Comment navigation


15821

« 1 ... 1150 1151 1152 1153 1154 ... 1583 »

  1. రవీంద్రధనుస్సు గురించి chavakiran గారి అభిప్రాయం:

    05/19/2010 10:28 am

    ఎక్కడ మనసుకు అభయమో,
    శిరసుకు ఉన్నత స్థానమో,
    ఎక్కడ సరస్వతి స్వేచ్చగా సాగునో,
    ఎక్కడ యిరుకు ప్రాంతీయ కుడ్యాలతో-
    ప్రపంచం ముక్కచెక్కలవ్వలేదో,
    ఎక్కడ వాక్యాలకు మూలం సత్యమో,
    ఎక్కడ అలసటలేని చేతులు పూర్ణత్వంకై –
    నిరతమూ పాటుపడతాయో,
    ఎక్కడ స్పష్ట తర్కం, కాష్టంలో కాలిపోలేదో,
    ఎక్కడ మనసు స్వయంగా నీచే విశాలాలోచన –
    కార్యాలవైపు నడిపించబడుతుందో,
    అట్టి స్వర్గంలో ప్రభూ! నా దేశాన్ని మేల్కొలుపు.


    And here is my version 🙂

  2. ఉత్తమాయిల్లాలు గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/19/2010 3:01 am

    మాలతి గారూ,

    నేను శ్రీరంగశయనం పాత్రని పోలి ఉంటానా అని మీరు అనుకోవటంలో అన్యాయం ఏమీ లేదు. 🙂 పాత్రకి సార్వత్రికమైన పార్శ్వం లేక పోతే అది నమ్మదగ్గదిగా మాత్రం ఎట్లా అవుతుంది? (నమ్మనలవి కాని పాత్రలతో కథ చెప్పలేమా అన్నది వేరే విషయం.)

    సంచారి గారు చెప్పినది రూపం గురించి. నేను చెప్పినది సారం గురించి. ఎటు నించి నరుక్కు వచ్చామన్నదే తేడా – ఎంత వరకు ఎట్లా ఉపయోగ పడగలిగాము అన్నదానికి అవధి మీరే.

    మీరు రాసినది మీకు తృప్తిగా ఉంటే అంతే.

    ఉపేంద్ర

  3. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి గారి అభిప్రాయం:

    05/18/2010 7:20 pm

    సంచారి గారూ,
    మీజవాబుకి థాంక్స్. మీరెండు వ్యాఖ్యలు చూసినతరవాత, క్రిటికల్‌గా చదవడం అంటే కథ మెరుగుపరచడానికో మరోకారణంగానో సలహాలు యివ్వడమే అనిపిస్తోంది. నేను పరీక్షకో పోటీకో అయితే, లేదా ఎవరైనా అదే పనిగా అడిగినప్పుడు మాత్రమే అలా చేస్తాను.

    మీరు నా రెండుకథల్లోనూ చివరి వాక్యాలమూలంగా క్లుప్తత దెబ్బ తింది అన్నారు. పెంపకం కథలో ’మెరుగుపరచడానికి’అని మీలాటివారు ఇచ్చిన సలహాననుసరించే చివర మార్చేను. నామొదటి డ్రాఫ్టులో అది లేదు. ఇలాటివి తెలుస్తాయనే మిగతా పాఠకులని కూడా అభిప్రాయాలు రాయమని అడిగేను.

    ఉపేంద్ర గారూ,
    మీరు కథలో ఏం చెప్పేరనే దృష్టితోనే చదివారు. అందుకు ధన్యవాదాలు. నాకథలో ఒక పాత్రని చిత్రించడమే నా ధ్యేయం. అంచేత మిగతా పాత్రలని డెవలప్ చెయ్యలేదు. చిన్నకథలో అంతే జరుగుతుంది అని నేను అనుకుంటాను. నిజానికి బుచ్చిబాబుగారి చివరికి మిగిలేది నవలమీద నా వ్యాఖ్యానం కూడా అదే. బహుశా అది నాకు గుర్తొచ్చిందేమో కూడా ఇది రాస్తున్నప్పుడు.

    మీ రెండో పాయింటు. నాకేదో ఆపాత్రమీద కోపం ఉన్నట్టుంది అన్నారు. నేను రచయిత వేరూ, కథకుడు వేరూ అనుకుంటాను. మీవ్యాఖ్య చూసి మీరు శ్రీరంగశయనంలాటివారు కాబోలు అనుకోడం న్యాయం కాదు కదా.

    పైన చెప్పినట్టే, మీరూ నేనూ కథ చదివేతీరులో తేడా అది. అబ్జెక్టివ్‌గా ఆలోచిస్తే, రచయిత ఒక పాత్రని నమ్మదగ్గపాత్రగా చిత్రించేడా లేదా అని అడగడానికీ, ఆపాత్రమీద రచయితకి సానుభూతి ఉందా లేదా అని అడగడానికీ తేడా వుంది కదా.
    మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.

  4. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    05/18/2010 1:45 pm

    వికీపీడియా లింకు పట్టుకుని వెడితే, పెద్దగారి పద్యం ఇక్కడ దొరికింది.

  5. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి J.Narayana Murthy గారి అభిప్రాయం:

    05/18/2010 6:37 am

    ఆర్యు లారా,
    అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?
    మీకు అనేక ధన్యవాదాలు.
    నారాయణమూర్తి

  6. సుగమం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/16/2010 11:04 am

    సంపాదకులకు:

    టి. శ్రీవల్లీ రాధిక -కవితలన్నీ బాగున్నాయి. వీరు రాసిన “అర్హత” కథ ఇంతవరకూ ఈ పత్రికలో చదివిన కథలన్నిటిలోకీ నాకు నచ్చిన కథ.
    “నా స్నేహితుడు” అన్న కథ ఇక్కడ ప్రచురించగలరా? థేంక్స్.

    లైలా

  7. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి T.Raja gopal గారి అభిప్రాయం:

    05/15/2010 11:43 pm

    Srinivas garu,

    Thanks for the link on Sri Adinarayana rao. My request to you is to write in Telugu,in eemaata about his good work in detail based on Hindustani style, giving some audio clips.

    Regards,
    Raja gopal.

  8. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకి రేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/15/2010 9:01 pm

    బాబ్జీలు గారూ,
    వ్యాసం చివర ఉన్న మూడవ రెఫరెన్సు – ‘చివరి మాట’ ఆఖరి పేరాలో చూడండి. బాలగోపాలు మార్క్సిజం పట్ల తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. గమనించ వలసిన విషయం ఒకటున్నది. ఎవరైనా చీకట్లో బయల్దేరేటప్పుడు ఏదో ఒక దీపం పట్టుకుని బయల్దేరుతారు. దారి మధ్యలో దాని వెలుగు సరిపోవటం లేదంటే దాన్ని బాగు చేసుకుంటారు. లేకపోతే వేరే దీపం ఏదైనా ఏర్పాటు చేసుకుంటారు. మార్క్సిజం వెలుగులో తనకి కనపడిన సత్యాలను ఎంత నిక్కచ్చిగా చెప్పారో, అంతే నిక్కచ్చిగా దాని పరిమితులు కనపడినప్పుడు కూడా బాలగోపాలు చెప్పారు. మూడు దశాబ్దాల పాటు అవిరామంగా తెలుగులోనూ ఇంగ్లీషులోనూ రాసిన మనిషి కాబట్టి, ఆయన ఎప్పుడూ ఎట్లా ఆలోచించారన్నది పట్టుకోవటం కష్టం కాదు.

  9. ఉత్తమాయిల్లాలు గురించి చాకి రేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/15/2010 8:54 pm

    మాలతి గారూ అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేస్తున్నాను.
    ఈ కథలో – పైనించి కింద వరకు కనపడేది రంగశయనం వ్యక్తిత్వం. మిగిలిన వారందరూ కూడా రంగశయనం మీద ఒక సారి టార్చి లైటు వేసి మనకు చూపించి వెళ్లిపోతారు. ఇంతమంది భుజాల మీదుగా రంగశయనం మీద దాడి చేశారు కాబట్టి మీకు రంగశయనం పట్ల చాలా అయిష్టం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. రంగశయనాన్ని మూర్ఖుడుగా చూపించటం వరకే ఈ కథ పరిమితమయితే చెప్ప వలసినదేమీ ఉండదు. కానీ కథ చివర్న ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు అన్న మాట వచ్చింది కాబట్టి, ఆ మూర్ఖత్వానికి కారణం ఆయన ఒక తరానికి చెందిన మనిషి కావటం అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజానికి కథలో ఆయన తరానికి చెందిన వారు మరెవరూ కనపడరు. ఎదురింటి ఎల్లమ్మ అనే ఒక మనిషీ, పక్కింటాయన ఇంకొకరెవరో తప్ప! స్పష్టా స్పష్టమైన జ్ఞాపకాల ద్వారా తల్లి వ్యక్తిత్వమేమిటో కొంత కనపడుతుంది. (అది కథ చివర్లో కొడుక్కి సాక్షాత్కారమవుతుందని మీరంటారు – ఆ మాటని మీ మాట భరోసా మీద తీసుకుంటాను) ఆ అభిప్రాయం కలగగానే మళ్ళీ చదివితే దాన్ని నిరూపించే ఆధారాలు ఇంకేవీ కనపడవు. చివరికి రంగశయనం పట్ల మీకు తీవ్రమైన అయిష్టమో అసంతృప్తో ఉన్నదని , అందువల్లనే మీరు ఆ పాత్రని పరమ మూర్ఖుడిగా, స్వార్ధ పరుడుగా చిత్రీకరించారనీ అనిపిస్తుది. ఇతర పాత్రల పట్ల మీకు శ్రద్ధ లేదనీ అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా వెతుక్కుని చూసుకుంటే తప్ప తెలియవు. ఈ కథని నేను రాస్తానని అనుకోను కానీ, ఇలాంటి కథ రాసే పని పడ్డప్పుడు, పాత్రల పట్ల నాకున్న రాగద్వేషాలకు మూలం ఏమిటో తేల్చుకున్నాకనే రాస్తాననుకుంటాను.

    ఇక పోతే, రివ్యూ విషయం లో – నిజానికి కథలకి పీర్ రివ్యూ సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. కథలకి నప్పేది వర్క్ షాపు పద్ధతి. కథల్లోనూ కవితల్లోనూ రచయితలు తనకి చాలా ఆంతరంగికమైన విషయాలతో పని చేస్తారు. వాటిని మలిచే ప్రయత్నంలో ఇంకొకళ్లెవరైనా పాల్గొనాలంటే – దానికి తగిన వాతావరణం చాలా జాగ్రత్త గా ఏర్పరుచుకోవాలి. పీర్ రివ్యూ తప్ప మరొక మార్గం లేదనుకుంటే – మీకు ఎటువంటి విమర్శో, అభిప్రాయమో కావాలన్నది ఆలోచించుకుని ముందుగానే మీరు చెప్తే ఇతరులకి తమ తమ హద్దులు పరిమితులు, దేని గురించి మాట్లాడ వచ్చును, ఏది అంగీకారం కాకపోవచ్చును ఇట్లాంటివి తెలుస్తాయి. ఆ పైన మీకు పనికొచ్చే విధంగా విమర్శించటానికి వీలవుతుంది.

    ఉదాహరణకి, ఈ కథ గురించి నేను పైన చెప్పినది మీకు ఏరకంగానూ ఉపయోగ పడక పోవచ్చును. మీరు రాసిన కథ పట్ల అందులో పాత్రల పట్ల మీకు ఏ అభిప్రాయం ఉందో, మీరు విమర్శనించి ఏమీ ఆశిస్తున్నారో నాకు తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది. 🙂

    ముందే చెప్పినట్టుగా, అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేశాను. అన్యధా భావించరనే ఆశ.

  10. ఉత్తమాయిల్లాలు గురించి సంచారి గారి అభిప్రాయం:

    05/15/2010 5:46 pm

    ఎలానూ మిగతా పాఠకులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టీ ఇక పొడిగించనును, కానీ…

    1. మీ బ్లాగుపాఠకులంతా మీ పీర్లనే మీకు అనిపిస్తే మరీ మంచిది. మీ బ్లాగు చదివేవాళ్ళంతా క్రిటికల్గా చదవరేమో అన్నాను. దానితో, పీర్ల గురించి నా నిర్వచనం ఏవని మీకు తెలిసిందో నాకు తెలవడం లేదు. అయినా పర్లేదు.

    2. మీ కథను ఎలా మార్చాలో పాఠకులకు ఇవ్వకుండానే వచ్చే హోంవర్క్ మీ కథలు రాయడములో మీరాశించే ఒక ప్రయోజనమని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడర్థమయింది, మీరు కావాలనే అపరిపక్వత (raw ness)ని కొంత ఒదిలిపెడుతున్నారని మీ కథల్లో.

    3. కథ మెరుగు పెట్టడానికి ఖచ్చితమైన కొలమానాలు ఉన్నాయి. ఉంటాయి. అవి సాపేక్షికమైనవి కావు. ఏ కథకు ఆ కథ, ఆకథ చుట్టూ అల్లబడివున్న వాతావరణం అంతర్లీనంగా వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే ఆ కథాకథనశైలీశిల్పాల్లో హెచ్చుతగ్గుల్ని అంచనా వేస్తారు.

    నేను మెరుగు పెట్టడం అన్నదానికి మీరు తీసుకున్న అర్థమ్ సరి అయినది కానే కాదు. మీ శైలిలోనే, మీ భాషలోనే మీరు చెప్పిందే మరింత బాగా పాఠకులు ఎక్కువమందికి మీరనుకున్న అర్థంలోనే చేరడానికి చేసే మార్పు మెరుగు పెట్టడం అంటే. మిమ్మల్ని నా భాషలో మాట్లాడమని కాదు. (పెళ్ళికి మీ అమ్మాయిని నేను అలంకరించటం అంటే మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకోడం కాదు. చాలా మంది, చాలా మంచి అమ్మలకి కూడా కూతుళ్ళకి పెళ్ళి ముస్తాబు రాక, వేరేవారితో చేయిస్తారు. చిన్నపట్నించీ మొఖం కడిగి జడేసి బడికి పంపాను కాబట్టీ పెళ్ళి ముస్తాబు కూడా నేనే చేయగలను అనుకోడమే కాదు, నాకంటే నా కూతురిని ఇంకెవరూ ఇంత బాగా అలంకరించలేరు అని కూడా అనుకోడం సరి అయినది కాదు. అలంకరణలో లోపాలుంటే పెళ్ళాగిపోదు కదా, పెళ్ళయింది కదా అని అలంకరణ గొప్పగా ఉన్నట్టూ కాదు, కథలూ అలాగే. అలంకరణ చక్కగా ఉండటం ఆ కళాకారుడికి కళకు ఉన్న బంధం మీద ఆధారపడి ఉంటుంది… కదా?)

    పాఠకులు చదివే కథని తమ భాషలోకి మార్చుకోడమూ, కథని అలా తమ లోకానికి అన్వయించుకోడమూ అనె ప్రక్రియ చాలా లోతైన విషయం. కథని మెరుగు పెట్టడం చాలా మొదట్లో జరిగే (ప్రిలిమినరీ) తంతు. ఇదే తేలుతున్నట్టులేదు సరిగ్గా, అంతదాకా ఎందుకు లేండి.

    శైలి అంటే నాకు తెలుసనే అనుకుంటాను. మళ్ళి చెప్పినందుకు కృతజ్ఞతలు.వినదగు నెవ్వరు చెప్పిన… ముందే చెప్పాను గదా నా చాదస్తాలు చాలా ఉన్నాయని. మీకేమో చాలా అధునాతన భావాలు ఉన్నై, ఈ తరంలో చాలా మందికి మల్లే. తాను ముణిగిందే గంగ, తాను వలచిందే రంభ తరహాలో. శుభం. అలానే కానీయండి, ముణిగిపోయిందేమీ లేదు ఎలానూ.

    ఇంక ఎలతానండీ, మీరు చెప్పినట్టుగానే “… పెరవారికి చోటొసంగుచున్”
    సంచారి.

« 1 ... 1150 1151 1152 1153 1154 ... 1583 »