Srinivas garu,
An excellent effort and inquisitive work. I commend your interest in bringing out interesting topics.
During 1970s and 1980s there were excellent novels came as serials in Vijaya Magazine on History. The author’ was Prasad, but I did not get any more details about this author after that. He wrote extremely well and I remember those days they won the heart of Telugu people. He did write some like ‘Ramarayalu’ and some on Sri Krishnadevaraya too. He too proposed (I vaguely remember) that Harihararaya and Bukkaraya were from Warangal.
I just got a copy of Nalamotu Chakravarthi garu latest book on ‘My Telugu Roots…’
నమస్కారములు ,
నాకు శ్రీనాథ మహాకవి అంటే చాల ఇష్టం అందుకే అతని పద్యాలకోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను అలా మీ వెబ్ సైట్ చూసాను చాల బాగుంది మీ సేవలు మాకు ఆనందాన్నే కాక అమూల్యమైన పద్యాలనూ ఇచ్చింది. అందుకు కృతగ్యతలు, ఇంకా మీ వద్ద దాశరథి పద్యాలు ఉంటే నాకు మెయిల్ చేయండి .
మీ,
డి కిష్టా రెడ్డి
పూడిపెద్ది శేషుశర్మ గారికి వందనం.
మీ అవేదన అర్థం చేసుకోదగినది.యెన్నో ఏళ్ళుగా ఈ రకపు సినిమాలను ప్రజలు భరిస్తూ వస్తున్నారు. సమ కాలిక పరిస్థితులు చూపడాన్ని తప్పు పట్టలేం గాఁనీ నవీన సంస్కౄతి ముసుగులో అసభ్యత చొప్పించే వ్యక్తుల అలోచనలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యెవరో పెద్దాయన అన్నట్లు కధలన్నీ కలిపి 6 కన్నా యెక్కువ ఉండవని అనిపిస్తున్నది. కానీ కధనం మాత్రం కాలం తొ పాటూ మారుతూ వస్తుంది.ఈ సినిమాలలో మాట వరసకి మాత్రం పవిత్ర ప్రేమ అంటారు. చూపించటం మాత్రం ఆవేశం ఆపుకోలేని శారీరక కామం చూపుతారు. కథానాయిక తండ్రి యెప్పుడయినా ప్రతినాయకుడే. కథా నాయకుడు దుష్ట తండ్రి బారి నుండి నాయికను రక్షించదమే చిత్రాంశం. మొన్నీ మధ్య ఒక మహా నాయకుని కుమార్తె తన తండ్రి పోషించిన అనేక పాత్రలను పోలిన కుర్రాడిని పెళ్ళాడి పారిపోయిందాకా యివే కధలూ కధనాలు. అప్పటికి ఉలిక్కి పడ్డ చిత్ర నిర్మాణ రంగం, కధలను క్రొత్త కోణం లోనుంచి చూపటం మొదలు పెట్టింది. ఎందుకంటే మన మహా నాయకుడే ప్రతి నాయక పాత్రలోకి అసంకల్పితంగా దూరాల్సిన దుస్థితి వచ్చింది. మరి యెంతమంది ఆదపిల్లల తండ్రులు ప్రతినాయకుల పాత్రలు పోషించారో ..ప్రేమతో పెట్టుకోవద్దు అనే హిత బోధ యెంతమంది దర్శకులు చేసారో..అవన్నీ సామాన్య ప్రజల కోసం, మా దాకా ఆ పరిస్థితి రాదు అనుకున్న సినిమా జనంకు ఇది గుణ పాఠం. తాము ప్రజల్ని పట్టించిన తప్పు దారి లోనే తమ పిల్లలూ నదిచే రోజు వస్తుందనే నిజం తెలిసాకయినా ఈ దర్శకులూ, మహా నటులూ ప్రేమకూ, కామానికీ తేడా తెలిసేటట్లు సినిమాలు తీసి, కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులతో మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తున్న ప్రజలకు మంచి వినోదం అందించి వారి రుణం తీర్చుకోమని నా విన్నపం.
అష్ఠ లక్ష్ములూ ఉన్నారూ, అష్ఠ దరిద్రాలూ ఉన్నాయి. ఏమి ఎంచుకోవాలో ఇంగితం ఉపయోగించి తెలుసుకోవాలి. మా అమ్మ చెప్పినట్లు ” దరిద్రాలన్నిట్లోకీ భావదారిద్ర్యం దుర్భరం.” ఈ మంచి మాట అంతకు ముందు యెవరన్నారో నాకు తెలియదు. మన సినిమా ప్రజలు యెప్పటికి ఈ దరిద్రత వదిలించుకొని భావ సంపన్నులౌతారో వేచి చూదాలి.
సర్వే జనా సుఖినోభవంతుః
ఇట్లు
బీర వంశీధరుడు
వాస్తు శిల్పి
భాగ్యనగరము.
మా గురువుగారి గొంతు ఇన్నాళ్ళకి వినగలిగాను. అందునా కిన్నెరసాని.. ఓహ్… వింటుంటే వళ్ళంతా పులకరించింది… మనసుకి ఇంతకు ముందు ఎప్పుడూ కలగని ఆనందం… కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయ్… నాకు ఇంత గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు.
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది: “తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Saradhi Motamarri గారి అభిప్రాయం:
07/28/2010 12:39 am
Srinivas garu,
An excellent effort and inquisitive work. I commend your interest in bringing out interesting topics.
During 1970s and 1980s there were excellent novels came as serials in Vijaya Magazine on History. The author’ was Prasad, but I did not get any more details about this author after that. He wrote extremely well and I remember those days they won the heart of Telugu people. He did write some like ‘Ramarayalu’ and some on Sri Krishnadevaraya too. He too proposed (I vaguely remember) that Harihararaya and Bukkaraya were from Warangal.
I just got a copy of Nalamotu Chakravarthi garu latest book on ‘My Telugu Roots…’
శ్రీనాథుని చాటుపద్యములు గురించి Kista Reddy గారి అభిప్రాయం:
07/27/2010 1:55 pm
నమస్కారములు ,
నాకు శ్రీనాథ మహాకవి అంటే చాల ఇష్టం అందుకే అతని పద్యాలకోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను అలా మీ వెబ్ సైట్ చూసాను చాల బాగుంది మీ సేవలు మాకు ఆనందాన్నే కాక అమూల్యమైన పద్యాలనూ ఇచ్చింది. అందుకు కృతగ్యతలు, ఇంకా మీ వద్ద దాశరథి పద్యాలు ఉంటే నాకు మెయిల్ చేయండి .
మీ,
డి కిష్టా రెడ్డి
నువ్వు గురించి Madhu Anneboina గారి అభిప్రాయం:
07/27/2010 12:41 pm
చాలా బాగుంది రాగ ద్వీప గారూ…
” ఎదురుచూపే మధురం
విషాద సమ్మిళిత సమ్మోహన యోగం :”. నిజమే కదా..!
వినాయక చవితి కథ గురించి DVA Kumar గారి అభిప్రాయం:
07/27/2010 9:37 am
Hi,
Mee vinayaka chavithi katha baagundi. Naaku mee rail prayanam
chadavalani undi.Help cheya galaru
తెలుగు సినిమా? తెగులు సినిమా? గురించి VAMSHIDHAR BEERA గారి అభిప్రాయం:
07/26/2010 1:18 pm
పూడిపెద్ది శేషుశర్మ గారికి వందనం.
మీ అవేదన అర్థం చేసుకోదగినది.యెన్నో ఏళ్ళుగా ఈ రకపు సినిమాలను ప్రజలు భరిస్తూ వస్తున్నారు. సమ కాలిక పరిస్థితులు చూపడాన్ని తప్పు పట్టలేం గాఁనీ నవీన సంస్కౄతి ముసుగులో అసభ్యత చొప్పించే వ్యక్తుల అలోచనలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యెవరో పెద్దాయన అన్నట్లు కధలన్నీ కలిపి 6 కన్నా యెక్కువ ఉండవని అనిపిస్తున్నది. కానీ కధనం మాత్రం కాలం తొ పాటూ మారుతూ వస్తుంది.ఈ సినిమాలలో మాట వరసకి మాత్రం పవిత్ర ప్రేమ అంటారు. చూపించటం మాత్రం ఆవేశం ఆపుకోలేని శారీరక కామం చూపుతారు. కథానాయిక తండ్రి యెప్పుడయినా ప్రతినాయకుడే. కథా నాయకుడు దుష్ట తండ్రి బారి నుండి నాయికను రక్షించదమే చిత్రాంశం. మొన్నీ మధ్య ఒక మహా నాయకుని కుమార్తె తన తండ్రి పోషించిన అనేక పాత్రలను పోలిన కుర్రాడిని పెళ్ళాడి పారిపోయిందాకా యివే కధలూ కధనాలు. అప్పటికి ఉలిక్కి పడ్డ చిత్ర నిర్మాణ రంగం, కధలను క్రొత్త కోణం లోనుంచి చూపటం మొదలు పెట్టింది. ఎందుకంటే మన మహా నాయకుడే ప్రతి నాయక పాత్రలోకి అసంకల్పితంగా దూరాల్సిన దుస్థితి వచ్చింది. మరి యెంతమంది ఆదపిల్లల తండ్రులు ప్రతినాయకుల పాత్రలు పోషించారో ..ప్రేమతో పెట్టుకోవద్దు అనే హిత బోధ యెంతమంది దర్శకులు చేసారో..అవన్నీ సామాన్య ప్రజల కోసం, మా దాకా ఆ పరిస్థితి రాదు అనుకున్న సినిమా జనంకు ఇది గుణ పాఠం. తాము ప్రజల్ని పట్టించిన తప్పు దారి లోనే తమ పిల్లలూ నదిచే రోజు వస్తుందనే నిజం తెలిసాకయినా ఈ దర్శకులూ, మహా నటులూ ప్రేమకూ, కామానికీ తేడా తెలిసేటట్లు సినిమాలు తీసి, కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులతో మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తున్న ప్రజలకు మంచి వినోదం అందించి వారి రుణం తీర్చుకోమని నా విన్నపం.
అష్ఠ లక్ష్ములూ ఉన్నారూ, అష్ఠ దరిద్రాలూ ఉన్నాయి. ఏమి ఎంచుకోవాలో ఇంగితం ఉపయోగించి తెలుసుకోవాలి. మా అమ్మ చెప్పినట్లు ” దరిద్రాలన్నిట్లోకీ భావదారిద్ర్యం దుర్భరం.” ఈ మంచి మాట అంతకు ముందు యెవరన్నారో నాకు తెలియదు. మన సినిమా ప్రజలు యెప్పటికి ఈ దరిద్రత వదిలించుకొని భావ సంపన్నులౌతారో వేచి చూదాలి.
సర్వే జనా సుఖినోభవంతుః
ఇట్లు
బీర వంశీధరుడు
వాస్తు శిల్పి
భాగ్యనగరము.
శబ్ద తరంగాలు గురించి కౌటిల్య గారి అభిప్రాయం:
07/25/2010 10:12 pm
మా గురువుగారి గొంతు ఇన్నాళ్ళకి వినగలిగాను. అందునా కిన్నెరసాని.. ఓహ్… వింటుంటే వళ్ళంతా పులకరించింది… మనసుకి ఇంతకు ముందు ఎప్పుడూ కలగని ఆనందం… కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయ్… నాకు ఇంత గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/25/2010 4:06 pm
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది:
“తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
ఈమాట కొత్త వేషం గురించి Raman గారి అభిప్రాయం:
07/25/2010 11:01 am
మొదటి సారి చదువుతున్నా ఈ పత్రిక. గుడ్ వర్క్.
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి గోపీకృష్ణ గారి అభిప్రాయం:
07/24/2010 4:41 am
రూపకము బాగుంది. Quality of audio is very good.
నువ్వు గురించి radhakrishna గారి అభిప్రాయం:
07/24/2010 3:33 am
మీ కవిత చాలా బాగున్నది. మైదానము లొ చలమ్ చెప్పినవి గురుతుకు వస్తున్నవి. భావమ్ చాలా బావున్నది.