దాశరథి ఆధునిక కవితాయుగపు అవతీర్ణభారతి. నిజజీవితం కష్టాలకు పుట్టినిల్లై, జైలుగోడల మధ్య బిగించి పరీక్షపెడితే, అక్కడ మగ్గుతూ పళ్ళు తోముకోవడం కోసం ఇచ్చిన బొగ్గుతో జైలుగోడల మీద పద్యం వ్రాశారు. అంతే కాదు, అర్ధరాత్రి వేరే చోటుకు ఖైదీలని తీసుకుపోతున్నపుడు, మరుసటి రోజుని చూడకుండానే మరణించే అవకాశం ఉన్న ఆ సమయంలో భయపడకపోగా ఆ స్వేచ్ఛామారుతాన్ని చూసి ఆశువుగా పద్యాలు చెప్పారు.
Category Archive: సంచికలు
ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.
రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న భక్తిసంగీతమునకు కాణాచి. తఱువాతి కాలములోని త్యాగరాజువలె రామదాసు కూడ తన సర్వస్వాన్ని ఆ శ్రీరామునికే అర్పించాడు. ఆ రాములవారిని స్మరించాడు, నిందించాడు, స్తుతించాడు. రామదాసు ఎన్ని కీర్తనలను వ్రాసినాడో మనకు తెలియదు. సుమారు 250 – 300 అని అంచనా. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము కొన్ని రామదాసు కీర్తనలలోని ఛందస్సును అందరికి తెలియబరచడమే.
ఇప్పుడూ అదే అంటున్నాను, నువ్వు ఎటో వెళ్ళిన తరువాత మిగిలిన నిశ్శబ్దంలో, ఆవరణలోని రాతి అరుగుపై కూర్చుని. అదే వేసవి, అదే ఇల్లు. నీ మోకాళ్ళు కలుక్కుమన్నట్లు చప్పుళ్ళు, ఎండి రాలే వేప ఆకుల్లో, సన్నని కొమ్మల్లో. వెన్నెల రాత్రి కాదు కానీ, వేసవి కాంతి ప్రజ్వలించే పగలు! ఏం చూడగలను నేను? ఇప్పుడేవీ స్పష్టంగా కనపడవు. కనిపించే ప్రతీదానిలోనూ, బొత్తిగా పేరుకున్న ఎప్పటివో చిహ్నాలు. చేతివేళ్ళకు మట్టి. ఖాళీ వీధి. ఎండిన నేల.
కాలం పేర్చిన కపటపు పొరల లోతుల్లో
స్పందనల చిగురాకులు
మనసు మూలల్లో
కనుదెరుస్తూనే ఉంటాయి
ఒక సన్నని సుపరిచిత స్వరమేదో
నిత్యం మౌనరాగమాలాపిస్తూ
గొంతుక సానపెడుతూనే ఉంటుంది.
ఏటవాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ బండ్లను అక్కడ ఉన్న సైనికులు తోసి సాయం చేస్తున్నారు. కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలుకానంతగా అలసిపోయాడు. రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను.
అభేదమే కవిత్వం
పాఠకుడే కవి
బీజాక్షరం మాత్రమే మొదలు
ఊజా బల్ల మీదకి
పిలిస్తే వచ్చే అశరీరవాణి
పండుగనాడు
గద్దె పలుకు
కానీ తిరిగి చిగురవ్వడానికే
కొంచెం ఊపిరి పోసుకోవాలి
ఇంకొంచెం రేపటిని కలగనాలి
ఒంటరి శరమై లోలోన
ఒక యుద్దం పరంపరవ్వాలి
గెలవాలి. వెల్తురు చీలిక చూడాలి
నదుల నీరు ఇంకిపోతే
సముద్రునితో సమైక్యం
ఎండమావి అవుతుంది.
బిగి కౌగిళ్ళ పొగలు
కక్కే వేడి నిట్టూర్పులు
పడకగది దాంపత్యం పత్యం
మంచాలు విడివడిపోవడం సత్యం
బేలూరు చెన్నకేశవాలయం యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో నా మహాశిల్పి జక్కనచరిత్రలోని వర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను.
ఇష్టాల దప్పిక తీరేలా
కోరికలను పిలుచుకుని
కొత్త రుచులతో
మనసు ఆకలిని తీర్చుకుంటారు
ఒకరి అందాన్ని మరొకరు
రెట్టించుకుంటూ పొగుడుకుంటూ
నిలువెత్తు నిజాలని
ఇంద్ర ప్రసాద్ కవితాసంపుటి నుంచి అతనంటాడు కదా అనే కవితలో ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని చదవగానే ఝల్లుమన్నాయి నా తలపులు. అది చిన్నాచితకా మాట కాదు. దుస్తుల కాపట్యాన్ని నిరసిస్తూ, భౌతిక సౌఖ్యానికి, మానసిక వికాసానికీ నగ్నత్వాన్ని కోరుకోవడం, తద్వారా ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి సంబంధించిన నిన్న మొన్నటి భావాన్ని అధిగమించిన మాట.
అడ్డం లోహాలకు పట్టే మురికి సమాధానం: చిలుము దురద సమాధానం: కండూతి రహస్యం సమాధానం: గుంభనం ఆశ్చర్యము సమాధానం: వెరగు వాయుపుత్రుల చేతిలో ఆయుధం […]
క్రితం సంచికలోని గడినుడి-83కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురు సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-83 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు. వాటికి వెన్నుదన్నుగా వ్యాపారదృష్టి, దక్షతా ఉండాలి. తెలుగులో చాలాకాలం పాటు చెప్పుకోదగ్గ ప్రచురణ సంస్థలు రెండు మూడింటికి మించి లేవు. కాలక్రమేణా సమాజంలో పుస్తకాల ఆదరణతోపాటు వాటి ప్రాభవమూ తగ్గుముఖం పట్టాక ప్రమాణాలు, నియమాలు లేని తాలు ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. రచయితలు తమ పుస్తకాలు తామే అచ్చువేసుకోవడం మొదలయింది. కాని, పుస్తకప్రచురణ, విక్రయాలు సృజనకు సంబంధించని వ్యాపారరంగపు మెళకువలని, అవి తమకు లేవని రచయితలు గుర్తించలేదు. ఏదో ఒకలా తమ పుస్తకం అచ్చులో చూసుకోవాలన్న రచయితల ఉబలాటానికి, ప్రచురణకర్తల లోభిత్వం, కొరవడిన అభిరుచి, ప్రమాణాల పట్ల అశ్రద్ధ తోడై నాణ్యత లేని నాసిరకపు పుస్తకాలు ప్రచురింపబడుతూ వచ్చాయి. గత కొన్నాళ్ళుగా ఆ ధోరణి మారుతోంది. తెలుగులో పుస్తకప్రచురణ పట్ల అభిలాష, నాణ్యత పట్ల శ్రద్ద ఉన్న ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి. వారు ప్రచురించే పుస్తకాలు చక్కటి నాణ్యతతో అంతర్జాతీయ స్థాయితో పోల్చదగ్గవిగా ఉంటున్నాయి. కాని, అప్పటికీ ఇప్పటికీ మారని అంశం – పుస్తక ప్రచురణలో కనిపిస్తున్న ఈ వృత్తితత్త్వం రచయితలతో సాగే లావాదేవీలలో కనిపించక పోవడం. తద్వారా రచయితలకు ప్రచురణ సంస్థలపైన ఇప్పటికీ నమ్మకం కుదరకపోవడం. ఇందులో రచయితల పాత్ర గురించి, తమ రచనల పట్ల రచయితలకున్న అపోహల గురించీ తర్వాత, కాని తమ పుస్తకాలు ఎన్ని అచ్చు వేయబడుతున్నాయో, ఎన్ని అమ్ముడు పోతున్నాయో, ఎంత పారితోషకం రానుందో తెలియని అయోమయంలోనే చాలామంది రచయితలుంటున్నారు. ప్రచురణ సంస్థలు వారికి నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు, అపోహలకూ దారి తీస్తుంది. పుస్తకాలు అమ్మి కోటీశ్వరులైన ప్రచురణకర్తలు తెలుగులో ఎవరూ లేరు, నిజమే. అలాగని, తాము అమ్మలేని పుస్తకాలు సొంతడబ్బుతో ప్రచురించి ఈ సంస్థలు ఆ రచయితలనేమీ పోషించటం లేదు. ప్రస్తుత తెలుగు సాహిత్య వ్యాపారంలో డబ్బు తక్కువన్నది నిజం. కాని, తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి అంటే రచయితలకు, ప్రచురణ సంస్థలకు మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం ఉండాలి. అవి ఏర్పడాలంటే ప్రచురణ సంస్థలు స్పష్టమైన వ్యాపారనియమావళిని పాటించాలి. రచయితల డబ్బుతో ప్రచురణ, వితరణ వంటి సాంకేతికసహాయం మాత్రమే అందించే సంస్థలకూ ఇది వర్తిస్తుంది. నోటిమాటగా కాకుండా, తమ నిబంధనలు, విధానాలను చట్టబద్ధమైన ఒడంబడికలు చేసుకునే విధానం తెలుగునాట మొదలవ్వాలి. ప్రచురణావిక్రయాలు వ్యాపారాలు. వ్యాపారంలో స్నేహాలు, ఆత్మీయతలు, స్వచ్ఛంద సేవలు ఉండవు, ఉండకూడదు. పుస్తక ప్రచురణ క్రమంలో ప్రతీ అడుగుకూ మూల్యం ఉండాలి, అది చెల్లింపబడాలి. సంస్థలు రచయితలతో తాము చేసుకున్న ఒడంబడికలను పాటిస్తూ క్రయవిక్రయాల వివరాలు తెలియజేయాలి. తమ వ్యాపారసరళి నిజాయితీతో కూడినదని రచయితకు నిరూపించగలగాలి. సమస్య డబ్బు గురించి మాత్రమే కాదు, ఉండవలసిన నమ్మకం గురించి కూడా. ఇది ప్రచురణ సంస్థలకు అనవసరపు శ్రమగానో, వారి అహానికి దెబ్బగానో అనిపించవచ్చు. కాని, ఆ పారదర్శకత ప్రస్తుత తెలుగుసాహిత్య ప్రచురణారంగంలో అత్యవసరం. సాహిత్యం అభిలాష, పుస్తకం వ్యాపారం. ఈ రెంటిమధ్యా ఒక స్పష్టమైన విభజనరేఖ ఉంది. ఈ విభజనను గుర్తించి ఆచరించే కొద్దీ ఆ సంస్థల ప్రాభవమూ పెరుగుతుంది.
ఇది చదివినప్పుడు మరో పడవప్రణయం గుర్తొస్తుంది. పరాశరమహర్షిని తన పడవ ఎక్కించుకొన్నది మత్స్యగంధి. నది దాటిస్తుండగా, పరాశరుడు ఆ కన్యను కోరాడు, ఆ చిన్న యిరుకు పడవలోనే, అప్పటికప్పుడే జరిగిపోవలె అన్నాడు. ఆ కన్నెపిల్ల సందేహిస్తుంటే, ‘నీ కన్యాత్వంబు దూషితంబుగాదోడకు’ అని ఆశ్వాసించాడు.
పాట మొదలుపెట్టడం ఆలస్యం, బ్రిగేడ్ కమాండర్ భార్య మొహం విప్పారడం అంత దూరంనుంచీ స్పష్టంగా కనపడింది. అది అప్పటికి ఎన్నోసార్లు విజయవాడలో ఎన్నో స్టేజీల మీద పాడిన పాట! పాట ముగియబోతోంది. బ్రిగేడ్ కమాండర్ భార్య లేచింది. వెంటనే కమాండింగ్ ఆఫీసర్‌తో సహా, ఆఫీసర్ల వరసల్లో కూర్చొన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. బ్రిగేడ్ కమాండర్ కూడా లేచి, భార్యతో సహా స్టేజ్ వైపుకు నడిచి వచ్చారు.
పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.
స్త్రీల పాటలలోని కుచ్ఛల కథ లాంటివి చదివితే రామాయణ కథ మరోలా ముందుకు వస్తుంది. రావణాసురుడి దగ్గర్నుంచి రాముడు సీతను పుష్పకవిమానంలో తెచ్చిన తర్వాత సీత రావణుడి బొమ్మని గీసుకుని తలగడ కింద పెట్టుకుని పడుకుందిట! రావణాసురుడు మాటాడుతూ ఉండేవాడట!