖిత సాహిత్యం ఒక ఎత్తుగా పెట్టి తన సంకీర్తనా సాహిత్యాన్ని దానికి మించి సృష్టించిన అన్నమాచార్యుడు తన పదాలలో భాషలో , వాక్య విన్యాసాలలోనూ చూపించిన స్వతంత్రత ఎంతో ధీటైనది. కవికి మిగిలిన వారికన్నా ప్రయోగాలు చేయడంలోనూ.. పోనీ కొన్ని రకాల”తప్పులు” చేయడంలోనూ తన కవిత్వంలో సాధ్యం! అతని ప్రభుత్వమ్ అక్షరాల మీద ఘనమైనది. దాని గురించి మహా అయితే చర్చించుకోవలసిందే తప్ప అంతకుమించి నెరసులు ఎన్నే పనిని ఎవరూ చేయరు. అలా చేయకపోవడం అనేదికూడా ఒక సాహిత్య మర్యాద. శ్రీశ్రీనికూడా మేం అనగలం అని చెప్పుకోవాలనే సరదా కొందరికి ఉండొచ్చు. కానీ వారి తప్పులెన్నే గుణాలకన్నా మించినది శ్రీశ్రీ అక్షరం! “మనిషి” అన్నదాన్ని బహువచనంలో గ్రహించడానికి అక్కడ అవకాశం ఉందని ఎవరికైనా తెలుస్తుంది.అయినా లౌల్యం వారిచేత ఆ పని చేయనివ్వదు. అందువలన శ్రీశ్రీని ఏదైనా అని కాసింత గుర్తింపు పొందుదామన్నది ఒక ఆశ.
ఒప్పుకుంటే ఇలాంటి వారు అన్నమయ్య గారి వాక్యాలనీ..ఆయన వాడిన “దుష్ట సమాసాలనీ” అలాగే తనదైన పధ్ధతిలో[ వ్యాకరణం ఒప్పని పధ్ధతిలో] అన్నమయ్య రాసిన వాక్యాలనీ కూడా వీళ్ళు మార్చేద్దామని ఉబలాట పడనూ వచ్చు!”తప్పులెన్నువారు తండోపతండంబులు”కదా?
కవిత్వంలో కవి భావప్రేరితుడే గానీ..భాషాపీడితుడు కాలేడు. కవిత్వం గురించి తెలిసిన వారికీ..కల్పన గురించి తెలిసిన వారికీ ఈ సంగతులు తెలుస్తాయి. మిగతా వారికి తెలియవు. వాళ్ళకి మహా కవిత్వాలలోని “కల్పన”- పెళ్ళాల దగ్గర విషయాలని దాచి కాకమ్మ కబుర్లుల చెప్పే మొగుళ్ళ అబధ్ధాలూ..పొట్టకూటికి చెప్పే అబధ్ధాలూ..దొంగలెఖ్ఖలు చెప్పే వారి అబధ్ధాలూ కూడా ఒక్కలాగే కన్పిస్తాయి. “కల్పన” అన్నది అంత తేలికగా కన్పించే వారికీ..అందులోని తారతమ్యాలు తెలియని వారికీ వచ్చే సందేహాలు మరి ఈ స్థాయిలోనే ఉంటాయి. నవ్వుకుని ఊరుకోవాలంతే!! తన “ప్రజ” లో ఇలాంటి ప్రశ్నలని తీసుకుని శ్రీశ్రీ చాలా హాస్యంగా జవాబులు చెప్పనే చెప్పాడు కూడా!!
రమ.
రెండు శ్రీల విరించి – ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం గురించి tatiraju venugopal గారి అభిప్రాయం:
02/25/2010 3:28 pm
ఇన్ని ప్రక్రియలు ప్రవేశ పెట్టారు గానీ మహా కవి నిర్వహించిన పదబంధ ప్రహేళికల గురించి మరచి పోయారా? లోగడ నేను రచన మాస పత్రికలో ‘శ్రీశ్రీ- ఆ పేరే ఒక పజిల్ ‘ అన్న వ్యాసంలో అష్టావధానం లో నిషిద్ధాక్షరి వగైరా – ఎలా ఉన్నాయో అలానే ఆయన తన పజిల్ కూర్పులో ఆరు విధానాలు అనుసరించారని వాటిని పట్టికలతో వివరించాను. రచన శాయి గారు ముచ్చట పడి స్వయంగా రాసిన లేఖ నా మనసులోనూ, నా కలక్షన్స్ లోనూ ఇప్పటికీ భద్రంగా ఉంది.
తెలుగు వీర లేవరా గురించి tatiraju venugopal గారి అభిప్రాయం:
02/25/2010 3:10 pm
కాస్త ఆలస్యంగా చూసాను. వీడియో బావుంది. స్వయానా శ్రీశ్రీ గారు ‘పాట’ను చదువుతూ ఉంటె థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి మనిషి లో ఏక వచనం, సింహా లై లో బహు వచనం ఇవన్నీ శ్రీ శ్రీ గారు తన ‘పాడవోయి భారతీయుడా’ పాటల సేకరణలో చెప్పనే చెప్పారు. సింహంలా అని ఉంటే సరి పోయేది అని అన్నారు కూడా. ప్రతి మనిషి అని అంటునప్పుడు ఒకడే ఎందుకు ఇద్దరూ, ముగ్గురూ కావొచ్చుగా. శృంఖలాలు పగుల గొట్టటం, తొడలు గొట్టడం ఒక మనిషి పైనే మోపేస్తే ఎలా? ఒకడి శృంఖలాలు పగల గొట్టేందుకు ఇంకొకడు తొడలు గొట్టి ముందుకు రాడూ? నట శేఖరుడు కృష్ణ సినీ జీవితంలో ఒక మైలు రాయి అల్లూరి కథ. ఇప్పుడు రాళ్ళు రువ్వడమా? అన్నీ వాస్తవంగా ఏ సినిమా ఉండదు. మొన్నటి అన్నమయ్య , రామదాసులు అంతేగా? ప్రయత్నం అనేది మెచ్చుకోదగ్గది. పాటల్లో తప్పులు అన్ని కాలాల్లో ఉన్నవే- బహు తీపి, ఎన్నెన్ని హొయలో అన్నన్ని లయలు, పాటల పల్లకిలో ( శ్రీశ్రీ గారు మాత్రం ‘కళ్ళలో పెళ్లి పందిరి కనపడ సాగే- పాటలో ఆ తర్వాత పంక్తి ‘పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే’ అనే చెప్పారు. పల్లకీ,బాకీ, బాణీ,తుపాకీ, ఆచూకీ – ఈ పదాలన్నీ దీర్ఘాంతాలనీ కొందరు కొత్త కవులు ఎరుగక పోవడం గమనించారా? దిన పత్రికలూ అంతే-
-తాతిరాజు వేణుగోపాల్
కలైన గోర్వెచ్చని పాట గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
02/25/2010 8:58 am