కథ ఎటు వైపు నుండి నడిపినా అన్ని వైపుల నుండి పాత్రలను సరిగా చూపించడం రచయితగా నా బాధ్యతనా!? కాకపోవొచ్చు. రాసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు చిరాకు తెప్పిస్తుంటయ్. కొన్నిసార్లు నాలో ఒక పిచ్చివాడు ఉన్నాడేమో అనిపించేది. అప్పుడప్పుడు రూప కూడా అనేది ‘నీ పిచ్చితనమే నాకు నచ్చుతుంది రాజా. వాడి వల్లేనేమో నీ కథల్లో పాఠకుడి కోసం చేసే మానిప్యులేషన్, మెలోడ్రామా రాయడానికి కష్టపడతావు’ అని.
Category Archive: సంచికలు
శుక్రవారం ఉదయం ఆ అమ్మాయి రాలేదు. మధ్యాహ్నం కూడా రాలేదు. ఫోన్ చేస్తుంటే జవాబు లేదు. కాలుకాలిన పిల్లిలాగా ఫ్లాటులోనే ఆ గదిలోనుంచి ఈ గదిలోకి ఈ గదిలోనుంచి ఆ గదిలోకి తిరుగుతున్నాను. లంచ్ టైమ్ కూడా దాటిపోయింది. కాని నా మనసు నిండా ఆమే! నా కళ్ళనిండా ఆమే! నా దృష్టంతా తలుపు మీదే! గడియ వెయ్యడం, తియ్యడం. తలుపు ముయ్యడం, తెరవడం అంతా చికాకుగా వుంది. తలుపు ఓరగా వేసి అలా నా రిక్లైనర్‌లో కూర్చుండి పొయ్యాను.
‘ఆయన పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, అక్కడే సెట్లవుతారు’ మధ్యలో అంది అతని భార్య. సంబంధం లేకుండా కాదు. సంబంధం ఉంది. కొడుకునీ కూతుర్నీ మంచి రెసిడెన్షియల్ కాలేజీలో వేసి మంచి కోచింగ్ సెంటర్లో లాంగ్‍టర్మ్ పెడితే, ఒకరు డాక్టరూ ఒకరు ఇంజనీరూ అయ్యేవారని. ‘బాసు భగవంతుడికి పూజలూ నాకు అక్షింతలూ’ అనుకున్న అతడు దించిన తల ఎత్తలేదు. ‘వాళ్ళకేం కూర్చొని తిన్నా తరగని ఆస్తి’ అంది అమ్మ, దన్నుగా.
ఆ మహారణ్యం ఊడలు సాచి భూదేవికి మోకరిల్లుతుంది. కొండలై ఎదిగి ఆకాశానికి నమస్కరిస్తుంది. ఇటు భూమినీ, అటు ఆకాశాన్నీ వర్షంతో అనుసంధానిస్తుంది. అప్పుడు ఆ అడవి భిన్నమైన పశుపక్ష్యాదులకి, విభిన్నమైన జంతుజాలానికీ నెలవవుతుంది. సృష్టి చక్రం తిరగడానికి సృష్టికర్త వున్నాడనుకుంటే… ఆ అటవీ చక్రం తిరగడానికీ ఓ వనదేవత వుంది. సకల జీవరాశులనూ తన పచ్చదనంలో దాచుకున్న దాని కడుపులో మనుషులూ వున్నారు.
పుట్టినచోట,
నడుస్తున్న త్రోవంతా
కుంభ వృష్టిలో ములిగి
ఒడ్డు దాటి జరజరా
పొంగిపొర్లుతోన్న
ఉధృతమైన నదిలా
ఆత్మవిమర్శ చేసుకోలేని, ఏ ఉద్యమమైనా ఏ వాదమైనా అంతిమంగా పెడదారే పట్టింది, పడుతుంది. ఎటువంటి ఉద్యమమైనా వాటిలో ఈ ఆత్మవిమర్శ అన్నది లేనంతవరకూ వాటివల్ల సమాజానికి చిరకాలపు మంచి జరగదు. తాత్కాలికంగా కొంత అభ్యుదయం ఉన్నట్లు కనిపించవచ్చు. అంతే. ఆత్మవిమర్శ లేని ఉద్యమాలు వాటిని నడిపే వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తాయి. ఆత్మవిమర్శ లేనంతకాలం ఈ అస్తిత్వవాద ఉద్యమాలపై నా అభిప్రాయం మారదు.
గాయం చెయ్యడానికైనా
దాన్ని మాయం చేయడానికైనా మనుషులే కావాలి.
లాటరీలొద్దు.
లాజిక్కులొద్దు.
లాలనగా ఉండు.
పుష్టిగా భోంచెయ్యి.
పుడమో, పాదాలో అరిగిపోయే వరకూ నడువు.
ఊహలన్నీ ఊచలుగా
మారిపోయిన వైనాన్ని
సిరల్లో, ధమనుల్లో
పారే రక్తంలో
కలిసిన విషాన్ని
నీ నీలి కన్నుల దైన్యాన్ని
గోళాకారంలో వంగిన విశ్వం
మన నాయనమ్మ వెన్నుముక్క కాదని
తర్కిస్తే
కించిత్ అనుభవాల బరువులేని
గర్భస్థ నిద్ర
పాపమని నవ్వింది.
మానవుడిని కేంద్రంగా చేసుకుని తత్వాన్నీ విజ్ఞానాన్నీ రూపొందిస్తే తప్పేముంది? అది ప్రగతికి సోపానం కదా? మానవ జాతి అభివృద్ధికి ఉపకరిస్తుంది కదా? ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పే భారత్ కులవ్యవస్థలో మగ్గిపోతుండగా క్రైస్తవ పాశ్చాత్యం మానవుడే మహనీయుడని చాటుతోంది కదా అని అడగవచ్చు.
ఎలా అయితే వారి జీవన అస్తిత్వానికి మతమో, దేశమో, సినిమా నటులో ఊతమో, వీరి అస్తిత్వానికి ఈ అభ్యుదయవాదం అలా ఒక ఊతం. అందుకే వీళ్ళు కాలంతో మారరు. ఇది ఆవేదన నుంచి నిజాయితీగా పుట్టిన ఆవేశం కాదు. అలా ఆవేశించడం సమాజంలో వారి ఉనికికి కేవలం ఒక అవసరం. రాజకీయనాయకులు ప్రజల పట్ల చూపించే ప్రేమ లాంటిదే ఇది. వకాలత్‍గిరీ అంటే ఇదే. రాముడు వచ్చి తనను రక్షించమని భక్తులకు చెప్పాడా? లేదు.
రెండు బృహన్నాగరితల మధ్య
మిలియన్ వత్సరాలకు ముందు
ఏదో భీకర సంగ్రామం జరిగి
కుజగ్రహాన్ని మరో కురుక్షేత్రంగా
మార్చివుంటుందని
నా ఖచ్చితమైన
ఉపోహ!
ఎంత సొంతదైనా మూస మూసే
అది యెల్లకాలం రంజించాలని
ఆశిస్తే మిగిలేది అడియాసే!
సవ్యత లేని భాష నేడు హీరో
సరైన భాషకు ఆదరణ జీరో
ఈ సంకటస్థితిని చూసి
అభిజ్ఞులు ఏమంటారో!
కొత్త నదులలో స్నానమాడాలి
అరచేతిలో మిగిలిన
కాసిని జీవితపు క్షణాలను
అపురూపంగా దొరకపుచ్చుకుని
చేజారిపోయిన కాలాన్ని లెక్కించడం మాని
విస్తృతంగా వనంలో విహరించాలి
కాఫీ సోకిన పెదవుల ముందు
లత తటిల్లత అవుతుంది
మెహిదీహసన్ మూటాముల్లె సద్దుకుంటాడు
జాకిర్ హుస్సేన్ జుట్టు ముడేసుకుంటాడు
జస్‌రాజ్ గొంతు బొంగురుపోతుంది
చౌరాసియా వేణువు
గాయాలను కప్పెడుతుంటుంది
దీన్లోని పన్నెండుమంది స్త్రీలవి పన్నెండు విభిన్న నేపథ్యాలు. స్వచ్ఛమైన అడవి పువ్వుల్లా వికసించిన వీళ్ళలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకం జీవితం. వీళ్ళందరినీ కలిపివుంచే అంతస్సూత్రాలు – వాళ్ళ జీవితాల్లో అనుభవించిన బాధ, బయటకు రావాలనే ఆలోచన, ఎంత కష్టమైన నిర్ణయాన్నైనా తీసుకునే తెగింపు, దానికి కట్టుబడి ఉండే నిబద్ధత.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
మానవస్వభావానికి, కులాలు మతాలు భాష ప్రాంతాలు దేశాలు వంటి నియమాల గోడలు ఉంటాయా? చట్టం వారిని పట్టుకున్నప్పుడో, సమాజం వారిని వేలెత్తి చూపినప్పుడో, మేము నిమ్న/దళిత/ముస్లిం/స్త్రీ కాబట్టే మమ్మల్ని ఇలా… అని ‘సమయానికి తగు కార్డు’ వాడిన రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు, క్రీడాకారులు, రచయితలు, నటులు ఎందరు లేరు వీరిలో? వీరిని విమర్శించినంత ‘మాత్రాన’ అగ్రవర్ణ, మతదురహంకారులు అని ముద్ర వేసేయచ్చా ఎవరినైనా?
ఒక పాఠకుడికి పుస్తకం పట్ల గౌరవం ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఒక ప్రచురణకర్తకి తను ప్రచురిస్తున్న పుస్తకానిపై ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. రచయితకి తన రచన పట్ల బాధ్యత ఉండి తీరాలని నిర్బంధించలేము. ఇవి ఉండవని, ఉండకూడదనీ అనడం కాదిది. ఇవి లేకుండా కూడా గొప్ప పుస్తకాలు ఉనికిలోకి రావచ్చు. ఈ సాహిత్య ప్రపంచంలో చర్చలోకి తీసుకురాబడనూ వచ్చు. ఎందుకంటే, సాహిత్యాన్ని అందరూ ఒకే చూపుతో సమీపించరు. ఒకే ప్రమాణంతో సాహిత్యాన్ని కొలవరు. ఉదాహరణకి రచయితలందరూ వ్రాసేముందు ఆ కథావస్తువుకు మార్కెట్ ఉందా లేదా అని పరిశోధన చేసుకుని వ్రాయరు. ఒక ప్రేరణ వారిని అందుకు సన్నద్ధం చేయగల శక్తి సమకూర్చినప్పుడు వ్రాస్తారు. ఒక పాఠకుడు విమర్శకులు పొగిడారని పుస్తకం కొని చదవాలనుకోడు, వాళ్ళు తెగిడారని చదవకుండా ఉండనూ ఉండడు. అతనికి కావలసినవి ఉన్నాయనిపిస్తేనే ఒక పుస్తకాన్ని ముట్టుకుంటాడు. ప్రస్తుతం తెలుగులో పేరు తెచ్చుకుంటున్న ప్రచురణకర్తలలో చాలామంది కవిత్వాన్ని ప్రచురించటానికి సుముఖంగా లేరు. కవిత్వం ఎలాంటి తావుల్లో నుండి వచ్చినా, ఎటువంటి వారి నుండి వచ్చినా, వాళ్ళని ఉత్సాహపరచడానికో అటువంటి రచనలను వెలుగులోకి తీసుకురావాలనో వాళ్ళు కవిత్వాన్ని ప్రచురించలేరు. దాని వెనుక ప్రచురణకర్తలుగా వారికి కొన్ని స్థిరమైన అభిప్రాయాలూ సమీకరణాలూ ఉంటాయి. ఆర్ధిక కారణాలు కానీయండి, అనుభూతి కారణాలు కానీయండి, చదవడానికైనా, వ్రాయడానికైనా, ప్రచురించడానికైనా ఎవరి ప్రమాణాలు వారికి ఉన్నాయి. రచనలోనే కాదు, తను చేసే ప్రతీ పనిలో, తను కావాలనుకున్న ప్రతీ వస్తువులో ఒక స్థాయిని ఆశించడం అనేది మనిషి తనకు తాను తెలిసో తెలియకో ఏర్పచుకున్న నాణ్యతా ప్రమాణం – పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ – నుండి పుడుతుంది. ఇది సాధనతో రాణించే గుణం. నిర్వచించలేకపోయినా మన అనుభవంలో ఉన్నదే, మన నిత్యజీవితంలో చేస్తున్నదే – ఇది మంచిదనీ అది కాదని, ఇది బాగుందనీ అది లేదని, ఇది నచ్చిందనీ అది నచ్చలేదనీ మనం అంటున్న ప్రతిసారీ మనం సాధన చేస్తున్నదిదే. మనకు వెంటనే అర్ధం కాకపోయినా ఒక కవిత, ఒక చిత్రం, ఒక వస్తువు, ఇది గొప్పదే, మంచిదే, మెరుగైనదే అని తడితే అది దీనివల్లే. పిసరంత ఊహకు మసిపూసి మారేడు చేసి లేని విద్వత్తుని ప్రదర్శించే శుష్క ప్రేలాపనల నుంచి, రచయిత ఒక గంభీరమైన భావనని తన భాషలో చెప్తే, ఆ భాషను అర్ధం చేసుకోడానికి మనమే కష్టపడాలని తెలుసుకునేదీ ఇదిగో ఈ పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ వల్లే. ఇది ఒక్కొక్కరికీ ఒక్కో స్థాయిలో ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉన్నా తన ముందు ఉన్న వస్తువు/రచన/కళ ఆ స్థాయిని దాటివుందా, దానికి దిగువనుందా అన్నది అనియంత్రితంగానే ప్రతీ ఒక్కరూ చేసుకొనే కొలత. అసలటువంటిదేదీ తనకు లేదని, తాము ఏ రచననీ విమర్శించమని, ఎవరికీ ఎవరినీ విమర్శించే హక్కే లేదనీ అనడం తమని తాము మభ్యపెట్టుకోవడమే తప్ప మరొకటి కాదు. ఈ స్థాయి, ఈ ప్రమాణాలు పాఠకులు, ప్రచురణకర్తలు కూడా గమనించినా, వాళ్ళ ప్రమాణాలు పూర్తిగా రచనకు సంబంధించినవని అనలేం. వాటిని వాళ్ళ వాళ్ళ అవసరాలు నిర్దేశిస్తాయి. కానీ ఈ ప్రమాణాల స్థాయి రచయితలు పెంచుకునే కొద్దీ మన సాహిత్యంలో పొల్లు తగ్గిపోతుంది. రచయితలు కాస్త ఆలోచనాపరులై ఇది వాళ్ళపై నెరపుతున్న ప్రభావాన్ని అర్థం చేసుకోగలిగితే, అందుకోగలిగితే, ఆ రచనల్లో పెరిగే నాణ్యత, ప్రచురణా రంగాన్ని, పాఠక వర్గాన్నీ కూడా మెల్లగా ప్రభావితం చెయ్యకపోదు. అది మొత్తం సాహిత్యానికే జరిగే మేలు.
ఇదంతా ఎలా పని చేస్తుందో నాకేం తెలుసు? ఐ డోంట్ కేర్. మీరొచ్చారు. కనీసం ఇంకో తోడు. అందరూ గుర్తొస్తుంటారు. అమ్మా, నాన్నా, తమ్ముడూ. ఇంకెప్పటికీ వాళ్ళను చూడలేను. ఏడవడం తప్ప ఏం చేయలేను. ‘బయటపడు బయటపడు ‘ లోపలంతా ఒకటే రొదగా ఉంటుంది. మీకు తెలుసా ఎన్ని సార్లు చచ్చిపోదామనుకున్నానో! ఈ మధుగాడేమో నన్నొక్కదాన్నే వదిలేసి ఎటో తిరిగి తిరిగి ఎప్పటికో వస్తాడు. కొన్ని సార్లు కొన్ని రోజులపాటు మాట్లాడడు.