ఈ బృహత్ పర్వతాలు ప్రకృతి మాత దేవాలయాలు, ఈ శిఖరారోహణలు ఆమెకు మనం అర్పించే పూజా నైవేద్యాలు. మేము కూడా తీర్థయాత్రికులమే గదా అనిపించింది. పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలులు అర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం… అది కదా కొండల మీద నెలకొన్న కోనేటిరాయళ్ళ దర్శనాల అంతరార్థం!

మళ్ళీ పెరేడ్‌. పీటీ తర్వాత బ్రేక్ ఎనభై నిముషాలు. కానీ, ఆ గ్రౌండ్‌లోనుంచి బారక్స్‌కి చేరి, తర్వాతి పీరియడ్‌కి అనుగుణంగా డ్రెస్ మార్చుకుని, మెస్‌‍లో బ్రేక్‌ఫాస్ట్ చేసి, మళ్ళీ స్క్వాడ్‍లో అందరమూ ఒక తీరైన గుంపుగా తయారై క్లాస్ జరిగే మరో ట్రైనింగ్ గ్రౌండ్‌కి చేరడానికి బొటాబొటీగా సరిపోయింది. వగర్చుకుంటూ డ్రిల్ షెడ్ ముందర నిలబడ్డాం. డ్రిల్ మాస్టర్ హవల్దార్ మా కోసమే ఎదురుచూస్తున్నాడు కోపంగా.

పండుముసిలి అంటారు. ఈవిడ లాంటి వాళ్ళనేనా? పాక్కుంటూ, డేక్కుంటూ ఉండే ముసిలివాళ్ళూ ఉంటారు కామోసు. నేనెప్పుడూ ఎవర్నీ చూడలేదు. బామ్మ మరికొన్నేళ్ళకి ఇలా అయిపోతుందా ఏం? అమ్మో! బామ్మ ఇలా అవకూడదు. తను అసలే పొట్టిమనిషి. ఈవిడలా నడుం వొంగిపోతే ఇంకేమైనా ఉందా!

ఎప్పుడైనా, ఏవైనా జేబులో భద్రంగా
దాచుకుందామా
అంటే, వీలు పడేదే కాదు

మరమరాలో, చేతివేళ్ళ చుట్టూ వెలిగే
పసుపు రంగు
నల్లీలో, రేగు పండ్లో, ఉప్పు

జల్లిన జామ ముక్కలో!

బ్రిటీష్ పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నందువలన పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేశారుట. అంతేకాదు, ఇంత జబ్బున పడి కోలుకుంటున్న నన్ను పరామర్శించడానికి నా ప్రాణస్నేహితుడు హెచ్‌కె ఇంతవరకు ఎందుకు రాలేదు అనుకున్నారు? వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుట.

మాటల మధ్య
పాటల వేళ
పెదాలు కలిసినప్పుడు
కౌగిలి లో
స్పర్శాస్పర్శ సందర్భంలో
నవ్వుల మధ్య
దుఃఖద్వీపంలో

చెట్టు కొమ్మలు పలచబడడంతో అడ్డులేని గాలి ఆమెని ఈడ్చి కొడుతూ వుంది. ఎంత అవస్థ పడ్డా అవతలి వైపు చెట్టు కొమ్మలందట్లేదు. నిరాశతో దుఃఖం వొచ్చిందామెకి. మళ్ళీ శక్తి కూడదీసుకొని చెట్టు కొమ్మలందుకునేంతలో గాలి వాటిని విడిపించింది. ఆమె పట్టులోంచి జారిపోయిన చెట్టు కొమ్మలు ఆమె మొహాన్ని గాలి విసురుకు కొరడాలలా కొట్టాయి. గాలి, చెట్టు కొమ్మలూ కలిసి ఆమె గొంతుకు ఉరి బిగించాయి.

ఒంటరిగా ఉండనీండి! ఒదిలిపెట్టి పోండి!
తళుకు తళుకుమని మెరిసే తారకలను తిలకిస్తూ
హడావుడిగ పరిగెత్తే మొయిళ్ళను వీక్షిస్తూ
ఉద్వేగపు శిలపై ఉత్సాహపు ఉలితో చెక్కిన
ఊహా మూర్తులకు ఊపిరి పోసుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!

ఆయనకి భారతీయ తత్త్వశాస్త్రమన్నా, సంస్కృతి అన్నా వల్లమాలిన అభిమానం. పాఠాలు చెబుతున్నపుడు మధ్యమధ్యలో ఈ విషయాలు దొర్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సంప్రదాయం పట్ల కొంత మొగ్గు ఎక్కువ ఉన్నప్పటికీ, ఏది చెప్పినా, సంప్రదాయాన్ని, సైన్సునీ మేళవిస్తూ మనసుకి హత్తుకుపోయేలా చెప్పేవారు. ఒకసారి క్లాసులో ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న నానుడి ప్రస్తావన వచ్చింది. ఆలోచనలు వెళ్ళి వెళ్ళి చివరకి ‘సత్యం స్వరూపం ఏమిటి?’ అన్న ప్రశ్నకి దారి తీశాయి.

తోడుగా కొన్ని వాక్యాలు మృదువుగా
ఆత్మబంధువులై హత్తుకుంటూ
ఆగకుండా వర్షిస్తూ ఉన్నాయి

రెండు సముద్రాల నడుమ
కొలవలేనంత అంతరం
ఏ వంతెనా రెండిటినీ కట్టిపడేయలేదు

ఎందాకని
నీలో నిన్ను దూరంగా విసురుకుని
నీకు అన్నీ దగ్గరని భ్రమిస్తావు?

నీవు పగిలి నమ్మకం ముక్కలైనా
నిజం నలిగి సహనం సొమ్మసిల్లినా
మౌనం ధాటికి మాట ఇంకిపోయినా
నిన్ను నీకు శత్రువుగా మర్చినా.

కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు, అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి వేరు చేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్న’ అని పిలుచుకునే ఈ స్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’. మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండిన వారికే దక్కేవి.

సంస్కృత వృత్తములను ఏవిధముగా ఎనిమిది త్రిక గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, రెండు ఏకాక్షరపు గణములతో వివరించగలమో, అదే విధముగా దేశి ఛందపు వృత్తములను కూడ బ్రహ్మ, విష్ణు గణములతో, ఒక గురువు, రెండు లఘువులతో వివరించ వీలగును.

ఆనందుడు చెప్పడం ప్రకారం భగవానుడు భిక్షుసంఘానికి ఎవర్నీ నాయకుడిగా నిర్దేశించలేదు. దీనికి రెండు కారణాలు కావొచ్చు. మొదటిది ఆయన ముఖ్య శిష్యులైన శారిపుత్ర, మౌద్గలాయనులు అప్పటికే దేహం చాలించారు. రెండోది, ఎవరికైనా నాయకత్వం కట్టబెడితే వాళ్ళు ఉత్తరోత్తరా అధికారం కోసం పాకులాడుతూ, దెబ్బలాటలతో ధర్మం గురించి పూర్తిగా మర్చిపోయే రోజులు రావడానికి అవకాశం ఎక్కువ.

కాని నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని సంకల్పించను. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని పద్యాలలో వ్యర్థ పదాలు చోటు చేసికొనరాదు. అందుచేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత అనేకనూతనవృత్తాలను, ఖండ, చతురశ్ర, మిశ్ర, త్ర్యస్రగతులలో సాగే అనేకమాత్రాపద్యభేదాలను వివరించుటయే ఈ వ్యాసంయొక్క లక్ష్యం.

జ్యోతి మాసపత్రికలో 1970,80లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: