వెన్నెల నవ్వింది

సా్వవిు ఆఫీసు జీపు దిగి ఇంట్లోకొస్తూనే తనక్కడే ఉనా్న పలకరించకుండా బెడ్‌ రూమువైపుకెళ్తూ ఉంటే వెన్నెల గమనించింది తన మొఖంలో కనిపిస్తున్న ఉదే్వగాన్ని, చిరాకుని.

ఏదైనా ఉంటే తనే చెబుతాడుగా అనుకుంటూ, వంటింట్లో ఉన్న అరవ వంట మనిషికి టీ త్వరగా తయారు చెయ్యవుని కేకెయ్యడానికి వెళ్ళింది, అతను టీ ెపట్టాలంటే అరగంట పడుతుందని తెలిసినా. ఏ పనైనా సరిగ్గా చెయా్యలని, టీనే కాదు, పులిహార చేసినా, వంకాయ వండినా ఎక్కడా ఒక్క పొల్లు కూడా తప్పు పోవద్దు అని లెక్చరిస్తాడని తెలుసు, అసలు అట్లా విపరీతపు క్రమశిక్షణ చేబట్టే సా్వవిు అతణ్ణి ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెల్తున్నాడని తెలుసు.

ఒక్కోసారి అనిపించేది, తను అమ్మా, నాన్న దగ్గరికి వెళితే ఇక్కడేదీ తకు్కవ అవదు, అన్నీ శుభ్రంగా ఎక్కడవి అక్కడ ఉన్నట్టే ఉంటlు. ఇల్లంతా క్లీను చెయ్యడానికి ఇద్దరు మనుషులు, వంటకు ఒకరైతే, ఆ ఒకరికి ఇంకొకరు ెహల్ప్‌ చెయ్యడానికి, తోటకు ఇద్దరు, ఆఫీసు రూములో ఫైల్లు దులపడానికి, సర్దడానికి ఒకరు, ఇంకోకడు బlుట నించి కూరలు తేవడానికి ఫోనులందుకోవడనికి, తనకోసమే ఉండే వేరొక కారు డ్రైవరు, మొత్తంగా తొమ్మిది మంది తనకేదీ తకు్కవకాకుండా ఇంట్లో తన అజవూయిషీలో ఉండే వాళ్ళే.

వీళ్ళంతా గవర్నంఎంటు వాళ్ళిచ్చిన వాళ్ళే కాబట్టి, తమకే అభ్యంతరం లేకపోయింది. ఉండేది ఇద్దరే అయినా ఎస్పీ బంగ్లా ప్రభుత్వం వారిదే కాబట్టి మరి దీన్ని జిల్లా అభు్యదయానికి సంకేతంగా మైన్టైను చెయ్యకపోతే తమకే తలవంపులు కాబట్టి తప్పలేదు. అదీకాక, ఎప్పుడో ఒకసారి వీళ్ళంతా తమ ఇంట్లో తమకే ప్రైవసీ లేకుండా తిరుగుతూ ఉంటే వొచ్చే చిరాకు తిప్పతే మిగతా అప్పుడు తోడుగా ఉంటానికీ, ఏదవసరమైతే అది తేవడానికి తనకేమాత్రం ఒళ్ళలవకుండా హాయిగానే అనిపించేది మొదట్లో. రాన్రాను విసుగ్గా తయారైంది, అసలు తన సంసారమ్మీద తనకేమాత్రం కంట్రోల్‌ లేనట్టుగా అనిపించి.

తమకింకా ిపల్లలు లేరు కానీ, అసలు ిపల్లా ీపచూ ఉంటే కూడా, అసలు ఎస్పీ లెవెలు ఏ మొఘలు చక్రవర్తికీ తీసిపోకుండా ఉంటుంది, కాకపోతే జిల్లాకే పోలీసును కదా అని, ఎకు్కవ మంది ెపళా్ళలను చేసుకుంటాను అంటే కుదరదు తిప్పతే.

ఏమ్టివా్వళ ఇతను ఇంకా టీ ఇవ్వడా అనుకుంటూ, ఏమైంది అని అడగడానికి హాల్లో టీ వీ ముందు నించి లేవబోతూ ఉంటే, తన వెనుకే వంటింట్లో దాకా ఒచ్చిన ఆఫీసు డ్రైవరు చెప్పాడు మెల్లగా. అమ్మా, ఇవా్వళ సారు ఒకడిని ఆఋఈసులో కొట్టారు అని, అప్ప్ణణించీ తన మూడు చెడిపోయినట్టుంది మీరు కొంచెం కనిపెట్టండి అన్నాడు.

అప్పుడప్పుడూ తనకాశ్చర్యవుయే్యది ఇదే, ఇంట్లో ఉన్న ెపళా్ళనికన్నా ఈ పని వాళ్ళకే ఎకు్కవ బాధ సార్‌ మూడు గురించి. నవ్వొచ్చింది. తనకు తెలుసు సా్వమికి కోపమొస్తే అది నిజంగా పోలీసు కోపమే అని. ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే, ముఖ్యవుంత్రో గవర్నరో అయితే తప్ప, ఊరుకోడు. తన కోపమంతా చూపించంది, అట్లా ఉన్నందుకేనేమో మరి డిపార్టుమెంటులో మంచి ేపరు తెచ్చుకున్నాడు కూడా. తమెక్కడికెళ్ళినా రౌడీలు మోసగాళ్ళను మొట్టమొదటే లోపలేసి, ఏ పొలిటీషిlునుకూ బెదరకుండా, ములాజా లేదు అని చెప్పి నయాన్నో భయాన్నో నేరాలనరికట్టడం తెలుసు. కొద్దిరోజులు రాయలసీవులో పనిచేస్తే మనుషులుకూడా రాళ్ళవుతారేమో అనిపించేది ఆయన మారిపోతున్న భాష తీరు చూసి.

ఇవా్వళ కూడా అట్లా నేరం చేసిన వాడిమీదే కోప్పడి ఉంటాడు. కోప్పడ్డాడు అని ఇంత బెదురుగా డ్రైవరు చెబుతున్నాడంటే, ఒకటి రెండు బాది ఉంటాడని తనకు డౌటు కూడా.

ఇంతకీ ఏమైంది, అడిగింది తనే, వడబోస్తున్న టీ వైపు చూస్తూ.

ఏం లేదమ్మ, వాడెవడో తన ిపల్లవాడిని పోలీసులు తీసుకెళ్ళి లోపలేసారట, వాడు దినాం నెలనించీ స్టేషను చుట్టూ తిరిగినా ఎవరూ ఏం చెప్పలేదట, ఇవా్వళ మనాఫీసుకొచ్చి గొడవ ెపట్టాడు. అదే టైములో సారు అదేదో హోం మంత్రి గారి నెలవారి సమీక్షలో డీ జీ పీలతో పాటు, టెలీ కాన్ఫరెన్సులో ఉనా్నరట, ఆ ఫోనులో మాట్లాడుతూ ఉంటే బlుటనించి వాడు ఒకటే లొల్లి, ఫోనులో ఎవరికో వినిపించిందేమో మరి తెలియదు కానీ, ఆ ఫోను మధ్యలోనే బlుటకొచ్చి నాలుగు తన్ని బlుటకు ఈడే్చసి మళ్ళి వెళ్ళిపోయారు సారు. బlుటున్న మాకు సరిగ్గా అర్ధం కాలేదు, కాని అసలు అంతదాకా రానిచ్చిన వెంట ఉండే ఇన్‌ ెస్పక్టరుదే తప్పంతా. లేకపోతే సారు అంత పనిలో ఉంటే వాడినెవడినో ఆఫీసులో మరీ అంత దగ్గరిగా రానిచే్చ పనేనా అసలు.

సా్వవిు భక్తితో సా్వవిు, ఐ పీ ఎస్‌ ను సవుర్ధిస్తూన్న ఈ డ్రైవరును చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు, కానీ పాపం ఆయన అట్లా ఎన్నడు చెయ్యడు మరి ఏమైందో పూర్తిగా తెలియదు తనకై తనే చెప్పేదాకా అనుకుంది.

తనే చెప్పింది మిగతా పనివాళ్ళతో, సరే, ఇప్పుడైతే ఎవరూ గుసగుసలు మొదలు ెపట్టకండి, ఎవరైనా ఫోనులు చేస్తే సారు బిజీ అని చెప్పండి, అత్యవసరమైనవి కాకపోతే. తనకే ప్రెస్‌ ెసక్రటరీ భాద్యత నిర్వహించక తప్పదు ఒక్కోసారి. టీ తీసుకెళ్ళబోతున్న అయ్యరును ఆగమని, తనే అందుకుంది దానితో పాటు అతను సర్ది ఇచ్చిన ఒక పకోడీల ప్లేటును కూడా.

బెడ్‌ రూములోకెళ్ళేసరికి సా్వవిు విడిచేసిన బట్టలు అక్కడే బెడ్డు పైన పడి ఉన్నై. తను రాకపోతే చాకలి వచ్చి తీసుకెళ్ళి సాయంత్రం లోపల ఉతికి, ఆరేసి, యూనిఫారం గంజి ెపట్టి ఇస్త్రీ చేసి కొత్తదానికి మల్లే కప్‌ బోర్డులోకి వచే్చస్తుందని తెలుసు, తన ప్రవేుయమేదీ లేకుండానే.

ఈ మనిషివా్వళ కొత్తగా అసలు ఈ డ్రెస్సును ఇలా బెడ్డు మీద వెయ్యడమేమిటీ అనుకుంటూ బెడ్డు పక్కగా ఉన్న టీ పాయి మీద కాఫీ, పకోడీలు ెపట్టేసి, డ్రెస్సు ప్యాంటు, షర్టు జేబులు చెక్‌ చేసి ఒక హ్యాంగరుకేసి ఉతకాల్సిన బట్టలు ెపట్టే అల్మారాలో ెపట్టింది. ఇంకా రాడేం బా్రతూములోనించి అని అలోచిస్తూ వెళ్ళి తలుపు తట్టి ఉనా్నరా లోపలే అడిగింది.

జవాబు రాలేదు. మళ్ళి ఒక ెసకండాగి, సా్వవీు, మీరునా్నరా లోపలే, సా్ననం గానీ చేస్తునా్నరేమిటి అడిగింది.

లోపలనించి జవాబుకు బదులు ముందు ఎదో శబ్దమై, తర్వాత వినిపించింది, వినీ, ఒకసారి బెడ్‌ రూము తలుపేసి రా అని. గొంతు కొత్తగా అనిపించింది, అసలు అంతగా అప్‌ ెసట్‌ అయే్యదేముందా అని. చెప్పినట్టుగా తలుపేసి వచ్చింది.

బాత్‌ రూము తెరిస్తే ఇప్పుడు తెరుచుకుంది, లోపల యూరోపియను కమ్మోడు మూేససి ఉంది, దాని మిద టవలు కట్టుకుని మీద బనీను కూడా లేకుండా కూరు్చని సా్వవిు కనిపించాడు. లైటు ఒక్కటే వెలుగుతోంది కమ్మోడుకు దూరంగా ఉన్న సింకు దగ్గర. ెపద్ద లైటేమైందని అడుగుతూ ిస్వచ్చి వేసింది, కడుపులో ఏదో భయపడుతున్నట్టునా్న అన్ని డౌట్లనూ పక్కకు నెడుతూ.

ఎంత దూరం నెట్టినా కొన్ని కొన్ని మన కళ్ళవుుందుకు రాక తప్పవు, అవెంత అసంబద్ధమైనవైనా, ఎంత వికారం పుట్టించేవైనా. సా్వవిు రెండు చేతుల్లో మొఖం దాచుకుని కిందకి వంగి కూరు్చనే వున్నాడు, తను లోపలకొచ్చినా తల ఎత్తలేదు.

ఏమైందండీ, అనింది, తను దగ్గరికి రాగానే తన నడుం పట్టుకుని ఒక్కసారిగా బావురుమన్న సా్వమిని చూసి ఏం అర్ధం కాలేదు.

అసలు ఆరడుగులుండి, ఎస్పీ అంటే ఇలా ఉండాలి అని అనేట్టుగా కనిపించే చెట్టంత మనిషి, ఒక మగవాడు ఏడవడం తనకసలు అంతగా తెలియదు, కానీ స్వామితో ెపళ్ళlూ్యక ఈ అయిదేళ్ళలో పూర్తిగా తెలుసుకుంది కాబట్టి, ఏదో బాగా గాయపరిచేదే జరిగి ఉంటుంది అనిపించింది.

అతని తలపట్టుకుని నిమిరింది తిప్పతే ఏవునాలో తోచలేదు. దగ్గరగా ఒకయిదు నిమిషాలనా్న ెపద్దగా ఏడ్చి ఉంటాడు, అసలు టైము తెలియలేదు కానీ. ఏమైంది సా్వవీు, ఎందుకంత బాధ ప్లీజ్‌ చెప్పు అడిగింది మళ్ళీ, రెండేళ్ళక్రితం వాళ్ళవు్మ చనిపోతే ఏడి్చన సా్వమిని చూసింది కానీ ఇట్లా వర్కు నించి వచ్చి ఏడుస్తూ కూరు్చన్న సా్వమిని ఊహించుకోవడం కష్ఠంగా ఉంది.

అసలు తనకేడుపొచే్చలా ఉంది.

ఇంకో పదిహేను నివుుషాల్లో కొద్దిగా సర్దుకున్నాడనిపించి తనే అంది ఒక గ్లాసు మంచినీళు్ళ తాగండి అని. ప్లీజ్‌ ఒక కప్పు టీ తాగితే అన్నీ మాట్లాడుకోవచ్చు, చెప్పింది.

ఒక నిమిషం తన మొఖంలోకి చూసి నేను దిగజారాను వెన్నెలా చెప్పాడు తను. ఐ ఆవ్‌ు నాట్‌ ది సేం పర్సన్‌ ఎనీమోర్‌ నేను మనిషిగా మిగల్లేదు ఇవా్వళ మళ్ళీ చెప్తూ, మొఖంలో బాధంతా గొంతులో తీసుకుని కుమిలి కుమిలి మరొకసారి గట్టిగా ఏడ్చాడు.

ఇంకో అయిదు నిమిషాలlూ్యక కొంత తేరుకున్నాడేమో, తనిచ్చిన మంచినీళు్ళ తాగాడు. తనే బాత్రూములోకే తీసుకెళ్ళింది టీ కప్పును, ఒక్క రెండు ిసప్పులు తీసుకున్నాక అడిగింది, ఈ రోజు ఆఫీసులో జరిగిందానికేనా, డ్రైవరు చెప్పాడు అంది. తలూపి ఎక్కడో శూన్యంలోకి కళు్ళ దూరే్చసాడు.

సరే అయిపోయిందేదో అయిపోయింది, మీరు సా్ననం చేసి రండి, మనం మాట్లాడుకుందాం అంటే, సరే అని తలూపాడు.

బlుటకొచ్చి, తలుపు దగ్గరగా లాగి, టీ కప్పు స్టూలు మీదపెడుతూ ఉంటే ెపళ్ళికి ముందు తమ మాటలు గుర్తొచ్చినయి.

వాళ్ళింట్లో అమ్మ తప్ప ఎవరూ ఉండే వారు కాదు, తమ అమ్మా నాన్నకు అసలు వాళు్ళ తూగరు అని తెలిసినా ఐ పీ ఎస్‌ కాబట్టి కావాలని అల్లుడుగా తెచ్చుకున్నాడు తన నాన్న. తనక్కూడా సా్వవిు బాగా నచ్చాడు, తన సింపుల్‌ నెస్‌ తో.

మొదటిరోజే చెప్పాడు ట్యాంకు బండుమీద తనతో ఒంటరిగా మాట్లాడాలని తీసుకెళ్ళి, వెన్నెలా, మీరు డబ్బున్న వాళు్ళగా ెపరిగారనుకుంటా, కాని నేను ేపదరికం నుండొచ్చినవాణ్ణి. ైపకెదగాలని కోరుకుంటున్న వాణ్ణి. వీలయినంతవరకు ప్రిన్సిపుల్సుతో బతకాలని అనుకుంటునా్ననిప్పుడైతే, మీకు నేనేదో సంపాయించేస్తాననో లేకపోతే ఐ పీ ఎస్‌ కాబట్టి కోట్లాధిపతులమై పోతామని అనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు. మనకొచ్చే జీతంలోనే బతకాల్సొస్తుంది అనీ ఇంకా ఎవేవో చెప్పాడు, తమ మొదటి పరిచయంలోనే.

అప్పుడే అనుకుంది, తనకో మంచి లైఫ్‌ పార్ట్నర్‌ దొరికేడని. అత్తయ్య కూడా బాగా చూసుకునేది తనను.

ఒక్క సంవత్సరంలో తనెంతో మారిపోయాడనుకునేది, కొత్తగా వచ్చిన టీ వీ చెట్టు, ఫర్నిచరు లాంటి వాటితో పాటుగా ఎప్పుడైనా పండుగకు ెపద్ద ెపద్దవే చీరలొచే్చవి. ఒక జిల్లాకు ఎస్పీ గా చేసేటప్పుడైతే నెలకు రెండు బస్తాలు క్రమం తప్పకుండా మామిడి పళు్ళ వచే్చవి, ధాన్యమైతే సరే సరి, అసలు ఇప్పటివరకూ తము ఏది కొంటామో ఏది ఊరికే వస్తుందో తెలియదు. అయిదేళ్ళలో రెండు ప్లాట్లు కొనగలిగామెట్లా అని తనడగలేదు, ఆయన చెప్పలేదు. ఒకటి లోను తీసుకుని కొనా్నవుని మాత్రం తెలుసు. కానీ అంత ఖరీదయిన ఏరిlూలో తమెలా కొనగలిగామో అర్ధమవదు, అయినా సరే ఎక్కడికెళ్ళినా, ేపపర్లు చూసినా అంతా అనే ప్రకారం సా్వవిు ఖచ్చితమైన ఆఫీసరు అని, అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేస్తునా్నడని చెప్పుకోవడమే కాబట్టి, మిగతావి పట్టించుకోలేదు.

ఇంకా తన ఆలోచనల్లో ఉండగానే బాత్రూము తెరుచుకుని బlుటకొచ్చాడు సా్వవిు. లేని నవ్వు తెచ్చుకుని, ఫ్రెష్‌ అయా్యరు పకోడీలు తీసుకుంటారా అడిగింది. లేదు వెన్నెలా, నువ్వెక్కడికైనా వెళ్ళేదుంటే వెళు్ళ డ్రైవరును తీసుకుని, రేపొ్పద్దున ఎట్లా వుంటుందో చెప్పలేం అన్నాడు, తను పైజమా లాల్చీ వేసుకుంటూ.

అసలేమైందండీ తనే మళ్ళీ అడిగింది, ఎట్లాగూ చెప్తాడని తెలిసీ. ఒక సారి తనవేపు చూసి కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు, ెపద్దగా ఏం లేదు, ఇంపార్టెంటు కాల్లో ఉంటే బlుట గొడవ ఆపవుని చెప్పడానికి వెళ్ళితే నా కాళ్ళమీద బడి వదల్లేదు, లేపితే చెయ్యి దగ్గర చొక్కా పట్టుకున్నాడు అతను, లాగేసి మళ్ళీ తొందరగా కాల్లో జాయిన్‌ అవా్వలి కాబట్టి వెళా్ళను. అంతే, కానీ ఆ తొందర్లో కొంత దురుసుగా చేసినట్టునా్నను, అతను చెప్పేది వినిపించుకోకుండా. నేను చేసింది తేప్ప కానీ అసలే పరిస్థితి అంత బాగా లేదు మన జిల్లాల్లో ఈ వెధవ ఎలక్షనులు చేపట్టి అందులో ఈ రోజు అనుకోకుండా వొచ్చిన ఈ స్టేటస్‌ మీటింగొకటి అందుకే అలా చేసానంతే అన్నాడు.

మరి ఇది ెపద్ద గొడవ అవుతుందా పత్రికల్లో?

కాక పోవచ్చు, అక్కడా ఆఫీసులో ఎవరూ లేరు, మన వాళ్ళే మొత్తం పోలీసులే ఉనా్నరక్కడ, అదే ఏ ఎస్సైయ్యో అయితే ఇంకా బాగా గొడవ చేేసవారు, నేను తొందరగా వదిలించుకుని లోపలికెళా్ళను. ేపపరు వాళు్ళ కూడా ఎవరూ లేరు.

ఎవరైనా ఎస్సైకి చెప్పకపోయారా మరి అతన్ని పట్టించుకొమ్మని?

ఇది నెల నించీ అవుతున్నదట నాకైతే ఇప్పటిదాకా తెలియలేదు, మన హైద్రాబాదు మీటింగులు చేబట్టి, ఇట్లాంటివి నాదాకా రావట్లేదు కూడా.

అయితే ఏవువదు లెండి, చెబుతూ లేచింది తను.

లేదు నువ్వు కూర్చో విన్నీ, నేను ఆరు నెల్లుగా అనుకుంటున్నది నీకు చెపా్పలి, కొంత ధృడంగా చెప్పాడు.

అర్ధం కాలేదు అన్నట్టు మొఖం ెపట్టి కూర్చుంది మళ్ళీ.

ఏం లేదు, ఈ ఉద్యోగం మొదట్లో ఏదో చేేసస్తానని అనుకునే వాణ్ణి, చూస్తునా్నవుగా మనం కూడా ఈ చదరంగంలో ఒక పావుగా తప్ప మిగల్లేము అని అర్ధమైంది. డబు్బ, ేఫవర్లు, ప్రమోషను కోసం రాజకీlూలు, ేపరుకోసం ఏవో కొన్ని మంచి విజిబిలిటీ ఉండే పనులు లాంటివి మాత్రం తప్పట్లేదు. అసలు నేను అనుకున్నట్టు కాక, ఇక్కడేదో అంగట్లో నా పదవినే కాక నన్ను నేనే అమ్ముకున్నట్లు తయారైంది.

అయితే ఏవ్‌ు చేద్దావునుకుంటునా్నరు అడిగింది. ఒక నెల రోజులు వెకేశను తీసుకోండి చెప్పింది సానుభూతిగా. చూద్దాం రాత్రికి మళ్ళీ మాట్లాడుదాం, ఇప్పుడైతే కాేస్సపు పడుకొండి అని తను ఖాళీ కప్పు తీసుకుని బlుటకు నడిచింది.

సా్వవిు బెడ్‌ మీద వాలుతుంటే, తలుపు దగ్గరికేసింది.

కిచెనులో అయ్యరుతో వంటేదో చేేససి, అన్నిటి మీదా మూతలు ెపట్టేసి ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పేసి, డ్రైవరు, ఇంకో ెహూవ్‌ు గార్డు ఇంటి ముందెలాగూ ఉంటారు గనక ఇంట్లో ఉండే ఇంకో ఇద్దరిని కూడా రాత్రికి వెళ్ళిపొమ్మని చెప్పింది. ఈ రోజైనా కొంత ప్రైవసీ అవసరమని తోస్తోమ్ది తనకు.

హాల్లో టీవీ ముందు కూరు్చన్న మాటే కాని, మనసు దాని మీద నిలబడట్లేదు.

మళ్ళీ తనకు పెళ్ళైన మొదట్లో తెలిసిన విషlూలు గుర్తొచ్చినయి. సా్వవిు చిన్నప్పుడు ఇంట్లో తినడానికి కూడా తిండిలేని రోజుల్లో ఆరేళ్ళొచ్చినా బడి మొఖం తెలియక ఉన్న రెండు బర్లూ కాయమని పడవబ్డడ భూములల్ల మేపడానికి తల్లీ తండ్రీ తోలేవాళు్ళ వాళు్ళ కూలికి పోతూ. ఆ బర్లకు ఏదో రోగమొచ్చి చనిపోయాక, ఇల్లుగడవడానికి కష్టవువుతుంటే, దికు్కతోచక, ఉన్న ఒక్క కొడుకూ ఆకలితో ఛస్తాడేమోనని, తనను జీతముంచడానికి ఊర్లె పటేలు దగ్గరికి పట్టుకెళా్ళడట వాళ్ళ నాయన. గూడేనికి రెండు ఫర్లాంగులే కనక పటేలు ఇక్కడుంటే మీ పోరగాడు నా ఇంట్ల ఇంగ పనేం జేస్తడు అని పట్నంల దొరసాని కాడ ెపట్టు అని ఇరవై కిలోమీటర్ల దూరమైతె మీ వాడు ఊకె ఇంటికురికి రాడు అని అది గాక పట్నపు తిండి ప్తడది ెపద్దగైతె పట్నంల ఏదన్న ఓటల్ల జేరు్చకుంటరు అని చెప్పి పట్నం తీసుక పొయ్యిండు. సా్వవిు తనకు ఎన్నోసార్లు కళ్ళకు కట్టినట్టు చెప్పేవాడు, మొదటిరోజు పట్నంల పటేలు ఇంట్ల జేరిస్తందుకు తీసుకపోతె అక్క డ వాళ్ళ నాయిన పటేలవు్మ కాల్లు మొక్కుడు, ఎట్లనన్న ిపల్లగాడు తినేటట్టు చూడుమని, వాడు రెండు పూటలు తింటె ఇరవైనాలుగ్గంటలు పని జేస్తడని జెప్పుకుంట, అదే ఈడున్న పటేలు కొడుకును చూసి ఆ చిన్నపటేలువి ఏవన్న పాతవి అంగీ లాగు ఉంటె ఇమ్మని బlుల్దేరపోతూ మళ్ళీ వెనక్కొచ్చి, గుడ్ల నీళు్ళ గుక్కుకుంటున్న కొడుకును పట్టుకునేడ్చి, ఇగ వొదిలిబెట్టిపోవుకుంట, చటుకు్కన వొంగి, తన ఈడే ఉన్న పటేలు కొడుకు కాళు్ళ కూడ పట్టుకోని, అయ్య నీతో బాటు రాత్రిపూట కుసబెట్టుకోని ఒక వొయి జెప్పుమన్నడట.

ఈ మాటలన్ని సరిగ్గా అదే భాషలో ఒక్క పొల్లు పోకుండ చెప్తూ ఉంటె, సా్వవిు ఆ కాలం నించీ ఇప్పటిదాకా నడిచొచ్చిన దూరం గురించి ఆలోచిస్తూ తను నవే్వసేది. నీకు నవు్వలాటగనే ఉంటుంది విన్నీ, ఆరేళ్ళ ిపల్లవాడిని గతిలేక తిండికోసం కుదువ ెపట్టడం చూడ్డానికి మాత్రం ఏడుపొస్తది అని ీసరిlుస్సlు పోయేవాడు.

అట్లా ఒక్క వొయి, అంటే పుస్తకమని సా్వవిు జెప్పేదాక తనకు తెలియదు, అనుకున్నదల్లా ఆ పుస్తకాలు ఒక దాని తర్వాత ఒకటి పటేలు కొడుకు కంటే ఏకాగ్రతతో చదివే వాడేమో మరి, లేకపోతే ఏకసంథాగ్రహుడో మరి, అక్కడున్న రెండేళ్ళలో చదవడం రాయడం నేర్చుకుని, తనను చూడ్డానికొచ్చిన నాయనతో ఎవరూ చూడకుండా బతివూలి, ఏడ్చి, బీదోళ్ళ హాస్టల్ల తిండిపెడుతరట బడికి పోతె అని, నేను చదువుకుంటాను నాన్నా అని వెంట తగిలిన సంవత్సరానికి అదేదొ వివుుక్తి లభించినట్టు ఆ వెట్టినించి బlుటప్డడాడు. ఇక ఆ పైన జరిగింది ిహస్టరీ బుకు్కలోకెక్కవలసిందే. ఎక్కడా ఒక్క పొల్లు పోకుండా, ఇంటరు దాకా రావటం, ఇంజనీరింగు ఎంట్రను్సకు, కోచింగుకు డబ్బులేక బీ ఎస్సీ ఆ తర్వాత ఎమ్మెస్సీ స్కాలర్షిప్పుతో చదివుతూ, ట్యూశనులు చెప్పి బ్రతుకు గడుపుతూ ిసవిల్సు రాసి మొదటి సారే ఐ పీ ఎస్‌ వస్తే ఇక మళ్ళీ రాయకుండా ఇదిగో ఇలా.

తనే చెప్పాడొకసారి ఆర్నెల్ల క్రితం, ఇప్పుడు గుర్తొస్తూంది అసలు, తను వెనకట ఎప్పుడైనా టీవీలోనో లేక ిసనివూల్లోనో ేపదవాళ్ళను ఎందుకూ పనికిరాని వాళు్ళగా లేకపోతె తమలాంటి ఎస్సీ ఎస్టీలను ఎగతాళి చేస్తూనో చూపితే తనూ నవే్వవాడుట అందరితో పాటుగా, అదికూడా ఎదో రూపు రేఖలనో, భాషనో ఎగతాళి చేసినట్టుగా అనుకుని. రాన్రాను అన్ని రకాల ఎగతాళులు ఎక్కువైనయి తిప్పతే తగ్గలేదు. చూడూ ఇప్పుడు నేనెక్కి వొచ్చిన ఎర్రబస్సును చూసి నేనే నవే్వలా చేసిన ఈ ప్రపంచాన్ని అని తను అన్నప్పుడు సరిగ్గా అర్ధం కాలేదు.

టీవీ లో నూ్యసు కూడా అయిపోయింది ఇంకా లేవలేదేం అనుకుంటూ వెళ్ళి చూస్తే బాత్రూములో మొఖం కడుగుతున్నాడు. సరే ఇక లేచాడు అనుకుని, తనే భోజనానికి ప్లేట్లు ెపట్టింది, ఎట్లానైతేనేం, ఇవా్వళ ఇంట్లో వేరే వాళు్ళ చుట్టూ లేకుండా ఇద్దరే కలిసి తినొచ్చని.

భోజనం చేస్తూ ఉంటే చెప్పాడు సా్వవిు, ఈ రోజు తను లాగి అవతల విసిరేసిన ముసలాlున తనను మొట్టమొదట పటేలు దగ్గర జేర్చడానికి తీసుకెళ్ళిన తండ్రి లాగే చేసాడని, అతను కూడా తన కొడుకు గురించే అడగడానికొచ్చాడు, కాకపోతే నేను ఈ అధికారమ్మీద సవారీ చేస్తూ కన్నూ మినూ్న కానలేదు అని.

భోజనాలlూ్యక ప్లేట్లు సింకులో పడేసి తను వచ్చి టీ వీ ముందు కూర్చుంది స్వామితో పాటుగా. టీ వీ ఆఫ్‌ చేస్తూ చెప్పాడు, విన్నీ, నేను ఉద్యోగం వదిలేద్దామని కొనా్నళు్ళగా అనుకుంటునా్న, ఆ నిర్ణయం ఇవ్వాళ్టితో స్థిరమైంది. నేనీ వ్యవస్థలో ఇమడలేను, మళ్ళీ మనిషినవా్వలంటే తప్పదు. ఈ జీవితం నన్ను మనిషిగా ఖతం చేసి ఒక గులావుుగా, ఒక జీతగానిగా చేసింది ఇంత కష్ఠపడి నేను ఏ జీతమైతే చెయ్యొద్దనుకున్నానో దాంట్లోనే పడేసింది. పైగా నేను దేన్నైతే అసహ్యించుకున్నానో చిన్నప్ప్ణణించీ దాన్నే ఆచరించే ఒక చక్రానికి స్పోక్‌ గా మిగిలి పోతునా్నను, ఎవరినైతే ఉద్ధరించాలనుకున్నానో వాళ్ళను ఈడ్చి బlుట విసిరేస్తునా్నను. ఇనా్నళూ్ళ అందరితో పాటు వాళ్ళ లాగే మనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కడో చోట రెండు ప్లాట్లు, ఇళు్ళ కట్టేసుకుని మందిలో కలిసి పోతునా్నవుని నేనెంత అనుకున్నా, ఇక నా వల్ల కాదనిపిస్తోంది. అదీకాక ఇవా్వళ చేసినపనితో నా బాడీతో పాటుగా సోల్‌ ను , ఇమ్కా మా నాయన మంది కాళు్ళ పట్టుకుని ెపట్టిన కన్నీళ్ళను అన్నిటినీ ఒక్కసారిగా అమే్మసినట్టనిపిస్తున్నది. దీనికంటే మనకున్న దానితో ఆఖరికేదైనా నా లాంటి వాళ్ళకు రీ హాబ్‌ క్లినిక్‌ నడుపుతూ గడపొచ్చు అనిపిస్తూంది, ఈ మాత్రం బతుకు బతగ్గలం మనం బlుట కాక పోతే ఇంతమంది పని వాళు్ళ ఉండరు ఇంట్లో, నువే్వవుంటావు, అడుగుతున్నాడు సా్వవిు.

వెన్నెల ఇప్పుడే పొడిచినట్టుగా కనీ కనిపించకుండా సన్నగ నవ్వింది.