వినాయకుని మనస్సులో
సంకోచాలు సందేహాలు
Category Archive: సంచికలు
ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ […]
సా్వవిు ఆఫీసు జీపు దిగి ఇంట్లోకొస్తూనే తనక్కడే ఉనా్న పలకరించకుండా బెడ్ రూమువైపుకెళ్తూ ఉంటే వెన్నెల గమనించింది తన మొఖంలో కనిపిస్తున్న ఉదే్వగాన్ని, చిరాకుని. […]
రంగు మారింది
కారుమబ్బులు అంటి
తెల్లదనం నల్లముసుగేసింది
వెలవెలపోయింది కాంతి !
“ఉండండి ఆ మిగిల్నవి చూడ్ణియ్యండీ….అయ్యో ఈ సందులో పడీసేరేటండీ?” అని భాస్కర కుమార్ ఆత్రంగా ఆ పెయింటింగ్ చుట్టలు విప్పి చూడబోతే “అవెందుకండీ ఇప్పుడు ముందీ కార్డు సంగత్తేల్చండీ?” అని గద్దిస్తున్నాడు ఆతీ ప్రకాష్.
గోడ కడుతున్నారు ఇంతకు ముందో గోడ ఉంది అది దేవుడి గోడ దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా దీని వెనకాతల ఏడుస్తారు మరికొందరు […]
ఇరవైయేళ్ళుగా అమెరికాలో కంప్యూటర్ రంగంలో వివిధ స్థాయిల్లో పని చేసి, కొన్నాళ్ళు స్వంతంగా ఒక వైర్‌లెస్ టెక్నాలజీ కంపెనీని నడిపి, ఏడాది క్రితమే స్వదేశానికి తిరిగొచ్చాడు శ్రీవాత్సవ. సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని, డాలర్లలో జీతాన్ని వొదిలేసి ఇక్కడికెందుకొచ్చారని ఎవరైనా అడిగితే…జన్మభూమిపై మమకారంతో దేశసేవ చేయడానికి వొచ్చానని చెబుతాడు. దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రం అమెరికాలో కంప్యూటర్ల జోరు తగ్గి, ఇండియాలో అవకాశాలు పెరగడంతో…ఇంకాస్త సంపాదించుకోవడానికి తిరిగొచ్చాడు తప్పితే జన్మభూమీ, దేశసేవా ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు.
లోపల దీపం వెలగకూడదు
ఎవరి ప్రతిబింబం వారికే
అడ్డు నిలవ కూడదు.
నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ […]
లోపలి ధ్యానంలో మెట్లు కనిపించవు మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని శిఖరం కొసకి చేరుకుంటాం అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి ఈదురుగాలుల హోరులోనో అందీ […]
India Vs Australia cricket match చూస్తున్నాను.ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం నేను ఉదయాన్నే నిద్ర లేవడం లాంటిదే! ఎప్పుడో గాని జరగదు. ఇరవైరెండేళ్ళ […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక పోయాం. ఇకముందు అలాటి అవాంతరాలు కలగకుండా జాగ్రత్తచర్యలు […]
పాలగుమ్మి పద్మరాజు భమిడిపాటి జగన్నాథరావుల సాహిత్య సంభాషణం, బాలాంత్రపు వెంకటరావు తో ముఖాముఖీ ,
స్థానం నరసింహారావు పాటలు, పద్యాలు
“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం! ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం. ఇప్పటివరకు పంపని వారికి మరోసారి మళ్ళీ! “ఈమాట”కు పంపిన […]
నాలుగు వేడి వేడి ఇడ్లీలు ఆరగించి, ఇంటి ముందు వరండాలో సుఖంగా మడతకుర్చీలో చేరాడు ధర్మారావు. దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది. ఇంటిముందూ, వీధిలో అంతా […]
బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన మీద ప్రేమతోటే ఇదంతా అని నమ్మినట్టు శ్రీను […]
జీన్ కొడుకు ఫ్రాంకీ అరుస్తూ లేచాడు. ఈ మధ్యన ఈ అరుపులు ఎక్కువయ్యాయి వారానికి రెండు, మూడు సార్లు, రాత్రి మూడింటికీ, ఐదింటికీ కూడా. […]
పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్‌కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.
ఇండియా ప్రయాణం అంటే నాకు మహా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా, ఓ నెల్లాళ్ళు ఆనందంగా గడిపేస్తాను. నిన్ననే మా […]
వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]