Comment navigation


15826

« 1 ... 1113 1114 1115 1116 1117 ... 1583 »

  1. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Ramakrishna గారి అభిప్రాయం:

    09/20/2010 5:55 pm

    గుణాఢ్యుడు రచించిన బృహత్కథ కావ్యం మరియు హాలుడు రచించిన గాధా సప్తశతి ఎక్కడ దొరుతుందో దయచేసి నా ఈ మెయిల్ కు పంపగలరు. హార్డ్ కాపీ అయిన మరియు సాఫ్ట్ కాపీ అయిన పర్వాలేదు.

  2. వెన్నెల – తిలక్ కవిత గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    09/20/2010 5:31 pm

    బాగుంది. పుస్తకంలో చదవటానికీ, పైకి చదివితే వినటానికీ కూడా బాగుంది.

    ఐతే, దాదాపు చివరి ఇరవై పంక్తులు – ఇంకో కవితను తెచ్చి అతుకు వేసిట్లుగా ఉంది. కవిత లయ మారింది. లయ మారితే మారింది. కవిత విషయం కూడా మారింది.

    అప్పటివరకు వెన్నెలను ప్రయివేటుగా అనుభవిస్తున్న మానవుడు, అకస్మాత్తుగా 🙂 “ఎవరో” – వెధవా! నీ ఒక్కడి కోసమే నీ దొడ్లోనే కురుస్తాందా వెన్నెల? వెన్నెల అందరిదీ కాదూ. అది అన్నిచోట్లా కురవదూ? అని కొరడా పెట్టి కొట్టినట్లు; సన్నాసీ! కవిత్వంలో ఏవి తప్పక రాయాలో మర్చిపోయావా -అని కోప్పడితే ఢమిక్కిన గుర్తుకు వచ్చినట్లు; అక్కణ్ణుంచీ కవితలో -“ధనికులు, నిరుపేదలు, ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ములు, ఊరి బైట కాలీకాలని చితికీలలు” -వచ్చి పడ్డాయి.

    నా ఉద్దేశంలో, ‘వెన్నెల’ ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు వేరు కవితలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి – ఒకటి చేయబడ్డాయి. ఆ పని కవి సొంతగానే చేసుకున్నాడో, లేక ఇతరుల ప్రోద్బలం వల్ల జరిగిందో, ఊరికే పోనివ్వడమెందుకు ‘వెన్నెల’ మీద ఉన్న బంతులన్నీ ఒక కవితలోనే ఒక ప్రసారంలోనే వినిపించేద్దాం, పనై పోతుంది – అని ప్రసారకర్తలో, ప్రచురణకర్తలో అనుకున్నారో మరి.

    ధోరణి వేరైన -రెండు రచనలనూ విడగొట్టి -మొదటి కవిత ధనికుల పెట్టెలోనూ, రెండోది పేదల పొట్టలోనూ వేస్తే రెండూ నిండుతాయి. 🙂 కాదా.

    కవితలో కొన్ని పంక్తులు తిలక్ రెండుసార్లు చదవటం నచ్చలేదు. అవి సంగీతంలో సంగతుల వంటివి కావు. రెండో సారి చదివినంతనే వాటి రుచి పెరగలేదు. ఏ వాక్యానికీ రెండో సారి చదవవలసిన అదిక ప్రాముఖ్యతా లేదు.

    తిలక్ – హాయిగా వెన్నెల అనుభవించటం అర్ధాంతరంగా మానేసి – హడావిడిగా పెన్నూ కాగితం తెచ్చేసుకుని-

    ” నా రచనగా తానై పోయింది
    వెన్నెల వంటి నా ఉద్రేకానికి
    తెలుగు భాష శరద్వియ
    ద్విహార వనమై నడచిపోయింది ”

    అని రాయటం కూడా మానేసి ఉండాల్సింది.

    ఏమంటారు చదువరులు? శ్రోతలు?

    లైలా

  3. పూల పల్లకి గురించి విశాల గారి అభిప్రాయం:

    09/20/2010 11:18 am

    శ్రీనివాస్ గారూ,

    అనవసరపు హంగులు, ఆర్భాటాలు, బరువులు, బేరాలు లేకుండా శృతి లో పలికిన లలిత గీతంలా చల్లగా, హాయిగా ఒక చక్కటి అనుభూతిని అందిస్తూ సాగిపోయింది… మీ ‘పూల పల్లకి’.

    చాలా బావుంది. అభినందనలు.

  4. సా విరహే తవ దీనా గురించి mOhana గారి అభిప్రాయం:

    09/20/2010 10:14 am

    నమస్కారాలు నారాయణ బాబు గారూ, నస్రుద్దీన్ గారి పాట ఇంటర్నెట్‌లో ఉంటే తెలుపగలరు. ఈ వ్యాసం బాగుందంటే దానికి కారణం నేనొక్కడిని మాత్రమే కాదు. నాతోబాటు వ్రాసిన సహరచయిత బ్రహ్మానందంగారు కూడ దీనికి కారకులు.
    విధేయుడు – మోహన

  5. సా విరహే తవ దీనా గురించి Narayana babu vedula గారి అభిప్రాయం:

    09/20/2010 9:16 am

    Nindati chandana mindu kirana manu was also sung by Ustaad Amin Nasiruddin Dagar in Bageshwari of Dhrupad styleof music.
    excellent piece of article by mohana rao garu

  6. రాగలహరి: సింధుభైరవి గురించి Murali గారి అభిప్రాయం:

    09/20/2010 7:21 am

    వేణు మాధవా అన్న పాట మోహన రాగమ్లో కూర్చబడినది. లక్ష్మన్న గారు, దయచేసి మధ్యమావతి రాగం గురించి రాయండి.

  7. మారుపేర్ల మాయువు గురించి మారుపేర్ల మాయువు గారి అభిప్రాయం:

    09/19/2010 6:42 pm

    మారుపేర్ల మాయువు ఈమాట పత్రికలో పుట్టడానికి ప్రధాన కారణం, వ్యక్తి గత నిందలతో కూడిన అభిప్రాయాలను సెన్సార్‌ చెయ్యడంలో ఉన్న ఈమాట సంపాదకుల బాధ్యతా రాహిత్యమే. పైకి బాగానే కబుర్లు చెబుతారు గానీ, ఎంతో మంది సంపాదకులు ఎన్నో సార్లు అభ్యంతరమైన వ్యాఖ్యలను సెన్సారు చెయ్యకుండా ప్రచురించారు. ఒక్కోసారి ఒక సంపాదకుడు మిగిలిన సంపాదకులతో సంప్రదించకుండా అటువంటి వ్యాఖ్యని అనుమతించారని ఓ సిల్లీ సంజాయిషీ చెబుతారు. “స్వల్పమైన వ్యంగ్యం ఆరోగ్యకరం, హాస్యదాయకం” అని అనుకుంటూ, వ్యక్తి గత నిందలున్న వ్యాఖ్యలని ప్రచురిస్తారు. అది ‘స్వల్పమో’, ‘అధికమో’ తేల్చడానికి మీరెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది మీ పత్రిక అని సమాధానం చెబుతారు. ఆ ‘స్వల్పం’ రచయితకి కూడా ‘స్వల్పం’ అవునో, కాదో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? ఇక ఆ రచయిత్రి(త) ఏడవలేక, కృత్రిమ నవ్వు మొహానికి పులుముకుని, ఏదో జవాబివ్వడమో, దాన్ని నిర్లక్ష్యం చెయ్యడమో చేస్తారు. రచన గురించే రాయండీ, రచన గురించే రాయండీ అని ఓ పక్క కేకలు పెడుతూనే వుంటారు. ఇంకో పక్క అలా లేని వ్యాఖ్యలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటూనే వుంటాయి. దానికి బాధ్యత ఈ సంపాదకత్వ వర్గానిదే. ఏ రచయిత్రి(త) వచ్చి “నా మీద వ్యక్తిగతమైన నింద వుంది, బాబోయి” అని మీతో చెప్పుకోగలరు?

    ఒక పాఠకురాలు(డు) ఒక రచన గురించి, ఆ రచయిత్రి(త) ప్రశక్తి లేకుండా, ఏమన్నా విమర్శ చేస్తే, ఆ రచన నచ్చిన ఒక గుంపు ఇక విరుచుకు పడుతుంది. ఆ విరుచుకు పడ్డం అంతా, రచన గురించో, రచన మీద వచ్చిన విమర్శ గురించో అయితే, ఎవరికీ అభ్యంతరం వుండదు. నెమ్మదిగా మొదలయి, తీవ్రంగా వ్యక్తి గత స్థాయిలోకి వెళుతుంది ఆ నింద. ఒక్కోసారి వ్యక్తి గత మెప్పుదలే కదా, ఎవరికీ అభ్యంతరం వుండదు అని మీరనుకుంటూ, ఆ రచయిత్రి(త)ని ఇష్టపడే వంధిమాగధుల గొప్ప గొప్ప మెప్పుకోళ్ళు ప్రచురిస్తారు. అవి చదవడానికి మాత్రం ఎంత వెగటు పుడుతుందో.

    ఈమాట సంపాదకులు వ్యాఖ్యానాల విషయంలో, ఏ మాత్రమైన వ్యక్తి గత రిఫెరెన్సూ లేకుండా సెన్సారు చెయ్యగలిగి నప్పుడు మాత్రమే, ఈ “మారుపేర్ల మాయువు”కి అంతం పుడుతుంది. లేదా, ఈ “మారుపేర్ల మాయువు” వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటీ అని మిమ్మల్ని మీరు ప్రశ్నంచుకోండి. ఇవన్నీ మీరు సెన్సారు చేసి, అనుమతించిన రచనలూ, వ్యాఖ్యానాలూ. ఇంక రాసిన మనిషికి అక్కర్లేని పేరు మీకెందుకూ? ఆ మనిషి అసలు పేరు రాయలేదని మీకు బాధ ఎందుకూ?

    ఒక వేలు అవతల వేపు వాళ్ళ కేసి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళూ మీ వేపే చూపిస్తాయన్న నానుడి వుండనే వుంది. స్వవిమర్శ కూడా ముఖ్యమే.

  8. తోడు గురించి shanthi గారి అభిప్రాయం:

    09/19/2010 3:55 am

    నిజంగా ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మకు పెళ్ళి చేయాలని అనిపిస్తే రామారావు కాకుండా యే భీమారావునో చూస్తే సరిపోయేది.

  9. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి BADAGALA RAMANAMURTY గారి అభిప్రాయం:

    09/18/2010 7:52 am

    మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం బాపూ బొమ్మలతో ఇచ్చిన మీ రుణం ఎలాగున తీర్చుకోవడం? మీకు నా కృతజ్ఞతలు, నమస్కారములు.

  10. ప్రేమ కవితలు గురించి Nagaraju.Voore గారి అభిప్రాయం:

    09/18/2010 7:09 am

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

« 1 ... 1113 1114 1115 1116 1117 ... 1583 »