Comment navigation


15826

« 1 ... 1115 1116 1117 1118 1119 ... 1583 »

  1. ప్రేమ కవితలు గురించి lalitha గారి అభిప్రాయం:

    09/15/2010 7:04 am

    నా మనసులొని భావాలు మీ కవితలొ వెల్లువెత్తాయి
    నా ప్రేమ కలలు మీ కలమున జాలువారాయి
    ప్రేమను ప్రేమతొ ప్రేమిస్తున్న ఓ నేస్తమా నీకు నా జోహార్లు

    …నేను మీలాగే ఒక ప్రేమ పిపాసిని,
    నా ప్రియుని కోసం ఇలాగే కవితలు రాస్తున్నాను.

    లలిత

  2. కవితా సుమశరుడు తిలక్ గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    09/14/2010 12:59 pm

    “వార్షుకాభ్రం నాకు యక్షపతీ సౌందర్యాన్ని రచిస్తుంది” అంటే? యక్షపతి అంటే కుబేరుడని తెలుసు. యక్షపతీ సౌందర్యం అంటే? సంపద్వంతమైన సౌందర్యమా?కాదేమో!

  3. ప్రేమ కవితలు గురించి anitha గారి అభిప్రాయం:

    09/14/2010 5:00 am

    మీ కవిత చాలా బాగుంది.

  4. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి MALLIKARJUNA SHARMA గారి అభిప్రాయం:

    09/14/2010 4:51 am

    Tikkana is really great. I think the poem is preceded by prose like, “Drovadi bhandurammaina kommudi grakkuna vidilichi… asitacchavin bolchu maha bhujangamo naa vilasilli…” this prose-poetry should also have been given by Sri Brundavana Rao. Anyway much thanks to him for reminding us again about the great dramatic poetic talents of Tikkana Somayaji. As for some liking or not liking, of course it is an individual affair, but then we have also to comment there may be at least some who may not cherish the pleasant smells of sandalwood.

  5. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    09/13/2010 6:10 pm

    ఎవరి వ్యక్తిత్వానికైనా నిస్సందేహంగా వన్నె తెచ్చే లక్షణం నిబద్ధత.అది ఒక తాత్విక/రాజకీయ సిద్ధాంతానికి అవవచ్చు,జీవన విధానానికి అవవచ్చు,నైతికవిలువల పట్ల అవవచ్చు ,మానవీయ సంబంధాలు/ అనుబంధాల పట్ల అవవచ్చు.అయితే వ్యక్తులుగా మనం బద్ధులమయ్యే సిద్ధాంతాలు/ఇజాలు/వాదాలు, వాటికి భిన్నమైన మూలాలుకల సాహిత్య రూపాలు,సాహిత్యప్రక్రియల సాహితీ విమర్శను ఏమాత్రం ప్రభావితం చేయకూడదు.అరుదైన విమర్శనాశక్తి,సునిశితమైన వివేచన,నిష్పాక్షికత,సాహితీ నిబద్ధత ఉన్న రారా వంటి ప్రతిభావంతులైన విమర్శకుల పరిశీలనా దృష్టిని ,విశ్లేషణాపరిధిని కూడ సిధ్ధాంత చట్రాలు ఇంతగా పరిమితం చేయటం దురదృష్టకరం.తెలుగువచనకవితను అద్వితీయంగా పరిపుష్టం చేసిన తిలక్ కవిత్వానికి ఈ సమీక్ష
    న్యాయం చేయలేదనే చెప్పాలి.

  6. “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి Raghavendra గారి అభిప్రాయం:

    09/13/2010 12:09 pm

    P.G.Wodehouse ఒకసారి make a sound like an egg and beat it అన్నాడు. అలా వున్నదిఈ వ్యాసము.

  7. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి సంపాదకుల ప్రకటన గారి అభిప్రాయం:

    09/13/2010 9:32 am

    “ఒక్కొక్క యుగంలో జీవితం గురించి ఆనాటి జనులకు ఒక్కొక్క అవగాహన ఉంటుంది.” రారా గొప్పదనమిదే. మంచి అవగాహన. చారిత్రక పరిణామంలో విలువల అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవటం. అంటే కవిత్వావగాహన సాపేక్షమని. అంతవరకు బాగానే ఉంది. కానీ, “వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది” అనడంలో ఒక లాజికల్ ఫ్లా ఉంది. ఈ వాక్యం మరొకసారి చదవండి.వాస్తవ జీవితానికీ కవిత్వానికీ మధ్య అఖాతం ఎందుకేర్పడింది? దానికి కారణం ఏమిటి? కవిత్వం జీవిత వాస్తవానికి దూరంగా జరగటమే. అంటే అంతటితో ఈ ప్రాసెస్ అయిపోయింది. అఖాతం ఏర్పడటం లోనే, విస్తరించటంలోనే విస్మరించటం ఉంది. ఇంక విస్మరించటం ధ్యేయం కావటం ఏంటి?

    – సి. ఎస్. రావ్.

    [రా.రా సమీక్షపై సి. ఎస్. రావ్ గారు వ్రాసిన ప్రతిస్పందన నిడివి, పరిశీలన, వ్యాసానికి సరిపోయినంతగా వుండటంతో వారి లేఖను ఒక పూర్తి వ్యాసంగా ఈమాటలో ప్రచురించాము. ఇలా ఆలస్యంగా ప్రచురించడం మా నియమ భంగమే అయినా సబబైన నిర్ణయమనే మా అభిప్రాయం – సం.]

  8. మారుపేర్ల మాయువు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/11/2010 11:37 pm

    బావుంది. ఈ మాయువు మాయరోగం ఇంటర్నెట్ వచ్చాకనే పెరిగింది. రచయితలు మారుపేర్లతో రాయడం వల్ల ఎవరికీ ఇబ్బందీ లేదు; ఒరిగేదీ లేదు. అసలు గొడవంతా మొదలయ్యేది పాఠకుల పేర్లతో వచ్చే వ్యాఖ్యలవల్లే! ఇదే ప్రస్తుత రచ్చకి మూలకారణం. గతంలో పత్రికల్లో కథలూ, కాకరకాయలపైన ఉత్తరాలు రాసినా, సంపాదకుల వారు యధాశక్తి నొక్కేసేవారు. ఆహా ఓహోలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.
    గట్టిగా ఎవరైనా దబాయిస్తే, స్థలాభావం అన్న సాకెలాగూ వుంది. ఇంటర్నెట్ లో అటువంటివి లేవు. ఇలా రచన రాగానే, అలా వ్యాఖ్యరాసిపడేయచ్చు. ఈ సౌకర్యం ఇటు రచయితలకీ, పాఠకులకీ మంచిదే! చదివిన తరువాత రచనపై కలిగిన స్పందన క్షణంలో వడ్డించేయచ్చు. పొగడ్తయితే సదరు రచయితల ఛాతీల వైశాల్యం కాస్త పెరగచ్చు. ధన్యవాదాలూ, నెనర్లూ, కృత్జ్ఞతలూ వంటివి వినమ్రంగా చెబుతూ పొగడ్తలనేవి మాకు అంతగా పట్టవన్న బిల్డప్పూ ఇవ్వచ్చు.
    అదే విమర్శయితే మౌనముద్ర ఎలాగూ వుంది. ఇహ పాఠకులంటారా? మందలూ, మావాళ్ళూ, మా కులంవాళ్ళూ, మా వూరి వాళ్ళూ అన్న గోలెలాగూ ఏడ్చింది. నిజాయితీగా రాసే కామెంట్లు ఒకటీ అరా వుంటున్నాయి. మిగతా అంతా బాకాల రొదా లేదంటే దూషణ దండకం. కాబట్టి మారుపేర్లతో వచ్చే వ్యాఖ్యల వల్ల ఒనగూరిందేమీ లేదు. కాకపోతే మన స్నేహితుడో, తెలుసున్న వాడో ఏదయినా రాస్తే, ఆ రచన బానే వుందన్న మొహమాటపు వ్యాఖ్య ఎదురు పడినప్పుడు చెప్పినా, పరోక్షంగా వారిని వుతికి ఆరేయడానికి ఈ మారుపేర్ల మాయువు చక్కగా ఉపయోగ పడుతుంది. నాకు బాగా పరిచయమున్న ఒకాయన వున్నాడు. నా రచనలపై పైకి వ్యాఖ్యానించడం ఇష్ట లేక చక్కగా మారుపేర్లతో వ్యాఖ్యలు రాస్తూ తెగ సంబరపడిపోతాడు. అతగాడే రాస్తున్నాడని నాకు తెలుసు. అయినా ఎదురుపడినప్పుడు స్నేహబంధమూ, ఎంత మధురమూ అని గొంతెత్తి పాడుకుంటూ గడిపేస్తాం. ఏం చేస్తాం? ఇవోరకం కొత్త సంబంధాలు. అలవాటు పడిపోవాలంతే! ఇంకో గమ్మత్తుంది.
    వస్తువు పైనే వ్యాఖ్య వున్నప్పుడు ఎవరు రాస్తేనేంటని? వీళ్ళే మరో వితండ వాదం కూడా చేస్తారు. వస్తువుపైనే అసలు గొడవంతా అయినప్పుడు సొంత పేరుతో రాయడానికి వచ్చిన ఇబ్బందేమిటో అర్థం కాదు. రిలేషన్లూ, అవసరాలూ చెడకూడదు. కానీ చక్కగా స్నేహితులనీ దొంగ పేర్లతో ఉతికారేయచ్చు. రోడ్డు కీడ్చి చంకలు గుద్దుకోవచ్చు. ఒకవేళ సదరు రచయిత ఎదురు పడితే సింపతీ వర్షమూ కురిపించవచ్చు. చేతికి మసంటకుండా ఎదుటి వాణ్ణి బొగ్గుతో కడిగేయచ్చు. సర్ఫూ, రిన్నూ అవసరం లేకుండా, తడంటకుండా డ్రై కర్సింగ్ చేసేయచ్చు.
    ఆహా! ఎంత చక్కటి సాంకేతిక సౌకర్యం?
    కాబట్టి వ్యాఖ్యలకి విలువివ్వడం వృధా – నా ఈ కామెంటుతో సహా!
    ( నా ఈ కామెంటుక్కక్కూఅజ్ఞాత చొక్కా తొడిగి ప్రపంచమ్మీదికి వదిలేస్తే?……..)

  9. తోడు గురించి MJ గారి అభిప్రాయం:

    09/11/2010 1:21 pm

    I am sure even Americans won’t think about this kind of relatioship and marriage. Tell about this story to an Indain American growing up in US, he/she woulddefinitely hate this idea. I won’t even dare to talk to my kid about this story.

  10. తిలక్ కథలు గురించి MJ గారి అభిప్రాయం:

    09/11/2010 1:05 pm

    హిందూముస్లిం ఒకరినొకరు చంపుకోవడం చూసి నిజంగా జిన్నా ఈ విధంగా ఫీలయ్యాడేమో. అజ్ఙానం బలమైంది, జ్ఙానం చురుకైంది – చాలా గొప్ప కొటేషన్.

« 1 ... 1115 1116 1117 1118 1119 ... 1583 »