నిద్రిస్తున్న రహదారిని లేపి
కృతజ్ఞతలు చెప్పాలని ఉందినిద్రాభంగమైన
ఆ ప్రశాంతతను గమనించాలని ఉందిదిక్కులన్నీ చిక్కు ముడులు కావని
విడమరచి చెప్పాలని ఉందిజీవితానికి రహదారి
ప్రయాణానికి గతుకుల దారి
ఒకటి కాదని ఒప్పించాలని ఉందిఎవరు ఎక్కడనుండి వచ్చినా
చివరకు చేరేది నీలోనే అని
నమ్మించి ఓదార్చాలని ఉందిచెమ్మ కనిపించనివ్వని
చీకటి తత్వానికి
ఆధ్యాత్మిక తత్వం జోడించాలని ఉందిమళ్ళీ మంచి నిద్రలోకి పోయేదాకా
జోల పాడాలని ఉంది!