ఎక్కడికక్కడ కత్తెరతో పలకరిస్తూ
తుప్పట్టిన పేజీతో కడుక్కుంటూ
చిత్రవిచిత్రాండ పిండాకూడులే
పది వేల్లెమ్మని చేయి జార్చుతో
తెలిసిన వాగుకాదు సాగూకాదు
తుమ్మముళ్ళ పాన్పని తెలిసినా సరే
తప్పని శరణం గఛ్ఛామి
చల్లటి మంట మళ్ళీ పెట్టు
ప్రాపంచిక మాలిన్యంతో
పాలిపోయిన రహస్యాలని
చెట్టుకో పుట్టగా తంతూ
ముడికో చుక్క చొప్పున హుక్కు చొప్పున
దోసిట్లోంచి వాకిట్లోంచి చీకట్లోంచి
వాణ్నీ దాన్నీ చూసి తరించి
వేగి మాడి మసై రసాలూరుతూ…
చివుక్కులెన్నో తుడుచుకుని
చమక్కులద్దుకుని మళ్ళీ
యుగాలకొద్దీ చిగురాకులౌతున్న
చివరాకలి చిత్తడి కాంక్షకు
వందన చందనాలరగదీస్తూ
ఫ్రేముడు వైమనస్యాలని
ఇంకొక్కటిమ్మని సరేలెమ్మని
కానీ- చాలని కానీ
ఒక్క దూకు దూకి మగతతో
మడతపెట్టి-
వూసిన మండే కిళ్ళీ* సుఖపు రుచి నెమరేసుకుంటూ…
*ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లో ఫైర్‌పాన్.