చాలా కాలం తరవాత చూస్తున్నాను ఈమాట. మీ కవిత చక్కగా ఉంది. ” తనని తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుత క్షణం కోసం వేచిఉండడం ” అన్న మాటలో ఎంతో నిజం ఉంది. కథావిర్భావానికి కూడా ఇంతే.
నెలరోజులుగా ఒక కథ రాయాలని ప్రయత్నం. మనసులో ఎన్నో సార్లు రాసి చెరిపేసుకున్నాను. ఎంతో సహనంతో వేచి చూడగా చూడగా, నిన్న రాత్రి అనుకోకుండా కథ పూర్తయింది. టైము చూస్తే తెల్లవారుఝామున నాలుగు!!
డిప్రెషన్ కి మూలాన్ని చర్చించకపోవడం కధలో లోపమనే ఉద్దేశ్యం తో నేనా మాట అనలేదు. కధ నాకు నచ్చింది. ఒకో సారి చర్చించదలుచుకున్న సమస్య కు పరిష్కారం చూపలేకపోతామన్న న్యూనతతో కధ రాయడమే మానుకున్న నాలాంటి కలం పట్టని రచయితలకు పాఠం లాంటిది ఈ కధ.
రమేష్ నాయుడుగారిపై పరుచూరి శ్రీనివాస్‌గారి వ్యాసం బాగుంది. చాలామందికి నాయుడిగారి నేపథ్యం తెలియదు. ఇప్పుడు కొంత మేర తెలుసుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్‌గార్కి కృతజ్ఞతలు. నాయుడిగారి సంగీతాన్ని ఇష్టపడని ‘నిజమైన’ శ్రోత అంటూ ఉంటాడా!? ఏ సంగీత దర్శకుడి బాణీ ఆ సంగీత దర్శకుడిదే అయినా నాయుడిగారిలోని శ్రావ్యత నేనే సంగీత దర్శకుడిలోనూ వినలేదు. ముఖ్యంగా ఆయన రావుబాలసర్వతిదేవిగారితో పాడించిన లలిత గీతాల మాధుర్యం చెప్పనలవికానంత. పిచ్చెక్కించే రణగొణ ధ్వనుల్లోంచి ఇంటికొచ్చాక గదిలో ఒంటరిగా – కళ్లుమూసుకుని ఆయన ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘చందమామా రావే’ … లాంటి పాట ఒక్కటి వింటే చాలు… మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
(వి.ఎ.కె. రంగారావుగారు విజయచిత్రలో రాసిన రమేష్‌నాయుడిగారిపైని నివాళి నా కలక్షన్లలో ఉంది)
– గొరుసు
ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి అనుసరించే పత్రికలు రచయితలకి పారితోషికాలు అందిస్తాయి అన్న మాట కేవలం ఊహా జనితం.
ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంతో సహా అనేక రంగాలలో ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి పాటించే ప్రచురణల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇందులో రచయితలకి పారితోషికం చెల్లించే వాటి సంఖ్య నూటికి ఒకటో రెండో ఉన్నా ఆశ్చర్య పోవలసిందే. వీటిలో జీతాల మీద పనిచేసే వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉంటుంది. ఈ పత్రికల సర్క్యులేషన్ కూడా ఏమంత పెద్దగా ఉండదు. వ్యాపార ప్రకటనలూ చాలా తక్కువగా ఉంటాయి. అవసరమైన కొద్దిపాటి ఆర్ధిక వనరులు ఏదో ట్రస్టు ద్వారానో, యూనివర్సిటీ ద్వారానో సమకూర్చుకుంటారు. సంపాదకులూ, రచయితలూ, రెవ్యూయర్సూ అందరూ కూడా చాలా మట్టుకు స్వచ్ఛందంగానే ఎటువంటి పారితోషికమూ లేకుండానే పని చేస్తారు. పని చేసె వారందరూ అది చేయటం సాహిత్యంతో సహా తమ తమ రంగాల పట్ల తమ కున్న ఒక బాధ్యతగా భావిస్తారు. ఆయా రంగాలలో ప్రభావ శాలులుగా పనిచేయగలగటం, దాని వలన వచ్చే గుర్తింపు ఇవే పెద్ద పారితోషికాలు. ప్రోత్సాహకంగా ఇవ్వగలిగితే ఒకటో రెండో పత్రిక సంచికలు, లేదా కొత్త పుస్తకాలో జ్ఞాపికలుగా ఇస్తారు. ఇదేదో విదేశీ వ్యవహారంగా అనుకోనవసరం లేదు. అట్లాంటి పత్రికలు భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఈ పత్రికలకీ కొద్దిగా ఆర్ధిక వనరులు సమకూరితే, సంపాదకుల శ్రమ తగ్గించటానికి ఒక సహాయకులని పెట్టుకోవటానికో, కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళని ప్రోత్సహించడానికో చిన్న స్కాలర్ షిప్ లు ఇవ్వటానికో, ఏవో చిన్న చిన్న సౌకర్యాలు కల్పించుకోవటానికో వాడుతారు.
ఇంగ్లీషులో సృజనాత్మక రచనలు చేసే వారికి కూడా పెద్ద మొత్తాలలో పారితోషికాలు అందటం కూడా ఎక్కడా లేదు. ఉపాధ్యాయులుగానో, ఎకౌంటెంట్లుగానో , లాయర్లుగానో, హోటల్ సర్వర్లుగానో , పత్రికాఫీసుల్లో ఏవో ఉద్యోగాలలోనో ఎట్లాగో అట్లా జీవితాలు నెట్టుకొస్తూనే రచనలు చేస్తారు. అప్పుడూ అప్పుడూ వచ్చే అవార్డుల ద్వారానో, సినిమాలకో మరో మీడియాకో , నాటక ప్రదర్శనకో , పత్రికలలో కాలంలు రాసో కొద్ది పాటి డబ్బులు సంపాదించుకుంటారు. అమెరికాలోనైనా , లండన్ లో నైనా , మద్రాసులోనైనా హైదరాబాదులోనైనా … ఎక్కడైనా దాదాపుగా ఇదే పరిస్థితి. సృజనాత్మకమైన పనులు చేసే వారిని సమాజం ఇంతకన్నా గౌరవంగా చూసుకో గలగాలి అన్న దాంట్లో సందెహించాల్సినదేమీ లేదు కానీ , పారితోషికాలుంటే రచనలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని కానీ, నాణ్యత పెరుగుతుందని ఎట్లా చెప్పగలమో నాకు తెలియటం లేదు. (ఆనంద బజారు పత్రిక గౌరవించదగిన కొద్దిమంది రచయితలకి సంవత్సరం పొడుగునా గౌరవ వేతనాలు ఇస్తుంది. దానికి బదులుగా సంవత్సరానికొకటో రెండో రచనలు తమకిమ్మని అడుగుతుంది అని విన్నాను. అలాంటి పని తెలుగులో పద్ధతిగా కాక పోయినా అప్పుడప్పుడు కొన్ని పత్రికలు చేశాయని నమ్మ వచ్చును.)
ఇదెలా ఉన్నా, ‘ఈ మాట’ గిఫ్టు సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వ లేదు, అచ్చులో పత్రిక కాపీలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి, రచన ప్రచురించబడిన తరువాత, రచయితలకి, రెవ్యూయర్స్ కి తెలుగులో నో ఇంగ్లీషులోనో ఒక పుస్తకమో, సీడీనో జ్ఞాపిక గా పంపితే కొంత లాయల్టీ బలపడుతుందేమో చూడవచ్చును. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. అవసరమైతే ఆ డబ్బు ఎట్లా సమకూర్చుకోవచ్చునో ఆలోచించ వచ్చును. కానీ ఎటువంటి జ్ఞాపికలు ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచించడం దగ్గరినించి వాటిని పోస్టు చేసే వరకు — శ్రమ మాత్రం పెరుగుతుంది. సంపాదక వర్గం పైన ఈ భారాన్ని కూడా మోపకుండా ఈ మాట తరఫున మరొకరెవరైనా ఈ పని చేయగలుగుతారేమో ఆలోచించవచ్చును.
అమ్మగారు, అయ్యగారూ, పీర్ రెవ్యూ గురించి రెండు అభిప్రాయాలు అనవసరమని నేను భావిస్తున్నాను. నోబెల్ విజేత రాసినా, అతని పత్రం కూడా పీర్ రెవ్యూకు బద్ధమైనదే. నేచర్ వంటి శాస్త్రీయ పత్రికలు ఎవరి పత్రాలను అలాగే వేసికోవు. రచయితలు ఎంత గొప్పవారైనా సమీక్షకు తలవంచవల్సిందే. ఒక్కొక్క వేళలో సంపాదకులు మంచి వ్యాసాలను ఇక్కడ అక్కడ చిన్న మార్పులు చేసి పఠనీయతా సౌలభ్యాన్ని ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నా అనుభవంలో ఇది జరిగింది. మరో విషయం. జ్వాలాముఖికి, ఉగ్రమూర్తికి పడదనుకోండి. అప్పుడు జ్వాలాముఖి తన రచనలను సమీక్షకై ఉగ్రమూర్తికి పంపవద్దని సంపాదకులకు మనవి చేసికోవచ్చును.
ముఖ్యమైన మరో విషయంపై అభిప్రాయాలను సౌమ్యగారు తప్ప మరెవరూ చెప్పలేదు. పాఠకులకు ఎలాటి రచనలు నచ్చుతాయో అన్నదే ఆ విషయం. కొన్ని వ్యాసాలను అతి శ్రమతో ఎంతో పరిశీలన చేసి రాస్తారు. అలాటి సాహిత్య, సంగీత, విజ్ఞాన రచనలు పాఠకులకు నచ్చినవా లేవా అనే విషయం అందరూ చెప్పాలి. అలాగే ఇంకా ఎలాటి కొత్త రచనలు వారిని ఆకర్షిస్తుందో అనే సంగతిని నిర్మొహమాటంగా చెప్పాలి.
బహుశా పాఠకులకు కూడా తమ పాత్రను పోషించడానికై పదప్రహేళికల వంటి కొన్ని అంశాలను ప్రవేశ పెట్టవచ్చు. అదే విధంగా సమస్యాపూరణలను ప్రవేశ పెట్టవచ్చు. ఇలాటివి ప్రవేశ పెడితే పాఠకులు చదవడం మాత్రం కాక పాల్గొనేదానికి కూడా అవకాశం ఉంది.
మరొకరి పేరు నేను చెప్పితీరాలి – పరుచూరి శ్రీనివాస్ . చాలా వ్యాసాలను ఆయన రివ్యూ చేశారు. భైరవభట్ల కామేశ్వరరావు కూడ కొన్నిటిని రివ్యూ చేసిన గుర్తు. ఇంకా చాలామంది వుండివుంటారు. వాళ్ల పేర్లు సమయానికి గుర్తురానందుకు క్షమించాలి.
“పియర్ రివ్యూ” ని ప్రవేశపెట్టిన ఇంతకాలానికి దానిగురించిన సుదీర్ఘచర్చ ఆసక్తికరంగా వుంది. నాకు తెలిసిన చరిత్రని కూడ ఈ చర్చలోకి ప్రవేశపెడితే ఇంకొంత మంచి జరుగుతుందేమోనన్న కుతూహలంతో ఈ చిన్నప్రయత్నం.
“ఈమాట” తొలిసంచిక నుంచీ పియర్ రివ్యూ అమలులో వుంది. కథల విషయంలో అప్పటి సంపాదకులం – నేనూ, కొంపెల్ల భాస్కర్ , విష్ణుభొట్ల లక్ష్మన్న, కొలిచాల సురేశ్ – ఎవరమూ నిష్ణాతులం కామని మాకు స్పష్టమే కనుక చాలా మంది రివ్యూయర్లు చేయూత నిచ్చారు. నాకు బాగా జ్ఞాపకం వున్న పేర్లు – జంపాల చౌదరి, కన్నెగంటి చంద్ర, మాచిరాజు సావిత్రి, నాసీ, వేలూరి వేంకటేశ్వరరావు, విప్లవ్ ,వేమూరి వేంకటేశ్వరరావు. ఇంకా భట్టిప్రోలు అక్కిరాజు, డొక్కా ఫణికుమార్ కూడ చెయ్యివేసిన గుర్తు. ఆ రోజుల్లో కొందరు కథల్ని “స్నెయిల్ మెయిల్ “లో పంపడంతో రివ్యూలు కష్టమయేవి కూడ. ఐతే మా సంపాదకవర్గానికి కొంతవరకు నచ్చితే వాటిని ముందు తెలుగులో టైప్ చేసి ఎలెక్ట్రానిక్ కాపీలు రివ్యూయర్లకి పంపేవాళ్ళం. ఇక కవితల విషయంలో కన్నెగంటి చంద్ర, నందివాడ ఉదయభాస్కర్ , విన్నకోట రవిశంకర్ , మాచిరాజు సావిత్రి, విప్లవ్ , కనకప్రసాద్ , (మరొకరు – పేరు గుర్తు రావడం లేదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు), తమ్మినేని యదుకులభూషణ్ నాకు గుర్తున్నవారు. ఇంకొందరు కూడ సహాయం చేసిన గుర్తు. వ్యాసాలకు వస్తే “బరువైన” వాటి భారం వెల్చేరు నారాయణరావు గారి మీద వేసేవాడిని. వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, ఇండియా నుంచి వచ్చిన వాటిని ద్వానా శాస్త్రి, ఇక్కడ విన్నకోట రవిశంకర్ , తమ్మినేని యదుకులభూషణ్ చాలా రివ్యూ బాధ్యతల్ని మోసినవారు. కొందరి పేర్లు నేను మర్చిపోయే వుంటాను, వారు నన్ను క్షమిస్తారని ఆశ.
మరీ పత్రిక రిలీజ్ కి ముందురోజు వస్తేనో, లేక స్పష్టంగా ప్రచురణార్హంగా కనిపిస్తూంటేనో రివ్యూయర్లకి పంపకుండా సంపాదక వర్గమే నిర్ణయించిన సందర్భాలు వున్నాయి కాని అంత ఎక్కువ కాదు. అలాగే స్పష్టంగా నేలబారుగా కనిపించిన వాటిని కూడా మేమే నేరుగా తిరస్కరించటం అప్పుడప్పుడు జరిగాయి.
తొలిసంపాదకవర్గం లోని నేనూ, భాస్కర్ , లక్ష్మన్న – మాకు అంతకుముందు ఎన్నో ఏళ్లుగా టెక్నికల్ పబ్లికేషన్ , దాని మెలకువలు అనుభవమే కనుక పియర్ రివ్యూ “ఈమాట” పునాదుల్లో ఒకటిగా ఉండాలని ఎలాటి చర్చా లేకుండానే నిర్ణయించుకున్నాం. దాని కారణంగా ఏ కథా లేకుండా ఒకటి రెండు సంచికలు వచ్చిన గుర్తు కూడ. “ఎక్కువమంది రచనలు చేసేవారు లేనప్పుడు పియర్ రివ్యూ అనవసరం” అన్నవాదన అందువల్ల నాకు సమంజసంగా తోచదు. అలాగే, ఇది ఇక్కడి పత్రికలను అనుసరించాలనీ అనుకరించాలనీ చేసిన నిర్ణయం కాదు, ఇక్కడి టెక్నికల్ పబ్లిషింగ్ లో పియర్ రివ్యూ వల్ల జరిగే మంచిని చూసి, అప్పట్లో ఇక్కడ వస్తున్న ఇతర పత్రికల, ప్రచురణల గుణహీనతకి కారణం పియర్ రివ్యూ లేకపోవడం అన్న ప్రతిపాదన తోటి, ఇలా చేస్తే మంచి రచనలు వస్తాయనే భావనతో చేసిన పని. అందువల్ల తిరస్కరించిన రచనలకి, అలాగే మార్పులు చెయ్యవలసిన రచనలకి రివ్యూయర్ల అభిప్రాయాలని పంపేవాళ్లం.
ఇదంతా 2006 వరకు, నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్న కాలంలో విషయం. ఇప్పుడు రాసేవారు చాలా పెరిగారు గనుక రివ్యూయర్ల సంఖ్య కూడ పెరిగేవుంటుంది. ఐతే ప్రత్యక్షంగా నాకు తెలియని విషయాల్లో తలదూర్చటం సాహసం గనుక అటు వెళ్లను.
పీర్ రివ్యూమీద చాలామందికి సదభిప్రాయం లేదని వచ్చిన కామెంట్లు చూస్తుంటే అనిపిస్తోంది. కొన్ని వ్యాఖ్యల్లో ఎంతో అసహనం కనిపిస్తోంది. నాకనిపించినవి కొన్ని చెబుతాను.
ఒక రచనని ప్రచురణకి ముందుగా నలుగురైదుగురు చదివి అభిప్రాయాలు లేదా సలహాలొ ఇవ్వడంలో తప్పు లేదుకదా? ఒక్కో సారి ఆ రచన మెరుగు పడచ్చు. రచయిత గుర్తించని తప్పులు దొర్లితే సరిదిద్దే అవకాశం రావచ్చు. లేదా రచయిత చూడని మరో కొత్తకోణం కనిపించచ్చు. ఈ ప్రక్రియవల్ల మంచే జరుగుతుందని నా అభిప్రాయం.
ఈ పీర్ రివ్యూ అనేది వెస్ట్రన్ పద్ధతే కావచ్చు. మనకి అలవాటు లేని విషయం. ఎందుకంటే తమ రచనలవరకూ వచ్చేసరికి రచయితలకి (నాతో కూడా కలుపుకొని ) కాస్తో కూస్తో పొగరూ, తలబిరుసుతనమూ ఉంటాయి. అహం పాలు ఎక్కువగానే ఉంటుంది. కాదని పైకి అన్నా ఇది మాత్రం నిజం. ఎదుటవారు చెప్పే విషయమ్మీద గౌరవం లేనప్పుడు అర్హతలూ, యోగ్యతలూ ముందుకొస్తాయి. దాంతో రచనమీద జరగాల్సిన సమీక్ష వ్యక్తుల మీదకి మళ్ళుతుంది (ఎవరు సమీక్షకులో తెలియకపోయినా). ఇహ కాస్తో కూస్తో పేరొచ్చిన రచయితలయితే చెప్పనవసరం లేదు. నువ్వెవడివి మా రచన్ని సమీక్షించడానికన్న ధోరణి వ్యక్తమవుతుంది.
ఇది పీర్ రివ్యూ ప్రక్రియ మీద ఉన్న దురభిప్రాయం కంటే కూడా అది చేసే వారి యోగ్యత లేదా అర్హత మీదే నమ్మకం లేనట్లుగా వుంది.
అంతెందుకు? తెలుగునాట పత్రికల ఎడిటర్లూ వచ్చే రచనలకి చక్కగా అంట కత్తెర్లు వేస్తారు. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే (సాధారణంగా ఎవరూ అడిగే ధైర్యం చెయ్యరు ), స్థలాభావం అన్న వంక చూపిస్తూ తప్పించుకుంటారు. రచయిత రాసింది రాసినట్లు అచ్చేసిన పత్రిక తెలుగునాట ఉందంటే నేను నమ్మను. కాస్తో కూస్తో చేయి చేసుకోకుండా అచ్చెయ్యరు. పైగా మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు చెప్పే సాంప్రదాయం ఎలాగూ పాటించరు. కాబట్టి గొడవే లేదు. రచనలని పలానా సంచికలో వేస్తున్నామనే చెప్పే అలవాటే కనిపించదు. కథలూ, వ్యాసాలూ కత్తిరింపులు లేకుండా వుండవన్నది అందరికీ తెలుసున్నదే. కవితలొక్కటే దీనికి మినహాయింపు. ఒకవేళ ఎందుకు మార్పులు చేసారని అడిగినా జవాబిచ్చే తీరికుండదు వారికి. మరి అక్కడ లేని అభ్యంతరం (అంటే అచ్చయ్యి పోయాకా ఏమీ చెయ్యలేరు కనుక ) ఇక్కడ ఎందుకు?
ఈ పీర్ రివ్యూ పద్ధతిలో ఒక్కోసారి ఘర్షణ జరగచ్చు. మనస్తాపాలు కలగచ్చు. కాదనను. అయినా ఒకరిద్దరు చదివి, మంచీ, చెడులు చెబితే తప్పులేదని నా అభిప్రాయం. పైగా ఈ సమీక్షకులు కూడా తోటి రచయితలే కదా? రచనా వ్యాసంగమ్మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే కదా?
అనవసరంగా ఈ పీర్ రివ్యూ మీద అసహనం అర్థం లేదనిపిస్తోంది. విమర్శనేది మనకి మింగుడు పడని విషయం. అందువల్ల కూడా కావచ్చు.
ఇహ పీర్ రివ్యూని విజయవంతంగా చేస్తున్నా పసలేని రచనలొస్తున్నాయని రమగారి ఆరోపణ. నాకు తెలిసి ప్రతీ పత్రికా మంచి రచనలు మాత్రమే వేస్తున్నామన్న భ్రమలో పనిజేస్తాయి. ఇక్కడ మంచిదన్నది సాపేక్షికం. ఎవరి స్థాయీ, అవగాహనా, అభిరుల్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడొచ్చిన ప్రతీ రచన్నీ చెత్తబుట్టకి పరిమితం చెయ్యడం ఎంతవరకూ సమంజసం?
అసలే పీర్ రివ్యూకి జడిసి కొంతమంది ఇటువైపు చూడ్డమే మానేసారు. వాళ్ళు రాసిచ్చింది కళ్ళు మూసుకొని వేసే ( అచ్చుతప్పులతో సహా ) పత్రికలవైపే చూస్తున్నారు. కాబట్టి ఉన్నవాటిలో ప్రచురణకి బావుందనిపించినవే వేస్తున్నారని నా అభిప్రాయం. అవన్నీ పసలేని నాసిరకం రచనలుగా అనిపిస్తే ఎవరేం చెయ్యగలరు? పత్రిక మూసెయ్యటం తప్ప.
తెలుగునాట ప్రత్రికల్లో ఈ మాత్రం కూడా వ్యాసాలు రావు. కొన్ని పత్రికలయితే అసలు సాహితీ వ్యాసాల దరిదాపులక్కూడా పోవు.
రచయితలూ ఈ పీర్ రివ్యూ పద్ధతిమీద కన్నా రచనలమీద శ్రద్ధపెడితే మంచివి వచ్చే అవకాశం వుంది. వెబ్ పత్రికల్లో ఈమాట చాలా నయం. కేవలం హిట్లూ, విజిట్లూ పత్రికల ప్రాచుర్యానికీ, విజయానికీ కారణం కావని అందరికీ తెలుసు. రచనలమీదా, వ్యక్తిగత అభిప్రయాలమీదా ఈ మాత్రం చర్చకూడా మిగతా పత్రికల్లో జరుగుతుందని అనుకోను.
సౌమ్యా!! ఈ ప్రశ్నలకి జవాబులు నిజంగా తెలిసిన వాళ్ళు కనిపించరు. ఈ లోకంలో!! అన్నమయ్య గారు అందుకే “పై పై ముందట భవ జలధి.. దాపు వెనక చింతా జలధీ.. చాపలము నడుమ సంసార జలధి.. తేపఏది ఇవి తెగనీదుటకు?? పండెను ఏడమ పాపపురాశి.. అండనె కుడిని పుణ్యపురాశి.. కొండను నడుమ త్రిగుణ రాశి.. ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏదీ?? కింది లోకములు కీడు నరకములు.. అందేటి స్వర్గాలవె మీద.. చెంది అంతరాత్మ శ్రీవేంకటేశా!! నీ.యందె పరమ పద మవలమరేది? నారాయణా నీ నామమె గతి యిక.. కోరికలు నాకు కొనసాగుటకు” అంటూ ఈ మనసు తాలూకు గొడవనీ.. ఈదలేని ఈ సంసార సముద్రాన్నీ.. తనలో చెలరేగే ఆలోచనల సాగరాన్నీ… చంచలత్వంతో నిండిన జీవితంలో.. అసలు వ్యవధి అంటూ ఉన్నది ఎక్కడ?? అంటూ అంతరాత్మలో ఉన్న నారాయణుని ఉద్దేశ్యించి తన మనసులోని ఆరాటాన్నీ.. ఈ లోకపు తీరునీ కలగలిపి పదంగా చేసి ఆలపించాడు. ఆయన పదంలోని ప్రతీ చరణాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవంలోకి తెచ్చుకుని చూసుకుంటే మీ కధలోని స్పష్టంగా చెప్పలేని ఆ వ్యక్తావ్యక్తమైన ఒక అసహనమో.. అనిశ్చితమో జవాబుకు కొంతవరకూ లొంగుతుంది.
అన్నమయ్య గారి పదంలో ఉన్న గసడదవాదేశాలనీ సంధులనీ విరిచి వాక్యాలుగా రాసేను. పాఠకులకి చదవగానే అర్ధం అవగలదనే ఉద్దేశ్యంతో!! స్థిమితంగా ఈ పదం చదివి అర్ధం చేసుకోగలిగిన వాళ్ళకి అన్నమయ్య ఎన్ని సంఘర్షణలకి వాటిలోని సంక్లిష్టతలకీ ఇలా అక్షర రూపాన్ని ఇచ్చాడో తెలిసినకొద్దీ కవిగా ఆయన ఎంత గొప్పవాడో కూడా తెలుస్తుంది. కాలం ఒక 600 ఏళ్ళకి పైబడి గడిచింది సరే.. కానీ, మనిషి అంతరంగ మధనంలో అతలాకుతల సమస్యల జీవితంలో నిజంగా ఏమన్నా మార్పంటూ వచ్చిందా?? బాహ్యమైన మార్పులు తప్ప మనసు లోలోతులలో వచ్చిన మార్పులేవీ భవభంధ సముదాయమైన బతుకుల్లో, సౌమ్యా??
రమ.
కవితావిర్భావం గురించి Phani Dokka గారి అభిప్రాయం:
05/06/2010 10:34 am
వైదేహి గారూ,
చాలా కాలం తరవాత చూస్తున్నాను ఈమాట. మీ కవిత చక్కగా ఉంది. ” తనని తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుత క్షణం కోసం వేచిఉండడం ” అన్న మాటలో ఎంతో నిజం ఉంది. కథావిర్భావానికి కూడా ఇంతే.
నెలరోజులుగా ఒక కథ రాయాలని ప్రయత్నం. మనసులో ఎన్నో సార్లు రాసి చెరిపేసుకున్నాను. ఎంతో సహనంతో వేచి చూడగా చూడగా, నిన్న రాత్రి అనుకోకుండా కథ పూర్తయింది. టైము చూస్తే తెల్లవారుఝామున నాలుగు!!
చక్కని కవిత రాసినందుకు అభినందనలతో,
డొక్కా ఫణి.
భవబంధాల సాక్షిగా… గురించి bhavani గారి అభిప్రాయం:
05/06/2010 4:48 am
డిప్రెషన్ కి మూలాన్ని చర్చించకపోవడం కధలో లోపమనే ఉద్దేశ్యం తో నేనా మాట అనలేదు. కధ నాకు నచ్చింది. ఒకో సారి చర్చించదలుచుకున్న సమస్య కు పరిష్కారం చూపలేకపోతామన్న న్యూనతతో కధ రాయడమే మానుకున్న నాలాంటి కలం పట్టని రచయితలకు పాఠం లాంటిది ఈ కధ.
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:
05/06/2010 2:56 am
రమేష్ నాయుడుగారిపై పరుచూరి శ్రీనివాస్‌గారి వ్యాసం బాగుంది. చాలామందికి నాయుడిగారి నేపథ్యం తెలియదు. ఇప్పుడు కొంత మేర తెలుసుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్‌గార్కి కృతజ్ఞతలు. నాయుడిగారి సంగీతాన్ని ఇష్టపడని ‘నిజమైన’ శ్రోత అంటూ ఉంటాడా!? ఏ సంగీత దర్శకుడి బాణీ ఆ సంగీత దర్శకుడిదే అయినా నాయుడిగారిలోని శ్రావ్యత నేనే సంగీత దర్శకుడిలోనూ వినలేదు. ముఖ్యంగా ఆయన రావుబాలసర్వతిదేవిగారితో పాడించిన లలిత గీతాల మాధుర్యం చెప్పనలవికానంత. పిచ్చెక్కించే రణగొణ ధ్వనుల్లోంచి ఇంటికొచ్చాక గదిలో ఒంటరిగా – కళ్లుమూసుకుని ఆయన ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘చందమామా రావే’ … లాంటి పాట ఒక్కటి వింటే చాలు… మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
(వి.ఎ.కె. రంగారావుగారు విజయచిత్రలో రాసిన రమేష్‌నాయుడిగారిపైని నివాళి నా కలక్షన్లలో ఉంది)
– గొరుసు
మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి కామేశ్వర రావు గారి అభిప్రాయం:
05/06/2010 2:41 am
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఈమాటలో మీ కవిత 🙂 చాలా బాగుంది. అవును, జ్ఞాపకాల మిణుగురులకి వెలుగు తప్ప వేడిమెక్కడిది!
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
05/05/2010 10:49 pm
ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి అనుసరించే పత్రికలు రచయితలకి పారితోషికాలు అందిస్తాయి అన్న మాట కేవలం ఊహా జనితం.
ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంతో సహా అనేక రంగాలలో ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి పాటించే ప్రచురణల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇందులో రచయితలకి పారితోషికం చెల్లించే వాటి సంఖ్య నూటికి ఒకటో రెండో ఉన్నా ఆశ్చర్య పోవలసిందే. వీటిలో జీతాల మీద పనిచేసే వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉంటుంది. ఈ పత్రికల సర్క్యులేషన్ కూడా ఏమంత పెద్దగా ఉండదు. వ్యాపార ప్రకటనలూ చాలా తక్కువగా ఉంటాయి. అవసరమైన కొద్దిపాటి ఆర్ధిక వనరులు ఏదో ట్రస్టు ద్వారానో, యూనివర్సిటీ ద్వారానో సమకూర్చుకుంటారు. సంపాదకులూ, రచయితలూ, రెవ్యూయర్సూ అందరూ కూడా చాలా మట్టుకు స్వచ్ఛందంగానే ఎటువంటి పారితోషికమూ లేకుండానే పని చేస్తారు. పని చేసె వారందరూ అది చేయటం సాహిత్యంతో సహా తమ తమ రంగాల పట్ల తమ కున్న ఒక బాధ్యతగా భావిస్తారు. ఆయా రంగాలలో ప్రభావ శాలులుగా పనిచేయగలగటం, దాని వలన వచ్చే గుర్తింపు ఇవే పెద్ద పారితోషికాలు. ప్రోత్సాహకంగా ఇవ్వగలిగితే ఒకటో రెండో పత్రిక సంచికలు, లేదా కొత్త పుస్తకాలో జ్ఞాపికలుగా ఇస్తారు. ఇదేదో విదేశీ వ్యవహారంగా అనుకోనవసరం లేదు. అట్లాంటి పత్రికలు భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఈ పత్రికలకీ కొద్దిగా ఆర్ధిక వనరులు సమకూరితే, సంపాదకుల శ్రమ తగ్గించటానికి ఒక సహాయకులని పెట్టుకోవటానికో, కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళని ప్రోత్సహించడానికో చిన్న స్కాలర్ షిప్ లు ఇవ్వటానికో, ఏవో చిన్న చిన్న సౌకర్యాలు కల్పించుకోవటానికో వాడుతారు.
ఇంగ్లీషులో సృజనాత్మక రచనలు చేసే వారికి కూడా పెద్ద మొత్తాలలో పారితోషికాలు అందటం కూడా ఎక్కడా లేదు. ఉపాధ్యాయులుగానో, ఎకౌంటెంట్లుగానో , లాయర్లుగానో, హోటల్ సర్వర్లుగానో , పత్రికాఫీసుల్లో ఏవో ఉద్యోగాలలోనో ఎట్లాగో అట్లా జీవితాలు నెట్టుకొస్తూనే రచనలు చేస్తారు. అప్పుడూ అప్పుడూ వచ్చే అవార్డుల ద్వారానో, సినిమాలకో మరో మీడియాకో , నాటక ప్రదర్శనకో , పత్రికలలో కాలంలు రాసో కొద్ది పాటి డబ్బులు సంపాదించుకుంటారు. అమెరికాలోనైనా , లండన్ లో నైనా , మద్రాసులోనైనా హైదరాబాదులోనైనా … ఎక్కడైనా దాదాపుగా ఇదే పరిస్థితి. సృజనాత్మకమైన పనులు చేసే వారిని సమాజం ఇంతకన్నా గౌరవంగా చూసుకో గలగాలి అన్న దాంట్లో సందెహించాల్సినదేమీ లేదు కానీ , పారితోషికాలుంటే రచనలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని కానీ, నాణ్యత పెరుగుతుందని ఎట్లా చెప్పగలమో నాకు తెలియటం లేదు. (ఆనంద బజారు పత్రిక గౌరవించదగిన కొద్దిమంది రచయితలకి సంవత్సరం పొడుగునా గౌరవ వేతనాలు ఇస్తుంది. దానికి బదులుగా సంవత్సరానికొకటో రెండో రచనలు తమకిమ్మని అడుగుతుంది అని విన్నాను. అలాంటి పని తెలుగులో పద్ధతిగా కాక పోయినా అప్పుడప్పుడు కొన్ని పత్రికలు చేశాయని నమ్మ వచ్చును.)
ఇదెలా ఉన్నా, ‘ఈ మాట’ గిఫ్టు సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వ లేదు, అచ్చులో పత్రిక కాపీలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి, రచన ప్రచురించబడిన తరువాత, రచయితలకి, రెవ్యూయర్స్ కి తెలుగులో నో ఇంగ్లీషులోనో ఒక పుస్తకమో, సీడీనో జ్ఞాపిక గా పంపితే కొంత లాయల్టీ బలపడుతుందేమో చూడవచ్చును. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. అవసరమైతే ఆ డబ్బు ఎట్లా సమకూర్చుకోవచ్చునో ఆలోచించ వచ్చును. కానీ ఎటువంటి జ్ఞాపికలు ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచించడం దగ్గరినించి వాటిని పోస్టు చేసే వరకు — శ్రమ మాత్రం పెరుగుతుంది. సంపాదక వర్గం పైన ఈ భారాన్ని కూడా మోపకుండా ఈ మాట తరఫున మరొకరెవరైనా ఈ పని చేయగలుగుతారేమో ఆలోచించవచ్చును.
ఇటువంటి విషయాలలో ‘ఈ మాట’ సంపాదకులు ఇంగ్లీషులో చూడదగిన రెండు మోడల్స్ కి లింకులు క్రింద ఇస్తున్నాను
http://www.katha.org/
http://www.littlemag.com/security/index.html
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి మోహన రావు గారి అభిప్రాయం:
05/05/2010 9:32 pm
అమ్మగారు, అయ్యగారూ, పీర్ రెవ్యూ గురించి రెండు అభిప్రాయాలు అనవసరమని నేను భావిస్తున్నాను. నోబెల్ విజేత రాసినా, అతని పత్రం కూడా పీర్ రెవ్యూకు బద్ధమైనదే. నేచర్ వంటి శాస్త్రీయ పత్రికలు ఎవరి పత్రాలను అలాగే వేసికోవు. రచయితలు ఎంత గొప్పవారైనా సమీక్షకు తలవంచవల్సిందే. ఒక్కొక్క వేళలో సంపాదకులు మంచి వ్యాసాలను ఇక్కడ అక్కడ చిన్న మార్పులు చేసి పఠనీయతా సౌలభ్యాన్ని ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నా అనుభవంలో ఇది జరిగింది. మరో విషయం. జ్వాలాముఖికి, ఉగ్రమూర్తికి పడదనుకోండి. అప్పుడు జ్వాలాముఖి తన రచనలను సమీక్షకై ఉగ్రమూర్తికి పంపవద్దని సంపాదకులకు మనవి చేసికోవచ్చును.
ముఖ్యమైన మరో విషయంపై అభిప్రాయాలను సౌమ్యగారు తప్ప మరెవరూ చెప్పలేదు. పాఠకులకు ఎలాటి రచనలు నచ్చుతాయో అన్నదే ఆ విషయం. కొన్ని వ్యాసాలను అతి శ్రమతో ఎంతో పరిశీలన చేసి రాస్తారు. అలాటి సాహిత్య, సంగీత, విజ్ఞాన రచనలు పాఠకులకు నచ్చినవా లేవా అనే విషయం అందరూ చెప్పాలి. అలాగే ఇంకా ఎలాటి కొత్త రచనలు వారిని ఆకర్షిస్తుందో అనే సంగతిని నిర్మొహమాటంగా చెప్పాలి.
బహుశా పాఠకులకు కూడా తమ పాత్రను పోషించడానికై పదప్రహేళికల వంటి కొన్ని అంశాలను ప్రవేశ పెట్టవచ్చు. అదే విధంగా సమస్యాపూరణలను ప్రవేశ పెట్టవచ్చు. ఇలాటివి ప్రవేశ పెడితే పాఠకులు చదవడం మాత్రం కాక పాల్గొనేదానికి కూడా అవకాశం ఉంది.
విధేయుడు – మోహన
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/05/2010 4:51 pm
మరొకరి పేరు నేను చెప్పితీరాలి – పరుచూరి శ్రీనివాస్ . చాలా వ్యాసాలను ఆయన రివ్యూ చేశారు. భైరవభట్ల కామేశ్వరరావు కూడ కొన్నిటిని రివ్యూ చేసిన గుర్తు. ఇంకా చాలామంది వుండివుంటారు. వాళ్ల పేర్లు సమయానికి గుర్తురానందుకు క్షమించాలి.
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/05/2010 4:46 pm
“పియర్ రివ్యూ” ని ప్రవేశపెట్టిన ఇంతకాలానికి దానిగురించిన సుదీర్ఘచర్చ ఆసక్తికరంగా వుంది. నాకు తెలిసిన చరిత్రని కూడ ఈ చర్చలోకి ప్రవేశపెడితే ఇంకొంత మంచి జరుగుతుందేమోనన్న కుతూహలంతో ఈ చిన్నప్రయత్నం.
“ఈమాట” తొలిసంచిక నుంచీ పియర్ రివ్యూ అమలులో వుంది. కథల విషయంలో అప్పటి సంపాదకులం – నేనూ, కొంపెల్ల భాస్కర్ , విష్ణుభొట్ల లక్ష్మన్న, కొలిచాల సురేశ్ – ఎవరమూ నిష్ణాతులం కామని మాకు స్పష్టమే కనుక చాలా మంది రివ్యూయర్లు చేయూత నిచ్చారు. నాకు బాగా జ్ఞాపకం వున్న పేర్లు – జంపాల చౌదరి, కన్నెగంటి చంద్ర, మాచిరాజు సావిత్రి, నాసీ, వేలూరి వేంకటేశ్వరరావు, విప్లవ్ ,వేమూరి వేంకటేశ్వరరావు. ఇంకా భట్టిప్రోలు అక్కిరాజు, డొక్కా ఫణికుమార్ కూడ చెయ్యివేసిన గుర్తు. ఆ రోజుల్లో కొందరు కథల్ని “స్నెయిల్ మెయిల్ “లో పంపడంతో రివ్యూలు కష్టమయేవి కూడ. ఐతే మా సంపాదకవర్గానికి కొంతవరకు నచ్చితే వాటిని ముందు తెలుగులో టైప్ చేసి ఎలెక్ట్రానిక్ కాపీలు రివ్యూయర్లకి పంపేవాళ్ళం. ఇక కవితల విషయంలో కన్నెగంటి చంద్ర, నందివాడ ఉదయభాస్కర్ , విన్నకోట రవిశంకర్ , మాచిరాజు సావిత్రి, విప్లవ్ , కనకప్రసాద్ , (మరొకరు – పేరు గుర్తు రావడం లేదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు), తమ్మినేని యదుకులభూషణ్ నాకు గుర్తున్నవారు. ఇంకొందరు కూడ సహాయం చేసిన గుర్తు. వ్యాసాలకు వస్తే “బరువైన” వాటి భారం వెల్చేరు నారాయణరావు గారి మీద వేసేవాడిని. వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, ఇండియా నుంచి వచ్చిన వాటిని ద్వానా శాస్త్రి, ఇక్కడ విన్నకోట రవిశంకర్ , తమ్మినేని యదుకులభూషణ్ చాలా రివ్యూ బాధ్యతల్ని మోసినవారు. కొందరి పేర్లు నేను మర్చిపోయే వుంటాను, వారు నన్ను క్షమిస్తారని ఆశ.
మరీ పత్రిక రిలీజ్ కి ముందురోజు వస్తేనో, లేక స్పష్టంగా ప్రచురణార్హంగా కనిపిస్తూంటేనో రివ్యూయర్లకి పంపకుండా సంపాదక వర్గమే నిర్ణయించిన సందర్భాలు వున్నాయి కాని అంత ఎక్కువ కాదు. అలాగే స్పష్టంగా నేలబారుగా కనిపించిన వాటిని కూడా మేమే నేరుగా తిరస్కరించటం అప్పుడప్పుడు జరిగాయి.
తొలిసంపాదకవర్గం లోని నేనూ, భాస్కర్ , లక్ష్మన్న – మాకు అంతకుముందు ఎన్నో ఏళ్లుగా టెక్నికల్ పబ్లికేషన్ , దాని మెలకువలు అనుభవమే కనుక పియర్ రివ్యూ “ఈమాట” పునాదుల్లో ఒకటిగా ఉండాలని ఎలాటి చర్చా లేకుండానే నిర్ణయించుకున్నాం. దాని కారణంగా ఏ కథా లేకుండా ఒకటి రెండు సంచికలు వచ్చిన గుర్తు కూడ. “ఎక్కువమంది రచనలు చేసేవారు లేనప్పుడు పియర్ రివ్యూ అనవసరం” అన్నవాదన అందువల్ల నాకు సమంజసంగా తోచదు. అలాగే, ఇది ఇక్కడి పత్రికలను అనుసరించాలనీ అనుకరించాలనీ చేసిన నిర్ణయం కాదు, ఇక్కడి టెక్నికల్ పబ్లిషింగ్ లో పియర్ రివ్యూ వల్ల జరిగే మంచిని చూసి, అప్పట్లో ఇక్కడ వస్తున్న ఇతర పత్రికల, ప్రచురణల గుణహీనతకి కారణం పియర్ రివ్యూ లేకపోవడం అన్న ప్రతిపాదన తోటి, ఇలా చేస్తే మంచి రచనలు వస్తాయనే భావనతో చేసిన పని. అందువల్ల తిరస్కరించిన రచనలకి, అలాగే మార్పులు చెయ్యవలసిన రచనలకి రివ్యూయర్ల అభిప్రాయాలని పంపేవాళ్లం.
ఇదంతా 2006 వరకు, నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్న కాలంలో విషయం. ఇప్పుడు రాసేవారు చాలా పెరిగారు గనుక రివ్యూయర్ల సంఖ్య కూడ పెరిగేవుంటుంది. ఐతే ప్రత్యక్షంగా నాకు తెలియని విషయాల్లో తలదూర్చటం సాహసం గనుక అటు వెళ్లను.
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
05/05/2010 4:08 pm
పీర్ రివ్యూమీద చాలామందికి సదభిప్రాయం లేదని వచ్చిన కామెంట్లు చూస్తుంటే అనిపిస్తోంది. కొన్ని వ్యాఖ్యల్లో ఎంతో అసహనం కనిపిస్తోంది. నాకనిపించినవి కొన్ని చెబుతాను.
ఒక రచనని ప్రచురణకి ముందుగా నలుగురైదుగురు చదివి అభిప్రాయాలు లేదా సలహాలొ ఇవ్వడంలో తప్పు లేదుకదా? ఒక్కో సారి ఆ రచన మెరుగు పడచ్చు. రచయిత గుర్తించని తప్పులు దొర్లితే సరిదిద్దే అవకాశం రావచ్చు. లేదా రచయిత చూడని మరో కొత్తకోణం కనిపించచ్చు. ఈ ప్రక్రియవల్ల మంచే జరుగుతుందని నా అభిప్రాయం.
ఈ పీర్ రివ్యూ అనేది వెస్ట్రన్ పద్ధతే కావచ్చు. మనకి అలవాటు లేని విషయం. ఎందుకంటే తమ రచనలవరకూ వచ్చేసరికి రచయితలకి (నాతో కూడా కలుపుకొని ) కాస్తో కూస్తో పొగరూ, తలబిరుసుతనమూ ఉంటాయి. అహం పాలు ఎక్కువగానే ఉంటుంది. కాదని పైకి అన్నా ఇది మాత్రం నిజం. ఎదుటవారు చెప్పే విషయమ్మీద గౌరవం లేనప్పుడు అర్హతలూ, యోగ్యతలూ ముందుకొస్తాయి. దాంతో రచనమీద జరగాల్సిన సమీక్ష వ్యక్తుల మీదకి మళ్ళుతుంది (ఎవరు సమీక్షకులో తెలియకపోయినా). ఇహ కాస్తో కూస్తో పేరొచ్చిన రచయితలయితే చెప్పనవసరం లేదు. నువ్వెవడివి మా రచన్ని సమీక్షించడానికన్న ధోరణి వ్యక్తమవుతుంది.
ఇది పీర్ రివ్యూ ప్రక్రియ మీద ఉన్న దురభిప్రాయం కంటే కూడా అది చేసే వారి యోగ్యత లేదా అర్హత మీదే నమ్మకం లేనట్లుగా వుంది.
అంతెందుకు? తెలుగునాట పత్రికల ఎడిటర్లూ వచ్చే రచనలకి చక్కగా అంట కత్తెర్లు వేస్తారు. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే (సాధారణంగా ఎవరూ అడిగే ధైర్యం చెయ్యరు ), స్థలాభావం అన్న వంక చూపిస్తూ తప్పించుకుంటారు. రచయిత రాసింది రాసినట్లు అచ్చేసిన పత్రిక తెలుగునాట ఉందంటే నేను నమ్మను. కాస్తో కూస్తో చేయి చేసుకోకుండా అచ్చెయ్యరు. పైగా మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు చెప్పే సాంప్రదాయం ఎలాగూ పాటించరు. కాబట్టి గొడవే లేదు. రచనలని పలానా సంచికలో వేస్తున్నామనే చెప్పే అలవాటే కనిపించదు. కథలూ, వ్యాసాలూ కత్తిరింపులు లేకుండా వుండవన్నది అందరికీ తెలుసున్నదే. కవితలొక్కటే దీనికి మినహాయింపు. ఒకవేళ ఎందుకు మార్పులు చేసారని అడిగినా జవాబిచ్చే తీరికుండదు వారికి. మరి అక్కడ లేని అభ్యంతరం (అంటే అచ్చయ్యి పోయాకా ఏమీ చెయ్యలేరు కనుక ) ఇక్కడ ఎందుకు?
ఈ పీర్ రివ్యూ పద్ధతిలో ఒక్కోసారి ఘర్షణ జరగచ్చు. మనస్తాపాలు కలగచ్చు. కాదనను. అయినా ఒకరిద్దరు చదివి, మంచీ, చెడులు చెబితే తప్పులేదని నా అభిప్రాయం. పైగా ఈ సమీక్షకులు కూడా తోటి రచయితలే కదా? రచనా వ్యాసంగమ్మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే కదా?
అనవసరంగా ఈ పీర్ రివ్యూ మీద అసహనం అర్థం లేదనిపిస్తోంది. విమర్శనేది మనకి మింగుడు పడని విషయం. అందువల్ల కూడా కావచ్చు.
ఇహ పీర్ రివ్యూని విజయవంతంగా చేస్తున్నా పసలేని రచనలొస్తున్నాయని రమగారి ఆరోపణ. నాకు తెలిసి ప్రతీ పత్రికా మంచి రచనలు మాత్రమే వేస్తున్నామన్న భ్రమలో పనిజేస్తాయి. ఇక్కడ మంచిదన్నది సాపేక్షికం. ఎవరి స్థాయీ, అవగాహనా, అభిరుల్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడొచ్చిన ప్రతీ రచన్నీ చెత్తబుట్టకి పరిమితం చెయ్యడం ఎంతవరకూ సమంజసం?
అసలే పీర్ రివ్యూకి జడిసి కొంతమంది ఇటువైపు చూడ్డమే మానేసారు. వాళ్ళు రాసిచ్చింది కళ్ళు మూసుకొని వేసే ( అచ్చుతప్పులతో సహా ) పత్రికలవైపే చూస్తున్నారు. కాబట్టి ఉన్నవాటిలో ప్రచురణకి బావుందనిపించినవే వేస్తున్నారని నా అభిప్రాయం. అవన్నీ పసలేని నాసిరకం రచనలుగా అనిపిస్తే ఎవరేం చెయ్యగలరు? పత్రిక మూసెయ్యటం తప్ప.
తెలుగునాట ప్రత్రికల్లో ఈ మాత్రం కూడా వ్యాసాలు రావు. కొన్ని పత్రికలయితే అసలు సాహితీ వ్యాసాల దరిదాపులక్కూడా పోవు.
రచయితలూ ఈ పీర్ రివ్యూ పద్ధతిమీద కన్నా రచనలమీద శ్రద్ధపెడితే మంచివి వచ్చే అవకాశం వుంది. వెబ్ పత్రికల్లో ఈమాట చాలా నయం. కేవలం హిట్లూ, విజిట్లూ పత్రికల ప్రాచుర్యానికీ, విజయానికీ కారణం కావని అందరికీ తెలుసు. రచనలమీదా, వ్యక్తిగత అభిప్రయాలమీదా ఈ మాత్రం చర్చకూడా మిగతా పత్రికల్లో జరుగుతుందని అనుకోను.
భవబంధాల సాక్షిగా… గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/05/2010 2:08 pm