Comment navigation


15824

« 1 ... 1119 1120 1121 1122 1123 ... 1583 »

  1. తిలక్ తో నా పరిచయం గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    09/02/2010 11:59 pm

    ఏలూరు, విశాఖపట్టణము, జీడి మామిడి చెట్ల నీడల కబుర్లు వినడానికి సరదాగా ఉన్నాయి.

  2. ఆత్మ ఘోష గురించి Prasanna గారి అభిప్రాయం:

    09/02/2010 2:55 pm

    బాగుంది రవీ. ఇంకా వినాలని వుంది.

  3. ఆత్మ ఘోష గురించి Ramchandar Chebolu గారి అభిప్రాయం:

    09/02/2010 2:52 pm

    రవి,
    నాకు తెలియదు నీలో ఇంత కవిత్వం వుందని. చాలా బాగుంది.
    రామచంద్ర.

  4. గోరువంకలు గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    09/02/2010 1:48 pm

    నాకేదో పెద్ద తెలుసని కాదు కానీ… అచ్చుతప్పులని తెలిసి మరీ అలాగే ఉన్నదున్నట్లు పునర్ముద్రించారా? నిజంగానే?

    [ కొన్ని అచ్చుతప్పులని రూఢిగా తెలిసినవి సవరించాం. ఉదా: నిసణ్ణ – నిషణ్ణ, సవ్వయి – సవ్వడి, ఇలా. (వెల్చేరు వ్యాసంలో ఉటంకించిన ఒక కవితలో తిలక్ సంయమం అన్నాడా సంయమనం అన్నాడా అని చాలా చర్చ కూడా అయింది. రెండిటికీ అర్థం ఒకటే అయినా కవి వాక్కును మార్చకుండా ఉంచాలి గదా.) అంతకు మించి పరిష్కరించడం ఛందస్సు, తిలక్ కవిత్వం రెండూ బాగా తెలిసిన పండితుడు మాత్రమే చేయగలడు అని మా ఉద్దేశం. విశాలాంధ్ర తిలక్ రచనల ముద్రణలో విపరీతమైన నిర్లక్ష్యం కనిపిస్తుందనేది జగమెరిగిన సత్యమే. – సం.]

  5. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి వేణు గారి అభిప్రాయం:

    09/02/2010 1:25 pm

    తిలక్ కవిత్వం గురించి రాసిన ఈ వ్యాసాన్ని కొన్నేళ్ళ క్రితం చదివాను. ముఖ్యంగా ‘నన్ను కౌగలించుకున్న పెద్దపులివి’ అనే వాక్యం గురించి రా.రా. నిశిత విమర్శ బాగా గుర్తుంది. ఇంత విలువైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ఓ సందేహం. ‘నా అక్షరాలు ప్రజాశక్తుల నావహించే విజయ ఐరావతాలు’ అంటూ రా. రా. ఉటంకించారు. ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకంలో ఉండే ‘ప్రజాశక్తుల వహించే’ ఎటూ తప్పే. అన్వయంలో స్పష్టంగా కనిపించే ఈ దోషాన్ని పట్టించుకోకుండా యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వారి నుంచి చాలా మంది వరకూ దీన్నే యథాతథంగా కోట్ చేస్తుంటారు.

    ‘ప్రజాశక్తులావహించే’ అనే వర్షన్ కూడా ఓచోట చదివాను. ఇంతకీ ఏది సరైనదో!

    [తెలుగు, సంస్కృత నిఘంటువుల ప్రకారం లావహించే అనేది సరైనదండీ. ఐరావతాలు కాబట్టి అధిరోహించే (ఆరోహించే) ఎందుకు కాగూడదో అనే సందేహంతో మేమూ మార్చే సాహసం చేయలేదు. – సం.]

  6. మహామంగళప్రవచనము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/02/2010 10:19 am

    చిక్కని పద్యాలలో చక్కని కవిత్వం, చాలా బాగుందండీ!
    “అంభోవాహస్వనితానుకూలనటనంబూనె న్మయూరంబులున్” : మేఘధ్వనికి నెమళ్ళు నాట్యం చెయ్యడం మామూలే, ఆ ధ్వనికి అనుగుణంగా నాట్యం చేసాయనడం విశేషం!
    “తారలు క్షపాకరుడుం గనరాకయుండఁ గాలయవనికాంతరస్థనటులం బలె” : కొత్త ఊహ!
    “కరుణానిధి”, “కరుణాంబుధీ” లాంటి పదాలు వినివిని అరిగిపోయాయి 🙂 “అనుకంపాబ్ధీ!” : చాలా బాగుందీ పదం!

    “రస” విషయికంగానే కొంత నిరుత్సాహం కలిగింది. కథ తెలిసినవాళ్ళకయితే ఫరవాలేదు కాని, తెలియని నాలాంటి వాళ్ళ విషయంలో చివరకి వచ్చేసరికి హఠాత్తుగా ముగిసిపోయినట్టనిపిస్తుంది. అంత గొప్ప వర్ణనలతో ఆ వాతావరణాన్నీ, ఆ సురాంగన దిగిరావడాన్ని వర్ణించిన తీరులో అద్భుత రసాన్ని పోషించి, వెనువెంటనే శాంత రసస్ఫోరకాలయిన బుద్ధుని మాటలు వచ్చెయ్యడం ఒక రకంగా రసభంగమైనట్టు అనిపించింది. అక్కడ మరికొంత కల్పన ఉంటే మరింత రక్తి కట్టి ఉండేదని అనుకుంటున్నాను.

    ఏదైనా ఈ కాలంలో ఇంత మంచి పద్యకవిత్వాన్ని చదవడం అదృష్టమే! వీటిని దేశికాచారిగారి గళంనుంచి కాని, లేదా వేరెవరి మధుర గళంనుంచైనా కాని వినగలిగితే మరింత ఆనందంగా ఉంటుంది. ఇది ఈమాటలాంటి ఇంటర్నెట్ పత్రిలలకి పెద్ద పనేం కాదు కదా!

  7. పూల పల్లకి గురించి శేఖర్ పెద్దగోపు గారి అభిప్రాయం:

    09/02/2010 10:07 am

    చాలా బాగుంది….మొదటి నుండి చివరిదాకా మంచి feelని ఇచ్చింది….

  8. ఆత్మ ఘోష గురించి chavakiran గారి అభిప్రాయం:

    09/02/2010 6:53 am

    కవితల క్వాలిటీ బార్ ఏమన్నా కిందికి దింపారా ఏమిటి ఈ మాట వారు 🙂

  9. పూల పల్లకి గురించి Rishi గారి అభిప్రాయం:

    09/02/2010 6:23 am

    బాగుంది హాయిగా.

  10. బందీ గురించి Ravindrababu.Pydipalli గారి అభిప్రాయం:

    09/02/2010 5:51 am

    Dear Narayana Garu, I am not able to type my comment in Telugu so just in English i want to let my feelings out, after reading your poetry. It is simply superb.
    There is a very good flow Not in NAYAGARA, in your pen.

    Nuances, gradations, rhythm and reverberation all are mixed in a balanced proportion. When I read Tilak’s Amrutam kurisina rAtri (one of my favorite books)
    And Chalam’s translation work Gitanjali I see the words so simple but they carry million dollars worth of meaning. we have to read 100 times to understand the real meaning of those simple words. I had a similar feeling when I have gone through your “BANDHI”. Keep it up.

    with regards… RAVINDRABABU.P

« 1 ... 1119 1120 1121 1122 1123 ... 1583 »