ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.

ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు – చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).

ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.

ఈమాట జనవరి 2008 సంచికలో —

ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట

ఇంకా విశేషాలు —

ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?

ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.

విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.

ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.

దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.

గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!