ఈ మూడు భాగాల వ్యాసంలో ఒక్క జోక్ నాకు అర్థమయ్యింది. కొన్ని రచనలు రాసినప్పుడు రాసినవాడికి, దేవుడుకి అర్థమవుతాయి, కొంతకాలం పొయ్యాక అవి దేవుడికే అర్థమవుతాయి అని.
ఆ జోక్ అర్థమయ్యాక, అమ్మయ్య! నా మెదడుకి ఉన్నట్టుండి ప్రమాదం రాలేదు అనుకున్నా. ఎందుకైనా మంచిదని “sister act” సినిమా చూశా. అదీ అర్థమయింది. ఎమర్జెన్సీ రూమ్ కి బుర్ర తనిఖీకి వెళ్ళక్కర్లేదనుకున్నా.
కొన్నాళ్ళ క్రితం ఈ మేగజీన్లో ఓ సంచికలో ‘స్మైల్’ గురించి ఏమీ అర్థం పర్థం లేని వ్యాసాలొస్తే – దాని క్కారణం అవి ఆ స్మైల్ అన్న ఆయనెవరో పోయిన తరుణంలో రాశారు కదా -అలాటప్పుడు చేసే సృజనలు mushy gA, musty గా ఉంటాయి. అసలు అవి అందరు పాఠకులకు ఉద్దేశించినవి కాదు. ఏదో inner circle లో వాళ్ళు రాసుకుంటున్నారు. అలాటప్పుడు మౌనం వహించటం మర్యాద- అనుకున్నాను.
ఇప్పుడు ఈ సృజనలో ‘నామిని’ ఎవరో, ‘త్రిపుర’ ఎవరో, ‘నారాయణరావు’ ఎవరో పర్సనల్ గా తెలీక కాబోలు ఈ ముక్కల ముక్కల సంభాషణలు నాకేం అర్థం కాలేదు. ఇది కూడా ఏదో inner chambers లో సన్నిహితుల ముచ్చట్లనుకుంటా.
నాకథలు కూడా ఇక్కడ ప్రచురించబడుతున్నాయి కనకనూ, ఇంత చర్చ జరుగుతోంది కనకనూ, నాకు కలిగిన సందేహం – పీర్ రెవ్యూయరులు ఇస్తున్న సలహాలు రెవ్యూ చేసేవారెవరైనా ఉన్నారా?
ఎవరు రెవ్యూ చేస్తున్నారన్న ప్రశ్న నాకు లేదు. కథ నిజంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎత్తి చూపితే నాకు అభ్యంతరం లేదు. కానీ, ఏదో సలహా ఇవ్వకపోతే కొరతేమో అన్నట్టు, సలహా ఇచ్చి తీరాలన్న ధోరణిలో ఇస్తున్నట్టు ఉంటున్నాయి కొన్ని.
చిన్నకథ లక్షణం క్లుప్తత కనక, పాఠకులమేథకి వదిలిపెట్టేది చాలా ఉంటుంది. నాకథలు ఇక్కడ ప్రచురించినవీ, ఎక్కడా ప్రచురించనివీ కూడా నాబ్లాగులో పెట్టుకున్నప్పుడు పాఠకులకి రాని సందేహాలు పీర్ రెవ్యూయరులకి వస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ నాబ్లాగులో కొత్తకథ, భయం. దీనిమీద బోలెడు ప్రశ్నలు వేయొచ్చు. కానీ నాబ్లాగు పాఠకులకి ఏమీ సందేహాలు వచ్చినట్టు లేదు.
ఇట్లు
విధేయతతో,
నిడదవోలు మాలతి
ప్రేమ కవితలు గురించి J.sudha sekhar గారి అభిప్రాయం:
05/09/2010 4:24 am
నాకుఈ కవితలు… మరిచిన క్షణాలు…మల్లి క్షణాలుగా గుర్తుకు వస్తునాయ్. ok T…..you.
భారతి-గారు,
“ఆవిడ పాడిన […] ప్రైవేటు పాటలగురించి [మాత్రమే చెప్పాలన్న] వుద్దేశ్యంతో” పై నాలుగు మాటలు రాసాను. “రూపము నీయరయా” అన్న రాగమాలిక పాడింది వరలక్ష్మిగారే.! “బాలరాజు” సినిమా ఆడియో, వీడియోలు చాలా తేలికగా దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు ఆ పాట దొరకని పక్షంలో నాకు రాయండి. నేను పంపగలను. .
రాజగోపాల్ గారు: ఆదినారాయణరావుగారి గురిచి గతంలో రాసిన వివరాలు కొన్ని యిక్కడ: http://www.bhaavana.net/ghantasala/0202.html
అక్కడ “శాంత వంటి పిల్ల లేదోయి” అన్న పాట పిఠాపురం పాడినట్లుగా తప్పు రాసాను. ఆ పాట పాడింది ఘంటసాల.
Thanks to Srinivas garu for the rare collection of the audio. Rameshnaidu garu (my paternal cousin) lived beyond 1987. He attended my wedding in Hyderabad in March 1988. Recently I had shared those wedding photos and his personal info with one of the writers for a book on Telugu Cine Musicians. I can post the correct date after I consult my elders. Thanks again to Srinivas garu.
@ వంశీ గారు
థాంక్స్. దేవనాగరి లిపి చదవగలిగితే నాగార్జున కవిత్వం అంతర్జాలంలో చాలానే దొరుకుతుంది. వ్యాసం చివరన ఉన్న వీడియో లింకులు చూడండి. కవిత్వానికి దృశ్యాలు జోడయితే, అదీ ఎవరయినా చదువుతుంటే వినగలిగితే, ఆ కవిత వెనక ఉన్న కథలు ఏమిటో తెలుసుకోగలిగితే – లిపిలో అర్ధం కానీ విషయాలు చాలా మనసుకి పట్టుకుంటాయి.
@ బాబ్జీలు గారు
మీ మొదటి ప్రశ్నకి సమాధానంగా ‘నా ప్రాణం కుదుట బడుతుంది’ అని చెప్తే ఊరుకుంటారా? 🙂
క్లుప్తంగా చెప్పాలంటే సమాధానం అదే. కవిత్వం ఎట్లా చదవాలి, అర్ధవంతంగా ఎట్లా బతకాలి అని నేను పడే ఆరాటంలో నాకు పనికొస్తాయనిపించి నేను పేర్చుకుంటున్న సంభాషణలు అవి. సంభాషణలు అంటే నా దృష్టిలో కలిసి వెతుక్కోవటం. యుద్ధంలో కూడా సంభాషణ – సంవాదం అవసరమే అన్న మాటకి ఎంతో దూరం వెళ్ళనక్కర లేదు, మన పురాణాల నిండా దానికి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. పంచాయితీలో జరిగేది కలిసి వెతుక్కోవటం కాదు. ఇరు పక్షాలూ వారి వారి వాదనలు గెలవాలని అనుకుంటారు. అక్కడ ఎవరో ఒకరు తీర్పు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సంభాషణల మీద కూడా తీర్పు అవసరం అనే విచిత్ర వైఖరి మనలో ఇంత లోతుగా ఎట్లా పాతుకు పోయింది అన్నది ఆలోచించ వలసినదే.
కవిత్వం చదవటానికీ రాయటానికీ అన్నీ వేళలా, అన్నీ చోట్లా ఒకే మార్గం ఉండదు కదా! మరి అట్లాంటప్పుడు – ఈ రోజున మనకి ఇక్కడ పనికొచ్చే మార్గాలని ఎట్లా తయారు చేసుకోవాలి? అవి అందరికీ పనికొస్తాయని ఎట్లా చెప్పగలము – అన్న ప్రశ్నకి సమాధానం పెద్ద కష్టం కాదు. వెతుక్కుంటూ పోతుంటే, నలుగురూ మాట్లాడుటూంటే, ఆ సంభాషణల్లోంచి కొత్త దారులు వస్తాయి అవి నలుగురికీ పనికొస్తాయి. నాకు తోచేదేమంటే, అసహనం, ఏదో ఒకటే రుజుమార్గం ఉంటుందనీ అది మన లోపల్నించి తన్నుకుంటూ వస్తుందనీ అనుకోవటం పొరపాటు అని. కుటుంబరావు గారు – ఐశ్వర్యం నవల లోనే చెప్పేశారు కదా – మా పిల్లల తలల్లో వాల్వులుంటాయి. అందులోంచి ఐడియాలు బయటికి వస్తాయే కానీ లోపలికి వెళ్ళవూ అనీ. ఆ పిల్లలు ఎవరో కాదు. మనమే. దానికి విరుగుడుగా సంభాషణ అన్నదే ఒక సామాజిక ప్రక్రియగా సాధన చేయ వలసిన అవసరం చాలా ఉందనుకుంటాను.
మీరు అడిగినది – సంభాషణల్లోని విషయం గురించి కాదు కాబట్టి – ఇంత కన్నా ఏమీ చెప్పాలో నాకు తోచటం లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నా గురువుల్లో ఒకాయన అప్పుడప్పుడు ఒక మాట చెప్తూంటాడు. 1990 ప్రాంతంలో ఎవరో ప్రపంచ పటం అనే జీగ్ సా పజిల్ ని అమాంతంగా పైకి విసిరేశారు. కింద పడ్డ ముక్కలు ఏరుకుని మళ్ళీ ఎట్లా కూర్చుకోవాలా అన్నదే అసలు ప్రశ్న అని. ప్రపంచ పటం ముక్కల్ని మళ్ళీ పేర్చుకోవటం అంటే మనల్ని మనమే మళ్ళీ పేర్చుకోవటమే కదా? కవిత్వాన్ని చదవటం కొత్తగా నేర్చుకోవటమన్నా, రాయటం కొత్తగా నేర్చుకోవటమన్నా – ఆ ప్రయత్నంలో భాగాలే. మేము దీనికి అతీతులమని ఎవరయినా అనుకుంటే ఏమి చేయగలుగుతాము? అలాంటి భ్రమలని శాశ్వతంగా పట్టుకుని వేళ్ళాడటం ఎవరికీ సాధ్యం అవుతుందనుకొను.
చాలా బాగుంది మీ కవిత. వేచి ఉన్న కవితా తరంగం లేచి వచ్చే క్షణాలకై ఎదురు చూడడం కూడా ఓర్పులో ఒక నేర్పే. చివరి పదం ఆకాశం కన్నా భూమి అంటే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
గుండుగొమ్ములనుమానం – 3 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/10/2010 12:26 am
ఈ మూడు భాగాల వ్యాసంలో ఒక్క జోక్ నాకు అర్థమయ్యింది. కొన్ని రచనలు రాసినప్పుడు రాసినవాడికి, దేవుడుకి అర్థమవుతాయి, కొంతకాలం పొయ్యాక అవి దేవుడికే అర్థమవుతాయి అని.
ఆ జోక్ అర్థమయ్యాక, అమ్మయ్య! నా మెదడుకి ఉన్నట్టుండి ప్రమాదం రాలేదు అనుకున్నా. ఎందుకైనా మంచిదని “sister act” సినిమా చూశా. అదీ అర్థమయింది. ఎమర్జెన్సీ రూమ్ కి బుర్ర తనిఖీకి వెళ్ళక్కర్లేదనుకున్నా.
కొన్నాళ్ళ క్రితం ఈ మేగజీన్లో ఓ సంచికలో ‘స్మైల్’ గురించి ఏమీ అర్థం పర్థం లేని వ్యాసాలొస్తే – దాని క్కారణం అవి ఆ స్మైల్ అన్న ఆయనెవరో పోయిన తరుణంలో రాశారు కదా -అలాటప్పుడు చేసే సృజనలు mushy gA, musty గా ఉంటాయి. అసలు అవి అందరు పాఠకులకు ఉద్దేశించినవి కాదు. ఏదో inner circle లో వాళ్ళు రాసుకుంటున్నారు. అలాటప్పుడు మౌనం వహించటం మర్యాద- అనుకున్నాను.
ఇప్పుడు ఈ సృజనలో ‘నామిని’ ఎవరో, ‘త్రిపుర’ ఎవరో, ‘నారాయణరావు’ ఎవరో పర్సనల్ గా తెలీక కాబోలు ఈ ముక్కల ముక్కల సంభాషణలు నాకేం అర్థం కాలేదు. ఇది కూడా ఏదో inner chambers లో సన్నిహితుల ముచ్చట్లనుకుంటా.
Sorry! for evesdropping.
లైలా
సుగమం గురించి sivasankar గారి అభిప్రాయం:
05/09/2010 10:01 am
అస్తవ్యస్తముగా ఉన్న ప్రస్తుత మానవ సంబధాలకి ఈ కవిత ఒక నిదర్శన లా ఉంది.
బాగుంది అని చెప్పి సిగ్గుపడాలా??
యేది యేమైనా రాసిన వారికి ధన్యవాదములు.
శివ
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి నిడదవోలు మాలతి గారి అభిప్రాయం:
05/09/2010 9:07 am
నాకథలు కూడా ఇక్కడ ప్రచురించబడుతున్నాయి కనకనూ, ఇంత చర్చ జరుగుతోంది కనకనూ, నాకు కలిగిన సందేహం – పీర్ రెవ్యూయరులు ఇస్తున్న సలహాలు రెవ్యూ చేసేవారెవరైనా ఉన్నారా?
ఎవరు రెవ్యూ చేస్తున్నారన్న ప్రశ్న నాకు లేదు. కథ నిజంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎత్తి చూపితే నాకు అభ్యంతరం లేదు. కానీ, ఏదో సలహా ఇవ్వకపోతే కొరతేమో అన్నట్టు, సలహా ఇచ్చి తీరాలన్న ధోరణిలో ఇస్తున్నట్టు ఉంటున్నాయి కొన్ని.
చిన్నకథ లక్షణం క్లుప్తత కనక, పాఠకులమేథకి వదిలిపెట్టేది చాలా ఉంటుంది. నాకథలు ఇక్కడ ప్రచురించినవీ, ఎక్కడా ప్రచురించనివీ కూడా నాబ్లాగులో పెట్టుకున్నప్పుడు పాఠకులకి రాని సందేహాలు పీర్ రెవ్యూయరులకి వస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ నాబ్లాగులో కొత్తకథ, భయం. దీనిమీద బోలెడు ప్రశ్నలు వేయొచ్చు. కానీ నాబ్లాగు పాఠకులకి ఏమీ సందేహాలు వచ్చినట్టు లేదు.
ఇట్లు
విధేయతతో,
నిడదవోలు మాలతి
ప్రేమ కవితలు గురించి J.sudha sekhar గారి అభిప్రాయం:
05/09/2010 4:24 am
నాకుఈ కవితలు… మరిచిన క్షణాలు…మల్లి క్షణాలుగా గుర్తుకు వస్తునాయ్. ok T…..you.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
05/09/2010 4:06 am
భారతి-గారు,
“ఆవిడ పాడిన […] ప్రైవేటు పాటలగురించి [మాత్రమే చెప్పాలన్న] వుద్దేశ్యంతో” పై నాలుగు మాటలు రాసాను. “రూపము నీయరయా” అన్న రాగమాలిక పాడింది వరలక్ష్మిగారే.! “బాలరాజు” సినిమా ఆడియో, వీడియోలు చాలా తేలికగా దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు ఆ పాట దొరకని పక్షంలో నాకు రాయండి. నేను పంపగలను. .
భవదీయుడు,
శ్రీనివాస్
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
05/09/2010 3:54 am
రాజగోపాల్ గారు: ఆదినారాయణరావుగారి గురిచి గతంలో రాసిన వివరాలు కొన్ని యిక్కడ:
http://www.bhaavana.net/ghantasala/0202.html
అక్కడ “శాంత వంటి పిల్ల లేదోయి” అన్న పాట పిఠాపురం పాడినట్లుగా తప్పు రాసాను. ఆ పాట పాడింది ఘంటసాల.
భవదీయుడు,
శ్రీనివాస్
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి Sukanya గారి అభిప్రాయం:
05/09/2010 1:59 am
Thanks to Srinivas garu for the rare collection of the audio. Rameshnaidu garu (my paternal cousin) lived beyond 1987. He attended my wedding in Hyderabad in March 1988. Recently I had shared those wedding photos and his personal info with one of the writers for a book on Telugu Cine Musicians. I can post the correct date after I consult my elders. Thanks again to Srinivas garu.
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
05/08/2010 11:57 pm
@ వంశీ గారు
థాంక్స్. దేవనాగరి లిపి చదవగలిగితే నాగార్జున కవిత్వం అంతర్జాలంలో చాలానే దొరుకుతుంది. వ్యాసం చివరన ఉన్న వీడియో లింకులు చూడండి. కవిత్వానికి దృశ్యాలు జోడయితే, అదీ ఎవరయినా చదువుతుంటే వినగలిగితే, ఆ కవిత వెనక ఉన్న కథలు ఏమిటో తెలుసుకోగలిగితే – లిపిలో అర్ధం కానీ విషయాలు చాలా మనసుకి పట్టుకుంటాయి.
@ బాబ్జీలు గారు
మీ మొదటి ప్రశ్నకి సమాధానంగా ‘నా ప్రాణం కుదుట బడుతుంది’ అని చెప్తే ఊరుకుంటారా? 🙂
క్లుప్తంగా చెప్పాలంటే సమాధానం అదే. కవిత్వం ఎట్లా చదవాలి, అర్ధవంతంగా ఎట్లా బతకాలి అని నేను పడే ఆరాటంలో నాకు పనికొస్తాయనిపించి నేను పేర్చుకుంటున్న సంభాషణలు అవి. సంభాషణలు అంటే నా దృష్టిలో కలిసి వెతుక్కోవటం. యుద్ధంలో కూడా సంభాషణ – సంవాదం అవసరమే అన్న మాటకి ఎంతో దూరం వెళ్ళనక్కర లేదు, మన పురాణాల నిండా దానికి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. పంచాయితీలో జరిగేది కలిసి వెతుక్కోవటం కాదు. ఇరు పక్షాలూ వారి వారి వాదనలు గెలవాలని అనుకుంటారు. అక్కడ ఎవరో ఒకరు తీర్పు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సంభాషణల మీద కూడా తీర్పు అవసరం అనే విచిత్ర వైఖరి మనలో ఇంత లోతుగా ఎట్లా పాతుకు పోయింది అన్నది ఆలోచించ వలసినదే.
కవిత్వం చదవటానికీ రాయటానికీ అన్నీ వేళలా, అన్నీ చోట్లా ఒకే మార్గం ఉండదు కదా! మరి అట్లాంటప్పుడు – ఈ రోజున మనకి ఇక్కడ పనికొచ్చే మార్గాలని ఎట్లా తయారు చేసుకోవాలి? అవి అందరికీ పనికొస్తాయని ఎట్లా చెప్పగలము – అన్న ప్రశ్నకి సమాధానం పెద్ద కష్టం కాదు. వెతుక్కుంటూ పోతుంటే, నలుగురూ మాట్లాడుటూంటే, ఆ సంభాషణల్లోంచి కొత్త దారులు వస్తాయి అవి నలుగురికీ పనికొస్తాయి. నాకు తోచేదేమంటే, అసహనం, ఏదో ఒకటే రుజుమార్గం ఉంటుందనీ అది మన లోపల్నించి తన్నుకుంటూ వస్తుందనీ అనుకోవటం పొరపాటు అని. కుటుంబరావు గారు – ఐశ్వర్యం నవల లోనే చెప్పేశారు కదా – మా పిల్లల తలల్లో వాల్వులుంటాయి. అందులోంచి ఐడియాలు బయటికి వస్తాయే కానీ లోపలికి వెళ్ళవూ అనీ. ఆ పిల్లలు ఎవరో కాదు. మనమే. దానికి విరుగుడుగా సంభాషణ అన్నదే ఒక సామాజిక ప్రక్రియగా సాధన చేయ వలసిన అవసరం చాలా ఉందనుకుంటాను.
మీరు అడిగినది – సంభాషణల్లోని విషయం గురించి కాదు కాబట్టి – ఇంత కన్నా ఏమీ చెప్పాలో నాకు తోచటం లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నా గురువుల్లో ఒకాయన అప్పుడప్పుడు ఒక మాట చెప్తూంటాడు. 1990 ప్రాంతంలో ఎవరో ప్రపంచ పటం అనే జీగ్ సా పజిల్ ని అమాంతంగా పైకి విసిరేశారు. కింద పడ్డ ముక్కలు ఏరుకుని మళ్ళీ ఎట్లా కూర్చుకోవాలా అన్నదే అసలు ప్రశ్న అని. ప్రపంచ పటం ముక్కల్ని మళ్ళీ పేర్చుకోవటం అంటే మనల్ని మనమే మళ్ళీ పేర్చుకోవటమే కదా? కవిత్వాన్ని చదవటం కొత్తగా నేర్చుకోవటమన్నా, రాయటం కొత్తగా నేర్చుకోవటమన్నా – ఆ ప్రయత్నంలో భాగాలే. మేము దీనికి అతీతులమని ఎవరయినా అనుకుంటే ఏమి చేయగలుగుతాము? అలాంటి భ్రమలని శాశ్వతంగా పట్టుకుని వేళ్ళాడటం ఎవరికీ సాధ్యం అవుతుందనుకొను.
ఇంకా ఎందుకు మిగిలావు గురించి మోహన రావు గారి అభిప్రాయం:
05/08/2010 8:00 pm
బాగుంది, చదివిన తరువాత ఏదో వెలితి, ఆవేదన, అన్వేషణ ప్రారంభమయింది.
విధేయుడు – మోహన
కవితావిర్భావం గురించి మోహన రావు గారి అభిప్రాయం:
05/08/2010 7:52 pm