Comment navigation


15824

« 1 ... 1118 1119 1120 1121 1122 ... 1583 »

  1. శతకందసౌరభము: పరిచయం గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    09/05/2010 3:15 pm

    కందము పద్యము లందున
    అందము నెంతైన గలదు నాస్వాదింపన్
    ఎందున గని విని యెఱుగము
    అందఱి నానంద పఱచు నది మకరందమ్ .

    కృష్ణమోహన రావు గారి కంద పద్యాలు బాగున్నాయి.

  2. పూల పల్లకి గురించి రఘువీర్ గారి అభిప్రాయం:

    09/05/2010 12:14 pm

    చాలా బాగుంది.రచయిత ఆ అమ్మాయిని సృష్టించి ఆమె మనసులోకి దూరి రాశాడా అనిపించింది.

  3. తిలక్ తో నా పరిచయం గురించి tahataha గారి అభిప్రాయం:

    09/04/2010 4:56 pm

    వేలూరి వారికి నమస్కారాలు
    తిలక్ తో మీకు ఉండిన పరిచయం గురించి మీరు రాసింది చదివి ఆనందించాను . ఆంద్ర విశ్వ కళా పరిషత్ రూపు రేఖలు మారి పోయి చాలా కాలమయ్యింది యూనివెర్సిటీ ల సంఖ్య పెరిగి ఒకప్పటి ఆంద్ర విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర విశ్వవిద్యాలయమయి ఉత్తరాంధ్ర లో మరో యూనివెర్సిటీ రావడం తో ఉత్త ఆంద్ర విశ్వ విద్యాలయం అయింది
    . తః తః

  4. మారుపేర్ల మాయువు గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    09/04/2010 10:51 am

    ‘శ్రీరంగం శ్రీనివాసరావు’ అనే పెద్ద కొండని చిన్న అద్దంలో చూపించడమే ‘శ్రీశ్రీ’ అంటే- అని రచన పత్రికలో అన్నాను. అలా అలరించిన పేర్లే వపా ,కొకు, పాప, సినారె, చాసో, భకారా, భరాగో లాంటివి. మరో రకం- గోరా శాస్త్రి, ద్వానా శాస్త్రి, కవన శర్మ వగైరా. ఇక భాగవతుల శంకర శాస్త్రి, కిళాంబి నరసింహాచార్యులు, సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే అసలు పేర్ల కంటే కలం పేర్లే బాగా వర్ధిల్లాయి. సినిమా హిట్టయితే కొత్త ఇంటి పేర్లు వస్తాయి, సిరివెన్నెల, అల్లరి- వంటివి. బిరుదులు వస్తే ఇక అసలు పేర్లతో పనే లేదు, కవి సామ్రాట్, నట సామ్రాట్, నట రత్న అటువంటివి. విష్ణువుకి వేయి నామాలు కదా, మనుషులు ముచ్చటగా మరో పేరు పెట్టుకొని ఆనందిస్తే –పోనీ లెండి.
    -డా. తాతిరాజు వేణుగోపాల్

  5. కవితా సుమశరుడు తిలక్ గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    09/04/2010 10:00 am

    సారీ… తిలక్ ‘అమ్మాయిలు’ అన లేదు, ‘ఆడ పిల్లలు’ , అన్నారు.
    నా అభిప్రాయం లో ఓ చిన్న సవరణ.
    -డా. తాతిరాజు వేణుగోపాల్

  6. కవితా సుమశరుడు తిలక్ గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    09/03/2010 12:09 pm

    తిలక్ లో కృష్ణ శాస్త్రి + శ్రీ శ్రీ ఉన్నారు. వేటూరి సుందర రామ మూర్తి లో అందరూ ఉన్నారు. తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు’ అని అంటే వేటూరి వారు ‘ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం’ అనగలిగారు. ఇప్పుడు వీరెవ్వరూ లేరు. వారి మాటలూ,పాటలే ఉన్నాయి.
    -డా. తాతిరాజు వేణుగోపాల్
    |

  7. బందీ గురించి Jagannatha Rao గారి అభిప్రాయం:

    09/03/2010 7:42 am

    బందీ కవితలో నింద మిషతో స్తుతించడం బాగుంది. ఇది వ్యాజ స్తుత్యలంకారం.

  8. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/03/2010 4:42 am

    వహించడం అంటే మోయడం (to carry, to bear). “శిరసా వహించడం” అన్నది మనకి తెలుసున్న మాటే. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అంటే ప్రజాశక్తులను మోసే (తమపైకి ఎత్తకుని ఊరేగించే) విజయ ఐరావతాలని అర్థం చక్కగా ఉంది కదా! ఆవహించడాలు, అధిరోహించడాలు ఎందుకు?

    [నిజమే! మియా కల్పా! మీకు కృతజ్ఞతలు – సం]

  9. మారుపేర్ల మాయువు గురించి subbarao గారి అభిప్రాయం:

    09/03/2010 1:05 am

    చాలా మంచి ఒపినియన్.

  10. మహామంగళప్రవచనము గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    09/03/2010 12:43 am

    దేశికాచారి గారి కవిత్వం ఎప్పటి వలనె రసానుభూతి కలిగిస్తూ మధురంగా వుంది. దేశికాచారి గారికి చెందవలసిన కీర్తి, ప్రఖ్యాతి ఆయన్నింకా వరించలేదేమోనని నేను భావిస్తున్నాను. ఆయన కవిత్వంని అందిస్తున్నఈమాటకు కృతజ్ఞతలు.

« 1 ... 1118 1119 1120 1121 1122 ... 1583 »