ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు.

అద్భుతాల దీపాలు
అంతులేని శాపాలు
జాతకాలు పాతకాలు
దేవుడికే లంచాలు

నేను మిమ్మల్ని మోసం చేయబోవడం లేదు. చేసి మీ దృష్టిని ఆకట్టుకునే ఉద్దేశమే ఉంటే నా మొదటి వాక్యం “చిమ్మ చీకట్లోంచి ఒక స్త్రీ ఆర్తనాదం హృదయ విదారకంగా వినిపించింది” అయి ఉండేది.

రాధికాసాంత్వనము ప్రచురితమైన సంవత్సర కాలం తరువాత, 1911లో, ‘శశిలేఖ’ అన్న పత్రికా సంపాదకులు ఇది అశ్లీల కావ్యమని అభ్యంతరం లేవనెత్తటముతో, ఈ పుస్తకం నిషేధింపబడి తెలుగు సాహిత్య, ప్రచురణా రంగములలో పెద్ద కార్చిచ్చు రేగిల్లినది.

సంగీతం శబ్ద ప్రధానమైనది కాబట్టి ఆ కవిత్వంలో వాడే పదాలు సరళంగానూ, సున్నితంగానూ ఉండే అవసరమొచ్చింది. అందువల్ల ఏ వాగ్గేయకారుడైనా భాష మీద చాలా పట్టుంటే కానీ శబ్దాలంకార ప్రయోగాలు చేయలేరు.

“ఊరందరికీ ఇలాంటి పుకార్లంటే భలే ఇష్టం. పంకజానికి పొలం వ్యవహరాల్లో మా బావ సాయం చేస్తున్నాడు. అంతే! అందర్నీ పిలిచినట్లుగానే మా అక్క ఆవిణ్ణీ పిలిచింది. ఏం పిలవకూడదా?”

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.

సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి స్పెషల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హరిగాడయితే ఇంక చెప్పక్కర్లేదు. రామకృష్ణ “ఒరేయ్, గ్యారంటీనా?” అంటూ డౌటు పడ్డాడు.

నేను ఉద్యోగంలో చేరిన రోజు తను ఆస్పత్రి, ఆఫీసుల మధ్య తిరుగుతోంది. వాళ్ళ నాన్నకిది నాలుగో గుండె పోటు. ఆయనకు ఆరోగ్యం నెమ్మదించినప్పుడు మాత్రం వాళ్ళందరి జీవితాలను నియంత్రించేది నాయనే.

ఏ దేశంలోనన్నా యుద్ధం వస్తే, యుద్ధపరంగా సాహిత్యం రావడం సహజం. ఆ విషయంలో మన తెలుగు సాహిత్యం కుంటుపడే ఉన్నది. బహుశా తెలుగునాడు నుంచి మిలిటరీలోకి వెళ్ళినవారు తక్కువై ఉండవచ్చు.

ముళ్ళపూడి వెంకట రమణ (28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011): సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం – ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత – ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ పెన్ను మూశారు. వారికి మా శ్రద్ధాంజలి.

  • ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు ప్రవేశపెడుతున్నాం.
  • పలుకుబడి – తెలుగు పదాలపై సురేశ్ కొలిచాల కొత్త శీర్షిక ప్రారంభం.
  • ఒక కథ చెప్పిన కథ; కనకప్రసాద్ కవిత, వ్యాసం, శబ్ద సాహిత్యం; సత్య పెట్లూరి మొదటి కథ కాలనీ భోగి; ఇంద్రాణి, దమయంతి, ఉదయకళ, రవిశంకర్, కృష్ణదేశికాచార్యుల కవితలు, వేలూరి వేంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందంల కథలూ, ఇతర శీర్షికలు, వ్యాసాలు – ఈ సంచికలో మీకోసం.

ఏ కవితనో చదువుతున్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే సందేహం – ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవితే అని రాసినవారు బుకాయిస్తున్నారా అని. అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని.