Comment navigation


15818

« 1 ... 1171 1172 1173 1174 1175 ... 1582 »

  1. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి e.bhaskaranaidu గారి అభిప్రాయం:

    04/04/2010 10:49 am

    ఇప్పుడొస్తున్న అచ్చు పత్రికల్లొ కాల్పనిక సాహిత్యం వాసి చాల తక్కువగా వున్నట్టు నాకనిపిస్తుంది. నేనెంతో మేధావినని అనుకోవడంలేదు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన సినిమాని ఒక నేల టికెట్టు ప్రేక్షకుడు “ఛీ” అనే ఒక మాటతో తీసి పారెయ్యగలడు. అలాంటిదే ఇదీను. ఆ కారణంగానే ఇటువంటి పత్రికలు కొంత వరకు ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయని నాకనిపిస్తుంది. రాబోవు కాలంలో వెబ్ పత్రికలు ఇంకా ప్రాచుర్యంలోనికి రాగలవని నా భావన. ఎలాగంటే నేటి యువతలో సాహిత్యాభిలాష అంతగా లేకపోవడం, వారికి అంత సమయం లేకపోవడం, వారికి ఓపిక కూడ లేకపోవడం వంటి కారణాలు చెప్పుకోవచ్చు. ఇక వెబ్ పత్రికలు రాను రాను ప్రాచుర్యంలో కొంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం: …వాటిని చదివే వారు సాహిత్యాభిలాష కలవారు, విశ్రాంత జీవులు, మేధావులు కావచ్చన్నది నా అభిమతం. అంతర్జాలం ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బహుళ ప్రచారమవుతున్నందున రాను రాను అవి పురోగమించ వచ్చనిపిస్తుంది. కనుక రాబోయే కాలంలో వెబ్ పత్రికలదే రాజ్యమని నాకనిపిస్తున్నది.

  2. శ్రీ మేడసాని మోహన్‌గారి అష్టావధాన విశేషాలు గురించి e.bhaskaranaidu గారి అభిప్రాయం:

    04/04/2010 9:34 am

    చాలబాగుందండి. అవధానము ఎంత పాతదైనా అందులో కొత్తదనం పుడుతూనె వుంటుంది. అదొ నిరంతర సజీవ ప్రవాహం. విన్నంతసేపు ఊపిరి ఉగ్గబట్టుకొని వున్నట్టనిపిస్తుంది నా మటుకు నాకు. ఇంతటి ఉత్కంఠ కలిగించే సాహిత్య ప్రక్రియ నాకు వేరొక్కటి కానరాదు. ఇటువంటివి ఇతరులవి తెలియజేయండి. ధన్యవాదములు.

  3. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి e.bhaskaranaidu గారి అభిప్రాయం:

    04/04/2010 8:49 am

    చాల మంచి కథనం వినిపించారు. ఇంకా ఇలాంటివి పంపవలసినదిగా కోరుతున్నాను.

  4. తడిస్తే కదా తెలిసేది! గురించి gana గారి అభిప్రాయం:

    04/03/2010 3:26 pm

    Hareesh garu,

    Thank you for the detailed information. I understand your concern and also agree that Gurajada too followed matra-chandassu. But, he relieved poetry from several earlier forms.

    I have no blind favor and inclination to all those writing in free verses. As long as the poet is poet, his/her expressions do certainly convey essence or appeal or both. I could equally enjoy the poetry in ‘Vemana, Bhaskara and Sumati’ satakalu in comparison with poetry by Gurajada, Sri Sri, Sinare and Siva reddy etc…

    I believe, poetry can be well encouraged as long as it has no restrictions.
    Below-average poetry may not find its long way whatever may be the form it is.
    Please consider that, I only mean to share my opinion.

  5. తడిస్తే కదా తెలిసేది! గురించి hareesh గారి అభిప్రాయం:

    04/03/2010 10:13 am

    Gana Garu, ( I am unable to type in Telugu, though I love to write in Telugu. Please bear with me).

    On a second reading, I found the “bhavam” in the above verse to be very appealing and anubhooti jallulo tadisinattu feelingni kaliginchindi and hence succeeded in accomplishing the objective of writing poetry. However, my frustration is about many free verses that being published in various Telugu Magazines and passed off as Modern Poetry without there being any essence nor appeal. I think Gurajada too wrote in a particular system, i.e.,Matra Chandassu and Sri Sri popularised free verses. But, the free verses of Sri Sri are so appealing and also pathbreaking. Therefore, in my opinion, there is no bar in writing in free verses as long as they are appealing, but you will agree that most of the free verses are below average. I hope I made myself clear.

    Hareesh

  6. తడిస్తే కదా తెలిసేది! గురించి gana గారి అభిప్రాయం:

    04/03/2010 12:35 am

    హరీష్ గారు,

    గురజాడ గారు ప్రసాదించిన వచన కవిత్వ వరాన్ని వదులుకోమంటారా? అనుభూతి రూపాంతరం చెంది కవిత్వం కావడమే ముఖ్యమని నా ఉద్దెశ్యం. వార్తలు, వ్యాసాలు మరియు కధల తో పోలిక లేకుండా పంచే స్వేచ్చా మాధుర్యపు వచన కవిత్వానికి మళ్ళీ గోడలా?

    దయచేసి ఆలోచించండి.

  7. అసమర్ధుని జీవయాత్రే! గురించి gaddeswarup గారి అభిప్రాయం:

    04/03/2010 12:19 am

    When I read the book in the early fifties, I thought that it was about me and it scared me. Luckily I got interested in mathematics and moved away from that background. Recently I tried to read it again. It is still painful, I could not go on.

  8. రెండు అమెరికన్ రుతాలు గురించి naMdivADa udaya BAskar గారి అభిప్రాయం:

    04/02/2010 10:19 am

    హెచ్చార్కె కవిత అద్భుతంగా ఉంది.

    “భూమికి అటువేపు
    నాకోసం చూసి చూసి
    రాలి ఎండిన కొండ రేగుపళ్ళు
    జేబుకింద
    కదుల్తూ ఒక పద్యం”

    పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడు చెట్టు తొర్ర్ల్లల్లో చిప్‌మన్‌కులు, లాన్ మీద మొలిచిన డాండెలియన్‌లు, మేపుల్ చెట్టుకొమ్మల్లో పక్షులు జరుపుతున్న చర్చాగోష్టులు తన కవి హృదయమ్మీద చేస్తున్న దాడిని తట్టుకుని తన చిన్ననాటి రేగుచెట్టు నీడకి సురక్షితంగా చేరుకుంటానని తనకి తాను భరోసా ఇవ్వడం నిజంగా అభిమన్యుడు వినని కధే.

    Hats off హెచ్చార్కే!

    ఇది నిజమైన diasporic కవిత. Keep it coming!

    ఉదయ్

  9. తడిస్తే కదా తెలిసేది! గురించి hareesh గారి అభిప్రాయం:

    04/02/2010 5:12 am

    ఇది కవిత్వం అంటే నేనొప్పుకోను. నా ఉద్దేశం ప్రకారం కందంలో రాశేవాడే కవి. అంటే వచనం ఎప్పుడూ కవిత్వం కాదు, భావం ఎంత బాగున్నా. This is not to discourage the above poet(?), but I would like people to recognize the need to develop writing in proper chandassu. I hope “Eemaata” would train people who are interested in developing the skill of writing chando badda kavitvam.

  10. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/29/2010 3:06 am

    కామేశ్వరి గారూ,

    మీరు చెప్పింది చదివాక వేలూరి గారి వ్యాసం మీరు సరిగా చదవలేదన్న అభిప్రాయం కలిగింది. ఒకవేళ చదివినా పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించడం లేదు. వంగూరి ఫౌండేషన్ వారు ఈ బృహత్కార్యం తలపెట్టారని తెలిసి సంతోషించే కథలూ, వారి సొంత ప్రవరలూ పంపారని ( నాతో సహా ) అనుకుంటున్నాను. అది ప్రోత్సాహం కాక మరేవిటి? ఈ పుస్తకం అచ్చువేయడ వెనుక కష్టం అందరికీ తెలుసు. పడ్డ కష్టం కాస్త చిత్తశుద్ధితో చేసుంటే బావుండేదన్నదే అందరి బాధాను.
    “తెలుగు సాహిత్యంలో విమర్శ లేదు. రావడ లేదు” అన్నది తరచు వింటూ ఉంటాం. తీరా ఎవరైనా బాగోగులు చర్చిస్తే, ఆ చర్చించే వారిమీద విసుర్లూ, విరుచుకు పడడాలూ కూడా చూస్తూనే వున్నాం.
    పొగడ్తల దండలే మాక్కావాలి. తెగడ్తలు మాచెవులకు చేరవనే వారున్నంత వరకూ విమర్శ రాదు. పది తరాలకి పనికొచ్చే గ్రంధాలు పేజీలని బట్టీ, సైజుని బట్టీ నిర్ణయిస్తారా? లేక నాణ్యతని బట్టి విలువిస్తారా? అన్నంలో రాళ్ళూ, పుస్తకాల్లో అచ్చుతప్పులూ ఓ పట్టాన మింగుడు పడవు. రుచి మాట దేవుడెరుగు, అవి అరాయించుకునే శక్తి నాలాంటి అర్భకులకి లేదు. వుండదు కూడా.
    విమర్శకీ, దుయ్యబట్టడానికి తేడా వుంది. వండిన పదార్థం రుచి చూస్తూ చెప్పడం విమర్శ, తినకుండా, చూస్తూనే చీ,- దరిద్రంగా వండారనడం దుయ్యబట్టడం. రెంటికీ భేదం వుంది. గమనించగలరు.

« 1 ... 1171 1172 1173 1174 1175 ... 1582 »