“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.
Category Archive: సంచికలు
వేడికోలు చూపుల్ని ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే, గుండె పట్టేసి.. దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!
బందిపోటుదొంగ దొరికిపోయినా ఫరవాలేదు అన్న ధైర్యంతో దొంగతనం చేస్తాడు. గ్రంథచోరుడు, “మనం దొరకంలే,” అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు.
సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే
అప్పుడెప్పుడో అక్కడి ఇసుకలో గుచ్చిన
కబడ్డీ కూతల గవ్వల్ని ఏరుకున్నాను
భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.
ఉన్నదల్లా
భూమ్యాకాశాల మధ్య ఊగిసలాడుతూ
వింతపల్లకి నెక్కి వీధులేగుతున్న అతనూ
కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.
“ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ళ సాక్షిగా పెట్టని పరీక్షలు.
తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.
ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది.
ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’
అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.
అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.