ఒక మందు వ్యాపార యోగ్యం కావడానికి కనీసం పది నుండి పదిహేను ఏళ్ళు పడుతుంది. ఒక్క వ్యాధికి వేల వేల రసాయన మిశ్రణాలను పరీక్షిస్తే ఒక్కటి చివరకు ప్రభుత్వ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ వ్యవహారానికంతటికీ కొన్ని కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఔషధ పరిశ్రమ అంచనా.

మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు చిరస్మరణీయమైనది. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలునికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను.

నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దనీ స్నేహాన్ని తెంపేసాడు.

కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

కొన్ని అపురూపమైన తెలుగువారి గొంతుకలు – ఆచంట లక్ష్మీపతి, టంగుటూరి ప్రకాశం పంతులు, గుఱ్ఱం జాషువా, జరుక్ శాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, స్వామి శివశంకర్, విస్సా అప్పారావు, మొక్కపాటి నరసింహ శాస్త్రి, దామోదరం సంజీవయ్య మరి కొంతమందివి.

దాదాపు అర్థ శతాబ్దం క్రితం వ్రాసిన ఈ కథల్లో కనిపించే ప్రాంతాలు, పరిసరాలు నాకు పరిచయం లేనివి. కానీ పరిసరాలను, పాత్రలను కళ్ళ ముందు నిలిపేందుకు వాడిన భాష, వాక్యాలు నిత్యనూతనం.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ (7 మే 1861 – 7 ఆగస్ట్ 1941) 150వ జన్మదిన వార్షికోత్సవం (మే 7 – మే 9) శాంతినికేతన ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది. ఈ సందర్భంగా కవయిత్రి కేతకి కుషారి డైసన్ చేసిన టాగోర్ కవితల అనువాదాల సంకలనం పెంగ్విన్ ఇండియా వారు విడుదల చేస్తున్నారు. టాగోర్ పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ కవులచే గీతాంజలి కవితల పఠనం, వాచికాంజలి, నృత్యాంజలి, కావ్యాంజలి తదితర సాహిత్య లలిత కళా కార్యక్రమాలను ప్రదర్శించబోతున్నారు.
 


 

  • ఇంద్రాణి, సుబ్రహ్మణ్యం, స్వాతికుమారి, దేశికాచారి కవితలు; సాయి బ్రహ్మానందం చెప్పే కోనసీమ కథ; గిరిధరరావు చెప్పిన ‘నల్లతోలు’ కథ నచ్చిన కారణం; సోమ శంకర్ అనువాద కథ గాంధీ అభిమాని.
  • పలుకుబడి లో వ్యుత్పత్తి, నిరుక్తములపై సురేశ్ కొలిచాల భాషా శాస్త్ర వ్యాసం; కనకప్రసాద్ సాహిత్య చింతన ‘మూడు లాంతర్ల’లో మరొక భాగం; మందుల పరిశోధన గురించి మోహనరావు వ్యాసం; బృందావనరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం.
  • మోహనరావు టాగోర్ గీతాలకు చేసిన అనువాదాలు, మాతృకలు; శ్రీనివాస్ సేకరించి పంపిన కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం లోపలి పిలుపు విని, ఈ సంచికలో మీకోసం.

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.

కళ, సారస్వతం వంటి వెసులుబాటు లేని రంగాల్లోన ఎవరైనా అంత ఓపిగ్గా పరిశ్రమ ఎందుకు చేస్తారు? వాళ్ళ మనస్తత్వానికి అది తప్పనిసరి అయితేనే కదా! కేవలం తెలివితేటలూ, స్వయంప్రతిభ తోటే గొప్ప ఫలితాల్ని సాధిస్తామనుకొనే వాళ్ళ విశ్వాసాలు, న్యూనతల్ని గురించి ‘రామానుజన్ సిండ్రోం’ అని ఒక కధ ఉన్నాది. ఆ కధ విని నాకు ఎక్కడో ‘చురుక్కు’మని గుచ్చుకుంది. ఇలాగని బిపిన్‌తో అంటే నవ్వీసి ఊరుకున్నాడు.

సృజనశీలి యంత్రం కాదు. కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు, ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి, ఆ పైన నాగరికుడు, మర్యాదస్తుడు, సంస్కారి అనదగిన ఒక మనిషి – వీళ్ళు ముగ్గురూ ఉన్నారు.

[[ఈ కథ 06 మార్చ్ 2011 సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. మూడు లాంతర్లు వ్యాసం 3, 4 భాగాల్లో ఉటంకించిన కారణంగా, […]

భాష అంటే జ్ఞాపకాల నిధి. ఒక జాతి సంస్కృతి, చరిత్ర ఆ భాషలో నిక్షిప్తమై ఉంది. భాషలోని ప్రతి పదం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంటుంది. ఒక భాషలోని పదాల సామూహిక ఆత్మకథే ఆ భాషాచరిత్ర అని చెప్పుకోవచ్చు.