ట్రిగ్గర్లు

విడిన భృకుటి, విచ్చుకున్న పెదవి
ఒక మోదం

ప్రేమ, నిశ్శబ్దం
లేమి

చూపు, బాణం
జీవనసంగమం

నిశ్వాస, తన్మయత్వం
ఒక ప్రదర్శన

జోల, సుధ, ప్రకృతి
ఒక వాత్సల్యపు అల

నిట్టూర్పు, జారిన చుక్క
ఒక వేదన

పిడికిలి, కేక
ఒక తరంగం

గౌరవం, బెరుకు
అస్థిరత్వం

నువ్వు, నవ్వు
కృతజ్ఞత


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ వున్న మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...